Showing posts with label ఎం.ఎం.కీరవాణి పాడిన పాటలు. Show all posts
Showing posts with label ఎం.ఎం.కీరవాణి పాడిన పాటలు. Show all posts

Saturday, November 2, 2013

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడు లేడు లే.... మాతృదేవోభవ (1994)

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..
తోటమాలి నీ తోడు లేడు లే..
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..
లోకమెన్నడో..చీకటాయెలే..
నీకిది తెల్లవారని రేయమ్మా..
కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం..
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..
తోటమాలి నీ తోడు లేడు లే..
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..
లోకమెన్నడో..చీకటాయెలే..

చెదిరింది నీ గూడు గాలిగా..
చిలక గోరింకమ్మ గాధగా..
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా..
తనవాడు తారల్లో చేరగా..
మనసు మాంగల్యాలు జారగా..
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా..
తిరిగే భూమాతవు నీవై..
వేకువ లో వెన్నెలవై..
కరిగే కర్పూరము నీవై..
ఆశలకే హారతివై..(రాలిపోయే)

అనుబంధమంటేనే అప్పులే..
కరిగే బంధాలన్నీ మబ్బులే..
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే..
తన రంగు మార్చింది రక్తమే..
తనతో రాలేనంది పాశమే..
దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే..
పగిలే ఆకాశం నీవై..
జారిపడే..జాబిలివై..
మిగిలే ఆలాపన నీవై..
తీగ తెగే..వీణియవై..(రాలిపోయే)


చిత్రం : మాతృదేవోభవ (1994)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : వేటూరి సుందరరామ మూర్తి
గానం : ఎం.ఎం.కీరవాణి
**********************************************
Raalipoye puvva neeku raagalenduke..
thotamaali nee todu ledu le..
vaalipoye podda neeku varnaalenduke..
lokamennado..cheekatayele..
neekidi tellavaarani reyamma..
kaliki ma chilaka paadaku ninnati nee raagam..
Raalipoye puvva neeku raagalenduke..
thotamaali nee todu ledu le..
vaalipoye podda neeku varnaalenduke..
lokamennado..cheekatayele..

Chedirindi nee guudu gaaliga..
chilaka gorinkamma gaadhaga..
chinnari roopalu kanneti deepaalu kaagaa..
tanavaadu taarallo cheraga..
manasu maangalyaalu jaaraga..
sindhuura varnaalu tellari challaripogaa..
tirige bhuumaatavu neevai..
vekuva lo vennelavai..
karige karpuuramu neevai..
aasalake haarativai..(raalipoye)

Anubandhamantene appule..
karige bandhaalanni mabbule..
hemanta raagaala chemantule vaadipoye..
tana rangu maarchindi raktame..
tanato raalenandi paasame..
deepaala pandakki deepaale kondekkipoye..
pagile aakasam neevai..
jaaripade..jabilivai..
migile aalapana neevai..
teega tege..veeniyavai..(raalipoye)


Movie Name : MathruDevoBhava (1994)
Music Director : M.M. Keeravani
Lyricist : Veturi Sundararama Murthy
Singer : M.M. Keeravani

Saturday, August 3, 2013

పన్నెండేళ్ళ ప్రాయం వెన్నెల్లాంటి హృదయం ....... బావ (2010)

Pannendella praayam vennellanti hrudhayam
yennallaina marupe raavugaa
santhoshaala samayam panthaalaina madhuram
sontham kaani yedhale levuga
kaasepu aa gynapakaallani yedhuraithe
nee roopu aa chota pasi paapai thosthundhi
kathala kadhile kaalam lona anni vinthale
chelime chilike kallalona kalavaa chinthale
adhigo theneteegalle thaakindhi aa challa gaali
apude thene theepanthaa nannandhukomandhi velli

Pannendella praayam vennellanti hrudhayam
yennallaina marupe raavugaa
santhoshaala samayam panthaalaina madhuram
sontham kaani yedhale levuga

Cheruvvullo eetha isakallo raatha
thirannallo aade sye atta
gudi loni paata thunigala veta
badi lo nerpinche bathukaata
chinanaati snehaala chigurinthale
yedhigenu eenati pulakinthalai
aa bomma pellilla sandhallalo
ee bomma kennenni thullinthalo
nuvvu dhaachali anukunna villedhani thelusaa

Pannendella praayam vennellanti hrudhayam
yennallaina marupe raavugaa
santhoshaala samayam panthaalaina madhuram
sontham kaani yedhale levuga

Manapai jadi vaana kurise nimishaana
padavala thayyare guruthundhaa
mamidi kommallo kokila tho cheri
kuse kachcheri guruthundhaa
ninamonne ayinattu vunnayile
aa nuvvu naatho vundettu chesaayile
paadhaalu ye dhaari nadipinchuno
ye prema theeraalu kanipinchuno
adagaalantu nee chentha vaalindhilaa manasu

Pannendella praayam vennellanti hrudhayam
yennallaina marupe raavugaa
santhoshaala samayam panthaalaina madhuram
sontham kaani yedhale levuga


చిత్రం : బావ (2010)
సంగీతం : చక్రి
రచన : అనంత్ శ్రీరామ్
గానం : ఎం.ఎం.కీరవాణి
****************************************
Movie Name : Baava (2010)
Music Director : Chakri
Lyricist : Ananth Sriram
Singer : MM. Keeravani

Sunday, December 16, 2012

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది........ వేదం (2010)

సా.......నినిసరిదపమగరిసా....సరోజా...సరోజా...
తాంగిట తరికిట తరికిట పడేసి
తోంగిట తరికిట తరికిట ముడేసి
తదినక మోతనక సరసమున
తాంగిట తరికిట తరికిట తరికిట సరసమున
తాంగిట తరికిట దినకు దినకు తా

గుండె గుబులుని గంగకి వదిలి..ముందు వెనకలు ముంగిట వదిలి
ఊరి సంగతి ఊరికి వదిలి....దారి సంగతి దారికి వదిలి
తప్పు ఒప్పులు తాతలకొదిలి.....సిగ్గు ఎగ్గులు చీకటికొదిలి
తెరలను ఒదిలి పొరలను ఒదిలి...తొలి తొలి విరహపు చెరలను ఒదిలి
గడులను ఒదిలి ముడులను ఒదిలి....గడబిడలన్నీ గాలికి వదిలేసి
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.......

లోకం రంగుల సంత....ప్రతిదీ ఇక్కడ వింత
అందాలకు వెల ఎంత....కొందరికే తెలిసేటంత
పాతివ్రత్యం పై పై వేషం.....ప్రేమ త్యాగం అంతా మోసం
మానం శీలం వేసెయ్ వేలం.....మన బ్రతుకంతా మాయాజాలం
ఎగబడి ఎగబడి దిగబడి దిగబడి...జతపడి త్వరపడి త్వరపడి ఎక్కడికో...
శివ శివా.....ఎగిరిపోతే.......

నా...సొగసులకు దాసుడవవుతావో...నీతో
నా అడుగులకు మడుగులొత్తగలవా..నీతో
నను కోట్లకు పడగలెత్తిస్తానంటావా నీతో
నా గుడికట్టి హారతులిస్తావా నీతో
నీతో నీతో నీతో నీతో.........


చిత్రం : వేదం (2010)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : సాహితి
గానం : ఎం.ఎం.కీరవాణి , సునీత
*****************************
saaa ni ri sa ri da pa ma ga ri sa
sarojaaa.. sarojaaaa.......
tangita tarikita tarikita padesi
tonngita tarikita tarikita mudesi
thadinaka mothanaka sarasamuna
tangita tarikita tarikita tarikita sarasamuna
tangita tarikita dinaku dinaku tha

gunde gubuluni gangaki vadili..... mundu venakulu mungita vadili
oori sangathi ooriki vadili.... daari sangathi dariki vadili
tappu oppulu tatalaku vadili... siggu yeggulu chikatiki vadili
teralani vadili poralani vadili .... toli toli virahapu cheralani vadili
gaduluni vadili , mudulani vadili gadabidalannni galiki vadilesi...
egiripothe entha baguntundi.....

lokam rangula santha.....pratidi ikkada vintha
andalaku vela entha???.....kondarike telisetantha
papi brathyam pai pai vesham.....prema tyagam antha mosam
maanam seelam vese velam....mana batukuntha maayajalam
egabadi egabadi digabadi egabadi jatabadi kalapadi twarapadi ekkadiko....
shiva..shivaa
egiripothe entha baguntundi..

naa sogasulaku dasudu authava
neetho naa adugulaku madugulotta galava
neetho nanu kotalaki padagalettistava neetho
na gudi katti haratalu isthavaa...neetho
neetho neetho neetho neetho(2)
egiri pothe entha baguntundi....


Movie Name : Vedam (2010)
Music Director : M.M.Keeravani
Lyricist : Sahithi
Singer : M.M.Keeravani ,Suneetha

Monday, October 29, 2012

పూత వేసిన లేత మావిని చూసినట్టుంది .... సంగమం (2007)


పల్లవి:
పూత వేసిన లేత మావిని చూసినట్టుంది
నువ్వు నవ్వుతూ ఉంటే...
పాత పాటలు కొకిలమ్మే పాడినట్టుంది
నీ పలుకు వింటుంటే...
మాటలే వరదలై ఉరకలేస్తునవి
చెంత నువ్వుంటే...
ఉంటే...
//పూత వేసిన//

చరణం : 1
మునుపు కలగని మురిపెమేదో ముద్దుగా నా ముందరుంది
అలుపు తెలియని వలపు నాలో హద్దులే చెరిపేయమంది
లేనిదేది నాకు లేదను తలపు ఉండేది
ఇంతలో నీ పరిచయం ఒక లోటు తెలిపింది

నువ్వే కావాలని,కలవాలని,కలగాలని
ప్రియా నా ప్రాణమే మారాము చేసింది

సగపసగరినిసగపనిసనిదపగమదపసగరిగ..
అంటూ....

చరణం : 2
పోత పోసిన పసిడి బొమ్మే కదిలినట్టుంది
నువ్వు నడచి వస్తుంటే....
కోత కోసిన గుండె నాలో మిగిలి ఉంటుంది
నను విడిచి వెళుతుంటే...
మాటలే మౌనమై ఉసురు తీస్తున్నవి
ఒంటరై ఉంటే.....

పూత వేసిన లేత మావిని చూసినట్టుంది

కుదురు దొరకని ఎదురు చూపే కొంటెగ వెంటాడమంది
నిదుర కుదరని కంటిపాపే వెంటనే నిను చూడమంది
ఏమిటో నా తీరు నాకే కొత్తగ ఉంది
ప్రేమ ఊసులు మానలేని మత్తులో ఉంది

నిరీక్షణ చాలని ఇక చాలని అడగాలని
చెలి నా ఊపిరి నిను చేరుకుంటుంది

ననననననననన..........

అంటూ.....
చేతికందని చందమామే అందినట్టుంది
నువ్వు తాకుతూ ఉంటే...
చోటు ఇమ్మని చుక్కలేవొ అడిగినట్టుంది
నను తోడు రమ్మంటే .....
మాటలే కవితలై మురిసిపోనున్నవి
జంట నువ్వైతే....

ఐతే....

పూత వేసిన లేత మావిని చూసినట్టుంది


చిత్రం : సంగమం (2007)
సంగీతం : M.M.కీరవాణి
రచన : అనంత శ్రీరామ్
గానం :  M.M.కీరవాణి , ప్రణవి
********************************************
Movie Name : Sangamam (2007)
Music Director : M.M.Keeravani
Lyricist : Anantha Sriram
Singers : M.M.Keeravani, Pranavi