పల్లవి : నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేదీ నేలపై ఏ లీల సేవింతునో.. ఏ పూల పూజింతునో
చరణం 1 శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె ఈ పేదరాలి మనస్సెంతో వేచె ||2|| నీ పాదసేవా మహాభాగ్యమీవా నా పైని దయజూపవా.. నా స్వామి ||నీవుండేదా||
చరణం 2 దూరాననైన కనే భాగ్యమీవా నీ రూపు నాలో సదా నిల్పనీవా ఏడుకొండలపైనా రేడైన స్వామి నా పైని దయజూపవా.. నా స్వామి ||నీవుండేదా||
చిత్రం : భాగ్యరేఖ (1957) సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం : పి.సుశీల *************************** Movie Name : Bhagya Rekha (1957) Music Director : Pendyala nageshwar rao Lyricist : Devulapalli krishna sastry Singers : P.Susheela
ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది ఓరగా నెమలి పింఛ మారవేసుకుంటుంది ఎందుకో... ఎందుకో ప్రతిపులుగు ఏదో చెప్పబోతుంది వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది ఉండుండీ నా ఒళ్లు ఊగి ఊగి పోతుంది అదుగో రామయ్యే ఆ అడుగులు నా తండ్రివే ఇదిగో శబరీ శబరీ వస్తున్నానంటున్నవి కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని నా కోసమె నా కోసమె నడచి నడచి నడచీ నా కన్నా నిరుపేద నా మహరాజు పాపం అదుగో అసలే ఆనదు చూపు ఆపై ఈ కన్నీరు తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో ఎలాగో నా రామా! ఏదీ? ఏదీ? ఏదీ? నీల మేఘమోహనము నీ మంగళరూపము కొలను నడిగీ తేటనీరు కొమ్మనడిగీ పూలచేరు చెట్టునడిగి పట్టునడిగీ పట్టుకొచ్చిన ఫలాలు పుట్టతేనె రసాలు దోరవేవో కాయలేవో ఆరముగ్గిన వేవోగాని ముందుగా రవ్వంత చూసి విందుగా అందియ్యనా... (2)
చిత్రం : సంపూర్ణ రామాయణం (1971) సంగీతం : కె.వి.మహదేవన్
పల్లవి : పాడనా తెనుగుపాట... పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెనుగుపాట...
చరణం : 1 కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో మావుల తోపుల మూపులపైన మసలే గాలుల గుసగుసలో మంచి ముత్యాలపేట మధురామృతాల తేట ఒకపాట... పాడనా తెనుగుపాట... పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెనుగుపాట...
ఒకపాట... పాడనా తెనుగుపాట... పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెనుగుపాట...
చరణం : 3 ఒళ్లంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ ఒళ్లంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ మెళ్ళో తాళి కాళ్లకు పారాణి మెరిసే కుంకుమబొట్టు ఘల్లు ఘల్లున కడియాలందెలు అల్లనల్లన నడయాడే తెలుగుతల్లి పెట్టనికోట తెలుగునాట ప్రతిచోట ఒకపాట... పాడనా తెనుగుపాట... పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెనుగుపాట...
చిత్రం : అమెరికా అమ్మాయి (1976) సంగీతం : జి.కె.వెంకటేష్ రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం : పి.సుశీల ********************************* padanaa tenugupata.. padanaa tenugupata.....paravashanai me yeduta me pata padanaa tenugu pata...
పల్లవి: తోటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు తోటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
చరణం 1: నవ్వులా అవి.. కావు నవ్వులా అవి కావు... నవ పారిజాతాలు నవ్వులా అవి కావు.. నవ పారిజాతాలు రవ్వంత సడిలేని.. రసరమ్య గీతాలు రవ్వంత సడిలేని.. రసరమ్య గీతాలు ఆ రాజు ఈ రోజు అరుదెంచునా ఆ రాజు ఈ రోజు అరుదెంచునా అపరంజి కలలన్నీ చిగురించునా
తోటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
చరణం 2: చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను పాటలా ధర రాగ భావనలు కన్నాను చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను పాటలా ధర రాగ భావనలు కన్నాను ఎల నాగ నయనాల కమలాలలో దాగి ఎల నాగ నయనాల కమలాలలో దాగి ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను ఆ పాట నాలో తియ్యగ మ్రోగనీ ఆ పాట నాలో తియ్యగ మ్రోగనీ అనురాగ మధుధారయై సాగనీ ఊఁహూఁహుఁ.. ఊఁహూఁహుఁ.. ఉఁహుఁహుఁ.... ఊఁహూఁహుఁ..
తోటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
చిత్రం : ఏకవీర (1969) సంగీతం : కె.వి. మహదేవన్ రచన : దేవులపల్లి కృష్ణ శాస్త్రి గానం: ఘంటసాల, P.సుశీల ****************************************** thotalo na raju thongi chusenu nadu neetilo aa raju needa navvenu nedu(2)
kaavu navvulaa avi kaavu navapaarijaataalu navvulaa avi kaavu navapaarijaataalu ravvanta sadi leni rasaramya geetalu aa raju eeroju arudenchunaa(2) aparanji kalalanni chivurinchunaa
ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి బ్రతుకంతా ప్రతి నిమిషం పాట లాగా సాగాలి ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి. ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి
నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి. ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి
చిత్రం : సుఖ దు:ఖాలు (1967) సంగీతం : S.P.కోదండపాణి రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం ****************************** Movie Name : Sukhadhukhaalu (1967) Music Director : S.P.Kodandapani Lyricist : Devulapalli KrishnaSastry Singer : S.P.Bala subramanyam
చరణం: తిమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా తిమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా తారాటలా సయ్యాటలా సయ్యాటలా తారాటలా వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు బింకాలు బిడియాలు పొంకాలు పోడములు ఏమో ఎవ్వరిదో గాని ఈవిరి గడసరి
మావి చిగురు తినగానే కోయిల పలికేనా కోయిల పలికేనా
చరణం: ఒకరి ఒళ్ళు ఊయ్యాల వేరొకరి గుండె జంపాల ఊయ్యాల జంపాల జంపాల ఊయ్యాల ఒకరి ఒళ్ళు ఊయ్యాల వేరొకరి గుండె జంపాల ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో పలకరింతలో పులకరింతలో పలకరింతలో పులకరింతలో ఏమో ఏమగునో గాని ఈ కథ మన కథ
మావి చిగురు తినగానే కోయిల పలికేనా కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా ఏమో ఏమనునో గాని ఆమని ఈ వని
మావి చిగురు తినగానే కోయిల పలికేనా కోయిల పలికేనా
చిత్రం : సీతామాలక్ష్మి (1978) రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రీ సంగీతం : కే. వి. మహదేవన్ గానం : S.P.బాలు, P.సుశీల
పల్లవి: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు ..పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు ..... ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు.. పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు... ఎంత తొందరలే హరి పూజకు ...ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ ..... ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు... పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు..
చరణం 1: కొలువైతివా దేవి నాకోసము...కొలువైతివా దేవి నాకోసము.. తులసీ ..... తులసీ దయాపూర్ణకలశీ... కొలువైతివా దేవి నాకోసము..తులసీ....తులసీ దయాపూర్ణకలశీ... మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి ..... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి ..... మొల్లలివి ...నన్నేలు నా స్వామికి...
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు... పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు ఎంత తొందరలే హరి పూజకు... ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ ...
చరణం 2: ఏ లీల సేవింతు.. ఏమనుతు కీర్తింతు... ఏ లీల సేవింతు.. ఏమనుతు కీర్తింతు సీత మనసే నీకు సింహాసనం... ఒక పువ్వు పాదాల....ఒక దివ్వె నీ మ్రోల.... ఒక పువ్వు పాదాల...ఒక దివ్వె నీ మ్రోల ఒదిగి నీ ఎదుట ఇదే వందనం ..... ఇదే వందనం .....
చరణం 1: ఆగలేక నాలాగే ఊగే ఈ దీపము ఆగలేక నాలాగే ఊగే ఈ దీపము పరుగు పరుగునా త్వర త్వరగా ప్రభుని పాదముల వాలగ విందులు విందులు చేసే.. ఎందుకీ సందెగాలి సందెగాలి తేలి మురళి
చరణం 2: ఏనాటిదో గాని ఆ రాధా పల్లవ పాణీ ఏమాయెనో గాని ఆ పిల్లన గ్రోవిని విని ఏనాటిదో గాని ఆ రాధా పల్లవ పాణీ ఏమాయెనో గాని ఆ పిల్లన గ్రోవిని విని.. విని.. విని.. ఏదీ ఆ... యమున యమున హృదయమున గీతిక ఏదీ బృందావన మిక.. ఏదీ విరహ గోపిక
పల్లవి: చాలులే నిదరపో... జాబిలి కూనా ఆ దొంగ కలవరేకుల్లో తుమ్మెదలాడేనా ఆ సోగకనుల రెప్పల్లో తూనీగలాడేనా చాలులే నిదరపో జాబిలి కూనా... ఆ దొంగ కలవరేకుల్లో తుమ్మెదలాడేనా ఆ సోగకనుల రెప్పల్లో తూనీగలాడేనా తుమ్మెదలాడేనా... తూనీగలాడేనా తుమ్మెదలాడేనా... తూనీగలాడేనా
చరణం 1: అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా ఓసి... వేలెడేసి లేవు బోసి నవ్వులదానా అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా ఓసి... వేలెడేసి లేవు బోసి నవ్వులదానా
మూసే నీ కనుల.. ఎటుల పూసేనే నిదర... అదర... జాబిలి కూనా... ఆ దొంగ కలవరేకుల్లో తుమ్మెదలాడేనా ఆ సోగకనుల రెప్పల్లో తూనీగలాడేనా తుమ్మెదలాడేనా... తూనీగలాడేనా తుమ్మెదలాడేనా... తూనీగలాడేనా
చరణం 2: అమ్మను బులిపించి నీ అయ్యను మరిపించావే కాని చిట్టి తమ్ముడొకడు నీ తొట్టిలోకి రానీ అమ్మను బులిపించి నీ అయ్యను మరిపించావే కాని చిట్టి తమ్ముడొకడు నీ తొట్టిలోకి రానీ
చుక్కలతో చెప్పాలని.. ఏమని ఇటు చూస్తే తప్పని.. ఎందుకని.. ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని..
చరణం 2: మనసులో ఊహకనులు కనిపెట్టే వేళ చెవిలో ఒక చిన్న కోర్కె చెప్పేసే వేళ మనసులో ఊహకనులు కనిపెట్టే వేళ చెవిలో ఒక చిన్న కోర్కె చెప్పేసే వేళ మిసిమి పెదవి మధువులు తొణికేనని మిసిమి పెదవి మధువులు తొణికేనని పసికట్టే తుమ్మెదలు ముసిరేనని ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని
చుక్కలతో చెప్పాలని.. ఏమని ఇటు చూస్తే తప్పని.. ఎందుకని.. ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని..
చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968) సంగీతం : కె.వి. మహదేవన్ రచన : దేవులపల్లి గానం: బాలు, సుశీల
నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని... నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని... కొలువై ఉందువుగాని...కలుముల రాణి రావమ్మా మహాలక్ష్మీ...రావమ్మా... రావమ్మా
తెల్లారి పోయింది పల్లె లేచింది... తెల్లారి పోయింది పల్లె లేచింది... పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది రావమ్మా మహాలక్ష్మీ...రావమ్మా ... రావమ్మా మహాలక్ష్మీ...రావమ్మా
నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని... నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని... కొలువై ఉందువుగాని...కలుముల రాణి రావమ్మా మహాలక్ష్మీ...రావమ్మా ...రావమ్మా
చరణం 2: కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి...గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు కావెడు పసుపు గడపకు పూసి... గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి... గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు కావెడు పసుపు గడపకు పూసి... గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు
నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని... నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని... కొలువై ఉందువుగాని...కలుముల రాణి రావమ్మా మహాలక్ష్మీ...రావమ్మా ...రావమ్మా...కృష్ణార్పణం
చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968) సంగీతం : కె.వి. మహదేవన్ రచన : దేవులపల్లి గానం: బాలు, సుశీల