చరణం : 1 శివ గంగ తిరనాళ్లలో నెలవంక స్నానాలు చెయ్యాలా చిలకమ్మ పిడికిళ్లతో గొరవంక గుడిగంట కొట్టాలా నువ్వు కంటి సైగ చెయ్యాలా నే కొండ పిండి కొట్టాలా మల్లి నవ్వే మల్లెపువ్వు కావాలా (2) ఆ నవ్వుకే ఈ నాపచేను పండాలా ॥॥
చరణం : 2 గోదారి పరవళ్లలో మా పైరు బంగారు పండాలా ఈ కుప్ప నూర్పిళ్లతో మా ఇళ్లు వాకిళ్లు నిండాలా నీ మాట బాట కావాలా నా పాట ఊరు దాటాలా మల్లిచూపే పొద్దుపొడుపై పోవాలా (2) ఆ పొద్దులో మా పల్లె నిద్దర లేవాలా ॥॥
చిత్రం : పదహారేళ్ళ వయసు (1978) సంగీతం : చక్రవర్తి రచన : వేటూరి గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి *************************************************** Movie Name : Padaharella Vayasu (1978) Music Director : Chakravarthy Lyricist : Veturi Sundararama Murthy Singers : S.P.Balu, S.Janaki
చిత్రం : పున్నమి నాగు (1980) సంగీతం : చక్రవర్తి రచన : వేటూరి సుందరరామ మూర్తి గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం ******************************************* Movie Name : Punnami Nagu (1980) Music Director : Chakravarthy Lyricist : Veturi Sundararama Murthy Singer : S.P.Balasubramanyam
నీ..మగసిరి మషాలా..నాకే కావాలా నా పరువం దరువం నీవల్ల దివాలా అవ్వాలా ఇవాళ నీ సొగసుల ఉయ్యాలా..నేనే ఊగాలా నీ బింకం పొంకం నావల్ల దివాలా అవ్వాలా ఇవాళ ||నీ మగసిరి||
నీ సుతారమంతా సుఖాల శృతిలో సితార వాయించనా ఈ వయారి సొగసులు కాజేసి ముద్దుల విరాళమే ఇవ్వనా నీ బిగింపు తెగింపు నా ఒంపుసొంపుకి ముగింపు కావాలిరా నా గులాబిరేకుల జిలేబి కైపులు గులాములవ్వలిరా నువ్వడిగితే తీసివ్వనా నీ ఒంటికే సెంటవ్వనా ||నీ మగసిరి||
నీ మిఠాయి మాటల గిటారు పాటలు నిటారితో పాడుకో నా పరాకి కాళ్ళకి సరైన గురైన జవాబులే చెప్పుకో నీ హుషారు ఊపుల నిషాలలోపల రసాలు అందించవే నీ సూదంటి నడుముని నాకంటి చూపుల దారాలలో దాచవే నీవడిగితే నేనివ్వనా చేయి తగిలితే పూవవ్వనా ||నీ మగసిరి||
చిత్రం : భారతంలో అర్జునుడు (1987) సంగీతం : చక్రవర్తి రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్.జానకి ********************************************* Movie Name : Bharathamlo Arjunudu (1987) Music Director : Chakravarthy Lyricist : Jonnavithula Ramalingeswara Rao Singer : SP. Balasubramaniam, S.Janaki
చిత్రం : భారతంలో అర్జునుడు (1987) సంగీతం : చక్రవర్తి రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్.జానకి ********************************************* Movie Name : Bharathamlo Arjunudu (1987) Music Director : Chakravarthy Lyricist : Jonnavithula Ramalingeswara Rao Singer : SP. Balasubramaniam, S.Janaki
బంతి తీసుకో కపిల్ దేవ్ లా బ్యాట్ పట్టుకో విశ్వనాథ్ లా గవాస్కరల్లే కొట్టు గ్రౌండును అదరగొట్టు రవిశాస్త్రిలాగా రన్నులు చేస్తూ అజారుద్దీన్ లాగా ఆడు ఒకే దెబ్బతో సిక్సరు అదే ఊపులో సెంచరీ దాటించేస్తా బౌండరీ దడదడలాడాలి గాలరీ ||నీకూ నాకూ||
దమ్ముచూపుతా మదన్ లాల్ లా దుమ్ము రేపుతా శ్రీకాంత్ లా ఎగిరే బంతులు పడతా ఏ వన్ బౌలర్ నవుతా వెంగ్ సర్కార్ లా వేగం చూపి పఠౌడి పద్ధ తిలో కొడతా మాంచి ఊపుతో కొడుతూ మధ్యలోన ఔటవ్వకు లంచి బ్రేకులో లాలూచీ పడి నమ్మించి నన్ను ముంచకు ||నీకూ నాకూ||
చిత్రం : భారతంలో అర్జునుడు (1987) సంగీతం : చక్రవర్తి రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్.జానకి ********************************************* Movie Name : Bharathamlo Arjunudu (1987) Music Director : Chakravarthy Lyricist : Jonnavithula Ramalingeswara Rao Singer : SP. Balasubramaniam, S.Janaki
పల్లవి : నీ చూపులోనా.. విరజాజి వానా ఆ వానలోనా నేను తడిసేనా.. హాయిగా
నీ నవ్వులోనా.. రతనాల వానా ఆ వానలోనా నేను మరిచేనా... తీయగా
చరణం : 1 ఆ వెన్నెలేమో.. పరదాలు వేసే నీ వన్నెలేమో.. సరదాలు చేసే ఆ వెన్నెలేమో.. పరదాలు వేసే నీ వన్నెలేమో.. సరదాలు చేసే వయసేమో పొంగిందీ... వలపేమొ రేగిందీ వయసేమో పొంగిందీ... వలపేమొ రేగిందీ కనివిని ఎరుగని తలపులు చిగురించే...
నీ చూపులోనా.. విరజాజివానా ఆ వానలోనా నేను తడిసేనా.. హాయిగా
నీ నవ్వులోనా.. వడగళ్ల వానా ఆ వానలోనా నేను మునిగేనా... తేలనా
నీ చూపులోనా... విరజాజివానా ఆ వానలోనా నేను తడిసేనా... హాయిగా
నీ నవ్వులోనా... రతనాల వానా ఆ వానలోనా నేను మరిచేనా... తీయగా
చిత్రం : పిల్ల జమీందార్ (1980) సంగీతం : చక్రవర్తి రచన : వడ్డేపల్లి కృష్ణ గానం: S.P.బాలు, ఎస్.పి.శైలజ *************************************** Movie Name : Pilla Zamindar (1980) Music Director : Chakravarthy Lyricist : Vaddepalli Krishna Singers : S.P.Balu, S.P.Sailaja
చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లె పువ్వా చక్కని జాబిలి ఎక్కడుంటాను నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను
నీలి నీలి నీ కురుల నీలాల మేఘాల విరిసింది మల్లిక నా రాగ మాలిక అల్లిబిల్లి నీ కౌగిట అల్లుకున్న నా మమత కొసరింది కోరిక అనురాగ గీతిక నీ మూగ చూపులలో చెలరేగే పిలుపులలో నీ పట్టు విడుపులలో సుడిరేగే వలపులలో కన్ను కన్ను కలవాలి కలిసి వెన్నెలై పోవాలి చీకటి వెన్నెల నీడలలో దాగుడుమూతలు ఆడాలి
ఆకలైన నాకు తెలుసు కౌగిలెంత తీయనిదో కౌగిలింతకే తెలుసు ఆకలెంత తీరనిదో వేచివున్న నాకు తెలుసు విరహమెంత తీయనిదో కాచుకున్న నీకు తెలుసు కలయికెంత కమ్మనిదో ఈ పూల వానలలో తడిసిన నీ అందాలు ఈ పూత సొగసులలో కురిసిన మకరందాలు నీలో తీగలు మీటాలి నాలో రాగం పలకాలి లోకం మరిచిన మైకంలో మనమే ఏకం కావాలి
చిత్రం : అల్లరి బుల్లోడు (1978) సంగీతం : చక్రవర్తి రచన : వేటూరి సుందరరామమూర్తి గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, పి.సుశీల *************************************** chukkalato thotalo yekkadunnavo pakkaku rave marumalle puvvaa chakkani jabili yekkaduntanu ne pakkane chukkanai palakaristanu
neeli neeli ne kurula neelala meghala virisindi mallika na raga maalika allibilli ne kougita allukunna na mamata kosarindi korika anuraga geetika ne muga chupulalo chelarege pilupulalo ne pattu vidupulalo sudirege valapulalo kannu kannu kalavali kalisi vennelai povali cheekati vennela needalalo dagudumutalu aadali
aakalaina naku telusu kougilenta teeyanido kougilintake telusu aakalenta teeranido vechivunna naku telusu virahamenta teeynido kachukunna neku telusu kalayikenta kammanido ee pula vanalalo tadisina ne andaalu ee puta sogasulalo kurisina makarandaalu nelo teegalu meetali nalo ragam palakali lokam marichina maikamlo maname yekam kavali
Movie Name : Allari Bullodu (1978) Music Director : Chakravarthy Lyricist : Veturi SundaraRamamurthy Singers : SP. Balasubramaniam, P.Susheela
ఒకటే కోరిక నిన్ను చేరాలని ఒడిలో కమ్మగా కరిగిపోవాలని కరిగిపోవాలని(2)
నడకతో లేత నడుముతో చెలి మంత్రమే వేసెను కురులలో నీలి కనులలో నా హృదయమే చిక్కెను నీ చూపులే నను నిలువునా కౌగిలిస్తున్నవి నా పెదవులే నీ నామము కలవరిస్తున్నవి కలలందు కనులందు కదలక నిలిచెను నీ సొగసు
చేతికి చేయి తగిలితే గుబులు పుడుతున్నది కొత్తగా నా వయసుకు దిగులు వేస్తున్నది చెక్కిట ఆ నొక్కులు ఆశ పెడుతున్నవి ఆ ఒంపులు మేని బరువులు నను నిలువనీకున్నవి అణువణువు ప్రతి నిమిషం తొందర చేసెను నీకోసం
ఓ చంద్రమా .. ఒకనాటి ప్రియతమా... ఓ చంద్రమా .. ఒకనాటి ప్రియతమా... ఓ చంద్రమా .. ఒకనాటి ప్రియతమా... ఈ పేద కలువ నీకు గురుతేనా తెలుపుమా ఓ చంద్రమా ఒకనాటి ప్రియతమా
చరణం : 1 నీవు నాకు చేసిన బాస.... నీటి మీద రాసిన రాత నీవు నాకు చేసిన బాస.... నీటి మీద రాసిన రాత తాళి కట్టిన కలువకన్న తలుకులోలికే తార మిన్న రోజూ మారే రూపం నీది.. రోజూ మారే రూపం నీది.. మోజు పడిన పాపం నాది ఓ చంద్రమా ఒకనాటి ప్రియతమా
కళలు మార్చి కలలే చెరిపి.... మనువు మార్చి మంటలు రేపి కళలు మార్చి కలలే చెరిపి.... మనువు మార్చి మంటలు రేపి మచ్చ పడిన సొగసు నీది చిచ్చు రేగిన మనసు నీది కట్టగలవు మెడకో తాడు...కట్టగలవు మెడకో తాడు... కన్నె వలపుకే ఉరితాడు
ఓ చంద్రమా .. ఒకనాటి ప్రియతమా... ఈ పేద కలువ నీకు గురుతేనా తెలుపుమా ఓ చంద్రమా ఒకనాటి ప్రియతమా
చిత్రం : విచిత్ర జీవితం (1978) సంగీతం : చక్రవర్తి రచన : వేటూరి సుందర రామమూర్తి గానం : పి. సుశీల ********************************* oo chandramaa...okanaati priyatamaa.... oo chandramaa...okanaati priyatamaa.... oo chandramaa...okanaati priyatamaa.... ee peda kaluva neeku gurutenaa telupumaa oo chandramaa okanati priyatamaa
పల్లవి ఈ అనంత కాల గమనంలో ఈ రవ్వంత జీవన పయనంలో అందరు నీవారు..చివరకు మిగిలేదెవరు లేరు
చరణం : నీ కడుపున చీకటి దాచుకొని కన్నీరే చమురుగ చేసికొని నీ కొర్కెలు నిలువునా కాల్చుకొని వెలుగును పంచావందరికి నీ వేదన తెలిసిందెవరికి
చరణం : చేతికి తమ్ముడు అందోస్తాడని చెట్టుకు తానొక వేరౌతాడని చేసిన త్యగం చేయి దాటిందా రెక్కలు వస్తే అంతేనమ్మా నీ రెక్కలే నీకు శాశ్వతమమ్మా
చరణం : నీ అలసట తీర్చే ఓడి ఒకటుందని నీ అనురగనికి గుడి తాననుకొని వేచావమ్మా ఆశలు దాచుకొని.. దేవుడు తలుపులు మూసడా నీ దీపం నేటితో కొండెక్కిందా
చరణం అందరి నొసలు ఒకటేనమ్మా అందరి రాతలు వెరౌనమ్మా కొందరి బ్రతుకులు అందరి కోసమని రాసినివాడికే తెలియాలి కధ ముగింపు వాడే తేల్చాలి
చిత్రం : సంధ్య (1980) సంగీతం : చక్రవర్తి రచన : ఆత్రేయ గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం ******************************** Movie Name : Sandhya (1980) Music Director : Chakravarthy Lyricist : Aathreya Singer : S.P.Bala Subramanyam
నీ పైన నాకెంతో అనురాగముందని నీ పైన నాకెంతో అనురాగముందని నిను వీడి క్షణమైనా నేనుండ లేనని ఎలా, ఎలా నీకెలా తెలిపేది ( 2) !! నీ పైన!!
నీలి నింగిలో కోటి తారలు మాలలల్లి తేనా అందమైన ఆ చందమామ నీ కురుల తురుమవలెనా (2) అణువణువున నీవే వ్యాపించినావని (2) ఎలా, ఎలా నీకెలా తెలిపేది (2) !! నీ పైన!!
వలపు తెలియని మనసులోనికి ఎందుకోసమని వచ్చావు మనసు దోచుకుని మమత పంచుకొని మరలి వెళ్లి పోతున్నావు నిన్నే హృదయాన నిలిపాను నేనని ఎలా, ఎలా నీకెలా తెలిపేది (2 ) !! నీ పైన!!
చిత్రం : అభిమానవతి (1975) సంగీతం : చక్రవర్తి రచన : దాశరథి గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం ********************************** Movie Name : Abhimanavathi (1975) Music Director : Chakravarthy Lyricist : Dasarathi Singer : S.P.Bala Subramanyam
చరణం : 2 ఉదయించే తూరుపులో కిరణాలన్నీ నవ్వులే.. వరములు కోరే దేవుడికిచ్చే హారతి కూడా నవ్వులే.. మృతినైనా గెలిచేటి ఈ నవ్వులు నీ పేర మిగిలేటి నీ గురుతులు.. నవ్వులతో సంతకం చేసిన నా జీవితం అంకితమే చేస్తున్నా...కవితలా..తీరని మమతలా.
చిత్రం : స్రవంతి (1986) సంగీతం : చక్రవర్తి రచన : వేటూరి సుందర రామమూర్తి గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం *************************** Movie Name : Sravanthi (1986) Music Director : Chakravarthy Lyricist : Veturi Sundara Ramamurthy Singer : S.P.Bala Subramanyam
కలం..గళం..స్వరం నాకు నీవేననీ మధుర ప్రణయ కవిత పాడుకున్నానులే నీలో అలిగే అందాల రూపం నాలో వెలిగే శృంగార దీపం నీలో కరిగే ఆ ఇంద్ర చాపం నాలో జరిగే అమృతాభిషేకం సన్నని కులుకే వెన్నెల చినుకై రమ్మందిలే మనసిమ్మందిలే నీ రాగమే పాడిందిలే
పాడనా వేణువై నీవు నా ప్రాణమై నా జీవన బృందావని లో ప్రియ దర్శన రస మాధురిలో పాడనా వేణువై నీవు నా ప్రాణమై
చిత్రం : సుందరి సుబ్బారావు (1984) సంగీతం : సత్యం రచన : వేటూరి సుందర రామమూర్తి గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
నాకొక శ్రీమతి కావాలి...నీ అనుమతి దానికి కావాలి. నాకొక శ్రీమతి కావాలి...నీ అనుమతి దానికి కావాలి. నాకొక శ్రీమతి కావాలి...నీ అనుమతి దానికి కావాలి. మేనక అందం ...ఊర్వశి నాట్యం... కలబోసి కాపురం చెయ్యాలి. నాకొక శ్రీమతి కావాలి...నీ అనుమతి దానికి కావాలి.
పొద్దుకాడ ముద్దిచ్చి లేపాలి నువ్వు ...ముద్దు ముద్దు మీద ముద్దిచ్చి లేచేది నేను పొద్దుకాడ ముద్దిచ్చి లేపాలి నువ్వు ...ముద్దు ముద్దు మీద ముద్దిచ్చి లేచేది నేను
సంసారం ఒక చదరంగం...అనుబంధం ఒక రణరంగం స్వార్ధాల మత్తులో..సాగేటి ఆటలో ఆవేశాలు, ఋణపాశాలు తెంచే వేళలో సంసారం ఒక చదరంగం....అనుబంధం ఒక రణరంగం
గుండెలే బండగా మారిపోయేటి స్వార్ధం తల్లిని తాళిని డబ్బుతో తూచు బేరం రక్తమే నీరుగా తెల్లబోయేటి పంతం ఇంటికి మంటికి ఏకధారైన శోకం తలపై నీ గీత ఇలపైనే వెలసిందా రాజులే బంటుగా మారు ఈ క్రీడలో జీవులే పావులైపోవు ఈ కేళిలో ధనమే తల్లి, ధనమే తండ్రి, ధనమే దైవమా?
సంసారం ఒక చదరంగం...అనుబంధం ఒక రణరంగం స్వార్ధాల మత్తులో..సాగేటి ఆటలో ఆవేశాలు, ఋణపాశాలు తెంచే వేళలో సంసారం ఒక చదరంగం....అనుబంధం ఒక రణరంగం
కాలిలో ముళ్ళుకి కంట నీరేట్టు కన్ను కంటిలో నలుసిని కంట కనిపెట్టు చెల్లి రేఖలు, గీతలు చూడదే ఏ రక్తబంధం ఏ పగా చాలదు ఆపగా ప్రెమపాశం గడిలో ఇమిరెనా మదిలో గల మమకారం పుణ్యమే పాపమై సాగు ఈ పోరులో పాపకే పాలు కరువైన పట్టింపులో ఏ దైవాలు కాదంటాయి మదిలో ప్రేమను
సంసారం ఒక చదరంగం...అనుబంధం ఒక రణరంగం ప్రాణాలూ తీసినా, పాశాలూ తీరునా అదుపు లేదు, అజ్ఞ లేదు మమకారాలలో
కౌగిలే కాపురం కాదులే పిచ్చితల్లి మల్లెల మంచమే మందిరం కాదు చెల్లి తేనెతో దాహము తీర్చదేనాడు చెల్లి త్యాగమే ఊపిరై ఆడదైయేను తల్లి కామానికి దాసొహం కారాదే సంసారం కాచుకో భర్తనే కంటి పాపాయిగా నేర్చుకో ప్రేమనే చంటి పాపాయిగా మన్నించేది, మనసిచ్చేది మగడే సోదరి
సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక గుణపాఠం ప్రేమే సంసారము, ప్రేమే వేదాంతాము వయస్సు కాదు, వాంచ కాదు, మనసే జీవితం
చుక్కలు, జాబిలి చూసి నవ్వేటి కావ్యం నింగికే నిచ్చెన వేసుకుంటుంది బాల్యం తారపై కోరిక తప్పురా చిట్టీ నేస్తం రెక్కలే రానిదే ఎగరలేనెదు భ్రమరం వినరా ఒ సుమతి..పొరాదు ఉన్న మతి పాత పాఠాలనే దిద్దుకో ముందుగా నేర్చుకో కొత్త పాఠాలనే ముద్దుగా నిను పెంచేది , గెలిపించేది చదువే నాయనా
సంసారం ఒక చదరంగం చెరింగిందా నీ చిరుస్వప్నం ఈ గాలి వానలో నీ మేఘమాలలో ఉరిమే మబ్బు మెరిసే బొమ్మ చెరిపే వేళలో చుక్కలు జాబిలి చూసి నవ్వేరి కావ్యం నింగికి నిచ్చెన మేసుకుంటుంది బాల్యం తారపై కోరిక తప్పురా చిట్టి నేస్తం రెక్కలే రానిదే ఎగరనేలేదు భ్రమరం వినరా ఓ సుమతీ పోరాదు ఉన్న మతి పాత పాఠాలనె దిద్దుకో ముందుగా నేర్చుకో కొత్త పాఠాలనే ముద్దుగా నిన్ను పెంచేది గెలిపించేది చదువే నాయనా
సంసారం ఒక చదరంగం చీకటిలో అది రవికిరణం ప్రళయాలు రేగినా తిమిరాలు మూగినా వెలిగించేది ఈ సంసారమే
చిత్రం : సంసారం ఒక చదరంగం (1987) సంగీతం : చక్రవర్తి రచన : వేటూరి గానం : S.P. బాలు
అందం శరణం గచ్చామి అధరం శరణం గచ్చామి ఈ సాయంత్ర వేళ నీ ఏకాంతసేవ అతి మధురం అనురాగం ఒదిగే వయ్యారం ప్రణయం శరణం గచ్చామి హృదయం శరణం గచ్చామి ఈ సింధూర వేళ నీ శృంగారలీల సుఖ శిఖరం శుభయోగం అది నా సంగీతం
చరణం 2 చూపుతో గిచ్చక వయసే లేతదమ్మా వలపు గాలికే వాడుతున్నది విసరకు పూబాణమే చేసుకో మచ్చిక వరసే కొత్తదమ్మా చలికి రేగిన ఒడికి చేరిన చెరిసగ మీ ప్రాణమే నీ ఊపిరి నాలో పూలారబోసి అందాలో నా ప్రేమ గంధాలో ముసిరే ముంగిళ్లలోన అందం శరణం గచ్చామి హృదయం శరణం గచ్చామి ఈ సాయంత్ర వేళ నీ ఏకాంతసేవ సుఖ శిఖరం శుభయోగం అది నా సంగీతం
చిత్రం : పసివాడి ప్రాణం (1987) సంగీతం : చక్రవర్తి రచన : వేటూరి గానం : ఎస్.పి.బాలు , పి.సుశీల ***********************************
Movie Name : Pasivaadi Pranam (1987) Music Director : K.Chakravarthy Lyricist : Veturi Sundara Ramamurthy Singers : S.P.Balu , P.Susheela
చిత్రం : ఛాలెంజ్ రాముడు (1980) సంగీతం : చక్రవర్తి రచన : వేటూరి గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల ******************************* Movie Name : Challenge Ramudu Music Director : Chakravrthy Lyricist : Veturi Singers : S.P.Balu , P.Sushela