Showing posts with label Jonnavitthula Ramalingeswara Rao-Lyrics. Show all posts
Showing posts with label Jonnavitthula Ramalingeswara Rao-Lyrics. Show all posts

Thursday, October 31, 2013

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో .... మాయలోడు (1993)

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల  ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి
వాన జాణ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది  సింగారంగా

నింగి నేల ఈవేళ చలికి వణికిపోతుంటే
బిగి కౌగిలి పొదరింటికి పద పదమంటే
ఈ కౌగిలింతలోన ఏలో
గుండెల్లో ఎండ కాసే ఏలో
పైన మబ్బు ఉరిమింది
పడుచు జింక బెదిరింది
వల వేయగా సెలయేరై పెనవేసింది
చినుకమ్మ మెరుపమ్మ ఏలో
చిటికేసే బుగ్గ మీద ఏలో
వలపు ఇక తొలివలపు తక జం తక జం
వయసు తడి సొగసు అరవిరిసే సమయం

మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది
ఎద లోపల చలిగాలుల సుడి రేగింది
వానొచ్చే వరదొచ్చే ఏలో
వయసంటే తెలిసోచ్చే ఏలో
మేను చూపు పోయింది వాలు చూపు సయ్యంది
చలి కోరిక అలవోకగ  తల ఊపింది
సరసాల సిందులోన ఏలో
సరిగంగ తానాలు ఏలో
ఒడిలో ఇక ఒకటై తకతకతై  అంటే
సరసానికి దొరసానికి ముడిపెడుతుంటే...


చిత్రం : మాయలోడు (1993)
సంగీతం : S.V. కృష్ణా రెడ్డి
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
*****************************************
Movie Name : Mayalodu (1993)
Music Director : S.V.Krishnareddy
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : SP. Balasubramaniam, Chitra

గోంగూర సేలోనా గోలగోల చెయ్యొద్దురా మావా వెనకాల .... భారతంలో అర్జునుడు (1987)

గోంగూర సేలోనా గోలగోల
చెయ్యొద్దురా మావా వెనకాల
గోంగూర సేలోనా గోలగోల
చెయ్యొద్దురా మావా వెనకాల
పోసికోలు ఆసికాలు చాలు చాలు
పోసికోలు ఆసికాలు చాలు చాలు
కదపనీయి కూసింత చెయ్యీకాలు..చెయ్యీకాలు

గోంగూర సేలోనా పొద్దుటేల
ఆకంతా కోసేటి పడుచుపిల్ల
గోంగూర సేలోనా పొద్దుటేల
ఆకంతా కోసేటి పడుచుపిల్ల
ఆగలేవు నిన్నుచూస్తే కాలూచెయ్యీ
మరి ఆగలేవు నిన్నుచూస్తే కాలూచెయ్యీ
సరసమాడి సాటుమాటు సాయం చెయ్యి..సాయం చెయ్యి

నాగులేటి వాగులాటి నడక చూసి
నల్లపూసకంటె సిన్న నడుము చూసి
ఆగలేకపోయానే అత్తకూతురా
వెన్నపూసలాంటి ఒంటి మెరుపు చూసి
మిరపతోట ఎరుపులాంటి చూపు చూసి
నిలవలేకపోయారా సందమామా
ఓ ఎట్టయితే వచ్చేసెయ్యి అహ అందరిని ఒప్పించెయ్యి
లగ్గాలే పెట్టిస్తా రానిచ్చెయ్యి రాసిచ్చెయ్యి మురిపించెయ్యి ||గోంగూర||


గోగుపూల సోకులన్ని దోచుకోకు
గోరువంకలాగ వచ్చి గిచ్చబోకు
నాగళ్ళ కొనగోళ్ళ గుచ్చొద్దురా
మంచెకాడి కుప్పకాడ ఒప్పుకోవే
బొంగరాల బుంగమూతి తిప్పుకోవే
ముత్యాలమునిపంట ముద్దియ్యవే
హెయ్ పందిళ్ళు వేయించెయ్యి ఒహో పరువాలు అందించెయ్యి
పొంగారే బొంగారం పండించెయ్యి పట్టేసెయ్యి..ఒట్టేసెయ్యి ||గోంగూర||


చిత్రం :  భారతంలో అర్జునుడు (1987)
సంగీతం :  చక్రవర్తి
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం :   ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
*********************************************
Movie Name : Bharathamlo Arjunudu (1987)
Music Director : Chakravarthy
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : SP. Balasubramaniam, S.Janaki

నీ..మగసిరి మషాలా..నాకే కావాలా ...... భారతంలో అర్జునుడు (1987)

నీ..మగసిరి మషాలా..నాకే కావాలా
నా పరువం దరువం నీవల్ల దివాలా అవ్వాలా ఇవాళ
నీ సొగసుల ఉయ్యాలా..నేనే ఊగాలా
నీ బింకం పొంకం  నావల్ల దివాలా అవ్వాలా ఇవాళ
 ||నీ మగసిరి||

నీ సుతారమంతా సుఖాల శృతిలో సితార వాయించనా
ఈ వయారి సొగసులు కాజేసి ముద్దుల విరాళమే ఇవ్వనా
నీ బిగింపు తెగింపు నా ఒంపుసొంపుకి ముగింపు కావాలిరా
నా గులాబిరేకుల జిలేబి కైపులు గులాములవ్వలిరా
నువ్వడిగితే తీసివ్వనా
నీ ఒంటికే సెంటవ్వనా  ||నీ మగసిరి||

నీ మిఠాయి మాటల గిటారు పాటలు నిటారితో పాడుకో
నా పరాకి కాళ్ళకి సరైన గురైన జవాబులే చెప్పుకో
నీ హుషారు ఊపుల నిషాలలోపల రసాలు అందించవే
నీ సూదంటి నడుముని నాకంటి చూపుల దారాలలో దాచవే
నీవడిగితే నేనివ్వనా
చేయి తగిలితే పూవవ్వనా  ||నీ మగసిరి||


చిత్రం :  భారతంలో అర్జునుడు (1987)
సంగీతం :  చక్రవర్తి
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం :   ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
*********************************************
Movie Name : Bharathamlo Arjunudu (1987)
Music Director : Chakravarthy
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : SP. Balasubramaniam, S.Janaki

అందాల కోనలో...గంధాల మేడలో.... భారతంలో అర్జునుడు (1987)

అందాల కోనలో...గంధాల మేడలో
అందాల కోనలో గంధాల మేడలో
వెన్నెలకి జాబిలికి శోభనం
వెన్నెలకి జాబిలికి శోభనం
ప్రేమజంట పడుచుతనం పావనం

తేనెవాగు పక్కన...మల్లెతోట మధ్యన
తేనెవాగు పక్కన మల్లెతోట మధ్యన
పాలపొంగు అనుభవాల ఉత్సవం
పాలపొంగు అనుభవాల ఉత్సవం
మరువరాని ఙ్ఞాపకాల వైభవం

జగడాల జాజితీగ పొగరైన కందిరీగ సంపంగి పక్కమీద సంగమం
రాగాల పొద్దులోన తాళాలోన హద్దుపైన మద్దెల తాకిళ్ళ సంబరం
ఆగాళ్ళ కాగడాలు అంటిస్తుంటే
భోగాల చలిమంట రాజేస్తుంటే
ఇవ్వాలి నీ పెదవి తాంబూలం
అవ్వాలి నీవింక మందారం
చెయ్యాలి మురిపాల జాగారం  ||అందాల కోనలో||

కౌగిళ్ళ కొలువులోన ఏకాంత రాత్రివేళ నూరేళ్ళ వస్త్రాపహరణం
మోహాల ఆయుధాల వ్యూహాలబంధనాల ముద్దుముద్దు యుధ్ధాల భారతం
బింకాలా శంఖాలా రావాలలో..పరువాల కుర్రాళ్ళ పెదాలలో
చిగురాకు జండాలు ఎత్తేయనా
చిరునవ్వు పగడాలు మత్తియ్యనా
స్వప్నాల వాకిళ్ళు తెరిచేయనా  ||అందాల కోనలో||


చిత్రం :  భారతంలో అర్జునుడు (1987)
సంగీతం :  చక్రవర్తి
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం :   ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
*********************************************
Movie Name : Bharathamlo Arjunudu (1987)
Music Director : Chakravarthy
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : SP. Balasubramaniam, S.Janaki

నీకూ నాకూ కుదిరెను మ్యాచి... పోటాపోటి క్రికెట్టు మ్యాచి... భారతంలో అర్జునుడు (1987)

నీకూ నాకూ కుదిరెను మ్యాచి
పోటాపోటి క్రికెట్టు మ్యాచి
ఓడించేసెయ్ సర్వం దోచి
గెలిపించేసెయ్ ప్రేమించేసెయ్
నీకూ నాకూ కుదిరెను మ్యాచి
పోటాపోటి క్రికెట్టు మ్యాచి
ఓడించేస్తా పరువం దోచి
గెలిపించేస్తా ప్రేమించేసి

బంతి తీసుకో కపిల్ దేవ్ లా
బ్యాట్ పట్టుకో విశ్వనాథ్ లా
గవాస్కరల్లే కొట్టు గ్రౌండును అదరగొట్టు
రవిశాస్త్రిలాగా రన్నులు చేస్తూ అజారుద్దీన్ లాగా ఆడు
ఒకే దెబ్బతో సిక్సరు అదే ఊపులో సెంచరీ
దాటించేస్తా బౌండరీ దడదడలాడాలి గాలరీ  ||నీకూ నాకూ||

దమ్ముచూపుతా మదన్ లాల్ లా
దుమ్ము రేపుతా శ్రీకాంత్ లా
ఎగిరే బంతులు పడతా ఏ వన్ బౌలర్ నవుతా
వెంగ్ సర్కార్ లా వేగం చూపి పఠౌడి పద్ధ తిలో కొడతా
మాంచి ఊపుతో కొడుతూ మధ్యలోన ఔటవ్వకు
లంచి బ్రేకులో లాలూచీ పడి నమ్మించి నన్ను ముంచకు
||నీకూ నాకూ||


చిత్రం :  భారతంలో అర్జునుడు (1987)
సంగీతం :  చక్రవర్తి
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం :   ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
*********************************************
Movie Name : Bharathamlo Arjunudu (1987)
Music Director : Chakravarthy
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : SP. Balasubramaniam, S.Janaki

అగ్నిశిఖల సంకేతం ఈ గీతం ..... భారతంలో అర్జునుడు (1987)

అగ్నిశిఖల సంకేతం ఈ గీతం
భరతజాతి జాగృతికిది సందేశం
ఆవేశం కోల్పోయిన మీకోసం
గర్జించే...అర్జున శంఖారావం ||అగ్నిశిఖల||

అర్రచకత్వం ... ప్రబలిన దేశం
అమాయకులకే బలిపీఠం
సాహసవంతులు చచ్చిన సంఘం
సగటు మనుషులందరికి ఉరికంబం
పౌరహక్కు పతనానికి పరాకాష్ఠ ఈ ఘట్టం
అల్లూరి, భగత్ సింగ్  పునర్జన్మమీ సాక్ష్యం
ఒక్కసారి పచ్చినిజం పల్లవి పాడండి
గూండా రక్కసి రాజ్యం..కూల్చేయండి ||అగ్నిశిఖల||

అమానుషంగా...సహనమూర్తినే
వంచనతో బలిచేసిన ఘాతకులు
కిరాతకంగా దేశమాతపై గుళ్ళవాన కురిపించిన విద్రోహులు
దేశానికి దారుణాల తోరణాలు కడుతుంటే
అనుక్షణం ఈ సంఘం రణరంగం అవుతుంటే
సాహసించి చేయండి శాంతికి నవయఙ్ఞం
దురంతాల అంతానికి ఇదే మనకు శుభలగ్నం  ||అగ్నిశిఖల||


చిత్రం :  భారతంలో అర్జునుడు (1987)
సంగీతం :  చక్రవర్తి
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం :   ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
*********************************************
Movie Name : Bharathamlo Arjunudu (1987)
Music Director : Chakravarthy
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : SP. Balasubramaniam

వేస్తావా వేస్తావా నా ఆకులవక్క పువ్వులపక్క వేస్తావా ... ఖతర్నాక్ (2006)

వేస్తావా వేస్తావా నా ఆకులవక్క పువ్వులపక్క వేస్తావా
వేస్తాలే వేస్తాలే సోకులమెక్క పక్కలు ఇక వేస్తానే
ఏరా నీ ముందరుంటే ఎటో చూస్తుంటావా
గాలమేసియ్యమంటే ఆలోచిస్తుంటావా
రావే నా రవ్వలకోడి నీ ఒళ్ళోనే లాడీపేడీ ||వేస్తాలే||

చల్లెటు బుల్లెటు చాటుమాటు రవ్వట్టు
చీకట్లో పూవెట్టు చిమచిమ చిమాయింపుగా
ఉందంతే ఉన్నట్టు లేదంటే లేనట్టు
సిగ్గంతా తాకట్టు యమయమ యమాయింపుగా
ఏది నీ బంజారా చూడనీ కళ్ళారా పక్కనే ఉన్నారా మీటుకో తంబూరా
తెల్లారినా చల్లారని కౌగిళ్ళల్లో ఉడుకు మరిగి మళ్ళీ మళ్ళీ  ||వేస్తాలే||

కాముడికి తమ్ముడా కండవెల్లి గుమ్మడా
చుక్కపొడిచేదాకా ఒకే దూకుడా
ఓసి నీ జిమ్మడా దాచకే ఆవడా
చిల్లి పడిపోతాదే సిల్కు పావడా
ఆపు నీ ఆరాటం సాగనీ సయ్యాటం
ఎంతసేపు ఆడాలి ఒంటికర్ర కోలాటం
కొంపా కొల్లేరయ్యేదాకా గుప్పా తెగేదాకా మళ్ళీ మళ్ళీ  ||వేస్తాలే||


చిత్రం :  ఖతర్నాక్ (2006)
సంగీతం : M.M. కీరవాణి
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : గాయత్రి, శంకర్ మహదేవన్, నోయెల్
*********************************
Movie Name : Khatarnak (2006)
Music Director :  M.M.Keeravani
Lyricist :  Jonnavithula Ramalingeswara Rao
Singers : Gayathri,Shankar Mahadevan, Noel

Wednesday, October 30, 2013

మనుషుల్లో జెంటిల్ మాన్ పోస్ట్ మాన్ .. పోస్ట్ మాన్ (2000)

సార్ పోస్ట్ ...మేడం పోస్ట్
మనుషుల్లో జెంటిల్ మాన్ పోస్ట్ మాన్ .. పోస్ట్ మాన్
జాబుల్లో గ్రేటు జాబు పోస్ట్ మాన్ .. పోస్ట్ మాన్
మనుషుల్లో జెంటిల్ మాన్ పోస్ట్ మాన్
జాబుల్లో గ్రేటు జాబు పోస్ట్ మాన్
పోస్ట్ మాన్ లేని ఊరు వేస్టురా కన్నా
నీ బెస్టు ఫ్రెండు పోస్ట్ మాన్ తెలుసుకో నాన్నా
పట్టణాలకైనా పల్లెలకైనా వార్తలెన్నో మోసుకొచ్చే వారధేరా ఈ పోస్ట్ మాన్
సారథేరా ఈ పోస్ట్ మాన్ ||మనుషుల్లో||

రామయ్యా ఉంగరాన్ని సీతమ్మకిచ్చిన హనుమానేరా మొదటి పోస్ట్ మాన్
ముల్లోకాల వార్తలన్ని అక్కడికిక్కడ లింకుపెట్టిన నారదుడేరా మేటి పోస్ట్ మాన్
రాజూరాణిల ప్రేమపురాణం రాజమహెంద్రం కోట రహస్యం
మేఘాలల్లో వేగాలతో రెక్కలచాటున భద్రం చేసి
గమ్యం చేర్చిన వార్త విహారీ పావురమేరా స్పీడు పోస్ట్ మాన్
దాని వారసుడేరా నేటి పోస్ట్ మాన్  ||మనుషుల్లో||

భూగోళ్ళమ్మీద ఉన్న ప్రతి ఒక్కరితోను ఉత్తరబంధం ఉన్న ఉత్తముడేరా పోస్ట్ మాన్
ప్రేమపెళ్ళి అనుబంధాలకి మానవజీవన సంబంధాలకి
ముద్దర వేసీ ముందుకు నడిపేవాడు పోస్ట్ మాన్
కులము మతము పట్టనివాడు పేద గొప్ప చూడనివాడు
సరిహద్దుల్లో సైన్యానికి ప్రేమపెద్దలు పంచేవాడు ప్రజలందరికి చుట్టము వీడు
సహనముతోనే రోజూ సాగేవాడు
శుభము జయమూ మీకు అందిస్తాడు   ||మనుషుల్లో||


చిత్రం :  పోస్ట్ మాన్ (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత Jr
*******************************************************
Movie Name :  Post Man (2000)
Music Director : Vandemataram Srinivas
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Udith Narayan, Swarnalatha

రావే రావే ఓ కోయిలా .... రావే రావే ఓ కోయిలా.... ఈడు-జోడు (2010)

రావే రావే ఓ కోయిలా .....రావే రావే ఓ కోయిలా
రావే రావే ఓ కోయిలా..... రావే రావే ఓ కోయిలా
కొండాకోనలా పొంగే తేనెలా
రాగంతోటి ప్రాణం పోసే అందరి నేస్తం లా
రావే రావే ఓ కోయిలా..... రావే రావే ఓ కోయిలా

అహో మధురం కుహుకుహు గమకం
మహాకుసుమం రంగుల గగనం
చిత్రాలై చిందులేసే అందాలు మిత్రాలై మీదికొచ్చే చైత్రాలు
పిల్లాగాలి వేసే ఈలల్లో ప్రతి గుండెల్లోన అల్లోనేరెళ్ళు
అద్దం లాంటి చెరువునీళ్ళల్లో తడి పుత్తడిబుగ్గల కన్నెల ఊహళ్ళో
సరాగమాడగా...    ||రావే రావే||

ప్రతీ ఉదయం రసమయనిలయం
ఇదే సమయం ప్రతిభకు విజయం
నా ప్రాణం పలికే నీకే ఆహ్వానం
నీ గానం వింటూ ఉంటే ఆనందం
నీకూ నాకూ మధ్య ఈ దూరం నీ పాటే కదా వలపుకు ఆధారం
అభిమానుల ప్రేమే నీ సొంతం నీతో జట్టేకట్టే తరగని అదృష్టం
వరాలనీయగా...     ||రావే రావే||


చిత్రం :  ఈడు-జోడు (2010)
సంగీతం: సత్యం రత్నాల
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం: చిత్ర (Female version), దీపు (Male version)
*******************************************************
Movie Name :   Eedu - Jodu (2010)
Music Director : Satyam Rathnala
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Chitra (Female version), Deepu (Male version)

జై జై శ్రీ రామా నిను పొగడగ నా తరమా ..... అంజనీపుత్రుడు (2009)

జై జై శ్రీ రామా నిను పొగడగ నా తరమా
జై జై శ్రీ హనుమా చాటెదము నీ మహిమ
త్యాగానికి నువ్వే చిరునామా ఓ సీతారామ
సాయానికి నిలిచే గుణమా ఓ అతులిత బలధామా..
ఓ అతులిత బలధామా ||జై జై శ్రీ రామా||

దుష్టశిక్షణకు అవనికి వచ్చిన విష్ణుమూర్తి అవతారమా...రామా రామ
శ్రీరామునికే సాయం చేయగా దిగివచ్చిన శివతేజమా...హనుమా హనుమ
మునులు దేవతలు ఋషీశ్వరులకే తెలియని మూల ప్రకాశమా
సీతను రాముని కలిపి హృదయమున నిలిపిన భక్తియోగమా
శాంతి శౌర్యగుణశీలమా
రామకార్య సాఫల్యమా
నీతినియమముల ప్రియతమా
భూతప్రేతముల భరతమా
మాటమాటలో సత్యమా
భక్తకోటికే మిత్రమా
ఋషివాల్మీకే, తులసిదాసులే ఎరుగలేరు ఆ రాముని
చిన్నపిల్లలం మేమందరం ఎరుగుదం మా హనుమా... ||జై జై శ్రీ రామా||

రామదాసుని జైలునుండి విడిపించిన కరుణామయుడు మా రాముడూ...శ్రీ రాముడు
సీతమ్మ చెఱనీ విడిపించినాడు లంఘించి జలధి మా ఆంజనేయుడు..ఆంజనేయుడు
సూర్యవంశమునే కీర్తికాంతులతో నింపినాడు మా రామచంద్రుడు
సూర్యబింబమునే మామిడిపండుగ మింగినాడు బాలాంజనేయుడు
కష్టమునుండి బయటపడెదరు రాముని కొలిచేవారు
కష్టములెపుడూ పడరు మా హనుమను నమ్మినవారు
మా రాముడు తారకబ్రహ్మము
మా మారుతి అందరి నేస్తము
రామతత్వమునకర్థము తెలియుట ఎంతో కష్టం
మారుతి భక్తీ, శక్తీ, యుక్తీ, సేవా తెలియుట సులభం..ఎంతో సులభం
కౌసల్యాసుప్రజారామా
అంజనానందనాహనుమా
అంజనానందనాహనుమా   ||జై జై శ్రీ రామా||


చిత్రం : అంజనీపుత్రుడు (2009)
సంగీతం :  వందేమాతరం శ్రీనివాస్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : వందేమాతరం శ్రీనివాస్, సాయిశ్రీ హర్ష, మృదురవళి
*******************************************************
Movie Name :  Anjani Putrudu (2009)
Music Director : Vandemataram Srinivas
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Vandemataram Srinivas, Sai Sriharsha, Mrudu Ravali

నీసరి ఎవరయ్యా అంజనాకేసరి హనుమయ్యా ..... అంజనీ పుత్రుడు (2009)

నీసరి ఎవరయ్యా అంజనాకేసరి హనుమయ్యా
నీసరి ఎవరయ్యా అంజనాకేసరి హనుమయ్యా
దాసుడనేనయ్యా బ్రతుకున బాసట నీవయ్యా
చూసిరమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు...హనుమా...హనుమ
చూసిరమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు ఆ లంకను కాల్చి వచ్చినావు
సీతమ్మను చూసి వచ్చినావు శిరోమణి తీసుకొచ్చినావు
రామచంద్రుని ఆలింగన సన్మానమందినావు
రామచంద్రుని ఆలింగన సన్మానమందినావు
సత్కార్య సాధకులందరికి ఆదర్శము నీవు ||నీసరి ఎవరయ్యా||

శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి కూర్చినావు
ప్రభువుకు మంచి చేసినావు సుగుణములెంచి చూసినావు
శుభమ్ములు కలుగజేసినావు
లక్ష్మణ మూర్ఛను బాపగ సంజీవగిరిని తెచ్చినావు
భక్తులందరిని బ్రోచుటకు చిరంజీవిగా ఉన్నావు..హనుమా  ||నీసరి ఎవరయ్యా||

భక్తిపరీక్షకు నిలబడి ఒడిని గుండె చీల్చినావు
రాముని ఎదను చూపినావు అనితర భక్తి చాటినావు
భక్తుల శక్తి చాటినావు
రామనామయని ఘోషించే జపసాగరమే నీవు
రామనామాంబుధి నీవు
రామనామాంబుధి నీవు....హనుమా

హనుమా...నను గనుమా...    ||నీసరి ఎవరయ్యా||
భీమసేనుని దారి కాచి సరిదారి చూపినావు
ఆ తమ్ముని తరచి చూసినావు నిజమ్మును తనకు తెలిపినావు
విశ్వరూపమ్మును చూపినావు
జెండాపై కపిరాజై అర్జునరథమునెక్కినావు
అద్భుతమౌ జయమునొసగినావు
అద్భుతమౌ జయమునొసగినావు
హనుమా...హనుమా...      ||నీసరి ఎవరయ్యా||


చిత్రం : అంజనీపుత్రుడు (2009)
సంగీతం :  వందేమాతరం శ్రీనివాస్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : వందేమాతరం శ్రీనివాస్
*********************************************
Movie Name :  అంజనీపుత్రుడు (2009)
Music Director : Vandemataram Srinivas
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : Vandemataram Srinivas

చెల్లాయే ఇల్లాలై అత్తింటీకెడుతుంటే అందరి కన్నుల్లోనా కన్నీరే .... గోరింటాకు (2008)

చెల్లాయే ఇల్లాలై అత్తింటీకెడుతుంటే అందరి కన్నుల్లోనా కన్నీరే
అడుగే పడనీ పయనం విడువలేనీ బంధం ఆగీ ఆగీ అచటే నిలిచేనా
అప్పగింతాల తీరు ఇంతేనా
దేవుడిలా నిలిచి నిను పెంచిన అన్నయ్య
నిన్నే తలచి తలచి నిలువెల్లా నీరయ్యే
ఆకాశం తాకే ఆ ప్రేమ మమకారం నీవెంటే రావాలని కనుజల్లై కురిసే
సుఖశాంతులు శోభిల్లి నువ్వు మెట్టీన ఇల్లు
ఓ చెల్లి వర్థిల్లు నిండూనూరేళ్ళు
అన్నయ్యదీవెనలు శ్రీ రామరక్ష
శ్రీరస్తు శుభమస్తు సౌభాగ్యమస్తు


చిత్రం : గోరింటాకు (2008)
సంగీతం :   S.A.రాజ్ కుమార్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : గోపికా పూర్ణిమ
*********************************************
Movie Name : Gorintaku (2008)
Music Director : S.A.Raj Kumar
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : Gopika Purnima

కరుణకురియు అరుణాచల శివశంభో జయజయ శంభో ..... గోరింటాకు (2008)

కరుణకురియు అరుణాచల శివశంభో జయజయ శంభో
కడుపుతీపి రుచి తెలిసిన హరశంభో కైలాసవిభో
జన్మని ధన్యం చేయవయా వరపుత్రుడనొసగి ప్రేమతో దీవెనలీయవయా
కడుపుతీపి రుచి తెలిసిన హరశంభో కైలాసవిభో

రాహుకేత శని నాగ దోషములు నివారించు నిఖిలేశ్వరా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా
అమ్మ పిలుపుతో అమృతత్వమును ప్రసాదించు పరమేశ్వరా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా

బాలగణపతి కుమారస్వాముల ఆటలు చూసి మురిసే దేవా
శివశివశంకర హరహరదేవా
పాలుతేనె అబిషేకములనుగొని పరీక్షించకు ఇక దయగన రారా
అభయమునీరా పాహిపాహిమాం దేవా సంతానభాగ్యమీరా
తల్లిప్రేమలా తండ్రి మమతలా వెల్లువైన నీ చూపులే
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా
వంశదీపమై ఇల్లు చేరి వర్థిల్లునయ్య విశ్వేశ్వరా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా

పిలిచినంతనె పలికి భక్తులకు వరములనొసగె అరుణగిరీశా
నమకచమకముల మనసావాచా మరి మరి కొలిచెదా ఉమామహేశా
ధన్యమాయె నా బ్రతుకే దాసోహం ఇక నీకే..జన్మనీ ధన్య చేయవయా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా


చిత్రం : గోరింటాకు (2008)
సంగీతం :   S.A.రాజ్ కుమార్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : అనిత, మనో, ప్రియ ప్రకాష్, హేమ
*********************************************
Movie Name : Gorintaku (2008)
Music Director : S.A.Raj Kumar
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Anitha, Mano, Priyaprakash, Hema

అదోలా ఉన్నారేమండి అప్పుడే వెళతారేంటండి ...... ఆవిడే శ్యామల (2000)

ఏవండోయ్....
అదోలా ఉన్నారేమండి అప్పుడే వెళతారేంటండి
అసలు మీరొచ్చిందెపుడండి కాసేపు ఇంట్లో ఉండండి
తిన్నదెప్పుడు పడుకుందెప్పుడు ముచ్చటగా మాట్లాడెదెపుడు
మనసువిప్పి మాట్లాడండి హాయిగ మాతో గడపండి
వానొచ్చేలా ఉందండి...వానొచ్చేలా ఉందండి
మీరుంటే బాగుంటుందండి  ||అదోలా||

చక్కని దొరలా ఉండేవారు చిక్కిపోయారు
చిలిపితనాలు చిరుచిరునవ్వులు మరచిపోయారు
పండగపూట ఇంట్లో గడపక ప్రయాణమైపోతారు
పనులమీద పడి శ్రీమతి మీదే శీతకన్ను వేశారు
సందడి పెరిగే వయసండి బాధ్యత మీకూ ఉందండి
డబ్బుతో అన్నీ రావండి హాయిగ ఇంట్లో గడపండి
వెళ్ళకండి అటు చూడండి పిల్లి ఎదురు వస్తూందండి    ||అదోలా||

అన్నీ తెలిసి మళ్ళీ ఇంకా ఎందుకు చేస్తారండి
గుడికో సినిమాకో కలిసెళ్ళి ఎన్నాళ్ళయ్యిందో
భర్తే ఇంటికి బంధువులాగ వస్తున్నట్టుందండి
ఇట్టా అయితే ఇరుగూ పొరుగు ఏమనుకుంటారండి
కాపురం కలలా ఉందండి కారణం మీకే తెలుసండి
మనసుతో ఆలోచించండి అసలు ఏ కోపం వద్దండి
అర్థాంగిగా చెప్పానండి అర్థాంగిగా చెప్పానండి
నన్ను అర్థం చేసుకోండి                                ||అదోలా||


చిత్రం : - ఆవిడే శ్యామల (2000)
సంగీతం :  మాధవపెద్ది సురేష్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : నిత్యసంతోషిణి
*********************************************
Movie Name :  Aavide Shyamala (2000)
Music Director : Madhavapeddi Suresh
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : Nityasanthoshini

అమృతవర్షం లా నాపై కురిసావురా ....... అత్తిలి సత్తిబాబు LKG (2007)

అమృతవర్షం లా నాపై కురిసావురా
అమృతవర్షం లా నాపై కురిసావురా
ప్రియుడై పిలిచావురా నిజమై నిలిచావురా
అమృతవర్షిణిలా నన్నే కలిశావులే మెరుపై మెరిసావులే
వలపై కురిసావులే
సరసానికి సంతోషం ఎదురైన వేళ
పరువాలకి తెరతీసే తొలి సంబరాల
శోభనరాగాలలోన చొరబడు ఎదలోన   ||అమృతవర్షిణిలా||

గోదారి గట్టు చెట్టు పిట్ట పాట మన స్నేహం
తెలుగింటి కట్టు బొట్టు ఒట్టు మన బంధం
ఆకాశం చుక్కలు దిక్కులు నెలవంక మన సాక్ష్యాలే
చైత్రాలు వైశాఖాలు ఇద్దరి సరసాలు
నన్నేలే రాణులే నవ్వుల రాగాలు
కొమ్మల్లో మ్రోగేలే మంగళ వాద్యాలు
కుకు కుకుహు కోయిల నేనై ఆమని నీవై జీవనగీతం పాడాలే   ||అమృతవర్షిణిలా||

నీ నవ్వే తెల్లని తెల్లని గొల్లల మల్లెల మధుమాసం
నీ చూపే వెన్నెల కాకల కాముని కార్తీకం
నీతోనే గానం పానం భోనం మన్మథ సోపానం
నీకే నా యవ్వనసీమల పున్నమి సన్మానం
నువ్వే నా ఊహల ఊహల కోలాటం
నీవల్లే ఈ చెలి పొందును ఆనందం
నీ వెంతే తానా అంటూ తందానంటూ జతగా అంటి ఉంటానే
నిండు నూరేళ్ళు హాయిగా        ||అమృతవర్షం లా||


చిత్రం :  అత్తిలిసత్తిబాబు LKG (2007)
సంగీతం :   శ్రీ కృష్ణ 
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : చిత్ర, హరీష్ రాఘవేంద్ర
*********************************************
Movie Name :  Attili Sattibabu LKG (2007)
Music Director : SriKrishna
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Chitra, Harish Raghavendra

Tuesday, October 29, 2013

తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే ..... బాలరాజు బంగారుపెళ్ళాం (1995)

అబ్బయో....ఓ అబ్బయో
అబ్బయో....ఏంది అబ్బయో
అబ్బయో....చెప్పు అబ్బయో

చెరుకుముక్క చేతికిచ్చి కన్ను గీటితే
సురుకు సూపు రవిక మీద కాక రేపితే
మసకమసక సందెయేళ సందు దొరికితే
ఊపు మీద కంచె దాటి మంచె చేరితె
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే

వాసినే తేలు తేలు అంటు ఏలు చూపిస్తావేందే
నేను రాకపోతె తేలటం కాదు మునిగిపోయేదానివి

మోటబావి కాడ నువ్వు కాలుజారితే
బావిలోకి దూకి నేను పైకిలేపితే
గడ్డివాము కాడ వలపుగంట మోగితే
మొగ్గసోకు మొదటిసారి సిగ్గు వదిలితే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే

పొగ రాని చలిమంటకు అబ్బయో పొలిమేర వేడెక్కరో అబ్బయో
పొదచాతు సయ్యాటలో అబ్బయో పొగరంతా దిగుతాదిలే అబ్బయో
తడాఖా చూపించు మజామజాగా.....అబ్బయో
కానిస్తా తతంగం యధాతధంగా.....అమ్మాయో
ముచ్చటగా తీయనిదే తీసి ఇస్తారా
అదిరిందే సందడిలో అది ఇదీ ముడే పడేసి
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే

కుదిరింది కుప్పలకాడ అబ్బయో కురిపిస్తా ముద్దులవాన అబ్బయో
ఎపుడైనా కాదన్నానా అబ్బయో యావ నాకు లేదన్నానా అబ్బయో
చలాకీ వయస్సే చురుక్కుమందే....అమ్మాయో
ఇలాగే బిగిస్తే కసెక్కుతాందే...అబ్బయో
చూడు ఇక జింగిచకా వాగువంకల్లో
ఆశ పడి కన్నె ఒడి చేయాలంది హడావిడి
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే   ||మోటబావి||


చిత్రం : బాలరాజు బంగారు పెళ్ళాం (1995)
సంగీతం :  M.M.కీరవాణి
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం :  మనో , K.S.చిత్ర
*********************************************
Movie Name :  Balaraju Bangaru Pellam (1995)
Music Director : M.M.Keeravani
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Mano, K.S.Chitra

ఓంకారం వంకర శ్రీకారం వంకర అందమైన ఆడపిల్ల ఆకారం వంకర .... సుందరకాండ (2008)

నా చిన్నప్పుడు నేనూ ఇంతే
ఒకతో ఏట రెండో ఏట
మూడో ఏట నాలుగో ఏట
ఐదో ఏడు వచ్చేసరికి
ఆరో ఏట ఏడో ఏట ఎనిమిదో ఏట
తొమ్మిదొఏడు వచ్చేసరికి...
అవకతవకలు అష్టవంకరలు అన్నీ నాకే ఉండేవి
అమ్మో పిల్లకి ఏంటీ ఖర్మని హడలిపోయి మా అమ్మ
అప్పటికప్పుడు అప్పయ డాక్టరు దగ్గరికెత్తుకు వెళ్ళింది
చూపు ఆనని అప్పయ డాక్టరు ....హా...హా...
వంకరటింకర గీతలతోటి మందులచీటి రాసిచ్చాడు
రాసిందేది మందులషాపులో కాసింతైనా అర్థం కాక
పిప్పరమెంట్లు చాక్లెట్లిచ్చి చప్పరించమని పంపించారు

మా అమ్మేమో కంగారు పడితే నాన్నగారేమో మెదలక ఉంటే
తాతయ్యేమో కదలకపోతే మా బామ్మేమో భయపడుతుంటే
మా అమ్మమ్మేమో ఫరవాలేదని ధైర్యం చెప్పిందందరికి
అప్పుడు ఆవిడ ఏమందంటే....

ఓంకారం వంకర....శ్రీకారం వంకర
అందమైన ఆడపిల్ల ఆకారం వంకర
హరివిల్లు వంకర.....నెలవంక వంకర
కిందనుంచి పైదాకా కృష్ణమూర్తి వంకర
ఓంకారం వంకర.....శ్రీకారం వంకర
వినాయకుడి ముక్కు వంకర
హనుమంతుడి తోక వంకర
నారదుడి మాట వంకర
నందీశుడి కొమ్ము వంకర
జీడిపప్పు వంకర.....జిలేబి వంకర
తాతమీసం వంకర......బామ్మ అలక వంకర
ఒంటిపూస తేలుతున్న కొంకిలాంటి కొండి కన్న
గుచ్చిగుచ్చి బాధపెట్టు చుప్పనాతి చూపు నీది
నల్లమండ్ర గబ్బ లాగ డెక్కితోటి పట్టి కుట్టు గీర గీర నిక్కు నీది నేతిబీర టెక్కు నీది
కొక్కిరాయి ముక్కు నీది కీచురాయి గొంతు నీది
నాపరాయి మూతి నీది ఇటుకరాయి మొహం నీది
పొగరుబోతు దున్న నువ్వు వగరుబోతు కోతి నువ్వు
కుల్లుబోతు కాకి నువ్వు అదిరిపాటు మేక నువ్వు
తోక తెగిన బల్లి నువ్వు దొంగకళ్ళ పిల్లి నువ్వు
కొంగ ముక్కు చుంచు నువ్వు పెద్దగుండు సున్న నువ్వు


చిత్రం :  సుందరకాండ (2008)
సంగీతం :  విద్యాసాగర్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం :  K.S.చిత్ర
*********************************************
Movie Name : SundaraKanda (2008)
Music Director : Vidyasagar
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : K.S.Chitra

హాం ఫట్టూ దేవుడండీ... ఎంసెట్టూ దేవుడండీ... సుందరకాండ (2008)

 ఆహ పొట్టీ దేవుడండీ...  బహు గట్టీ దేవుడండీ...
గురిపెట్టీ కొలవరండీ...
ఈ మట్టిలోంచి పుట్టినట్టి గట్టిదేవుదండి
హాం ఫట్టూ దేవుడండీ... ఎంసెట్టూ దేవుడండీ...
గుడిచుట్టూ తిరిగి రండీ...
మీ పెట్టుపోతలను బట్టే యిట్టె పలుకునండి
టిక్కెటు మొక్కలు చూపి ఆపై ఎక్కడికక్కడ దాటి
ఇంకా దేకుతు పాకుతు మొర్లుతు మొక్కులు చెల్లించండి
హాం ఫట్టూ దేవుడండీ... ఎంసెట్టూ దేవుడండీ...
గురిపెట్టీ కొలవరండీ... హో......

కోరస్:
గంప దేవరా దేవరా జై జై దేవరా
గంప దేవరా దేవరా జై జై దేవరా

చరణం : 1
అత్తరు అర్చనతో మీ అత్త పీడ వదులుతుంది
మోడల్ చేస్తే మీ కోడలు లొంగుతుందీ
లప్ప తెచ్చి మీరిస్తే చేతికి చిప్పే ఇస్తాడు
తిప్పి తిప్పి తన చుట్టూ కోర్కెలు పిప్పే చేస్తాడూ

కోరస్ :  పచ్చనోట్ల కట్ట తోటి పాప నాశనం
చిటికెలోన చేయిస్తాము శీఘ్ర దర్శనం  హెయ్

పచ్చనోట్ల కట్ట తోటి పాప నాశనం
చిటికెలోన చేయిస్తాము శీఘ్ర దర్శనం  హెయ్

చెలగ వాహనుడు  పలుగు నివాసుడు
వోట్ల కారకుడు సీట్ల దాయకుడు

కోరస్ : ఏకుల మేమత మేదీ చూడడు నాధనాధనాధుడూ
హాం ఫట్టూ దేవుడండీ... ఎంసెట్టూ దేవుడండీ...  గురిపెట్టీ కొలవరండీ... హోయ్

చరణం : 2
మూల విగ్రహం పోట్టిదేవుడూ ఉత్స విగ్రహం కోట్ల దేవుడు
సర్వ మంగళం పోట్టిదేవుడూ సకల సంకటం కోట్ల దేవుడూ
ఎండిన చెరువుల పొలాల మధ్యన ఎయిర్ పోర్టు తెస్తా తెస్తా...
ఎకరం ఒక్కటి 20 కోట్లని రేట్లే పెంచేస్తా
పని పాట్లు చెయ్కుండా బతికేలా నే చేస్తా
 అ ఒక్క ఓటుతో పక్క జనానికి చుక్కలు చూపిస్తా

కోట్ల వారి మాట కోట్ల వోట్ల మూటయా
పచ్చనోట్ల దండ మీరు వేసుకోండయా    కో: ll2ll
 
పట్టు గోచీలు
రిస్టు వాచీలు
కలరు టీవీలు
సిలుకు శారీలు

ఉచ్చం నీచం ఏవీ చూడని నాధనాధనాధుడూ
హాం ఫట్టూ దేవుడండీ... ఎంసెట్టూ దేవుడండీ... గుడిచుట్టూ తిరిగి రండీ...
టిక్కెటు మొక్కలు చూపి ఆపై ఎక్కడికక్కడ దాటి
ఇంకా దేకుతు పాకుతు మొర్లుతు మొక్కులు చెల్లించండి
హాం ఫట్టూ దేవుడండీ... ఎంసెట్టూ దేవుడండీ... గుడిచుట్టూ తిరిగి రండీ...


చిత్రం :  సుందరకాండ (2008)
సంగీతం :  విద్యాసాగర్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం :  ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
*********************************************
Movie Name : SundaraKanda (2008)
Music Director : Vidyasagar
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : S.P.Balasubramanyam

ఏలో ఏలో ఉయ్యాల ఏడేడు రంగుల ఉయ్యాలా ............ సుందరకాండ (2008)

పల్లవి :
ఏలో ఏలో ఉయ్యాల ఏడేడు రంగుల ఉయ్యాలా
ఏలో ఏలో ఉయ్యాల ఏడేడు రంగుల ఉయ్యాలా
ఎదిగే వయసుల ఉయ్యాల ఎగిరే పైటల ఉయ్యాలా
ఎదిగే వయసుల ఉయ్యాల ఎగిరే పైటల ఉయ్యాలా
ఏదేదో అయ్యేలా
ఏలో ఏలో ఉయ్యాలా ఏడేడు రంగుల ఉయ్యాలా   ll ఏలో ఏలోll

చరణం : 1
అనగనగా అన గనగా ఉయ్యాలా అడవీ పక్కన పల్లె ఉయ్యాలా
ఆ పల్లె జాబిల్లి బంగారు నా తల్లి అందాల సిరిమల్లి ఉయ్యాలా..
ఆకోనకొకనాడు కోటాను దొరబాబు వచ్చి మల్లిని చూసె ఉయ్యాలా...
మనసుపడి మనువాడే ఉయ్యాలా
ముద్దూ ముచ్చట జరిపీనాడే ఉయ్యాలా..
మల్లీనక్కడ విడిచీనాడే ఉయ్యాలా
మళ్ళీ తిరిగీ రాలేదమ్మా ఉయ్యాలా    ll2ll        ll ఏలో ఏలో ll

చరణం : 2
రాముని కాలపు సీతమ్మా... ఆ సీతమ్మే మాయమ్మా...   ll2ll
తనగుండే గుడి చేసే ఉయ్యాలా అ గుడిలోన దేవుడా ఉయ్యాలా
ఒక్కడే ఉన్నాడు ఉయ్యాలా ఒక్కడే ఉంటాడు ఉయ్యాలా
ఒక్కడే ఉంటాడు ఉయ్యాలా


చిత్రం :  సుందరకాండ (2008)
సంగీతం :  విద్యాసాగర్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం :  సాధనాసర్గమ్
*********************************************
Movie Name : SundaraKanda (2008)
Music Director : Vidyasagar
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : Sadhana Sargam

విభ్రాంతిగొల్పు ఈ ఆర్తనైవేద్యం ...... దేవతలు (2007)

విభ్రాంతిగొల్పు ఈ ఆర్తనైవేద్యం
ఆ ఆదిశక్తికే ఆహ్వానయఙ్ఞం
అపర కాళీశక్తి ఆ పరాశక్తి
వనదేవతాశక్తి ఘన త్యాగశక్తి
అల కలిసి ఇల వెలసి అపురూప దేవతలు
మహిమలతో మహినేలు ఈ మహాదేవతలు


చిత్రం :  దేవతలు (2007)
సంగీతం :  ఘంటాడికృష్ణ
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం :  ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
*********************************************
Movie Name :  Devathalu (2007)
Music Director : Ghantadi Krishna
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : S.P.Balasubramanyam