Showing posts with label Hero Special- Ravi krishna songs. Show all posts
Showing posts with label Hero Special- Ravi krishna songs. Show all posts

Saturday, November 3, 2012

తడి వేడి .. తపనల్లో.. చెలరేగే సుఖమేదో .... నిన్న నేడు రేపు (2008)


తడి వేడి .. తపనల్లో.. చెలరేగే సుఖమేదో
ఒడిచాటూ .. గొడవల్లో.. సుడిరేగే చిలిపితనమూ

ఏటవాలు ఈతల్లో జతేగా
ఏకాస్త మోమాటం లెదుగా
నీరే నిప్పల్లే మారెనే
అందాలలో చలి తీరెనే

తడి వేడి .. తపనల్లో.. చెలరేగే సుఖమేదో
ఒడిచాటూ .. గొడవల్లో.. సుడిరేగే చిలిపితనమూ

వణుకుల చిలకా.. వాలిందీ నాపై
తొలకరి చినుకై.. చల్లగా
ఏ కోరికో తొలిచే .. నీ కోసమే పిలిచే.. ఓ ఓ

నీ కౌగిలే గిలిగిలిగా .. కవ్వింతలడిగిందిలే
లేలేత నా వయసే .. నీ చేతిలో బతికే

తడి వేడి .. తపనల్లో.. చెలరేగే సుఖమేదో
ఒడిచాటూ .. గొడవల్లో.. సుడిరేగే చిలిపితనమూ

నడుమున మెలికే నాట్యాలై నాలో ..తెలియని తపనే రేగిందిలే
నీ సాయమే అడిగా .. ఆ హాయిలో మునిగా

నాజూకులో తొలిరుచులే .. ఈ నాడు తెలిసాయిలే
ఈ గాలి ప్రేయసిలా .. రాగాల నా కలలా

తడి వేడి .. తపనల్లో.. చెలరేగే సుఖమేదో
ఒడిచాటూ .. గొడవల్లో.. సుడిరేగే చిలిపితనమూ


చిత్రం : నిన్న నేడు రేపు (2008)
సంగీతం : అనిల్
రచన : వేటూరి
గానం : హర్షిక, రంజిత్

ఊహల్లో ఉయ్యాలే ఊగాలే నీ జంట ...... నిన్న నేడు రేపు (2008)


ఊహల్లో ఉయ్యాలే ఊగాలే నీ జంట
కాదంటే అవునంటూ పడ్డాలే నీ వెంట

నిన్ను చూసాక అమ్మాయీ .. కలలకే నిదుర రాదే
ఎలా గడపాలి ఈ రేయి ..

మాటలే రాని ఈ మౌనం .. ప్రేమగా మారిపోతే
పాటలా నన్ను చేరిందే ..

చలిలో వణికే కవితై ప్రేమా !

ఊహల్లో ఉయ్యాలే ఊగాలే నీ జంట
కాదంటే అవునంటూ పడ్డాలే నీ వెంట

నిన్ను చూసాక అమ్మాయీ .. కలలకే నిదుర రాదే
ఎలా గడపాలి ఈ రేయి ..

మాటలే రాని ఈ మౌనం .. ప్రేమగా మారిపోతే
పాటలా నన్ను చేరిందే ..

చలిలో వణికే కవితై ప్రేమా !


చిత్రం : నిన్న నేడు రేపు (2008)
సంగీతం : అనిల్
రచన : వేటూరి
గానం : గౌతం భరద్వాజ్ , హర్షిక