Showing posts with label T.V.Raju Musical Hits. Show all posts
Showing posts with label T.V.Raju Musical Hits. Show all posts

Sunday, November 10, 2013

ఆలపించనా అనురాగముతో...ఆనందామృతమావరించగా... పిచ్చి పుల్లయ్య (1953)

పల్లవి :
ఆలపించనా అనురాగముతో...
ఆలపించనా అనురాగముతో...
ఆనందామృతమావరించగా
అవనీ గగనం ఆలకించగా...
ఆలపించనా... ఆలపించనా

చరణం : 1
చక్కని పూవులు విరిసి ఆడగా...
చల్లని గాలులు కలిసి పాడగా
పున్నమి వెన్నెల పులకరించగా...
పుడమిని సుఖాలు పొంగులెగరగా...
ఆలపించనా

చరణం : 2
చిలిపి గుండెలో వలపు నిండగా... చిరునవ్వులలో సిగ్గు చిందగా
చిలిపి గుండెలో వలపు నిండగా... చిరునవ్వులలో సిగ్గు చిందగా
అరమరలెరుగని అమాయకునిలో... అరమరలెరుగని అమాయకునిలో
ఆశయాలెవో అవతరించగా... ఆశయాలెవో అవతరించగా
ఆలపించనా....

చరణం : 3
కరుణ హృదయమే తాజ్ మహల్గా... అనంత ప్రేమకు ఆశ చెందగా
కరుణ హృదయమే తాజ్ మహల్గా... అనంత ప్రేమకు ఆశ చెందగా
నిర్మల ప్రేమకు నివాళులెచ్చే... నిర్మల ప్రేమకు నివాళులెచ్చే
కాంతిరేఖలే కౌగలించగా.... కాంతిరేఖలే కౌగలించగా
ఆలపించనా ...

ఆలపించనా అనురాగముతో... ఆనందామృతమావరించగా
అవనీ గగనం ఆలకించగా... ఆలపించనా


చిత్రం : పిచ్చి పుల్లయ్య (1953)
సంగీతం : టి.వి.రాజు
రచన : అనిసెట్టి సుబ్బారావు
గానం : ఘంటసాల
**********************************************
Movie Name : Pichi Pullayya (1953)
Music Director : T.V.Raju
Lyricist : Anisetti Subbarao
Singer : Ghantasala

Wednesday, May 15, 2013

పిలిచిన పలుకవు ఓ జవరాలా... పిడుగు రాముడు (1966)














పిలిచిన పలుకవు ఓ జవరాలా...
పిలిచిన పలుకవు ఓ జవరాలా...
చిలిపిగ నను చేర రావా రావా
కలువల రాయడు చూసే వేళ(2)
చెలియను కవ్వింతువేల ఏల

చల్లగ విరిసే నీ చిరు నవ్వులు(2)
మల్లెలు కురిసెను నాలోన
తొలి చూపులలో చిలికిన వలపులు
తొందర చేసెను నీలోన

జగములనేలే సొగసు నీదని(2)
గగనములో దాగే నెల రేడు
మనసును దోచే మరుడవు నీవని
కనుగొంటినిలే ఈనాడు


చిత్రం : పిడుగు రాముడు (1966)
సంగీతం : టి.వి. రాజు
రచన : సి. నారాయణ రెడ్డి
గానం : ఘంటసాల, పి. సుశీల
******************************************
pilichina palukavu oo javaraala..
pilichina palukavu oo javaraala.. 
chilipiga nanu chera raavaa raavaa
kaluvala rayadu chuse vela(2)
cheliyanu kavvintuvela yela

challaga virise ne chiru navvulu(2)
mallelu kurisenu nalona
toli chupulalo chilikina valapulu
tondara chesenu nelona

jagamulanele sogase needani(2)
gaganamulo daage nela redu
manasunu doche marudavu neevani
kanugontinile eenadu


Movie Name : Pidugu Ramudu (1966)
Music Director : T.V.Raju
Lyricist : C. Narayana Reddy
Singers : Ghantasala, P.Susheela

చినదానా చినదానా ఓ చిలిపి కనులదానా ..... పిడుగు రాముడు (1966)














చినదానా చినదానా ఓ చిలిపి కనులదానా
రా ముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను లేనా
చినదానా చినదానా ఓ చిలిపి కనులదానా
రా ముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను లేనా

దాటలేదు పదహారేళ్ళు దాచలేవు బెదిరే కళ్ళు
దాటలేదు పదహారేళ్ళు దాచలేవు బెదిరే కళ్ళు
గాలి తాకితేనే హొయ్ హొయ్ కందిపోవు నీ ఒళ్ళు
కందిపోవు నీ ఒళ్ళు
చినదానా చినదానా ఓ చిలిపి కనులదానా
రా ముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను లేనా

జడపాయలు వడి వేసేవు జారుపైట సరి చేసేవు..
జడపాయలు వడి వేసేవు జారుపైట సరి చేసేవు..
లేత నడుము దువు దువ్వనగా లేచి లేచి నడిచేవు
లేచి లేచి నడిచేవు
ఓ .. చినదానా చినదానా ఓ చిలిపి కనులదానా
రా ముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను లేనా

ఉలికి ఉలికి చూడబోకు ఉంటి నేను తోడు నీకు
ఉలికి ఉలికి చూడబోకు ఉంటి నేను తోడు నీకు
ఎదుట నీవు ఉంటే చాలు ఇంక ఎదురు లేదు నాకు
ఇంక ఎదురు లేదు నాకు
ఓ .. చినదానా చినదానా ఓ చిలిపి కనులదానా
రా ముందుకు సిగ్గెందుకు నీ రంగు తెలిసే జాణ


చిత్రం : పిడుగు రాముడు (1966)
సంగీతం : టి.వి. రాజు
రచన : సి. నారాయణ రెడ్డి
గానం : ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి
******************************************
chinadaana chinadaanaa oo chilipi kanuladaanaa
ra munduku siggenduku ne mundu nenu lenaa
chinadaana chinadaanaa oo chilipi kanuladaanaa
ra munduku siggenduku ne mundu nenu lenaa

daataledu padahaarellu dachalevu bedire kallu
daataledu padahaarellu dachalevu bedire kallu
gaali takitene hoy hoy kandipovu ne ollu
kandipovu ne ollu
chinadaana chinadaanaa oo chilipi kanuladaanaa
ra munduku siggenduku ne mundu nenu lenaa

jadapayalu vadi vesevu jarupaita sari chesavu..
jadapayalu vadi vesevu jarupaita sari chesavu..
leta nadumu duvu duvvanagaa lechi lechi nadichevu
lechi lechi nadichevu
O..chinadaana chinadaanaa oo chilipi kanuladaanaa
ra munduku siggenduku ne mundu nenu lenaa

uliki uliki chudaboku unti nenu todu neku..
uliki uliki chudaboku unti nenu todu neku..
yeduta neevu unte chalu inka yeduru ledu naku
inka yeduru ledu naku
O..chinadaana chinadaanaa oo chilipi kanuladaanaa
ra munduku siggenduku ne rangu telise Jaana


Movie Name : Pidugu Ramudu (1966)
Music Director : T.V.Raju
Lyricist : C. Narayana Reddy
Singers : Ghantasala, L.R.Eshwari

ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలి.... పిడుగు రాముడు (1966)














పల్లవి :
ఓహోహో... ఓహో... హో... ఓహోహో... ఓహో... హో... 
ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలి
నింగిలోని తారలు రెండు  నేలపైన నిలవాలి
॥రేయి॥

చరణం : 1
ఏ మబ్బు మాటున్నావో ఏ పొదల చాటున్నావో
ఏ మబ్బు మాటున్నావో ఏ పొదల చాటున్నావో
ఏ గాలి తరగలపైన ఊగి ఊగిపోతున్నావో
ఏ గాలి తరగలపైన ఊగి ఊగిపోతున్నావో
కలగా వన్నే కవ్వించేవో॥రేయి॥

చరణం : 2
చందమామలో ఉన్నాను చల్లగాలిలో ఉన్నాను
చందమామలో ఉన్నాను చల్లగాలిలో ఉన్నాను
నీ కంటిపాపలలోన నేను దాగి వున్నాను
నీ కంటిపాపలలోన నేను దాగి వున్నాను
నీలో నేనై... నిలిచున్నాను...
॥రేయి॥

చరణం : 3
ఆనాటి చూపులన్నీ లోన దాచుకున్నాను
ఆనాటి చూపులన్నీ లోన దాచుకున్నాను
నీవు లేని వెన్నెలలోన నిలువజాలకున్నాను
నీవు లేని వెన్నెలలోన నిలువజాలకున్నాను
కనవే చెలియా... కనిపించేను...
॥రేయి॥


చిత్రం : పిడుగు రాముడు (1966)
సంగీతం : టి.వి.రాజు
రచన : డా॥సి.నారాయణరెడ్డి
గానం : ఘంటసాల, పి.సుశీల
****************************************
ee reyi nuvvu nenu yelaagaina kalavali
ningiloni taralu rendu nela meeda nilavali
ee reyi nuvvu nenu yelaagaina kalavali
ningiloni taralu rendu nela meeda nilavali

ye mabbu matunnavo ye podala chatunnavo
ye mabbu matunnavo ye podala chatunnavo
ye gali taragala paina teli teli potunnavo
ye gali taragala paina teli teli potunnavo
kalagaa nanne kavvinchevoo..

chandamamalo unnanu challa galilo unnanu
chandamamalo unnanu challa galilo unnanu
ne kanti papalona nenu dagi unnanu
ne kanti papalona nenu dagi unnanu
nelo nenai niluchunnanu

aanaati choopulannee lona dhaachukunnaanu
aanaati choopulannee lona dhaachukunnaanu
neevu leni vennelalona nilavajaalakunnaanu..
neevu leni vennelalona nilavajaalakunnaanu..
kanave cheliyaa.. kanipinchenu..

ee reyi nuvvu nenu yelaagaina kalavali
ningiloni taralu rendu nela meeda nilavali


Movie Name : Pidugu Ramudu (1966)
Music Director : T.V.Raju
Lyricist : C. Narayana Reddy
Singers : Ghantasala, P.Susheela

Tuesday, May 14, 2013

కొమ్మల్లో పాలపిట్ట కూత కూసిందోయ్ ...... పిడుగు రాముడు (1966)














కొమ్మల్లో పాలపిట్ట కూత కూసిందోయ్
కమ్మంగా గున్నమావి కాపు కాసిందోయ్
రాజా రాజా నా రాజా

చిలిపి గాలి విసిరెనులే వలపు వాన కురిసెనులే రాజా(2)
గిలిగింతలు కలిగెనులే ఘుమా ఘుమాలే
ఈ గాలిలో ఈ వేళలో ఏవేవో తలపులు చిగురించెనులే

పైరు పాట పాడింది మొయిలు నాట్యమాడింది రాజా
పైరు పాట పాడింది మొయిలు నాట్యమాడింది రాజా
పూల తావి మత్తు జల్లి లాలించింది
పదే పదే అదేమిటో నా ఒళ్ళు పరవశమైపోయినది

పక్కనెవరో పిలిచినట్టు పైట కొంగు లాగినట్టు
ఏమేమో అనిపించును రాజా
పక్కనెవరో పిలిచినట్టు పైట కొంగు లాగినట్టు
ఏమేమో అనిపించును రాజా
అవునవునులే సిగ్గవునులే
వయసున చెలరేగిన భ్రమలివిలే


చిత్రం : పిడుగు రాముడు (1966)
సంగీతం : టి.వి. రాజు
రచన : సి. నారాయణ రెడ్డి
గానం : పి. సుశీల
******************************************
kommallo palapitta kuta kusindoy
kammangaa gunnamavi kapu kasindoy
raajaa raajaa na raajaa

chilipi gali visirenule valapu vana kurisenule raajaa(2)
giligintalu kaligenule ghumaa ghumaale
ee galilo ee velalo yevevo talapulu chigurinchenule

pairu paata padindi moyilu natyamadindi raajaa
pairu paata padindi moyilu natyamadindi raajaa
pula taavi mattu jalli lalinchindi
pade pade ademito na ollu paravashamaipoyinadi

pakkanevaro pilichinattu paita kongu laginattu
yememo anipinchunu raajaa
pakkanevaro pilichinattu paita kongu laginattu
yememo anipinchunu raajaa
avunavunule siggavunule
vayasuna chelaregina bhramalivile


Movie Name : Pidugu Ramudu (1966)
Music Director : T.V.Raju
Lyricist : C. Narayana Reddy
Singer : P.Susheela

మనసే వెన్నెలగా మారెను లోలోన ..... పిడుగు రాముడు (1966)














మనసే వెన్నెలగా మారెను లోలోన
వీడిన హృదయాలే కూడెను ఈవేళ...
మనసే వెన్నెలగా మారెను లోలోన
వీడిన హృదయాలే కూడెను ఈవేళ...
మనసే వెన్నెలగా మారెను లోలోన

విరిసే ఊహలలో పరువము నీదేలే...
విరిసే ఊహలలో పరువము నీదేలే...
మదనుడి కన్నులలో మగసిరి నీదేలే...
మదనుడి కన్నులలో మగసిరి నీదేలే...
సైగలతో కవ్వించే యవ్వని నీవే
మనసే వెన్నెలగా మారెను లోలోన
వీడిన హృదయాలే కూడెను ఈవేళ...
మనసే వెన్నెలగా మారెను లోలోన

తలపుల పందిరిలో కలలే కందామా...
తలపుల పందిరిలో కలలే కందామా...
తరగని కౌగిలిలో కాపురముందామా...
తరగని కౌగిలిలో కాపురముందామా...
కానరాని తీరాలే కనుగొందామా

మనసే వెన్నెలగా మారెను లోలోన
వీడిన హృదయాలే కూడెను ఈవేళ...
మనసే వెన్నెలగా మారెను లోలోన


చిత్రం : పిడుగు రాముడు (1966)
సంగీతం : టి.వి. రాజు
రచన : సి. నారాయణ రెడ్డి
గానం : ఘంటసాల, పి. సుశీల
******************************************
Manase vennelagaa maarenu lolona
veedina hrudayaale kudenu eevela...
Manase vennelagaa maarenu lolona
veedina hrudayaale kudenu eevela...
manase vennelagaa maarenu lolona

virise uhalalo paruvamu needele..
virise uhalalo paruvamu needele..
madhanudi kannulalo magasiri needele...
madhanudi kannulalo magasiri needele...
saigalato kavvinche yavvani neeve
Manase vennelagaa maarenu lolona
veedina hrudayaale kudenu eevela...
manase vennelagaa maarenu lolona

talapula pandirilo kalale kandaamaa..
talapula pandirilo kalale kandaamaa..
taragani kougililo kapuramundaamaa..
taragani kougililo kapuramundaamaa..
kanaraani teeraale kanugondamaa

Manase vennelagaa maarenu lolona
veedina hrudayaale koodenu eevela...
manase vennelagaa maarenu lolona


Movie Name : Pidugu Ramudu (1966)
Music Director : T.V.Raju
Lyricist : C. Narayana Reddy
Singers : Ghantasala, P.Susheela

రా రా రారా కౌగిలి చేర రారా దొరా.. ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా... పిడుగు రాముడు (1966)














నడకలో కొదమ సింగపు అడుగులున్న మొనగాడా
మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చినవాడా
మెరుపులున్న చినవాడా
రా రా రారా కౌగిలి చేర రారా దొరా
ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
రా రా  కౌగిలి చేర రారా దొరా
ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...

చలిగాలి వీచేను నీకోసమే...ఈ చెలి సైగ చేసేను నీకోసమే..
చలిగాలి వీచేను నీకోసమే...ఈ చెలి సైగ చేసేను నీకోసమే..
మనసందుకో నా మరులందుకో.... మనసందుకో నా మరులందుకో....
ఓ మగరాయడా నీకు బిగువెందుకో
రా రా  కౌగిలి చేర రారా దొరా....ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...

పొదరిండ్లు నిను నన్ను రమ్మన్నవి....నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవి...
పొదరిండ్లు నిను నన్ను రమ్మన్నవి....నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవి...
మాటాడవా సయ్యాటాడవా.... మాటాడవా సయ్యాటాడవా....
నీ కొస చూపుతో నన్ను వేటాడవా
రా రా  కౌగిలి చేర రారా దొరా...ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
రా రా  కౌగిలి చేర రారా దొరా...ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...


చిత్రం : పిడుగు రాముడు (1966)
సంగీతం : టి.వి. రాజు
రచన : సి. నారాయణ రెడ్డి
గానం : పి. సుశీల
******************************************
Nadakalo kodama singapu adugulunna monagaadaa
menilo pasidi vannela merupulunna chinavaadaa
merupulunna chinavaadaa
raa raa raara kougili chera raaraa doraa
ee rangeli praayammu needenu raa...

chaligaali veecheenu nekosame...ee cheli saiga cheseenu nekosame..
chaligaali veecheenu nekosame...ee cheli saiga cheseenu nekosame..
manasanduko na marulanduko....manasanduko na marulanduko....
oo magaraayadaa neku biguvenduko
raara kougili chera raaraa doraa...ee rangeli praayammu needenu raa...

podarindlu ninu nannu rammannavi....na madiloni raagaalu jhummannavi..
podarindlu ninu nannu rammannavi....na madiloni raagaalu jhummannavi..
maataadavaa sayyaataadavaa...maataadavaa sayyaataadavaa...
ne kosa chuputo nannu vetaadavaa
raara kougili chera raaraa doraa...ee rangeli praayammu needenu raa...
raara kougili chera raaraa doraa...ee rangeli praayammu needenu raa...


Movie Name : Pidugu Ramudu (1966)
Music Director : T.V.Raju
Lyricist : C. Narayana Reddy
Singer : P.Susheela

Sunday, March 17, 2013

అదే నీవంటివి అదే నేవింటిని గుండె అలలాగ చెలరేగ ఔనంటిని .... సప్తస్వరాలు (1969)


పల్లవి :
అదే నీవంటివి అదే నేవింటిని
గుండె అలలాగ చెలరేగ ఔనంటిని
అదే నీవంటివి అదే నేవింటిని
ఏమి అనలేని బిడియాన ఔనంటిని
అదే నీవంటివి అదే నేవింటిని

చరణం : 1
ఎవ్వరు లేని పువ్వులతోట
ఇద్దరు కోరే ముద్దులమూట
॥
ఎదలో కదలాడె పెదవుల తెరవీడి
చెవిలో ఝుమ్మని రవళించిన ఆ మాట
అదే నీవంటివి అదే నేవింటిని

చరణం : 2
పున్నమిరేయి పూచిన చోట
కన్నులు చేసే గారడి వేట
॥
చూపులు జతచేసి ఊపిరి శ్రుతిచేసి
తనువే జిల్లన కవ్వించిన ఆ మాట
అదే నీవంటివి అదే నేవింటిని

చరణం : 3
నిన్నూ నన్నూ కలిపిన బాట
నీలో నాలో పలికిన పాట
॥
జాబిలి సిగ్గిలగా కౌగిలి దగ్గరగా
మనసే ఝల్లన చిలికించి ఆ మాట
అదే నీవంటివి అదే నేవింటిని
ఏమి అనలేని బిడియాన ఔనంటిని
అదే నీవంటివి అదే నేవింటిని


చిత్రం : సప్తస్వరాలు (1969)
సంగీతం : టి.వి.రాజు
రచన : డా॥సి.నారాయణరెడ్డి
గానం : ఘంటసాల, పి.సుశీల
***************************************
Movie Name : Sapthaswaralu (1969)
Music Director : T.V.Raju
Lyricist : Dr. C. Narayana Reddy
Singers : Ghantasala, P.Susheela

Sunday, December 16, 2012

హే సురేశా! సుఖజీవన దాత .......... ఋష్య శృంగ (1961)

హే సురేశా! సుఖజీవన దాత!
పయోధర వాహనా! పర్జన్యా
నభోలోనాయకా ప్రభో వీరదాయకా
కావరా! మొరాలకించరా
ఘోడు ఘోడు ఘోషించె ప్రజల
గొంతు మీకు వినిపించలేదా
హాహాకారాలాల్లాడే ప్రజలా ఆర్తిమీకు కనుపించలేదా
ఓ ఋతుపవనా నీల జలదమా
కనికరాన ఈధర చరించరే జలాలనించరే
||నభో||

బీటలు వారిన హృదయాల
ఆరాటాలు ఆలించవేల
కన్నీటి జాలే ప్రవహించునేల
పన్నీటి జల్లై వర్షింపనేల
ఓ వరుణా దేవతా వర్షదేవతా
కనికరాన ఈధరా చరించవా జలాలనించవా
||నభో||

దళం ధళస్మనోనోజ్ఞ చంచలా ప్రకాశమా
ఫెళఫెళా గర్జించు ఘనాఘన నిర్ఘోషమా
ఘులఘుల ఘులగలగల గల ఘల్లున వర్షించరే
ఈ ఇలతనియించగ తరియించగ వర్షించరే


చిత్రం : ఋష్య శృంగ (1961)
సంగీతం : టి.వి.రాజు
రచన : సముద్రాల (జూనియర్ )
గానం : ఘంటసాల
**************************
Movie Name : Rushya Srunga (1961)
Music Director : T.V.Raju
Lyricist : Samudrala (Junior)
Singer : Ghantasala

Monday, November 26, 2012

ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా ..... శ్రీక్రిష్ణ పాండవీయం (1966)


సాకీ :
ఓహోహో... ఓహోహో...
ఛాంగురే ఛాంగు ఛాంగురే...

పల్లవి :
ఛాంగురే బంగారు రాజా
ఛాంగు ఛాంగురే బంగారు రాజా
మజ్జారే మగరేడా మత్తైన వగకాడా
అయ్యారే... అయ్యారే!
నీకే మనసియ్యాలని ఉందిరా...
ఛాంగురే... ॥

చరణం : 1
ముచ్చటైన మొలకమీసముంది
భళా అచ్చమైన సింగపు నడుముంది
జిగిబిగి మేనుంది
సొగసులొలుకు మోముంది
మేటి దొరవు అమ్మక చెల్లా
నీ సాటి ఎవ్వరుండుట కల్లా
ఛాంగురే... ॥

చరణం : 2
కైపున్న మచ్చెకంటి చూపు
అది చూపుకాదు పచ్చల పిడిబాకు
పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకో
గుచ్చుకంటె తెలుస్తుందిరా
మనసుచ్చుకుంటె తెలుస్తుందిరా
ఛాంగురే... ॥

చరణం : 3
గుబులుకొనె కోడె వయసు లెస్సా
దాని గుబాళింపు ఇంకా హైలెస్సా
పడుచుదనపు గిలిగింత
గడుసు వయసు పులకింత
ఉండనియవేమిసేతురా
కైదండ లేక నిలువలేనురా
ఛాంగురే... ॥


చిత్రం : శ్రీక్రిష్ణ పాండవీయం (1966)
సంగీతం : టి.వి.రాజు
రచన : డా॥సి.నారాయణరెడ్డి
గానం : జిక్కి
**************************************
Oho ho.. O.. O.. O o.. Aa.. Aa..
Oho ho.. O.. O.. O o.. Aa.. Aa..
Changure.. Changu changure…
Changure bangaaru raaja
Changu changure bangaru raaja
Majjare magaredaa mattaina vagakaadaa ayyare..
Ayyare neeke manasiyyalani unnadiraa changure
Changure bangaaru raaja
Changu changure bangaru raaja

Muchataina molaka meesamundi
Bhalaa.. Achchamaina singa tanuvunnadi
Bigi bigi menunnadi sogasaloluku momunnadi
Neti daruvu ammakuchallo.. Neesaati evaru unduta kallaa…
Aa.. Aa.. Changure.. Changu changure bangaru raja

Kaipunna machchakanti choopu adi choopu kaadu pachala pikibaaku
Pachala pidibaaku vichina pooreku guchu kunte telusthundiro..
Manasichukunte telustundi raa…
Changure.. Chaangu changure bangaaru raja

Gubulukoni kodi vayasu etta dani gubaalimpu inkaa hailessaa
Paduchutanapu giligintaa gadusu gadusu pulakintha
Undaneevu emi setturo.. Kaidanda leka niluvalenu raa
Chaangure.. Changu changure bangaru raja


Movie Name : Srikrishna Pandaveeyam (1966)
Music Director : T.V.Raju
Lyricist : C. Narayana Reddy
Singer : Jikki

Friday, November 9, 2012

అమ్మా అని అరిచినా ఆలకించవేమమ్మా ..... పాండురంగ మహత్యం (1957)


అమ్మా నాన్నా
అమ్మా
అమ్మా అని అరిచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరురోజు ఈ జన్మకు లేదా
అమ్మా అని అరిచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరురోజు ఈ జన్మకు లేదా

పదినెనలు నను మోసి పాలిచ్చి పెంచి
మదిరోయక నాకెన్నో వూడిగాలు చేసినా
ఓ తల్లీ నిను నలుగురిలో నగుబాటు చెసితీ
కలతకమ్మ తనయునీ తప్పులు క్షమియించవమ్మ
అమ్మా అమ్మా
దేహము విజ్ఞానము బ్రహ్మొపదేశమిచ్చి
ఇహపరాలు సాధించే హితమిచ్చె తండ్రివి..
తనుగానని కామమున నినువెడల నడిచితీ.
కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతా నాన్నా
నాన్నా నాన్నా

పారిపోతినమ్మా నాగతి ఎరిగితినమ్మా
నీ మాట దాటనమ్మ
ఒకమారు కనరమ్మా
మాతా పితా పాదసేవే మధవ సేవని మరువనమ్మ
మాతా పితా పాదసేవే మధవ సేవయని మరువనమ్మ
నన్ను మన్నిచగ రారమ్మా అమ్మా అమ్మా
అమ్మా

అమ్మా అని అరిచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరురోజు ఈ జన్మకు లేదా
అమ్మా
అమ్మా అని అరిచినా ఆలకించవేమమ్మా
అమ్మా ఆలకించవేమమ్మా..
అమ్మా

చిత్రం : పాండురంగ మహత్యం (1957)
సంగీతం : టి.వి.రాజు
రచన : సముద్రాల
గానం : ఘంటసాల
*****************************

Movie Name : Panduranga Mahatyam
Music Director : T.V.Raju
Lyricist : Samudrala Raghavacharya
Singer : Ghantasala

సై సై జోడెడ్ల బండి .. హోయ్ ....షోకైన దొరలా బండి... వరకట్నం


సై సై జోడెడ్లా బండి ..బండి
హోయ్ ....షోకైన దొరలా బండి
ఖంగు ఖంగు మని గంటల బండి
ఘల్లు ఘల్లుమని గజ్జెల బండి
చుట్టుపక్కల పన్నెండామడ దీనికి
పోటీ లేదండీ..
మహా ప్రభో...

కంటికాటుకెట్టి గట్లున్న గడ్డికోసి
గుత్తంగా రైక తొడిగి కొడవలేసి కోతకు వంగి
వగలాడి వోరగ చుస్తే వులిక్కి పడతది నా యెడ్లు
మహాప్రభో....

నెత్తిన బుట్టపెట్టి అడుగులో ఆడుగులేసి
సరదాగా సరసాలాడుతూ
పరిగెడుతూ పకపకలాడుతూ
నెరజాణ సైగల చూస్తే కనపడదు ముందు దారి
మహాప్రభో

మట్టగోచి గట్టిగ దోపి మట్టి తట్ట పైకి లేపి
చీరవేసి మనమీద ఒడుపుగా జబ్బమీద దెబ్బవేసే
చిలక కొలికి కులుకుతూంటే
జల్లు జల్లు మంటుంది నా ఒళ్ళూ..
మహా ప్రభో ....


చిత్రం : వరకట్నం (1968)
సంగీతం : టి.వి.రాజు 
రచన : కొసరాజు రాఘవయ్య 
గానం : ఘంటసాల 
***********************
Movie Name : Varakatnam (1968)
Music Director : T.V.Raju
Lyricist : Kosaraju Raghavaiah
Singer : Ghantasala

Monday, November 5, 2012

ఇంతేనయా తెలుసుకోవయా...ఈ లోకం ఇంతేనయా.... కథానాయకుడు (1969)


పల్లవి :
ఇంతేనయా తెలుసుకోవయా...
ఈ లోకం ఇంతేనయా
॥
నీతీ లేదు నిజాయితీ లేదు
ధనమే జగమయ్యా

చరణం : 1
డాబులుకొట్టి మోసం చేసి
జేబులు నింపేరు (2)
పాపం పుణ్యం పరమార్థాలు
పంచకు రానీరు
ఎవరికివారే యమునాతీరే
ఇదే ప్రపంచమయా
॥

చరణం : 2 పైసాతోటి సీసా చేరి
జల్సా చేసింది (2)
మనసే లేని సొగసేవుండి
మైమరపించింది
పైన పటారం లోన లొటారం
ఇదే ప్రపంచమయా
॥

చరణం : 3
మంచిని చేసే మనిషిని నేడు
వంచన చేసేరు (2)
గొంతులు కోసేవాడికి
నేడు గొడుగులు పట్టేరు
దొంగలు దొరలై ఊళ్లే దోచిరి
ఇదే ప్రపంచమయా
॥


చిత్రం : కథానాయకుడు (1969)
సంగీతం : టి.వి.రాజు
రచన : దాశరథి
గానం : ఘంటసాల, బృందం
************************************
Movie Name : Kathanayakudu (1969)
Music Director : T.V.Raju
Lyricist : Dasharathi
Singers : Ghantasala & Chorus

Sunday, November 4, 2012

ప్రియురాల సిగ్గేలనే ........... శ్రీకృష్ణ పాండవీయం (1966)


ప్రియురాల సిగ్గేలనే ||2||
నీ మనసేలు మగవాని జేరి ప్రియురాల సిగ్గేలనే
నాలోన ఊహించిన..
కలలీనాడు ఫలియించెస్వామి..
నాలోన ఉంహించిన..

చరణం : 1
ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేరిపినావు ||2||
మనసుదీర పలుకరించి
మా ముద్దుముచ్చట చెల్లించవే ||ప్రియురాల||

చరణం : 2
ప్రేమలు తెలిసిన దేవుడవని విని నా మదిలోన కొలిచితిని ||2||
స్వామివి నీవని తలచి నీకే బ్రతుకు కానుక చేసితిని ||నాలోన||

చరణం : 3
సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవే ఓ భామా ||2||
ఇపుడేమన్నా ఒప్పునులే ఇక ఎవరేమన్నా తప్పదులే ||ప్రియురాల||

చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం : T.V.రాజు
రచన : సముద్రాల
గానం : ఘంటసాల , పి.సుశీల

Tuesday, October 30, 2012

తెలుగు జాతి మనది ..నిండుగ వెలుగు జాతి మనది ... తల్లా ? పెళ్ళామా? (1970)


తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది
రాయలసీమ నాది
సర్కారు నాది
నెల్లూరు నాది

అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

ప్రాంతాలు వేరైనా
మన అంతరంగ మొకటేనన్న
యాసలు వేరుగవున్న
మన భాష తెలుగు భాషన్న

వచ్చిండన్న వచ్చారన్న
వచ్చిండన్న వచ్చారన్న
వరాల తెలుగు ఒకటేనన్న

మహాభారతం పుట్టింది రాణ్మమాహేంద్రవరంలో
భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో
ఈ రెంటిలోన ఏదికాదన్న
ఇన్నాళ్ళ సంస్కృతీ నిండు సున్న
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

పోచంపాడు ఎవరిది
నాగార్జునసాగరమేవరిది
మూడు కొండ్రలూ కలిసి దున్నిన
ముక్కరు పంటలు బండ్లకెత్తిన
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలే ఐదుకోట్ల తెలుగువారిది.
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్‌కి జై
గాంధి నెహ్రూల పిలుపు నందుకొని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం వందేమాతరం
స్వరాజ్యసిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర

దేశభక్తితో తెలుగువారికి ధిటే లేదనిపించాము
ఇంటిలోన అరమరికలు వుంటె ఇల్లెక్కి చాటాలా
కంటిలోన నలక తీయాలంటె కనుగ్రుడ్డులు పెరికివేయాలా
పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

తెలంగాణ మనది
రాయలసీమ మనది
సర్కారు మనది
నెల్లూరు మనది

అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది


చిత్రం : తల్లా ? పెళ్ళామా? (1970)
సంగీతం : టి.వి.రాజు
రచన : సి.నారాయణ రెడ్డి (సినారె)
గానం : ఘంటసాల , N.T.రామారావు, బృందం

Friday, October 26, 2012

పగటి పూట చంద్రబింబం అగుపించెను .... చిక్కడు దొరకడు (1967)


పగటి పూట చంద్రబింబం అగుపించెను ఏదీ ఏదీ
అందమైన నీ మోమే అదిగా కింకేది కానరాని మన్మధుడేమో
కనుపించెను ఏడీ ఏడీ ఎదుటవున్న నీవేలే ఇంకా ఎవరోయీ

వన్నె వన్నె తారలెన్నో కన్నుగీటి రమ్మన్నాయీ ఏవీ ఏవీ
అవి నీ సిగలోనే ఉన్నాయి, పదును పదును బాణాలేవో
ఎదను నాటుకుంటున్నాయీ ఏవీ ఎవీ అవి నీ ఓరచూపులేనోయీ
//పగటి//

ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించేవు
ఏమో ఏమో ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే ఇంతేనేమో
//పగటి//

చిత్రం : చిక్కడు దొరకడు (1967)
సంగీతం: టి.వి.రాజు
రచన : సి.నారాయణరెడ్డి
గానం : ఘంటసాల, పి.సుశీల

విరిసిన ఇంద్రచాపమో ......... చిక్కడు దొరకడు (1967)


విరిసిన ఇంద్రచాపమో
భువిని ప్రభవించిన చంద్రబింబమో
మరు పువుబంతిలో రతియో
మల్లెల దొంతియో మోహకాంతియో
సరస కవీంద్ర కల్పిత రసాకృతిలో
నవరాగ గీతియో
వరసరసీరుహానన బిరాన వరించి తరింపజేయవే

పగటిపూట చంద్రబింబం అగుపించెను ఏది .. ఏది?
అందమైన నీ మోమే అది గాకింకేది !
కాన రాని మన్మధుడేమో కనపించెను ఏడి .. ఏడి?
ఎదుటనున్న నీవేలే ఇంకా ఎవరోయి!

వన్నె వన్నె తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి -2
ఏవీ .. ఏవీ? అవి నీ సిగలోనే ఉన్నాయి ....
పదును పదును బాణాలెవో యెదను నాటుకుంటున్నాయి -2
ఏవీ .. ఏవీ ?అవి నీ ఓర చూపులేనోయి....
పగటిపూట చంద్రబింబం అగుపించెను ఏది .. ఏది ?
అందమైన నీ మోమే అది గాక ఇంకేది !

ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు -2
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించెవు -2
ఏమో.. ఏమో ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే ఇంతేనేమో ......


చిత్రం : చిక్కడు దొరకడు (1967)
సంగీతం : టి.వి.రాజు
రచన : సి.నారాయణరెడ్డి
గానం : ఘంటసాల, పి.సుశీల

రివ్వున సాగే... రెపరెపలాడే యవ్వనమేమన్నదీ .... మంగమ్మ శపధం (1965)



రివ్వున సాగే... రెపరెపలాడే యవ్వనమేమన్నదీ
పదే పదే సవ్వడి చేస్తున్నదీ
రివ్వున సాగే... రెపరెపలాడే యవ్వనమేమన్నదీ
పదే పదే సవ్వడి చేస్తున్నదీ
రివ్వున సాగే ...

పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది
కొడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది
పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది
కొడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది
సొగసైనా బిగువైనా ...నాదే నాదే

రివ్వున సాగే... రెపరెపలాడే యవ్వనమేమన్నదీ
పదే పదే సవ్వడి చేస్తున్నదీ
రివ్వున సాగే...

నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది
నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది
నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది
నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది
జగమంతా అగుపించెద ...నేనే నేనే

రివ్వున సాగే... రెపరెపలాడే యవ్వనమేమన్నదీ
పదే పదే సవ్వడి చేస్తున్నదీ
రివ్వున సాగే...

నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా
తారలనే దూసి దూసి దండలుగా చేతునా
నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా
తారలనే దూసి దూసి దండలుగా చేతునా
నేనన్నది కాలేనిది ...ఏదీ ఏదీ ...

రివ్వున సాగే... రెపరెపలాడే యవ్వనమేమన్నదీ
పదే పదే సవ్వడి చేస్తున్నదీ
రివ్వున సాగే...

 చిత్రం : మంగమ్మ శపధం (1965)
సంగీతం : టి.వి.రాజు
రచన :
గానం : పి.సుశీల

Tuesday, October 23, 2012

కట్టుకో కట్టుకో.. గళ్ళచీర ....... కదలడు వదలడు (1969)


పల్లవి:
కట్టుకో కట్టుకో.. గళ్ళచీర
పెట్టుకో పెట్టుకో.. పెళ్ళిబొట్టు
చుక్కలాంటి... చిన్నదాన.. జున్ను ముక్కలాగ ఉన్నదాన
చుక్కలాంటి... చిన్నదాన.. జున్ను ముక్కలాగ ఉన్నదాన

చుట్టుకో చుట్టుకో.. పట్టుపావడ
పట్టుకో పట్టుకో.. పూలదండ
కోడే కారు.. చిన్నవాడ.. నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ
కోడే కారు.. చిన్నవాడ.. నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ

చరణం 1:
నీ కులుకులు చూస్తుంటే.. ఆకలి కానే కాదు
నీ కన్నుల నీడ ఉంటే.. లోకంతో పని లేదు
నీ కులుకులు చూస్తుంటే.. ఆకలి కానే కాదు
నీ కన్నుల నీడ ఉంటే.. లోకంతో పని లేదు

చేతులు చేతులు కలిపి.. పోదామా పోదామా
చెక్కిలి చెక్కిలి కలిపి.. ఉందామా ఉందామా
నా చిలిపి తుమ్మెద రాజా

చుట్టుకో చుట్టుకో.. పట్టుపావడ
పట్టుకో పట్టుకో.. పూలదండ
కోడే కారు.. చిన్నవాడ.. నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ
కోడే కారు.. చిన్నవాడ.. నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ

చరణం 2:
ముత్యాల పందింట్లో.. మూడుముళ్ళు వేస్తావా
మురిపాల మబ్బుల్లో.. ముద్దుగ చెల్లిస్తావా
ముత్యాల పందింట్లో.. మూడుముళ్ళు వేస్తావా
మురిపాల మబ్బుల్లో.. ముద్దుగ చెల్లిస్తావా

చుక్కల పల్లకి తెస్తా.. భలేగా భలేగా
చక్కిలి గింతలు చేస్తా.. ఇలాగా ఇలాగా
ఓ చక్కర నవ్వుల రాణీ

కట్టుకో కట్టుకో.. గళ్ళచీర
పెట్టుకో పెట్టుకో.. పెళ్ళిబొట్టు
చుక్కలాంటి... చిన్నదాన.. జున్ను ముక్కలాగ ఉన్నదాన
చుక్కలాంటి... చిన్నదాన.. జున్ను ముక్కలాగ ఉన్నదాన

చుట్టుకో చుట్టుకో.. పట్టుపావడ
పట్టుకో పట్టుకో.. పూలదండ
కోడే కారు.. చిన్నవాడ.. నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ
కోడే కారు.. చిన్నవాడ.. నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ


చిత్రం: కదలడు వదలడు (1969)
సంగీతం : టి.వి. రాజు
రచన : ?
గానం : ఘంటసాల, సుశీల

ఓ..ఓ..ఓ.. ముద్దులొలికే ముద్దబంతి ...... కదలడు వదలడు (1969)

పల్లవి:
ఓ..ఓ..ఓ..
ముద్దులొలికే ముద్దబంతి
ముసి ముసినవ్వుల చేమంతి
ముసి ముసినవ్వుల చేమంతి
ఇస్తావా... అందిస్తావా
అందిస్తావా...నీ నవ్వులు
అవి ఎన్నడు వాడని పువ్వులు

చరణం 1:
కళ్ళలోన నీ రూపే...కళ కళలాడుతు ఉంటే
కళ్ళలోన నీ రూపే...కళ కళలాడుతు ఉంటే
కలలోన నీ చూపే... గిలిగింతలు పెడుతుంటే
కలలోన నీ చూపే... గిలిగింతలు పెడుతుంటే
నా మనసే నీదైతే...నా బ్రతుకే నీదైతే
ఇవ్వాలని అడగాలా...ఇంకా నాతో సరసాలా...
ఇంకా నాతో సరసాలా...

ఓ..ఓ...ఓ..
వలపులోలికే అత్త కొడుకా...చిలకకు తగ్గ గోరింక
ఈ చిలకకు తగ్గా గోరింక...వస్తావా కవ్విస్తావా
నువ్వు వస్తావా ...నా బాటలో...
వసి వాడని పరువపు తోటలో...

చరణం 2:
గూటిలోన దాగుంటే...గుసగుస పెడుతున్నాను
గూటిలోన దాగుంటే...గుసగుస పెడుతున్నాను
తోటలోనా నీవుంటే...తోడుగ నేనుంటాను
తోటలోనా నీవుంటే...తోడుగ నేనుంటాను

నాలోనే నీవుంటే...నీలోనే నేనుంటే
ఇంకేమి కావాలి...ఇలపై స్వర్గం రావాలి
ఇలపై స్వర్గం రావాలి...

ఓ..ఓ..ఓ...
ముద్దులోలికే ముద్దబంతి
ముసి ముసినవ్వుల చేమంతి
ముసి ముసినవ్వుల చేమంతి

ఓ..ఓ..ఓ..
వలపులోలికే అత్తకొడుకా...చిలకకు తగ్గ గోరింక
ఈ చిలకకు తగ్గా గోరింక


చిత్రం : కదలడు వదలడు (1969)
సంగీతం : టి.వి. రాజు
రచన : సి.నారాయణ రెడ్డి (సినారె)
గానం: ఘంటసాల, సుశీల
*************************************************
Movie Name : Kadaladu Vadaladu (1969)
Music Director : T.V.Raju
Lyricist : C. Narayana Reddy
Singers : Ghantasala, P.Susheela