Showing posts with label Mounasri Mallik-Lyrics. Show all posts
Showing posts with label Mounasri Mallik-Lyrics. Show all posts

Wednesday, May 8, 2013

గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ........ గుడ్ మార్నింగ్ (2012)

పల్లవి :
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్
జాలీగా చెప్పేసెయ్ గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్
హాప్పిగా గా వుంచేదే గుడ్ మార్నింగ్
హే ... రోజంతా ఉత్సాహం ఓ... చల్నేదో ఆరాటం
హే... సరదాల సంతోషం ఓ... జానేదో పరిహాసం

చరణం :
ప్రపంచమంతా వినిపించేటి మాటే గుడ్ మార్నింగ్
ఏ యుగానికైనా కనిపించేటి సీనే సన్ రైజింగ్
జన గళమున పలికే మధురంగా ఈ పాటేరా
మది గడపను తడిపే సొగసైన స్నోఫాలింగ్
ప్రేమేలేనివాడు తను మనిషే కాదు
అరె వాడే మారాలంటే చెప్పాలోయ్ గుడ్ మార్నింగ్

చరణం :
జగానికంత వెలుగులు చూపే రూటే గుడ్ మార్నింగ్
విరొధినా శుభాలు కోరే మాటే క్యాఫీలింగ్
జనగణమన గీతం వినిపించు ఏ చోటైనా
అది శిలలను సైతం కదిలించు కరిగించు
కలసి వుండి చూడు అరె కలదు సుఖము
జర అలసి వుంటే నేస్తం చెప్పేసెయ్ గుడ్ మార్నింగ్ *గుడ్ మార్నింగ్


చిత్రం : గుడ్ మార్నింగ్ (2012)
సంగీతం : రవి కల్యాణ్
రచన : మౌనశ్రీ మల్లిక్
గానం : ధీరజ్
************************************************
Movie Name : Gud Morning
Music Director : Ravi kalyan
Lyricist : Mounasri Mallik
Singer : Dheeraj

Saturday, May 4, 2013

యెదలో నదిలాగ కదిలిన భావాలు ........... గుడ్ మార్నింగ్ (2012)

పల్లవి:
యెదలో నదిలాగ కదిలిన భావాలు
మదిలో సుధలాగ కురిసిన రాగాలు
నా వయసుకు తెలియని దాహం
నా సొగసును పిలిచినదేమో
నా మనసును గెలిచిన స్నేహం
తనలో నేనే చూశానేమో ...  ||ఎదలో నదిలాగ ||

చరణం :
కలగా వస్తాడు కలకలమే చేస్తాడు
వలలన్నీ వేపీ వేపీ గిల్లిపోతాడు
కధలే చెబుతాడు కలవరమే పెడతాడు
ముడులన్నీ విప్పీ విప్పీ నవ్వుతుంటాడు
పాడాలని పదములు ఏరి ప్రతిరాతిరి కోరుతూ
ఆడాలని మువ్వలుకట్టి ప్రతి ఉదయం పరిగెడుతూ ఆ ...
నాలోని సరిగమలే ..ఆ ... .లోలోని మధురిమలై  ||ఎదలో నదిలాగ ||

చరణం :
చలిగా వస్తాడు విడివిడిగా ఉంటాడు
కళలన్నీ చూపీ చూపీ జారి పోతాడు
చెలియా అంటాడు చెకుముకి రాజేస్తాడు
చెలిమెల్లా కోరీకోరీ చేరిపోతాడు
కావాలని తనువును మీటి ప్రతిరాతిరి కోరుతూ
రావాలని ఝరులను దాటి తెరపడవలు పంపుతూ ఆ...
ఊహల్లో చెరిసగమై ఆ... దేహాలే రసజగమై  ||ఎదలో నదిలాగ ||


చిత్రమ్ : గుడ్ మార్నింగ్ (2012)
సంగీతం : రవికళ్యాణ్
రచన : మౌనశ్రీ మల్లిక్
గానం : గీతా మాధురి
*****************************************
Movie Name : Gud Morning (2012)
Music Director : Ravikalyan
Lyricist : Mounasri Mallik
Singer : Geetha Madhuri

Monday, March 4, 2013

విధి ఆడిన ఆటలలోన అలసినదా ఈ ప్రేమ .... గుడ్‌మార్నింగ్ (2012)


పల్లవి :
విధి ఆడిన ఆటలలోన అలసినదా ఈ ప్రేమ
మది పాడిన పాటలలోన
ఎగసినదా ఈ ప్రేమ
హృదయాలను వీడనిది
ఉదయాలను చూపునది
గ్రహణాలను పిలిచినదా తలచే ప్రేమ
గమ్యాలను చూపునది గగనాలకు సాగినది
శూన్యాలను వెతికినదా వలచే ప్రేమ
॥

చరణం : 1
ప్రేమా నీ విలువేదమ్మా
ప్రేమా నీ చలువేదమ్మా
నిలువెల్ల విషముగ మారి చూస్తూ ఉన్నావు
ప్రేమా నీ దయలేదమ్మా
ప్రేమా నీ ప్రేమేదమ్మా
తొలిప్రేమను బలిగా కోరి
ఆడుతున్నావు
తొలివేకువ తరుణాన
మలిసంధ్యగ మారావు
కోపమా... ద్వేషమా... శాపమా...
ఆశలవంతెన పరిచావు మృత్యువు
ముంగిట నిలిపావు... ఆ... ॥

చరణం : 2
ప్రేమా నువ్వు కరుణించావా
ప్రేమా నువ్వు కనిపించావా
కలలన్నీ నిజములు చేసి గుండె నింపావు
ప్రేమా నువ్వు బ్రతికించావా
ప్రేమా నువ్వు వినిపించావా
కథలన్నీ రుజువులు చేసి ప్రేమ పంచావు
చలివెన్నెల సమయాన
చెలి చెక్కిలి తడిమావా
హాయిగా... జాలిగా... చేరగా...
జన్మకు అర్థం తెలిపావు
తీర ని ఋణమై నిలిచావు... ఆ...
విధి ఆడిన ఆటలలోన
గెలిచినదా ఈ ప్రేమ
మది పాడిన పాటలలోన
మురిసినదా ఈ ప్రేమ
హృదయాలను వీడనిది
ఉదయాలను చూపినది
గ్రహణాలను చెరిపినదా తలచే ప్రేమ
గమ్యాలను చూపినది గగనాలకు సాగినది
చైత్రాలను పిలిచినదా వలచే ప్రేమ


చిత్రం : గుడ్‌మార్నింగ్ (2012)
సంగీతం : రవి కళ్యాణ్
రచన : మౌనశ్రీమల్లిక్
గానం : దినకర్
*******************************
Movie Name : Good Morning (2012)
Music Director : Ravi Kalyan
Lyricist : Mounasri Mallik
Singer : Dinakar