Showing posts with label Satyam Musical Hits. Show all posts
Showing posts with label Satyam Musical Hits. Show all posts

Sunday, November 10, 2013

పాలవంక సీమలో పసిడి చిలక కులికింది .... పాల మనసులు (1968)

పల్లవి :
పాలవంక సీమలో పసిడి చిలక కులికింది
పసిడి చిలక కులుకులలో పాలమనసు దొరికింది

పాలవంక సీమలో గోరువంక వాలింది
గోరువంక పలుకలలో దోర వలపు దొరికింది

చరణం : 1
రెక్కా రెక్కా ఆనించి ...రేయి పగలు విహరించి
రెక్కా రెక్కా ఆనించి... రేయి పగలు విహరించి
మిన్నులలో ఎగిసింది... అది వెన్నెలలో తడిసినది
మిన్నులలో ఎగిసింది... అది వెన్నెలలో తడిసినది

ఆ ...కోరికలూరే ఆ జంట... ఆరని ఆశల చలి మంట
కోరికలూరే ఆ జంట... ఆరని ఆశల చలి మంట ..
చల్లారని ఆశల... చలి మంట...

పాలవంక సీమలో గోరువంక వాలింది
గోరువంక పలుకలలో దోర వలపు దొరికింది

చరణం : 2
పచ్చని చిలకను చేరగనే... వెచ్చగ ఒదిగెను గోరింక
పచ్చని చిలకను చేరగనే... వెచ్చగ ఒదిగెను గోరింక
ముద్దుల జంటను చూడగనే... ముసిముసి నవ్వును నెలవంక
ముద్దుల జంటను చూడగనే... ముసిముసి నవ్వును నెలవంక

ఆ... కలకలాలాడే ఆ జంట... కమ్మని వలపుల తొలి పంట
కలకలా లాడే ఆ జంట... కమ్మని వలపుల తొలి పంట...
కమ్మని వలపుల... తొలి పంట

పాలవంక సీమలో పసిడి చిలక కులికింది
పసిడి చిలక కులుకులలో పాలమనసు దొరికింది


చిత్రం : పాల మనసులు (1968)
సంగీతం : సత్యం
రచన :
గానం : పి. బి. శ్రీనివాస్,  పి.సుశీల
**********************************************
Movie Name : Paala Manasulu (1968)
Music Director : Satyam
Lyricist :
Singers : P.B.Srinivas, P.Susheela

Friday, November 8, 2013

పగడాల దీవిలో.. పరువాల చిలక ......... దొంగలకు దొంగ (1977)

పల్లవి :
పగడాల దీవిలో.. పరువాల చిలక
తోడుగా చేరింది.. పడుచు గోరింక  
ఓయమ్మ నీ అందం.. వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ.. నా కళ్ళకు కాళ్ళకు

ముత్యాల కోనలో.. గడుసుగోరింక
ఆశగా చూసింది.. చిలకమ్మ వంక
ఓరయ్యో నీ చూపే.. వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ.. నా కళ్ళకు కాళ్ళకు

చరణం : 1
ఎరుపేది మలిసంధ్యలో.. ఓ.. అది దాగింది నీ బుగ్గలో
వెలుగేది తొలిపొద్దులో.. ఓ.. అది తెలిసింది నీ రాకలో
ఆ..ఎన్నడు చూడనీ..అందాలన్నీ..
ఎన్నడు చూడనీ..అందాలన్నీ....
చూశాను ఈ బొమ్మలో..ఓ..హా..

ముత్యాలకోనలో.. గడుసు గోరింక
ఆశగా చూసింది చిలకమ్మ వంక
ఓరయ్యో నీ చూపే వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ... నా కళ్ళకు కాళ్ళకు

చరణం : 2
నీ చిలిపి చిరునవ్వులే..ఏ.. ఊరించే నా వయసునూ
ఓ..హో..ఆ సోగ కనురెప్పలే..ఏ..కదిలించే నా కోర్కనూ
ఆ.. నీవే నేనై తోడు నీడై.. నీవే నేనై తోడు నీడై
నిలవాలి నూరేళ్ళకు..

పగడాల దీవిలో పరువాల చిలక
తోడుగా చేరింది పడుచు గోరింక
ఓరయ్యో నీ చూపే వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ..నా కళ్ళకు కాళ్ళకు

ఓయమ్మ నీ అందం వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ..నా కళ్ళకు కాళ్ళకు


చిత్రం : దొంగలకు దొంగ (1977)
సంగీతం :  సత్యం
రచన :  మైలవరపు గోపి
గానం :  ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, పి.సుశీల
*******************************************
Movie Name : Dongalaku Donga (1977)
Music Director : Satyam
Lyricist : Mailavarapu Gopi
Singers : S.P.Balasubramanyam, P.Susheela

ఏమని పిలవాలి.... నిన్నేమని పిలవాలి... భువనేశ్వరి (1979)

పల్లవి :
ఏమని పిలవాలి.. ఆహా.. హా.. హా.. హా..
నిన్నేమని పిలవాలి... ఆహా.. హా.. హా.. హా..
నవ మల్లికవో...  కవి గీతికవో
నను వలచే ప్రియ రాధికవో...
ఏమని పిలవాని... ఆ.. ఆ..

చరణం : 1
నీ చిరునవ్వులు సోకిన చాలు..
సూర్యుడు వెన్నెల కాయునులే
నీ నును పైటను తాకిన చాలు..
గాలికి గిలిగింత కలుగునులే
నీ పాదాలు మోపిన చాలు.. శిలలైనా విరబూయునే....

ఏమని పిలవాలి.. ఆహా.. హా.. హా.. హా..
నిన్నేమని పిలవాలి... ఆహా.. హా.. హా.. హా..
నవ మల్లికవో...  కవి గీతికవో
నను వలచే ప్రియ రాధికవో...
ఏమని పిలవాని... ఆ.. ఆ..

చరణం : 2
నీ కనుపాపల నీలిమలోనా ఆకాశాలే  దాగెనులే .. అహా.. హా.. హా..
నీ మెలివంపుల నిగ్గులలోన తొలకరి మెరుపులే తూగెనులే... ఆ.. హా.. హా...
నీ జతలోనా.. నీ శృతిలోనా... మన బ్రతుకే పయనించాలిలే...

ఏమని పిలవాలి.. ఆహా.. హా.. హా.. హా..  
నిన్నేమని పిలవాలి... ఆహా.. హా.. హా.. హా..
నవ మల్లికవో...  కవి గీతికవో
నను వలచే ప్రియ రాధికవో...
ఏమని పిలవాలి... ఆ.. ఆ..  


చిత్రం  : భువనేశ్వరి (1979)
సంగీతం  :  సత్యం
రచన  :  సి.నారాయణ రెడ్డి ( సినారె )
గానం  :  S.P.బాలు, S.జానకి
*************************************
Movie Name : Poola Rangadu (1979)
Music Director : Satyam
Lyricist : C. Narayana Reddy
Singers : S.P.Balu, S.Janaki

Thursday, November 7, 2013

ఈ గీతం .. సంగీతం .. ఓ చెలీ నా జీవితం ..... మహాలక్ష్మి (1980)

పల్లవి :
ఈ గీతం .. సంగీతం .. ఓ చెలీ నా జీవితం
నీ నీడలోనా ప్రణయం ..రసమయం. హే..హే

చరణం : 1
కల కల విరిసే కలువలలో.. నీ కనులే చూశానూ
తొలకరి గాలుల అలికిడిలో..నీ పిలుపే విన్నానూ
నిద్దురలోనా..మెలకువలోనా నీకై వేచానూ.....

ఓహో... ఓ... ఓ... ఓ... ఓ... ఓ

చరణం : 2
ఈ గీతం .. సంగీతం .. ఓ చెలీ నా జీవితం
నీ నీడలోనా ప్రణయం ..రసమయం. హా..హా

పలికించే ప్రతి లలిత శృతి  .. నీ వలపై మ్రోగిందీ
నడయాడే ప్రతి సుందరజతి..నీ అడుగై సాగిందీ
తరుణిమలొలికే నీ చిరునవ్వే వరమై దొరికిందీ

ఓహో... ఓ... ఓ... ఓ.. ఓ.. ఓ

ఈ గీతం .. సంగీతం.. ఓ చెలీ నా జీవితం
నీ నీడలోనా ప్రణయం.. రసమయం. హే..హే


చిత్రం : మహాలక్ష్మి (1980)
సంగీతం :  సత్యం
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం , పి. సుశీల
********************************************
Movie Name : Mahalaxmi (1980)
Music Director : Satyam
Lyricist : C. Narayana Reddy
Singers : SP.Balasubramanyam, P.Susheela

ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ... పెద్దన్నయ్య (1975)

పల్లవి :
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ...
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది...
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది

ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ...
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది...
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది

చరణం : 1
పదునారు కళలందు ఏ చిత్ర కళవో...
ఏ శిల్పి కలలందు నెలకొన్న చెలివో
పదునారు కళలందు ఏ చిత్ర కళవో...
ఏ శిల్పి కలలందు నెలకొన్న చెలివో
ఏ జన్మ పుణ్యాన నను చేరినావో.....

ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ...
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది...
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది..

చరణం : 2
నా గుండె గుడిలోన నీ రూపు వెలసే...
నిను చెరగా గొంతు రాగాలు పలికే..
నా గుండె గుడిలోన నీ రూపు వెలసే...
నిను చెరగా గొంతు రాగాలు పలికే...
వేచేను వెయ్యేళ్లు నీ తోడు కొరకే....

ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ...
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది

లా లా..ల..లా...లా లా..ల..లా
లా లా..ల..లా...లా లా..ల..లా...


చిత్రం : పెద్దన్నయ్య (1975)
సంగీతం :  సత్యం
రచన :
గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం , పి. సుశీల
********************************************
Movie Name : Peddannayya (1975)
Music Director : Satyam
Lyricist :
Singers : SP.Balasubramanyam, P.Susheela

Monday, August 19, 2013

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను..... పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను

నా పాట విని మురిశావు..ఆ పైన నను వలిచావు
నా పాట విని మురిశావు..ఆ పైన నను వలిచావు

కలలాగ నను కలిశావు..లతలాగ నను పెనవేశావు
ఒక గానమై.. ఒక ప్రాణమై..జతగూడి మనమున్నాము.. ఉన్నాము..ఉన్నాము..

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను

నాడేమి ఉందని భ్రమశేవు..నేడేమి లేదని విడిచేవు..
నాడేమి ఉందని భ్రమశేవు..నేడేమి లేదని విడిచేవు..

ఆ మూడూ ముళ్ళని మరిచేవు..నా పాల మనసుని విరిచేవు..
ఈనాడు నన్ను విడనాడినా..ఏనాటికైనా కలిశేవు..కలిశేవు..నను కలిశేవు..

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను


చిత్రం : పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం : సత్యం
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
***********************************************
Movie Name : Puttinillu - Mettinillu (1973)
Music Director : Satyam
Lyricist : C. Narayana Reddy
Singer : S.P.Balasubramanyam

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూశానులే.... పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)

పల్లవి :
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే..ఏ..ఏ..ఏ..ఏ
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే..ఏ..ఏ..ఏ..ఏ

ఏ నోము ఫలమో..ఏ దేవి వరమో..
నీ దాననైనానులే..ఏ..ఏ..ఏ..ఏ
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు..
ఈ రేయి నీకోసమే...

చరణం : 1
పానుపు మురిసింది మన జంట చూసి
వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి
పానుపు మురిసింది మన జంట చూసి
వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి
వలచిన ప్రియునీ..కలసిన వేళ..
వలచిన ప్రియునీ..కలసిన వేళ..
తనువంత పులకింతలే..ఏ..ఏ..ఏ..ఏ
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే...
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

చరణం : 2
దివిలో నెలరాజు దిగివచ్చినాడు..
భువిలో కలువమ్మ చేయిపట్టెనాడు....
దివిలో నెలరాజు దిగివచ్చినాడు..
భువిలో కలువమ్మ చేయిపట్టెనాడు...

నీ తోటి చెలిమి..నిజమైన కలిమి
నీ తోటి చెలిమి..నిజమైన కలిమి
నిలవాలి..కలకాలమూ..ఊ..ఊ..ఊ.

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే...
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు..
ఈ రేయి నీకోసమే...
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..


చిత్రం : పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం : సత్యం
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : ఏ.ఎం.రాజా , పి.సుశీల
***********************************************
Movie Name : Puttinillu - Mettinillu (1973)
Music Director : Satyam
Lyricist : C. Narayana Reddy
Singers : A.M.Raja, P.Susheela

Friday, November 30, 2012

పాడనా వేణువై నీవు నా ప్రాణమై ......... సుందరి సుబ్బారావు (1984)


పాడనా వేణువై నీవు నా ప్రాణమై
పాడనా వేణువై నీవు నా ప్రాణమై
నా జీవన బృందావని లో
ప్రియ దర్శన రస మాధురిలో

పాడనా వేణువై నీవు నా ప్రాణమై

చెలీ! సఖీ! ప్రియే! చారుశీలే! అనీ..
తలచి తనువు మరచి కలలు కన్నానులే
కాముడిలా సుమ బాణాలు వేసి
కదిలిన నీ చలి కోణాలు చూసి
ఆమనిలో సుమ గంధాలు పూసి
కవితలుగా నవ వేదాలు రాసి
మోవికి తగిలి ముద్దుల మురళి
కౌగిళ్ళలో ప్రియ కళ్యాణిలో
సంగీతమే పాడిందిలే

పాడనా వేణువై నీవు నా ప్రాణమై

కలం..గళం..స్వరం నాకు నీవేననీ
మధుర ప్రణయ కవిత పాడుకున్నానులే
నీలో అలిగే అందాల రూపం
నాలో వెలిగే శృంగార దీపం
నీలో కరిగే ఆ ఇంద్ర చాపం
నాలో జరిగే అమృతాభిషేకం
సన్నని కులుకే వెన్నెల చినుకై
రమ్మందిలే మనసిమ్మందిలే
నీ రాగమే పాడిందిలే

పాడనా వేణువై నీవు నా ప్రాణమై
నా జీవన బృందావని లో
ప్రియ దర్శన రస మాధురిలో
పాడనా వేణువై నీవు నా ప్రాణమై

చిత్రం : సుందరి సుబ్బారావు (1984)
సంగీతం :  సత్యం
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

Thursday, November 29, 2012

అంకితం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం ...... స్వప్న(1980)


అంకితం నీకే అంకితం ...అంకితం నీకే అంకితం
నూరేళ్ళ ఈ జీవితం
అంకితం నీకే అంకితం
ఓ ప్రియా ఆ ఆ ఆ
ఓ ప్రియా ఓ ప్రియా..

కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత
త్యాగరాయ కృతులందు వెలయు గీతార్ద సార నవత
నవవసంత శోభనా మయూఖ లలిత లలిత రాగ చంద్రలేఖ

స్వరమూ స్వరమూ కలయికలో ఒక రాగం పుడుతుంది
మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది
స్వరమూ స్వరమూ కలయికలో ఒక రాగం పుడుతుంది
మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది
ఆ అనురాగం ఒక ఆలయమైతే ఆ ఆలయ దేవత నీవైతే
ఆ ఆలయ దేవత నీవైతే గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం

అంకితం నీకే అంకితం

లోకవినుత జయదేవ శ్లోక శృంగార రాగదీప
భరత శాస్త్ర రమణీయ నాద నవ హావ బావ రూప
స్వరవిలాస హాస చతుర నయన
సుమ వికాస బాస సుందర వదన

నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది
ప్రేమా ప్రేమా కలయికతో ఒక ప్రణయం పుడుతుంది
నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది
ప్రేమా ప్రేమా కలయికతో ఒక ప్రణయం పుడుతుంది
ఆ ప్రణయం ఒక గోపురమైతే ఆ గోపుర కలశం నీవైతే
ఆ గోపుర కలశం నీవైతే
పుష్పం పత్రం ధూపం దీపం సర్వం అంకితం

అంకితం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం
అంకితం నీకే అంకితం
ఓ ప్రియా ఆ ఆ ఆ.....ఓ ప్రియా ఓ ప్రియా..


చిత్రం :  స్వప్న(1980)
సంగీతం : సత్యం
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
**************************************
Movie Name : Swapna (1980)
Music Director : Satyam
Lyricist : C Narayana Reddy
Singer : S.P.Balasubramanyam

తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి .......... తరంగిణి (1983)


తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
ఏ ఒడిలో నీ జననం ఏ కడలితో నీ పయనం
ఏ ఒడిలో నీ జననం ఏ కడలితో నీ పయనం
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి

ఇసుక తిన్నెలెదురైనా ఏ గిరులు తిరిగి పొమ్మన్నా
లోయల్లో దిగిపోయినా పాయలుగా విడిపోయినా
లోయల్లో దిగిపోయినా పాయలుగా విడిపోయినా
ఆగిపోదు నీ నడక ఆ..
ఆగిపోదు నీ నడక ఆ గమ్యం చేరేదాకా
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి

గుండె ముక్కలైపోయి సుడిగుండాలే చెలరేగి
కల్లోలం విషమించినా ఆ…
కల్లోలం విషమించినా కాలమే వంచించినా
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
ఆగిపోదు నీ నడక ఆ గమ్యం చేరేదాకా ఆ…
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి

ఎదలోని రాపిడిలోన కదలాడు నురగలపైన
కలకలనవ్వులున్నాయో ఓ….
కలకలనవ్వులున్నాయో కన్నీళ్ళు పొంగుతున్నాయో
తెలిసేదెవరికి.. ఆ దైవానికి

తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
ఏ ఒడిలో నీ జననం ఏ కడలితో నీ పయనం
ఏ ఒడిలో నీ జననం ఏ కడలితో నీ పయనం
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
ఓ తరంగిణి  ఓ తరంగిణి


చిత్రం : తరంగిణి (1983)
సంగీతం : సత్యం
రచన : సి.నారాయణ రెడ్డి (సినారె)
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
*******************************************
Movie Name : Tharangini (1983)
Music Director : Satyam
Lyricist : C. Narayana Reddy
Singer : S.P.Balasubramanyam

Saturday, November 10, 2012

ఇదే నా మొదటి ప్రేమలేఖ.. రాశాను నీకు చెప్పలేక..... స్వప్న (1981)


ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాశాను నీకు చెప్పలేక..
యెదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు భాష చేతకాక..
తెలుపుటకు భాష చేతకాక..

ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాశాను నీకు చెప్పలేక..
యెదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు భాష చేతకాక..
తెలుపుటకు భాష చేతకాక..

చరణం: 1
మెరుపని పిలవాలంటే.. ఆ వెలుగు వొక్క క్షణం ..
పూవనీ పిలవాలంటే.. ఆ సొగసు వొక్క దినం..
ఏ రీతిగా నిన్ను.. పిలవాలో తెలియదు నాకు..
ఏ రీతిగా నిన్ను.. పిలవాలో తెలియదు నాకు!!
తెలిసింది వొక్కటే.. నువ్వు నా ప్రాణమని!!
ప్రేమా..ప్రేమా..ప్రేమా..

ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాశాను నీకు చెప్పలేక..
యెదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు భాష చేతకాక..
తెలుపుటకు భాష చేతకాక..

చరణం: 2
తారవని అందామంటే.. నింగిలో మెరిసేవు..
ముత్యమని అందామంటే.. నీటిలో వెలిసేవు..
ఎదలోన కదిలే నిన్ను.. దేనితో సరిపోల్చలో??
ఎదలోన కదిలే నిన్ను.. దేనితో సరిపోల్చలో??
తెలిసింది వొక్కటే.. నువ్వు నా ప్రాణమని!!
ప్రేమా..ప్రేమా..ప్రేమా..

ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాశాను నీకు చెప్పలేక..
యెదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు భాష చేతకాక..
తెలుపుటకు భాష చేతకాక..

చిత్రం : స్వప్న (1981)
సంగీతం : సత్యం
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలు

గల గల పారుతున్న గోదారిలా .. రెపరెపలాడుతున్న తెరచాపలా.... గౌరి (1974)

గల గల పారుతున్న గోదారిలా
రెపరెపలాడుతున్న తెరచాపలా. లా..లాలలా....
హే హే గల గల పారుతున్న గోదారిలా
రెపరెపలాడుతున్న తెరచాపలా
ఈ చల్లని గాలిలా ఆ పచ్చని పైరులా
ఈ జీవితం సాగనీ హాయిగా
హే... గలగల పారుతున్న గోదారిలా

అందాలు పందిరి వేసే ఈ తోటలు
ఆ నింగి అంచులు చేరే ఆ బాటలు
నాగలి పట్టే రైతులు ,కడవలు మోసే కన్నెలు
బంగరు పంటల సీమలు చూడరా..

హే... గలగల పారుతున్న గోదారిలా

దేశానికాయువు పోసే పల్లెలు
చల్లంగ ఉండిన నాడే సౌభాగ్యము 
సత్యం ధర్మం నిలుపుటే న్యాయం కోసం పోరుటే..
హే... గలగల పారుతున్న గోదారిలా 


చిత్రం : గౌరి (1974)
సంగీతం : సత్యం 
రచన : దాశరథి 
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం 
*********************************
Movie Name : Gowri (1974)
Music Director : Satyam
Lyricist : Dasarathi
Singer : S.P.Bala Subrahmanyam

Monday, November 5, 2012

అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా ..... నోము (1974)

అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా
నాగుల చవితి నాగన్నా పూజలు గొనుమన్నా
పాలు పోసేము నోము నోచేము
మము చల్లంగా చూడాలి నాగన్నా

పానకాలు చిప్పిల్లు కానుక తెచ్చాము
ముంగిట ముత్యాల ముగ్గులు పెట్టాము
భక్తితో నిను గూర్చి పాటలు పాడేము
సిరిసంపదలిచ్చి మురిపించవయ్యా

మల్లెలు తెచ్చామయ్యా మల్లెల నాగేంద్రా
చలిమిడి పెట్టామయ్య చల్లని నాగేంద్రా
కన్నెలము కొలిచేమయ్యా కరుణించవయ్యా
అడిగిన వరమిచ్చి అలరించవయ్యా


చిత్రం : నోము (1974)
సంగీతం : సత్యం
రచన :
గానం : P.సుశీల
*****************************************************
andari daivam neevannaa aashal teerchannaa
nagula chaviti nagannaa pujalu gonumannaa
palu posemu nomu nochemu
mamu challanga chudali nagannaa

panakalu chippillu kauka techamu
mungita mutyala muggulu pettamu
bhaktito ninu gurchi patalu pademu
sirisampadalichi muripinchavayyaa

mallelu techamayyaa mallela nagendraa
chalimidi pettamayya challani nagendraa
kannelamu kolichemayya karuninchavayya
adigina varamichi alarinchavayyaa


Movie Name : Nomu (1974)
Music Director : Satyam
Lyricist :
Singer : P.Susheela

చక్కని దానా నునుపు చెక్కిలి దానా ..... నోము (1974)

చక్కని దానా నునుపు చెక్కిలి దానా
ఇంతలో బిడియమా చెంతనే విరహమా
చక్కని దానా నునుపు చెక్కిలి దానా

ఏ బిడియమే ఏ పడతికైనా పరమ సహజం
ఈ విరహమే నీ సరసనుంటే మధుర మధురం
తీగలా అల్లుకో తేనెలే అందుకో
చక్కనిదానా

నీలోన కదలే రాగాసుధలే పంచుకోనా
నీలో కలిసి లోలో విరిసి నేనుండిపోనా
వుండిపో వుండిపో గుండెలో నిండిపో...


చిత్రం : నోము (1974)
సంగీతం : సత్యం
రచన :
గానం : S.P.బాలసుబ్రహ్మణ్యం
*****************************************************
chakkani danaa nunupu chekkili daanaa
intalo bidiyamaa chetane virahamaa
chakkani daanaa nunupu chekkili daanaa

ee bidiyame ye padatikainaa parama sahajam
ee virahame ne sarasanunte madhura madhuram
teegalaa alluko tenele anduko
chakkanidaanaa

nelona kadale ragasudhale panchukonaa
nelo kalisi lolo virisi nenundiponaa
vundipo vundipo gundel nindipo...



Movie Name : Nomu (1974)
Music Director : Satyam
Lyricist : 
Singer : S.P.Balasubramanyam

కలిసే కళ్ళలోన కురిసే పూలవాన ........ నోము (1974)














కలిసే కళ్ళలోన కురిసే పూలవాన
విరిసెను ప్రేమలు హృదయాన
కలిసే కళ్ళలోన కురిసే పూలవాన
విరిసెను ప్రేమలు హృదయాన
కలిసే కళ్ళలోన.....

పెరిగి తరిగేను నెలరాజు
వెలుగును నీ మోము ప్రతి రోజు...
పెరిగి తరిగేను నెలరాజు
వెలుగును నీ మోము ప్రతి రోజు...
ప్రతిరేయి పున్నమిలే నీతో ఉంటే...
కలిసే కళ్ళలోన కురిసే పూలవాన
విరిసెను ప్రేమలు హృదయాన
కలిసే కళ్ళలోన.....

ఎదురుగ చెలికాణ్ణి చూసాను
ఎంతో పులకించిపోయాను...
ఎదురుగ చెలికాణ్ణి చూసాను
ఎంతో పులకించిపోయాను...
ఈ పొందు కలకాలం నే కోరేను..
కలిసే కళ్ళలోన కురిసే పూలవాన
విరిసెను ప్రేమలు హృదయాన
కలిసే కళ్ళలోన.....

కౌగిలి పిలిచేను ఎందుకని
పెదవులు వణికేను దేనికని...
కౌగిలి పిలిచేను ఎందుకని
పెదవులు వణికేను దేనికని...
మనలోని పరువాలు పెనవేయాలని
కలిసే కళ్ళలోన కురిసే పూలవాన
విరిసెను ప్రేమలు హృదయాన....


చిత్రం : నోము (1974)
సంగీతం : సత్యం
రచన : 
గానం : S.P.బాలు, P.సుశీల
*****************************************************
kalise kallalona kurise poolavaana
virisenu premalu hrudayaana
kalise kallalona kurise poolavaana
virisenu premalu hrudayaana
kalise kallalona....

perigi tarigenu nelaraju
velugunu ne momu prati roju...
perigi tarigenu nelaraju
velugunu ne momu prati roju...
pratireyi punnamile neetho unte...
kalise kallalona kurise poolavaana
virisenu premalu hrudayaana
kalise kallalona....

yeduruga chelikaanni chusanu
yentho pulakinchipoyanu...
yeduruga chelikaanni chusanu
yentho pulakinchipoyanu...
ee pondhu kalakaalam ne korenu..
kalise kallalona kurise poolavaana
virisenu premalu hrudayaana
kalise kallalona....

kougili pilichenu yendukani
pedavulu vanikenu denikani..
kougili pilichenu yendukani
pedavulu vanikenu denikani..
manaloni paruvaalu penaveyaalani
kalise kallalona kurise poolavaana
virisenu premalu hrudayaana


Movie Name : Nomu (1974)
Music Director : Satyam
Lyricist : 
Singers : S.P.Balu, P.Susheela

నోము పండించవా స్వామీ నను కరుణించ రావేమి ..... నోము (1974)

నోము పండించవా స్వామీ నను కరుణించ రావేమి
నిను నమ్మితిరా నిను కొలిచితిరా అలక చాలించి పాలించవా(2)

అనురాగమొలికే అందాల రాజుకు ఇల్లాలుగా చేసినావు
ఏ వేళనైనా ఏ ఆపదైనా మమ్మెంతో కాపాడినావు
ఎడబాటు ఎరుగని మా జంటనిపుడు(2)
ఎందుకు విడదీసినావు(2)

ఆది శేషుని అవతారం నీవైతే
నేనింత కాలము నోచిన నోము నిజమైతే(2)
దైవంగా నా పతినే నేను పూజిస్తే(2)
నీ మహిమను చూపాలి మా కాపురం నిలపాలి
నిజం నిరూపించాలి రారా...దేవా....రారా దేవా...


చిత్రం : నోము (1974)
సంగీతం : సత్యం
రచన :
గానం : P.సుశీల
*****************************************************
nomu pandinchavaa swamee nanu karunincha ravemi
ninu nammitiraa ninu kolichitiraa alaka chalinchi palinchavaa(2)

anuragamolike andaala rajuku illalugaa chesinaavu
ye velanainaa ye apadainaa mammento kapadinavu
yedabatu yerugani ma jantanuipudu(2)
yenduku vidadeesinavu(2)

aadi seshuni avataram neevaite
neninta kalamu nochina nomu nijamaite(2)
daivamga na patine nenu pujiste(2)
ne mahimanu chupaali ma kapuram nilapaali
nijam nirupinchali raraa...devaa....raraa devaa...


Movie Name : Nomu (1974)
Music Director : Satyam
Lyricist :
Singer : P.Susheela

మనసే జతగా పాడిందిలే .. తనువే లతలా ఆడిందిలే ..... నోము (1974)


మనసే జతగా పాడిందిలే .. తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో ..
ఆ..ఆఆ.అ

మనసే జతగా పాడిందిలే .. తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో .. ఓఓఓ..ఓ

ఈ గిలిగింత.. సరికొత్త వింత ఏమన్నదీ ?
పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నదీ

ఏ..ఏ. హె.హే
ఈ గిలిగింత.. సరికొత్త వింత ఏమన్నదీ ?
పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నదీ

అందుకే ఓ చెలీ .. అందుకో కౌగిలీ .. ఓ చెలీ ..

ఏ.. హె హే...
మనసే జతగా పాడిందిలే .. తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో .. ఓఓఓ..ఓ

ఓ..ఓఓ ఓ..
మనసే జతగా పాడిందిలే .. తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో .. ఓఓఓ..ఓ

నింగిని తాకే నీలాల మేఘం ఏమన్నదీ ?
నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నదీ
ఆ..ఓ..హో ..
నింగిని తాకే నీలాల మేఘం ఏమన్నదీ ?
నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నదీ

ఓ.. అందుకే ఓ ప్రియా .. అందుకో పయ్యెద .. ఓ ప్రియా

ఏ.. హె హే...
మనసే జతగా పాడిందిలే .. తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో !

ఓ..ఓఓ ఓ..
మనసే జతగా పాడిందిలే .. తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో!


చిత్రం : నోము (1974)
సంగీతం : సత్యం
రచన : సి. నారాయణ రెడ్డి
గానం : S.P.బాలు, P.సుశీల
*****************************************************
manase jatagaa padindile tanuve latalaa aadindile(2)
ee velalo yenduko....
manase jatagaa padindile tanuve latalaa aadindile(2)
ee velalo yenduko...

ee giligintha sari kotta vintha yemannadi
puche paruvam pulakinchu tarunam ipudannadi
ee giliginta sari kotta vinta yemannadi
puche paruvam pulakinchu tarunam ipudannadi
anduke oo chelee anduko kougili oo chelee...

ningini saage neelala megham yemannadi
ne kongunu minchina andaalu tanalo levannadi
ningini saage neelala megham yemannadi
ne kongunu minchina andaalu tanalo levannadi
anduke oo priyaa anduko pai yeda oo priyaa...


Movie Name : Nomu (1974)
Music Director : Satyam
Lyricist : C. Narayana Reddy
Singers : S.P.Balu, P.Susheela

Tuesday, October 30, 2012

ఇది తియ్యని వెన్నెల రేయి ....... ప్రేమలేఖలు (1953)


ఇది తియ్యని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
నా ఉహల జాబిలి రేఖలు
కురిపించెను ప్రేమలేఖలు

ఇది తియ్యని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి

నడిరాతిరి వేళా నీ పిలుపు
గిలిగింతలతో నను ఉసిగోలుపు
నడిరాతిరి వేళా నీ పిలుపు
గిలిగింతలతో నను ఉసిగోలుపు
నును చేతులతో నను పెనవేసి
నా ఒడిలో వాలును నీ వలపు

ఇది తియ్యని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి

నా మనసే కోవెల చేసితిని
ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నా మనసే కోవెల చేసితిని
ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నీ ఒంపులు తిరిగే అందాలు
కనువిందులు చేసే శిల్పాలు

ఇది తియ్యని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి

నీ పెదవులు చిలికే మధురిమలు
అనురాగము పలికే సరిగమలు
నీ పెదవులు చిలికే మధురిమలు
అనురాగము పలికే సరిగమలు
మన తనువులు పలికే రాగాలు
కలకాలం నిలిచే కావ్యాలు

ఇది తియ్యని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
నా ఉహల జాబిలి రేఖలు
కురిపించెను ప్రేమలేఖలు ప్రేమలేఖలు ...

ఇది తియ్యని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి

చిత్రం : ప్రేమలేఖలు (1953)
సంగీతం : సత్యం
రచన : ఆరుద్ర
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , పి.సుశీల

Monday, October 29, 2012

సీతారామ స్వామి నే చేసిన నేరములేమి ...... పట్నం వచ్చిన పతివ్రతలు (1982)


సీతారామ స్వామి నే చేసిన నేరములేమి
కోరితినా ఆ ఒక్కటితప్పా
నేరాలెన్నగ నేనే గొప్పా స్వామీ

నీ కౌగిలే కాసుల పేరని
నీ ముద్దులే ముత్యపుసరులని
మురిసితిగాని కొసరి కొసరి నే కోరితినా ఆ ఒక్కటి తప్ప
అది నీకు నాకు తెలుసును తప్ప స్వామి

ఇంటిపెత్తనాలడిగితినా
వీధికెక్కినే నలిగితినా
ఆ..ఆ.ఆ..ఆ
సాధింపులతో సణిగితినా
నిను బాధపెట్టి నేనెరుగుదునా
కోరితినా ఆ ఒక్కటితప్పా
నేరాలెన్నగా నేనే గొప్ప స్వామి

ఎన్నాళ్ళీ లంక చెర ..
ఏనాడు విందువో నాదుమొర
ఆతప్రాణపరయాణ శీలా
అన్యమడుగునా ఆ ఒక్కటితప్ప
కోరితినా ఆ కోరికతప్ప అది నీకు నాకు తలుసును తప్ప స్వామి

చిత్రం : పట్నం వచ్చిన పతివ్రతలు (1982)
సంగీతం : సత్యం
రచన :
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , పి.సుశీల

Friday, October 26, 2012

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో .... సీతారాములు (1980)


తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
యెగిరొచ్చే కెరటం సింధూరం

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
యెగిరొచ్చే కెరటం సింధూరం

జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం
గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం
వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం
ఆ హృదయం సంధ్యా రాగం మేలుకొలిపే అనురాగం

తొలిసంధ్య వేళలో........

సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యా సమయం
వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం
లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం
ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
యెగిరొచ్చే కెరటం సింధూరం


చిత్రం : సీతారాములు (1980)
సంగీతం : సత్యం
రచన : దాసరి నారాయణ రావు
గానం: ఎస్,పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల