Showing posts with label samudhraala(senior)-Lyrics ( సముద్రాల సీనియర్ రాసిన పాటలు ). Show all posts
Showing posts with label samudhraala(senior)-Lyrics ( సముద్రాల సీనియర్ రాసిన పాటలు ). Show all posts

Wednesday, July 31, 2013

బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ... సుమంగళి (1940)














కాటమరాయడ కదిరీ నరసింహుడ
కాటమరాయడ కదిరీ నరసింహుడ
మేటైనయేటకాడ నిన్నే నమ్మితిరా
మేటైనయేటకాడ నిన్నే నమ్మితిరా
బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా...
సేప కడుపున సేరి పుట్టితీ
రాకాసిగాని కోపాన సీరికొట్టితీ
సేప కడుపున సేరి పుట్టితీ
రాకాసిగాని కోపాన సీరికొట్టితీ
ఓపినన్ని నీళ్లలోన యెలసియేగ తిరిగినీవు
బాపనోళ్ల సదువులెల్ల బమ్మదేవరకిచ్చినోడ
బాపనోళ్ల సదువులెల్ల బమ్మదేవరకిచ్చినోడ
బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ ...
 బేట్రాయి సామి దేవుడా...


చిత్రం : సుమంగళి (1940)
సంగీతం : చిత్తూరు వి. నాగయ్య
రచన :  సముద్రాల సీనియర్
గానం : గౌరీపతి శాస్త్రి
*************************************
Movie Name : Sumangali (1940)
Music Director : Chittoor V.Nagayya
Lyricist : Samudrala Senior
Singer : Gowripathi Sastry

Saturday, May 11, 2013

రారోయి మా ఇంటికి మావో మాటున్నది మంచి మాటున్నది ... దొంగరాముడు (1955)


రారోయి మా ఇంటికి
రారోయి మా ఇంటికి మావో
మాటున్నది మంచి మాటున్నది
మాటున్నది మంచి మాటున్నది

చరణం : 1
నువ్వు నిలిసుంటె నిమ్మ సెట్టు నీడున్నది
నువ్వు కూసుంటె కురిసీలో పీటున్నది
నువ్వు తొంగుంటె పట్టె మంచం పరుపున్నది
మాటున్నది మంచి మాటున్నది
రారోయి మా ఇంటికి మావో మాటున్నది

చరణం : 2
ఆకలైతే సన్నబియ్యం కూడున్నది
నీకాకలైతే సన్నబియ్యం కూడున్నది
అందులోకి అరకోడి కూరున్నది
అందులోకి అరకోడి కూరున్నది
ఆపైన రొయ్యపొట్టు చారున్నది
మాటున్నది మంచి మాటున్నది
రారోయి మా ఇంటికి మావో
మాటున్నది మంచి మాటున్నది

చరణం : 3
రంజైన మీగడ పెరుగున్నది
నంజుకోను ఆవకాయ ముక్కున్నది
నీకు రోగమొస్తే ఘాటైన మందున్నది
రోగమొస్తే ఘాటైన మందున్నది
నిన్ను సాగనంప వల్లకాటి దిబ్బున్నది


చిత్రం : దొంగరాముడు (1955)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
రచన : సముద్రాల రాఘవాచార్య
గానం : జిక్కి
*********************************************
Raaroyi maa intiki ....mmm
raaroyi maa intiki maavo
maatunnadi manchi maatunnadi...haahhaa
maatunnadi manchi maatunnadi ..aaa

Nuvvu nilisunte nimma settu needunnadi ...ahaaa
nuvvu koosunte kuriseelo peetunnadi ... ahaa
nuvvu tongunte patte mancham parupunnadi ....
ahhahhahha .. bhale bhale....
maatunnadi manchi maatunnadi

Raaroyi maa intiki ....mmm...
maavo maatunnadi manchi maatunnadi

Aakalaithey sannabiyyam koodunnadi ..mm
neekaakalaithey sannabiyyam koodunnadi .. baavundi baavundi
anduloki arakodi koorunnadi ..ahhahh avvalraitu yerry good
anduloki arakodi koorunnadi...aaa
aapaina royyappottu chaarunnadi ...ahhhahhh.. abbo abbo
maatunnadi manchi maatunnadi

Raaroyi maa intiki ....antega...
maavo maatunnadi manchi maatunnadi

Ranjaina meegada perugunnadi ....brbrbre.. chee chee chee chee
nanjukonu aavakai mukkunnadi ...aahhh.. don't wantu
rogamoste ghaataina mandunnadi ..ah.. ahhahhh aa
rogamoste ghaataina mandunnadi ..a
ninnu saaganampa vallakati dibbunnadi ...
ahhahhhahahahhhhahoohahhahaha
hahahahhaooaohahha


Movie Name : Donga ramudu (1955)
Music Director : Pendyala Nageshwara rao
Lyricist : Samudrala Raghavacharya
Singer : Jikki

అంద చందాల సొగసరి వాడు...విందు భోంచేయ వస్తాడు నేడు... దొంగరాముడు (1955)


అంద చందాల సొగసరి వాడు....
అంద చందాల సొగసరి వాడు....
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ(2)

చూడ చూడంగ మనసగు వాడు
ఈడు జోడైన వలపుల రేడు
వాడు నీకన్న శోకైన వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ(2)

వాని కన్నుల్లో వెన్నెల జాలు
వాని నవ్వుల్లో ముత్యాలు రాలు
వాడు నీకన్న చల్లని వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ(2)

నేటి పోటీల గడుసరి వాడు
మాట పాటించు మగసిరి వాడు
వాడు నీకన్న సిరిగల వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ(2)

అందచందాల సొగసరి వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ.....


చిత్రం : దొంగరాముడు (1955)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
రచన : సముద్రాల రాఘవాచార్య
గానం : జిక్కి
*********************************************
Anda chandaala sogasari vaadu
Anda chandaala sogasari vaadu
vindu bhoncheya vastadu nedu
chandamama oho chandamama(2)

chuda chudanga manasagu vadu
eedu jodaina valapula redu
vadu neekanna shokaina vadu
vindu bhoncheya vastadu nedu
chandamama oho chandamama(2)

vani kannullo vennela jalu
vani navvullo mutyalu ralu
vadu neekanna challani vadu
vindu bhoncheya vastadu nedu
chandmama oho chandmama(2)

neti potila gadusari vadu
mata patinchu magasiri vadu
vadu nekanna sirigala vadu
vindu bhoncheya vastadu nedu
chandamama oho chanadmama(2)

andachandala sogasari vadu
vindu bhoncheya vastadu nedu
chandamama oho chandamama.....


Movie Name : Donga ramudu (1955)
Music Director : Pendyala Nageshwara rao
Lyricist : Samudrala Raghavacharya
Singer : Jikki

ఓఓఓఓ చిగురాకులలో చిలకమ్మా ........ దొంగరాముడు (1955)


ఓఓఓఓ చిగురాకులలో చిలకమ్మా
చిన్న మాట విన రావమ్మా
ఓఓఓఓ మరుమల్లెల్లో మావయ్య
మంచి మాట సెలవీవయ్య

పున్నమి వెన్నెల గిలిగింతలకు
పూచిన మల్లెల మురిపాలు
నీ చిరునవ్వుకు సరి కావమ్మ..
ఓ...చిగురాకులలో చిలకమ్మా
ఎవరన్నారో ఈ మాట వింటున్నాను నీ నోట
తెలిసి పలికిన విలువేలా...
ఓ...మరు మల్లెలలో మావయ్యా...

వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తియ్యదనాలకు
కలవా విలువలు సెలవీయ
ఓ..చిగురాకులలో చిలకమ్మా...
ఫై మెరుగులకే భ్రమపడకయ్య..మనసే మాయని సొగసయ్య
గుణమే దొరుకని ధనమయ్య...
ఓ...మరుమల్లెల్లో మావయ్యా....మంచి మాట సెలవీవయ్య
ఓ...చిగురాకులలో చిలకమ్మా..చిన్న మాట విన రావమ్మా


చిత్రం : దొంగరాముడు (1955)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
రచన : సముద్రాల రాఘవాచార్య
గానం : ఘంటసాల, జిక్కి
*********************************************
oooooooo chigurakulalo chilakammaa
chinna mata vina ravammaa
oooooooo marumallello mavayya
manchi mata selaveevayya

punnami vennela giliginthalaku
puchina mallela muripalu
ne chirunavvuku sari kavamma..
oo...chigurakulalo chilakammaa
yevarannaro ee mata vintunnanu nee nota
telisi palikina viluvelaa...
oo...maru mallelalo mavayyaa...

valache komali vayyaralaku kalase manasula tiyyadanalaku
kalavaa viluvalu selaveeya
oo..chigurakulalo chilakammaa...
pi merugulake bhramapadakayya..manase mayani sogasayya
guname dorukani dhanamayya...
oo...marumallello mavayyaa....manchi mata selaveevayya
oo...chigurakulalo chilakamma..chinna mata vina ravamma


Movie Name : Donga ramudu (1955)
Music Director : Pendyala Nageshwara rao
Lyricist : Samudrala Raghavacharya
Singers : Ghantasala, Jikki

భలే తాత మన బాపూజీ - బాలల తాతా బాపూజీ ... దొంగరాముడు (1955)

భలే తాత మన బాపూజీ - బాలల తాతా బాపూజీ
బోసినవ్వుల బాపూజీ - చిన్నీ పిలక బాపూజీ
కుల మత బేధం వలదన్నాడు - కలిసి బతికితే బలమన్నాడు
మానవులంతా ఒకటన్నాడు - మనలో జీవం పోసాడు
భలే తాత మన బాపూజీ - బాలల తాతా బాపూజీ

నడుం బిగించి లేచాడు - అడుగూ ముందుకు వేశాడు
కదం తొక్కుతూ పదం పాడుతూ - దేశం దేశం కదిలింది
గజగజలాడెను సామ్రాజ్యం - మనకు లభించెను స్వరాజ్యం
భలే తాత మన బాపూజీ - బాలల తాతా బాపూజీ

సత్యాహింసలే శాంతి మార్గమని - జగతికి జ్యోతిని చూపించాడు
మానవ ధర్మం బోధించాడు - మహాత్ముడై ఇల వెలిశాడు
భలే తాత మన బాపూజీ - బాలల తాతా బాపూజీ


చిత్రం : దొంగరాముడు (1955)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
రచన : సముద్రాల రాఘవాచార్య
గానం : పి. సుశీల
*********************************************
Movie Name : Donga ramudu (1955)
Music Director : Pendyala Nageshwara rao
Lyricist : Samudrala Raghavacharya
Singer : P.Susheela

Wednesday, December 26, 2012

పలుకరాదటే చిలుకా ఉలుకులేటికే .......... షావుకారు (1950)


పల్లవి :
పలుకరాదటే చిలుకా ఉలుకులేటికే
పలుకరాదటే వలపు చిలుకరాదటే
చిలుకా పలుకురాదటే

చరణం :
మనసులొకటి అయితే మరి మాటతో పనేలా
మనసులొకటి అయితే మరి మాటతో పనేలా
కన్నె బాసలింతేనని ఎదుట నిలచి పలుకరని
కన్నె బాసలింతేనని ఎదుట నిలచి పలుకరని
తెలుసుకొంటినే చిలుకా పలుకువింటినే
నీ పలుకు వింటినే
చిలుకా తెలుసుకొంటినే


చిత్రం : షావుకారు (1950)
సంగీతం : ఘంటసాల వెంకటేశ్వర రావు 
రచన : సీనియర్ సముద్రాల రాఘవాచార్య 
గానం : ఘంటసాల , రావు బాలసరస్వతి దేవి 
**************************************
Movie Name : Shavukaru (1950)
Music Director : Ghantasala Venkateshwara Rao
Lyricist : Samudrala Raghavacharya (senior)
Singers : Ghantasala , Rao Bala Saraswathi Devi

పలుకరాదటే చిలుకా పలుక రాదటే..... షావుకారు (1950)


పలుకరాదటే చిలుకా పలుక రాదటే
సముఖములో రాయబారమెందులకే
పలుకరాదటే....చిలుకా

ఎరుగని వారమటే....మొగమెరుగని వారమటే
పలికిన నేరమటే ....పలుకాడగ నేరవటే
ఇరుగుపొరుగు వారలకు
అరమరికలు తగునటనే పలుకరాదటే

మనసుని తొణికే మమకారాలు
కనులను మెరిసే నయగారాలు
తెలుపరాదటే సూటిగా
తెరలు తీసి పరిపాటిగా పలుకరాదటే

చిలుకా తెలుపవేలనే ....బదులు పలుకవేలనే

వలపు తలపులున్నా
కనుమాటు చాటు లేదా
పల్లెపడుచులీవగలు
కనీ వినీ ఎరుగరనీ చిలుకా తెలుపవేలనే

తళుకులూ బెళుకులూ
పల్లెటూర చూపిస్తే
పకా పకా నగుదురని
తెలుప వేలనే చిలుకా పలుకవేలనే

మనసులొకటి ఐతే ..మరి మాటతో పనేలా
కన్నెబాసలింతేనని ఎదుట నిలిచి పలుకరని
తెలుపవేలనే చిలుకా పలుకవేలనే.

తెలుసుకొంటినే చిలుకా
పలుకు వింటినే – నీ పలుకు వింటినే

చిత్రం : షావుకారు (1950)
సంగీతం : ఘంటసాల వెంకటేశ్వర రావు 
రచన : సీనియర్ సముద్రాల రాఘవాచార్య 
గానం : ఘంటసాల ,
**************************************
Movie Name : Shavukaru (1950)
Music Director : Ghantasala Venkateshwara Rao
Lyricist : Samudrala Raghavacharya (senior)
Singers : Ghantasala ,

Sunday, November 25, 2012

సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము ..... భూకైలాస్ (1958)


సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా
ఆనందలోకాలు చూపింతురా
సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా
ఆనందలోకాలు చూపింతురా

కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమారగ సంతోషమూరగ చెంత చేరరాద
కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమారగ సంతోషమూరగ చెంత చేరరాద
సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా
ఆనందలోకాలు చూపింతురా

యోగము చేదు విరాగము చేదు అనురాగమే మధురం
చాలు సాధన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము
యోగము చేదు విరాగము చేదు అనురాగమే మధురం
చాలు తాపాన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము
అట రంగారు బంగారు మీనాలమై చవులూరించు క్రొందేనె జూఱ్ఱాడుదాం
అట రంగారు బంగారు మీనాలమై చవులూరించు క్రొందేనె జూఱ్ఱాడుదాం
తేలాడుదాం ఓలాడుదాం ముదమార తనిదీర ఈదాడుదాం
ముదమార తనిదీర ఈదాడుదాం
సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా
ఆనందలోకాలు చూపింతురా

సుందరాంగా అందుకోరా … సుందరాంగా అందుకోరా ..
సుందరాంగా అందుకోరా … సుందరాంగా అందుకోరా..
సుందరాంగా అందుకోరా .. సుందరాంగా అందుకోరా
సుందరాంగా … సుందరాంగా … సుందరాంగా …

ఓం నమశ్శివాయ … ఓం నమశ్శివాయ .. ఓం నమశ్శివాయ

చిత్రం : భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్.సుదర్శనం , ఆర్.గోవర్ధనం
రచన : సముద్రాల రాఘవాచార్య
గానం : పి.సుశీల

Friday, November 9, 2012

విరిసే చల్లనీ వెన్నెలా ....మరల ఈనాడు మా కన్నులా... లవకుశ (1963)

పల్లవి : 
విరిసే చల్లనీ వెన్నెలా (2)
మరల ఈనాడు మా కన్నులా
॥

చరణం : 1 
చెన్నుమీర జానకమ్మ
అంకమ్మున వామాంకమ్మున
మా కన్నుదోయి విందుచేసి
మా రాముడు కరుణాధాముడు
॥
మదినెన్నో వింత సంబరాలు 
మీరగా ॥

చరణం : 2 
మరువగరానీ పండుగ నేడు
మా పాలికీ సర్వ జీవాళికి
మా ఊరూనాడూ వెల్లి విరిసే
ఉల్లాసము మధురోల్లాసము
॥
ధర పొంగీపోయీ 
ఆటలాడే హాయిగా ॥

చిత్రం : లవకుశ (1963)
రచన : సముద్రాల సీనియర్ 
సంగీతం : ఘంటసాల
గానం : ఎస్.జానకి, బృందం

అమ్మా అని అరిచినా ఆలకించవేమమ్మా ..... పాండురంగ మహత్యం (1957)


అమ్మా నాన్నా
అమ్మా
అమ్మా అని అరిచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరురోజు ఈ జన్మకు లేదా
అమ్మా అని అరిచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరురోజు ఈ జన్మకు లేదా

పదినెనలు నను మోసి పాలిచ్చి పెంచి
మదిరోయక నాకెన్నో వూడిగాలు చేసినా
ఓ తల్లీ నిను నలుగురిలో నగుబాటు చెసితీ
కలతకమ్మ తనయునీ తప్పులు క్షమియించవమ్మ
అమ్మా అమ్మా
దేహము విజ్ఞానము బ్రహ్మొపదేశమిచ్చి
ఇహపరాలు సాధించే హితమిచ్చె తండ్రివి..
తనుగానని కామమున నినువెడల నడిచితీ.
కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతా నాన్నా
నాన్నా నాన్నా

పారిపోతినమ్మా నాగతి ఎరిగితినమ్మా
నీ మాట దాటనమ్మ
ఒకమారు కనరమ్మా
మాతా పితా పాదసేవే మధవ సేవని మరువనమ్మ
మాతా పితా పాదసేవే మధవ సేవయని మరువనమ్మ
నన్ను మన్నిచగ రారమ్మా అమ్మా అమ్మా
అమ్మా

అమ్మా అని అరిచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరురోజు ఈ జన్మకు లేదా
అమ్మా
అమ్మా అని అరిచినా ఆలకించవేమమ్మా
అమ్మా ఆలకించవేమమ్మా..
అమ్మా

చిత్రం : పాండురంగ మహత్యం (1957)
సంగీతం : టి.వి.రాజు
రచన : సముద్రాల
గానం : ఘంటసాల
*****************************

Movie Name : Panduranga Mahatyam
Music Director : T.V.Raju
Lyricist : Samudrala Raghavacharya
Singer : Ghantasala

Sunday, November 4, 2012

నీలకంధరా దేవా దీనబాంధవా రావా .... భూకైలాస్ (1958)


జయ జయ మహాదేవ శంభో సదాశివా...
ఆశ్రితమందారా శృతిశిఖర సంచారా...

పల్లవి :
నీలకంధరా దేవా దీనబాంధవా రావా నన్నుగావరా ||2||
సత్యసుందరా స్వామీ నిత్యనిర్మలా పాహీ ||2|| ||నీలకంధరా||

చరణం 1
అన్యదైవము గొలువా...
అన్యదైవము గొలువా నీదుపాదము విడువా ||2||
దర్శనమ్మునీరా మంగళాంగ గంగాధరా ||2|| ||నీలకంధరా||

చరణం 2
దేహియన వరములిడు దానగుణసీమా
పాహియన్నను ముక్తినిడు పరంధామా
నీయమమున నీ దివ్యనామ సంస్మరణా
ఏమారక చేయుదును భవతాపహరణా
నీ దయామయ దృష్టి దురితమ్ములార
వరసుధావృష్టి నా వాంఛలీడేరా
కరుణించు పరమేశ దరహాసభాసా
హరహర మహాదేవ కైలాసవాసా...
కైలాసవాసా
ఫాలలోచన నాదు మొరవిని
జాలిని పూనవయా
నాగభూషణ నన్ను కావగ
జాగును సేయకయా ||2||
కన్నులనిండుగ భక్తవత్సల కావగ రావయ్యా ||2||
ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా ||2|| ||ఫాలలోచన||
శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా ||3||

చిత్రం : భూకైలాస్ (1958)
సంగీతం : R.సుదర్శనం , R.గోవర్ధనం
రచన : సముద్రాల
గానం : ఘంటసాల

Tuesday, October 30, 2012

కొనుమిదే కుసుమాంజలి .... శ్రీకృష్ణ తులాభారం (1966)


కొనుమిదే కుసుమాంజలి
అమరులా ప్రణయాంజలీ
రసికా నటలోక సార్వభౌమ నాదలోల విజయగోపాల

కాళీయ ఫణిరాజు పడగలపైనా
కాలియందియలు ఘల్లుమనా
లీలా నాట్యము చేసి చూపినా
తాండవ కృష్ణా జోహార్ జోహార్
నీ మధు మురళీ గానము విన్నా
భామలు మోహము మీరి దీనలై
రారా మదిని వగదీర మరులు నెరవేర
మనసు తనివార కౌగిలి వీర
నెరా దొరా మాపై నెనరు గొనర
మారుకేళి దేలుపు మను మగువల
మహానందమయ మలయోల్లాస గతులా
దివ్య రాస కేళి మహిమ జూపి మురియజేసి
నిదవధి సుఖమొసగిన ఘనశ్యామ
సత్యభామ పరంధామ
కొనుమిదే కుసుమాంజలీ
అమరులా ప్రణయాంజలీ

చిత్రం : శ్రీకృష్ణ తులాభారం (1966)
సంగీతం: పెండ్యాల
రచన : సముద్రాల
గానం : పి.సుశీల

Friday, October 26, 2012

పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా .... సువర్ణ సుందరి (1957)


పల్లవి:
పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా
పలుచన సలుపకురా
పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా
పలుచన సలుపకురా
పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ

చరణం:
మనసున తాళి మరువనులేర
గళమున మోలి సలుపకు రాజా
సమయము కాదురా నిన్ను దరిచేర
సమయము కాదురా నిన్ను దరిచేర
కరుణను నన్నీవేళ మన్నించర రాజా
కరుణను నన్నీవేళ మన్నించర రాజా

పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ

చరణం:
ఏలినవారి కొలువున గాని
మది నీరూపే మెదలినగాని
ఓయన లేనురా కదలగలేర
ఓయన లేనురా కదలగలేర
కరుణను నన్నీవేళ మన్నించర రాజా

పిలువకురా ఆ ఆ ఆ ఆ ఆ


చిత్రం: సువర్ణ సుందరి (1957)
రచన: సముద్రాల సీనియర్
సంగీతం: ఆదినారాయణరావు
గానం: P.సుశీల

ఆ ఆ హాయి హాయిగా ఆమని సాగే ......... సువర్ణ సుందరి (1957)

ఆ ఆ హాయి హాయిగా ఆమని సాగే
హాయి హాయిగా ఆమని సాగే 
సోయగాల గన ఓయి సఖా హాయి సఖా ఆ 
హాయి హాయిగా ఆమని సాగే 
లీలగా పువులు గాలికి వూగా ఆ 
లీలగా పువులు గాలికి వూగా ఆ 
లీలగా పువులు గాలికి వూగా 
సనిదమ దనిసా గమ గమ దనిసా 
రిసనిద సరిసని దనిని దనిని దని 
మగద మగద మద గరిగ మదని 
లీలగా పువులు గాలికి వూగా 
కలిగిన తలపుల వలపులు రేగా 
కలిగిన తలపుల వలపులు రేగా 
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా 
ఆ హాయి హాయిగా ఆమని సాగే 

ఏమో ఏమో తటిల్లతికమే మెరుపు 
ఏమో తటిల్లతికమే మెరుపు మైమరపేమో 
మయిలు రాజు దరి మురిసినదేమో మైమరపేమో 
మయిలు రాజు దరి మురిసినదేమో 
వలపు కౌగిలుల వాలి సోలి 
వలపు కౌగిలుల వాలి సోలి 
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా ఆ 
హాయి హాయిగా ఆమని సాగే 

ఆ ఆ చూడుమా చందమామ... అటు చూడుమా చందమామ
కనుమా వయ్యారి శారదయామిని.. కవ్వించే ప్రేమ చూడుమా చందమామ
వగలా తూలే విరహిణులా..... వగలా తూలే విరహిణులా
మనసున మొహము రేపు నగవులా 
మనసున మొహము రేపు నగవులా
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా
ఆ హాయి హాయిగా ఆమని సాగే 

ఆ..ఆ.ఆ కనుగవా తనియగా ప్రియతమా
కలువలు విరిసెనుగా 
ఆ  కనుగవ తనియగా ప్రియతమా 
కలువలు విరిసెనుగా ఆ ఆ కనుగవ తనియగా
చెలువము కనుగొనా...ఆ..ఆ.చెలువము కనుగొనా 
మనసానంద నాట్యాలు సేయునోయీ ...ఆనంద నాట్యాలు సేయునోయీ
సరిగమదనిసా దనిసా సనిసగరిగ సరిసని
దనిమదనిస నిరినిరి దనిదని మదమద గమగమ గమ
దనిసా గమ దనిసాదనిసా

చిత్రం : సువర్ణ సుందరి (1957)
సంగీతం : ఆది నారాయణ రావు 
రచన : సముద్రాల 
గానం : ఘంటసాల , జిక్కీ 

Thursday, October 25, 2012

సీతారాముల కల్యాణం చూతము రారండి .... సీతారామ కల్యాణం (1961)


పల్లవి:
సీతారాముల కల్యాణం చూతము రారండి
శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి... బొట్టును పెట్టి
మణి బాసికమును నుదుటను పెట్టి... నుదుటను పెట్టి
పారాణి పాదాలకు పెట్టి... ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ అ
పారాణి పాదాలకు పెట్టి
పెళ్ళికూతురై వెలసిన సీతా

సీతారాముల కల్యాణం చూతము రారండి
శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి

చరణం:
సంపెంగి నూనెను కురులను దువ్వి... కురులను దువ్వి
సొంపుగ కస్తూరి నామము తీర్చి... నామము తీర్చి
చెంపగవాచి చుక్కను పెట్టి... ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ అ
చెంపగవాచి చుక్కను పెట్టి
పెళ్ళికొడుకై వెలసిన రాముని

సీతారాముల కల్యాణం చూతము రారండి
శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి

చరణం:
జానకి దోసిట కెంపుల ప్రోవై... కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపురాశై... నీలపురాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా... ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ అ
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఇరువుర మెరిసిన సీతారాముల

సీతారాముల కల్యాణం చూతము రారండి
శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి


చిత్రం : సీతారామ కల్యాణం (1961)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : జి. నరసింహ రావు
గానం : P.సుశీల

జీవము నీవే కదా దేవా ........ భక్త ప్రహ్లాద (1967)


జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా!
నా భారము నీవే కదా!

జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
చంపేదెవరూ సమసెదెవరూ..చంపేదెవరూ సమసేదెవరు..
సర్వము నీవే కదా..స్వామీ..సర్వము నీవే కదా స్వామీ..!!

నిన్నేగానీ పరులనెఱుంగా
రావే వరదా
బ్రోవగ రావే వరదా, వరదా!
అని మొరలిడగా.. కరి విభు గాచిన
అని మొరలిడగా.. కరి విభు గాచిన
స్వామివి నీవుండ భయమేలనయ్యా!

హే ప్రభో! .. హే ప్రభో!
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
కరుణాభరణా.. కమలలోచనా
కరుణాభరణా.. కమలలోచనా
కన్నుల విందువు చేయగా రావే
కన్నుల విందువు చేయగా రావే
ఆశృత భవ బంధ నిర్మూలనా
ఆశృత భవ బంధ నిర్మూలనా!

లక్ష్మీ వల్లభా ....  లక్ష్మీ వల్లభా!

చిత్రం : భక్త ప్రహ్లాద (1967)
సంగీతం : సాలూరి రాజేశ్వర్ రావు
రచన : సముద్రాల (సీనియర్ )
గానం : పి.సుశీల

Saturday, September 29, 2012

మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ........ గృహలక్ష్మి (1967)

మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ
మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ
మేలుకోవయ్య

తెల్లవారెనురా విహగాలి లేచెనురా
తెల్లవారెనురా విహగాలి లేచెనురా
అల్లదే ఉదయాద్రి పైన
అల్లదే ఉదయాద్రి పైన అరుణకాంతి విరిసెరా
మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ మేలుకోవయ్య

చల్ల చిలికే భామల కంకణాల మోతలవిగో
చల్ల చిలికే భామల కంకణాల మోతలవిగో
జుమ్మని నిను లెమ్మని
జుమ్మని నిను లెమ్మని పిలిచేను తేటి తియ్యగా
మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ మేలుకోవయ్య

పసిడి వాకిటిలో విరజాజి మాలలతో
పసిడి వాకిటిలో విరజాజి మాలలతో
దాసకోటి వేచినారు
దాసకోటి వేచినారు నీకు సేవలు చేయగా
మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ మేలుకోవయ్య


చిత్రం : గృహలక్ష్మి (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: సముద్రాల
గానం: భానుమతి

Monday, September 24, 2012

ఈ మూగ చూపేలా బావా.......... గాలి మేడలు (1962)


ఈ మూగ చూపేలా బావా
ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడవదే బొమ్మా నీ దరి నే చేరి మాటాడనా
ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడదే బొమ్మా
రెప్పెయ్యకుండా ఒకే తీరున నువ్వు చూస్తే నాకేదో సిగ్గౌతది
ఓ.. హో.. హో… హో … ఓఓఓఓ
రెప్పెయ్యకుండా ఒకే తీరున నువ్వు చూస్తే నాకేదో సిగ్గౌతది
ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే … ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే
చెయ్యి చేయీ చేరా విడిపోవులే
ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడదే బొమ్మా
చల్లగ నీ చేయి నన్నంటితే చటుకున నా మేను ఝల్లంటది
ఆ.హా.. హా…హా… ఆఆఆఆ
చల్లగ నీ చేయి నన్నంటితే చటుకున నా మేను ఝల్లంటది
నా ముందు నిలుచుండి నువ్వు నవ్వితే ..
నా ముందు నిలుచుండి నువ్వు నవ్వితే
నా మనసే అదోలాగ జిల్లంటదే…
ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడదే బొమ్మా
జాగ్రత్త బావా చెయీ గాజులు ఇవే కన్న చిన్నారి తొలి మోజులూ …
ఓ.. హో.. హో… హో … ఓఓఓఓ
జాగ్రత్త బావా చెయీ గాజులు ఇవే కన్న చిన్నారి తొలి మోజులూ
చాటే నీ ఎలుగెత్తి ఈ గాజులే చాటే నీ ఎలుగెత్తి ఈ గాజులే
ఈ వేళా మరేవేళా మన రోజులే ….
ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడదీ బొమ్మా

చిత్రం : గాలి మేడలు (1962)
సంగీతం : T.G.లింగప్ప
రచన : సముద్రాల
గానం : ఘంటసాల , రేణుక