Showing posts with label S.P.Kodandapani Musical Hits. Show all posts
Showing posts with label S.P.Kodandapani Musical Hits. Show all posts

Sunday, September 1, 2013

పదండి ముందుకు... పదండి తోసుకు.. కదం తొక్కుతూ కదలండి... పదండి ముందుకు (1962)

పల్లవి :
పదండి ముందుకు...
పదండి తోసుకు
కదం తొక్కుతూ కదలండి
స్వరాజ్యమే మన జన్మహక్కనీ
సమస్త జగతికి చాటండి ॥
భారతవీర ప్రజలారా
స్వరాజ్య వాదీ ధరించు ఖాదీ (2)
పరాయి సరుకులు మనకేలా ॥
రాటమున వడకే వారే
పోరాటములోన వడకరులే॥॥

చరణం : 1
అహింసయే మన ఆయుధమూ
సత్యాగ్రహమే సాధనమూ॥
త్రివర్ణ సుందర పతాకము
భారత దాస్య విమోచనము॥
ప్రేమా శాంతీ ధర్మం నిండిన (2)
రామ రాజ్యమే ఆశయమూ (2)॥

చరణం : 2
కల్లు మానండోయ్ బాబయ్యా
కళ్లు తెరచి సాగి రారయ్యా బాబయ్యా
॥మానండోయ్‌॥
కాపురాలను కూల్చురాకాసిరా
కన్నీళ్లు కష్టాలు కొనితెచ్చురా॥
మంచితనమే చంపి...
మమతలే తెగతెంపి
మనల పశువుల చేయు మహామారిరా
॥మానండోయ్‌॥॥

చరణం : 3
తరతరాల దురన్యాయాలకు
గురియై... బలియై...
దారి కనరాని వారీ దరిద్రనారాయణులూ
హరిజనులు
సాటి మనిషిని దూరం చేసే జనులు
మోక్షం కనలేరసలు (2)
సమాజమంతా సమానమైతే
నాడే జాతికి నవజీవనము (2) ॥

చరణం : 4
ఈ భూమి మా భూమిరా
ఇది బంగారు మాగాణిరా
పనులెన్నో వేసి పంట సిరులను దోచి
మాతల్లి నేలకే మమ్ము దూరమ్ము చేయు
దుష్టపరిపాలనకు స్వస్తియీనాడే
పన్నుల నిరాకరణ ప్రారంభమాయె...॥
తెలుగు దేశ వీరులారా...
భరత దేశ పౌరులారా...


చిత్రం : పదండి ముందుకు (1962)
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
రచన : శ్రీశ్రీ
గానం : ఘంటసాల, మాధవపెద్ది సత్యం, ఎ.పి.కోమల
**********************************************
Movie Name : Padandi Mundhuku (1962)
Music Director : S.P.Kodandapani
Lyricist : Sri Sri
Singers : Ghantasala, Madhavapeddhi Sathyam, A.P.Komala

Thursday, December 13, 2012

చిలకా ఓ పంచరంగుల చిలకా .... జాతకరత్న మిడతంభొట్లు (1971)














పల్లవి :
చిలకా ఓ పంచరంగుల చిలకా
మొలకా చిరునవ్వుల బంగరుగిలకా॥
ముద్దుగ నీవు పలుక పులకరించునే నా పిలక
ముద్దుగ నీవు పలుక పులకరించునే నా పిలక
మిడతా ఓ పచ్చని రెక్కల మిడతా
విన్నాలే నగరములో నీ ఘనత॥
వలపుల తాయం పెడితే నీ వలలో నేనే పడతా
వలపుల తాయం పెడితే నీ వలలో నేనే పడతా
చిలకమ్మా... అహ మిడతయ్యా...

చరణం : 1
అయ్యయ్యో ఏమిటిది అమ్మా నాన్నా వస్తారూ
అబ్బబ్బో వాళ్లొకరూ మనపాలిటి దెయ్యాలూ॥
తిట్టకు తిట్టకు మన గుట్టు బయటపెట్టకు
గుట్టు రట్టు చేశావంటే
నాన్నకు వచ్చును కోపం
మన ప్రేమకు తెచ్చును మోసం ॥
మీ అబ్బకు కోపం రానీ
మీ అమ్మకు తాపం కానీ
జేజెమ్మను తీసుకురానీ
పెళ్లి ఔతుంది దిగులేం నీకు
రాత్రి వచ్చింది కల ఒకటి నాకు
చిలకమ్మా... అహ మిడతయ్యా...

చరణం : 2
ఆ లోకంలో బ్రతుకే చాలా కష్టము
ఈ లోకంలో ఏమిచేసినా మన ఇష్టము
॥లోకంలో॥
చిలక మిడతల కళ్యాణం చూతము రారండీ
చిలక మిడతల కళ్యాణం చూతము రారండీ
మల్లెపువ్వులే తలంబ్రాలుగా
పళ్లు ఫలాలు భోజనాలుగా
ముది ఏనుగులే ముత్తైలుగా
నీ కూతురు కులుకుతు ఉన్నది చూడు
చక్కగ దొరికెను అల్లుడుగారూ
కనులకు చెవులకు విందే నేడూ
బాతుల కచ్చేరీ ఉన్నదట
మన కోతుల నాట్యం జరుగునట
మిడతయ్యా... చిలకమ్మా...


చిత్రం : జాతకరత్న మిడతంభొట్లు (1971)
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
రచన : అప్పలాచార్య
గానం : మాధవపెద్ది సత్యం, ఎల్ .ఆర్ .ఈశ్వరి

Monday, November 26, 2012

మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదూ ..... సుఖ దు:ఖాలు (1967)




మేడంటే మేడా కాదు… గూడంటే గూడూ కాదు..
పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది… పొదరిల్లు మాది…

మేడంటే మేడా కాదు… గూడంటే గూడూ కాదు..
పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది… పొదరిల్లు మాది…

నేనైతె ఆకుకొమ్మ… తానైతె వెన్నెలవెల్ల
నేనైతె ఆకుకొమ్మ… తానైతె వెన్నెలవెల్ల
పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది

మేడంటే మేడా కాదు… గూడంటే గూడూ కాదు..
పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది… పొదరిల్లు మాది…
కొవెల్లో వెలిగే దీపం దేవీ మాతల్లి
కొవెల్లో తిరిగే పాటల గువ్వా నాచెల్లి
కొవెల్లో వెలిగే దీపం దేవీ మాతల్లి
కొవెల్లో తిరిగే పాటల గువ్వా నాచెల్లి
గువ్వంటే గువ్వాకాదు… గొరవంక గానీ..
వంకంటే వంకాగాదు… నెలవంక గానీ

మేడంటే మేడా కాదు… గూడంటే గూడూ కాదు..
పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది… పొదరిల్లు మాది…

గోరింకా పెళ్లయిపోతే .. ఏవంకో వెళ్లిపోతే
గోరింకా పెళ్లయిపోతే .. ఏవంకో వెళ్లిపోతే
గూడంతా గుభులయిపోదా… గుండెల్లో దిగులైపోదా..

మేడంటే మేడా కాదు… గూడంటే గూడూ కాదు..
పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది… పొదరిల్లు మాది…


చిత్రం : సుఖ దు:ఖాలు (1967)
సంగీతం : S.P.కోదండపాణి
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
******************************
Movie Name : Sukhadhukhaalu (1967)
Music Director : S.P.Kodandapani
Lyricist : Devulapalli KrishnaSastry
Singer : S.P.Bala subramanyam

Sunday, November 11, 2012

ఓ..చిన్నదాన నన్ను వదలి పోతావటే ........... నేనంటే నేనే (1968)

ఓ చిన్నదానా
ఓ..చిన్నదాన నన్ను వదలి పోతావటే
పక్కనున్నవాడిమీద నీకు దయరాదటే
ఒక్కసారి ఇటుచూడూ..పిల్లా..
మనసువిప్పి మాటాడూ..బుల్లీ..
ఒక్కసారి ఇటుచూడూ..మనసువిప్పి మాటాడూ
నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు...

అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ

నే చూడని జాణ లేదు భూలోకంలో పిల్లా..
నను మెచ్చని రాణి లేదు పై లోకంలో
ఓహోహో....  ఓహోహో

నే చూడని జాణ లేదు భూలోకంలో పిల్లా..
నను మెచ్చని రాణి లేదు పై లోకంలో
కంటికి నచ్చావే చెంతకి వచ్చానే..
నిలవకుండ పరుగుతీస్తే నీవే చింత పడతావే హెహే...
అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ

బెదిరి బెదిరి లేడిలాగా గంతులేయకే..
చేయిబట్టి అడిగినపుడు బిగువు చేయకే..

బెదిరి బెదిరి లేడిలాగా గంతులేయకే..
చేయిబట్టి అడిగినపుడు బిగువు చేయకే..

రంగు చీరలిస్తానే ...

రంగు చీరలిస్తానే ...రవ్వల కమ్మలిస్తానే..
దాగుడుమూతలు వదిలి
కౌగిలి యిమ్మంటానే పిల్లా..
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ 
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ 

నీ నడుము పట్టు హంసలాగా నాట్యం చేస్తా..
నీ కౌగిటిలో గుంగుమ్ము రాగం తీస్తా.. ఒహోహో ఆహాహా

నీ నడుము పట్టు హంసలాగా నాట్యం చేస్తా..
నీ కౌగిటిలో గుంగుమ్ము రాగం తీస్తా..
కారులోన ఎక్కిస్తా.. పాయ్..పాయ్..
జోరు జోరు నడిపేస్తా..

కారులోన ఎక్కిస్తా.. జోరు జోరు నడిపేస్తా..
చెంప చెంప రాసుకుంటూ జల్సాగా గడిపేస్తా..
పిప్పిరి పిప్పిరి పిపిపి


ఓ..చిన్నదాన నన్ను వదలి పోతావటే
పక్కనున్నవాడిమీద నీకు దయరాదటే

ఒక్కసారి ఇటుచూడూ..మనసువిప్పి మాటాడూ
నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు...

అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ


చిత్రం : నేనంటే నేనే (1968)
సంగీతం : కోదండపాణి
రచన : కొసరాజు రాఘవయ్య
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
**********************************
Movie Name : Nenante Nene(1968)
Music Director : S.P.Kodandapani
Lyricist : Kosaraju Raghavayya
Singer : S.P.Bala Subramanyam

Tuesday, October 30, 2012

రఘుకుల తిలకా నీ ఆనతి రచియించితి ...... కథానాయిక మొల్ల (1970)


రఘుకుల తిలకా
నీ ఆనతి రచియించితి రామాయణ సత్కృతి
ఆకృతి వరియించిన పతివి నీవే
అతులిత కైవల్య గతివి నీవే!...

జగమే రామమయం ! మనసే
అగణిత తారక నామ మయం
నీల జలద రమణీయ రూపం
నిగమాంచల మందిర మణిదీపం
సుందర జానకీ వందిత చరణం
సురముని శరణం! భవతాప హరణం

ఆ చిరునవ్వే అమృతపు జల్లు
అఖిల జగములేలు ఆచేతి విల్లు
అతని గానమున అలరారుకావ్యం
అన్ని యుగాలకు నవ్య్యాతి నవ్యం

ఎవని కమల కమనీయ పదము! చూ
పించె అహల్యకు ముక్తి పదము!
ఎవని చంద్రిక మృదుల కరము! అం
దించెను శబరికి దివ్యవరము
ఎవని ఏలుబడి ఇంటికొక్క గుడి నిలిపెనో
ఎవని రాజ్యమే రామరాజ్యమై వెలసెనో!
ఆ రాముడు నా అంతరంగమున నిండగా
అహము మరచి, ఈ యిహము మరచి
జన్మాంతర బంధములెల్ల విడిచి
ఆ మహర్జ్యోతిలో లీనము కానా
ఆ మహా ప్రభునిలో లీనము కానా
ఓ రామా! రఘురామా! కైవల్య రామా!


చిత్రం : కథానాయిక మొల్ల (1970)
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
రచన : సి.నారాయణరెడ్డి
గానం : పి.సుశీల
*********************************************
Movie Name : Kathanayika Molla (1966)
Music Director : S.P.Kodandapani
Lyricist : C Narayana Reddy
Singer : P.Susheela

ఎగిరే పావురమా దిగులెరగని పావురమా ...... జగత్ కిలాడీలు (1969)


ఎగిరే పావురమా దిగులెరగని పావురమా దిగిరావా ఒక్కసారి
ప్రతి రాత్రికి పగలుందని ఎరుగుదువా

మోముపైని ఏ నీడలు ముసరరాదని చంద
మామపైని ఏ మబ్బులు మసలరాదని - ఎరుగుదువా పావురమా
మాకన్నా నీవు నయం మూసే చీకటుల
దారిచేసి పోవాలని ఎదుగుదువా
అటుపచ్చని తోటుందని అటు వెచ్చని గూడుందని

అటూ ఇటూ అడుగడుగున చుక్కదీపముంటుందని
ఎగురుదువా పావురమా
ఒక్క గడియగాని, నీ రెక్క ముడవగూడదనీ
దూరాన ధ్రువతారను చేరే తీరాలని ఎరుగుదువా..

చిత్రం : జగత్ కిలాడీలు (1969)
గానం : పి.సుశీల
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : ఎస్.పి.కోదండపాణి

Tuesday, October 23, 2012

ఒకసారి కలలోకి రావయ్యా ... నా మువ్విళ్ళు కవ్వించి పోవయ్యా ... గోపాలుడు-భూపాలుడు (1967)

ఒకసారి కలలోకి రావయ్యా...
ఒకసారి కలలోకి రావయ్యా
నా మువ్విళ్ళు కవ్వించి పోవయ్యా

ఒకసారి రాగానే ఏమౌనులే
నీ హృదయాన శయనించి ఉంటానులే ఏలుకొంటానులే
ఒకసారి రాగానే ఏమౌనులే
ఓ గొల్ల గోపయ్యా

పగడాల నా మోవి చిగురించెరా
మోము చెమరించెరా మేను పులకించెరా
సొగసు వేణువు చేసి పలికించరా (2)

చెమ్మోవి పై తేనె ఒలికించనా (2)
తనివి కలిగించనా మనసు కరిగించనా
కేరింత లాడించి శోలించనా (2)
ఒకసారి కలలోకి రావయ్యా...ఆ ..ఆ ..

వొంపు సొంపుల మెరుపు మెరిపించవే
వగలు కురిపించవే మేను మరపించవే
మరపులో మధుకీల రగిలించవే (2)

చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా (2)
మొగ్గ తొడిగిందిరా మురిసి విరిసిందిరా
పదును తేరిన వలపు పండించరా (2)


ఒకసారి కలలోకి రావయ్యా
నా మువ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఓ గొల్ల గోపయ్యా...
ఒకసారి రాగానే ఏమౌనులే


చిత్రం : గోపాలుడు-భూపాలుడు (1967)
సంగీతం : S.P.కోదండపాణి
రచన : సి.నారాయణ రెడ్డి (సినారె)
గానం : ఘంటసాల , S.జానకి
*************************************************
Movie Name : Gopaludu Bhupaludu (1967)
Music Director : S.P.Kodandapani
Lyricist : C. Narayana Reddy
Singers : Ghantasala, S.Janaki

Sunday, October 21, 2012

కొండపైన ... వెండివాన.. అది గుండెల్లో కొత్తవలపు కురిపించాలి... ఇంటి దొంగలు (1973)


పల్లవి :
కొండపైన ... వెండివాన..
అది గుండెల్లో కొత్తవలపు కురిపించాలి
ఆ కొత్తవలపు కోరికలను పండించాలి
కొండపైన ... వెండి వానా.. ఆ ఆ..

చరణం 1:
మబ్బులు వస్తూ పోతుంటాయి
నిలిచేదొకటే నీలాకాశం
కలతలు వస్తూ పోతుంటాయి
మిగిలేదొకటే వలచే హృదయం
కన్నీళ్లలో కలకల నవ్వీ
కలహాలలో చెలిమిని పెంచీ
కలలాగా బ్రతుకంతా జీవించాలీ
కొండపైన... వెండి వానా..ఆ ఆ...

చరణం 2:
నిప్పులు చెరిగే వేసవితోనే
తేనెలు కురిసే వానొస్తుందీ
ఆకులు రాల్చే కాలంతోనే
చిగురులు తొడిగే ఘడియొస్తుందీ
అనురాగమే తీయని వరమై
ఆనందమే తరగని సిరియై
కలకాలం కాపురం సాగించాలి

కొండపైన ... వెండివాన
అది గుండెల్లో కొత్తవలపు కురిపించాలి
ఆ కొత్తవలపు కోరికలను పండించాలీ


చిత్రం : ఇంటి దొంగలు (1973)
సంగీతం : కోదండపాణి
రచన : సి. నారాయణ రెడ్డి
గానం: ఎస్.పి.బాలు, సుశీల
*************************************************
Movie Name : Inti Dongalu (1973)
Music Director : S.P.Kodandapani
Lyricist : C. Narayana Reddy
Singers : S.P.Balasubramaniam, P.Susheela

Monday, October 8, 2012

చిరు చిరు చిరు చిరు నవ్వులు ... ఇద్దరు మొనగాళ్ళు (1966)


పల్లవి:
చిరు చిరు చిరు చిరు నవ్వులు
చిరు చిరు చిరు చిరు నవ్వులు
నా చేతికి అందిన పువ్వులు
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హు హూ
తొలి తొలి తొలి తొలి చూపులు
నను కలవర పరిచే చూపులు... విరి చూపులు    

చిరు చిరు చిరు చిరు నవ్వులు
నా చేతికి అందిన పువ్వులు
తొలి తొలి తొలి తొలి చూపులు
నను కలవర పరిచే చూపులు... విరి చూపులు

చరణం 1:
మల్లె తీగ నడిచిందంటే...
నడిచిందంటే..నడిచిందంటే.. నడిచిందంటే
మల్లె తీగ నడిచిందంటే..
కల్ల మాట అనుకున్నాను
నీవు నడిచి పోతూ ఉంటే
నిజమే అనుకున్నాను

చిలిపి మదనుడున్నాడంటే...
ఉన్నాడంటే...ఉన్నాడంటే... ఉన్నాడంటే
చిలిపి మదనుడున్నాడంటే
కలయేమో అనుకున్నాను
నిన్నెదురుగా చూస్తూ ఉంటే
నిజమే అంటున్నాను
ఓ...ఓ..ఓ...ఓ..ఓ...

చిరు చిరు చిరు చిరు నవ్వులు
నా చేతికి అందిన పువ్వులు
ఓహొ ఓహొ ఒహో
తొలి తొలి తొలి తొలి చూపులు
నను కలవర పరిచే చూపులు... విరి చూపులు

చరణం 2:
మేడలోన నీవున్నావు..
నీవున్నావు...నీవున్నావు... నీవున్నావు
మేడలోన నీవున్నావు.. నీడలోన నేనున్నాను
నిండు వలపు నిచ్చెనవేససీ...
నిన్నే కనుకొన్నాను

పలకరించు జాబిలి నీవు
జాబిలి నీవు...జాబిలి నీవు... జాబిలి నీవు
పలకరించు జాబిలి నీవు...పరవశించు కలువను నేననూ
నిన్నే కనుకొన్నాను
ఓ...ఓ...ఓ...ఓ..

చిరు చిరు చిరు చిరు నవ్వులు
నా చేతికి అందిన పువ్వులు
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హు హూ
తొలి తొలి తొలి చూపులు
నను కలవరపచే చూపులు..విరి చూపులు

చిరు చిరు చిరు చిరు నవ్వులూ....


చిత్రం : ఇద్దరు మొనగాళ్ళు (1966)
సంగీతం : కోదండపాణి
రచన : సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల