Showing posts with label Junior Samudraala-Lyrics. Show all posts
Showing posts with label Junior Samudraala-Lyrics. Show all posts

Sunday, December 16, 2012

హే సురేశా! సుఖజీవన దాత .......... ఋష్య శృంగ (1961)

హే సురేశా! సుఖజీవన దాత!
పయోధర వాహనా! పర్జన్యా
నభోలోనాయకా ప్రభో వీరదాయకా
కావరా! మొరాలకించరా
ఘోడు ఘోడు ఘోషించె ప్రజల
గొంతు మీకు వినిపించలేదా
హాహాకారాలాల్లాడే ప్రజలా ఆర్తిమీకు కనుపించలేదా
ఓ ఋతుపవనా నీల జలదమా
కనికరాన ఈధర చరించరే జలాలనించరే
||నభో||

బీటలు వారిన హృదయాల
ఆరాటాలు ఆలించవేల
కన్నీటి జాలే ప్రవహించునేల
పన్నీటి జల్లై వర్షింపనేల
ఓ వరుణా దేవతా వర్షదేవతా
కనికరాన ఈధరా చరించవా జలాలనించవా
||నభో||

దళం ధళస్మనోనోజ్ఞ చంచలా ప్రకాశమా
ఫెళఫెళా గర్జించు ఘనాఘన నిర్ఘోషమా
ఘులఘుల ఘులగలగల గల ఘల్లున వర్షించరే
ఈ ఇలతనియించగ తరియించగ వర్షించరే


చిత్రం : ఋష్య శృంగ (1961)
సంగీతం : టి.వి.రాజు
రచన : సముద్రాల (జూనియర్ )
గానం : ఘంటసాల
**************************
Movie Name : Rushya Srunga (1961)
Music Director : T.V.Raju
Lyricist : Samudrala (Junior)
Singer : Ghantasala