Showing posts with label Hero Special- Naresh songs. Show all posts
Showing posts with label Hero Special- Naresh songs. Show all posts

Tuesday, October 29, 2013

అచ్చులు పదహారు నా వయసల్లే నా కళలల్లే .... హై హై నాయకా (1989)

 ఆ చూపేంటి వద్దు ఆ చూపొద్దు
నేనలాంటి వాణ్ణి కాను
చెప్పు తెలుగు భాషకు అచ్చులెన్ని హల్లులెన్ని

అచ్చులు పదహారు నా వయసల్లే నా కళలల్లే
హల్లులు ముఫ్ఫైరెండు నా కొలతల్లే లోని తహతహలల్లే

హలో.. హల్లులు ముఫ్ఫైరెండు కాదమ్మా
పాట కోసం నీ నోటికొచ్చిన అంకె చెపితే కుదరదు
ఐదు వర్గాలు య ర ల వ శ స హ లు కలిపితే హల్లులు ముఫ్ఫైఆరు
హల్లులు ముఫ్ఫైఆరు అంతే

అచ్చులు పదహారు నా వయసల్లే నా కళలల్లే
హల్లులు ముఫ్ఫైరెండు నా కొలతల్లే లోని తహతహలల్లే

ఇగో ఆగు ఆగు కొంచెం తమాయించుకో
ఈ కుప్పిగంతులు కప్పగెంతులు తర్వాత ముందు ఈ ప్రశ్నకు సమధానం చెప్పు తల్లీ
సంధులు ఎప్పుడు ఏర్పడతాయి

నీవు నాకు ఎదురైతే నేను నీ పక్కకు వస్తే
చస్తే...
నీవు నాకు ఎదురైతే నేను నీ పక్కకు వస్తే నాకేమో గుణసంధి నీకేమో వృద్ధిసంధి మధ్యనెవరూ లేకపోతే
సంయోగసంధి ఇద్దరమూ ఒకటైతే సవర్ణదీర్ఘసంధి
అచ్చులు పదహారు నా వయసల్లే నా కళలల్లే
హల్లులు ముఫ్ఫైరెండు నా కొలతల్లే లోని తహతహలల్లే

అమ్మా మతాలంగేష్కర్ ఇక పాటలు ఆటలు ఆపేయ్
తల్లీ..ఇప్పుడు నక్ష్త్రాల గురించి చెప్పుకుందాం
ఏం చక్కగా చెప్పు చూచేచోళా అశ్వని

నువు చూచేలోగా చచ్చును ఈ తరుణి
ఈ లోపల నేను బతికి చస్తే
నువు చూచేలోగా చచ్చును ఈ తరుణి ఆశ్లేష నక్ష్త్రం లో నఖక్షతం కావాలి
ఉత్ప్రేక్షాలంకారం లో ఊహలలో చేరాలి
ఆ తొమ్మిది రాశులలో నాకిష్టం మిథునరాశి
అచ్చులు పదహారు నా వయసల్లే నా కళలల్లే
హల్లులు ముఫ్ఫైరెండు నా కొలతల్లే లోని తహతహలల్లే


చిత్రం :  హై హై నాయకా (1989)
సంగీతం :  సురేష్ చంద్ర
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
*********************************************
Movie Name :  Hai Hai Nayaka (1989)
Music Director : Suresh Chandra
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : S.P.Balasubramanyam, S.Janaki

ఇది సరిగమలెరుగని రాగం ఇది భాషేలేని భావము ..... హై హై నాయకా (1989)

ఇది సరిగమలెరుగని రాగం
ఇది భాషేలేని భావము
ప్రేమగానమో.....

ఇది ఇది అని తెలియని భారము
ఇది పలికే భాషే మౌనము
ప్రేమగానమో.....                  
 ||ఇది సరిగమలెరుగని రాగం||

మణిలాగ రమణిలాగ
సుధచిందె వసుధమందె
అరవిరిసే ఆశల ఆమని

నువు రాగా తనువు ఊగా
లతలోని కలతతీరా
జతచేరా రారా జాబిలి
కల హంసలా......విరిధనువులా రావే వధువులా      ||ఇది ఇది||

గిలిగింత రగిలినంత రసగీతి సరసగీతి
రవళించగా రా రా మురళిలా

వనరాణీ కవనవాణీ కలవాలి కలలకేళీ
తెలివెన్నెల విరిసే వేళలో
నిను చేరగా....సరి సమయమే రాని శుభమని        
 ||ఇది సరిగమలెరుగని రాగం||


చిత్రం :  హై హై నాయకా (1989)
సంగీతం :  సురేష్ చంద్ర
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
*********************************************
Movie Name :  Hai Hai Nayaka (1989)
Music Director : Suresh Chandra
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : S.P.Balasubramanyam, S.Janaki

ముద్దొచ్చే పాప ముంచావే కొంప.. చంపావే ఆ చూపుతో.... హై హై నాయకా (1989)

ముద్దొచ్చే పాప ముంచావే కొంప
చంపావే ఆ చూపుతో
ముద్దొచ్చే పాప ముంచావే కొంప
చంపావే ఆ చూపుతో
వేయిస్తే నీకు ఆ మూడుముళ్ళు
గీకిస్తానేమో ఓ వెయ్యి గుళ్ళు
జన్మంతా నీ సంకీర్తన చేస్తా చేస్తూ చస్తా       ||ముద్దొచ్చే పాప||

నా గుండె కోశావే పిల్లా చేశావే నా మెదడు డొల్ల
నీ నడుము సంజీవి పుల్ల పెనవేసి బతికించవే మళ్ళ
రానంటూ మొరాయించకే నా చిట్టీ మొరాలించవే
ఊరించి దగా చేయకే ఊపూపి ఉడాయించకే
బెజవాల్లో వడగాలల్లే రావే
గూబదిరే ముద్దులు నాకు ఈవే ప్రాణం పోయవే          ||ముద్దొచ్చే పాప||

హే కనుసైగ చేసావు చాలే
తలకిందై శిలువెక్కుతానే
ముళ్ళల్లో రాళ్ళల్లో నేనే పరుగెడతా మోకాల్లపైనే
నీ గాలి మహామారిలా అంటిందే నషాళానికే
ప్రేమలోన ఘనాపాఠినై చేరానే పరాకాష్ఠకే
పిచ్చెక్కే యోగం తీసుకురాకే...
పోటీలో పీటీ ఉషలాగ రావే రాధారాణీ           ||ముద్దొచ్చే పాప||


చిత్రం :  హై హై నాయకా (1989)
సంగీతం :  సురేష్ చంద్ర
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
*********************************************
Movie Name :  Hai Hai Nayaka (1989)
Music Director : Suresh Chandra
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : S.P.Balasubramanyam

Thursday, October 24, 2013

మధుమాసం కుహుగానం.....ఇది రాయని ఇతిహాసమే..... మనసు మమత (1990)

మధుమాసం కుహుగానం
మధుమాసం కుహుగానం
ఇది రాయని ఇతిహాసమే
విధిరాతతో పరిహాసమే
మన జీవన లీలలో ఊయల
మధుమాసం కుహుగానం

ఆ.. చిలక జతలే కలా ఇలా కవ్వించగా
నీ.. కిలకిలలిలా ఎద ఎద స్పందించగా
కథ కాని జీవితాలే కనిపించే రూపము
శిథిలాలలోన నేడు కనిపించే దీపము
మదిలోని జ్వాల జ్యోతులైన వేళ
మధుమాసం కుహుగానం

నా.. వలపు జతిలో శృతి లయ పసిపాపలు
ఈ.. సుఖ ఋతువులో ఇవే కదా సుమమాలలు
ఇది చూపువెంట వెలిగే ఒక కరుణానందము
ప్రతిపూట చేయు పనిలో ఒక ధర్మావేశము
ఋణ పాశమేదో బంధమైన వేళ

మధుమసం కుహుగానం
ఇది రాయని ఇతిహాసమే
విధిరాతతో పరిహాసమే
మన జీవన లీలలో ఊయల
మధుమాసం కుహుగానం
లలలాల... లలలాల...


చిత్రం : మనసు మమత (1990)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
 రచన :
 గానం :
*****************************************
Madhumasam kuhuganam
Madhumasam kuhuganam
Idi raayani ithihasame
Vidhirathatho parihasame
Mana jeevana leelalo ooyala
Madhumasam kuhuganam

Aa.. Chilaka jathale kalaa ilaa kavvinchagaa
Nee... Kilakilalilaa yeda yeda spandinchagaa
Katha kaani jeevithale kanipinche roopamu
Sithilaalalona nedu kanipinche deepamu
Madiloni jwala jyothulaina vela
Madhumasam kuhuganam

Naa... Valapu jathilo sruthi laya pasipaapalu
Ee.. Sukha ruthuvulo ive kada sumamaalalu
Idi choopu venta velige oka karunaanandamu
Prathi poota cheyu panilo oka dharmavesamu
Runa paasamedo bandhamaina vela

Madhumasam kuhuganam
Idi raayani ithihasame
Vidhirathatho parihasame
Mana jeevana leelalo ooyala
Madhumasam kuhuganam
Lalalaala... Lalalaala...


Movie Name : Manasu Mamatha (1990)
Music Director : M.M.Keeravani
Lyricist :
Singers : 

ఈ కోపం చాలించు immediately ...... మనసు మమత (1990)

ఈ కోపం చాలించు immediately
కసి కోరిక మన్నించు conveniently
ఈ కోపం చాలించు immediately
కసి కోరిక మన్నించు conveniently
నే పంపిన ఆ తంతి ప్రేమల్లో పూబంతి
ప్రతి దానికి కథ ఉంది గుండెల్లో సెగ ఉంది
excuse me శాంతి శాంతి immediately.. immediately...
ఈ కోపం చాలించు immediately
కసి కోరిక మన్నించు conveniently

నీతోపాటే హాయ్ నా మతి పోయిందమ్మా శ్రీమతి
చెప్పాలంటే నా గతి చాలా ఉంది సంగతి
మా ఇల్లొక శూన్యాకాశం నువ్వే సిరిజాబిల్లి
నా జన్మొక వేసవి గీతం కానియ్యకు ఓ తల్లీ
ఇల్లాలుగా ఇల్లేలాలి immediately.. immediately...
ఈ కోపం చాలించు immediately ఏయ్..
కసి కోరిక మన్నించు conveniently

హేమంతాల సందెలే సీమంతాలే చేయగా
తొలి మాసాల ఆశలే మధుమాసంలో పూయగా
ఏ వరములు కురిపిస్తావే వరలక్ష్మివి నీవేగా
నా కథ ఎటు నడిపిస్తావో గృహలక్ష్మివి కాలేవా
ఈ దాసుని దయ చూడాలి immediately.. immediately...

ఈ కోపం చాలించు immediately
కసి కోరిక మన్నించు conveniently
నే పంపిన ఆ తంతి ప్రేమల్లో పూబంతి
ప్రతి దానికి కథ ఉంది గుండెల్లో సెగ ఉంది
excuse me శాంతి శాంతి immediately.. immediately...
ఈ కోపం చాలించు..
కసి కోరిక మన్నించు..


చిత్రం : మనసు మమత (1990)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
 రచన :
 గానం :
*****************************************
Ee kopam chalinchu immediately
Kasi korika manninchu conveniently
Ee kopam chalinchu immediately
Kasi korika manninchu conveniently
Ne pampina aa thanthi premallo poobanthi
Prathi daaniki katha undi gundello sega undi
Excuse me santhi santhi immediately... Immediately...
Ee kopam chalinchu immediately
Kasi korika manninchu conveniently

Neetho paate hai naa mathi poyindamma sreemathi
Cheppalante naa gathi chala undi sangathi
Maa illoka sunyakaasam nuvve sirijabilli
Naa janmoka vesavi geetham kaaniyyaku o thalli
Illaligaa illelaali immediately.. Immediately...
Ee kopam chalinchu immediately
Kasi korika manninchu conveniently

Hemanthala sandele seemanthaale cheyagaa
Tholi maasaala aasale madhumaasamlo pooyagaa
Ye varamulu kuripisthave varalakshmivi neevegaa
Naa katha yetu nadipisthavo gruhalakshmivi kaaleva
Ee daasuni daya choodali immediately.. Immediately...

Ee kopam chalinchu immediately
Kasi korika manninchu conveniently
Ne pampina aa thanthi premallo poobanthi
Prathi daaniki katha undi gundello sega undi
Excuse me santhi santhi immediately... Immediately...
Ee kopam chalinchu...
Kasi korika manninchu...


Movie Name : Manasu Mamatha (1990) 
Music Director : M.M.Keeravani
Lyricist : 
Singers :