Showing posts with label Madhava Peddhi Suresh Musical Hits. Show all posts
Showing posts with label Madhava Peddhi Suresh Musical Hits. Show all posts

Wednesday, October 30, 2013

అదోలా ఉన్నారేమండి అప్పుడే వెళతారేంటండి ...... ఆవిడే శ్యామల (2000)

ఏవండోయ్....
అదోలా ఉన్నారేమండి అప్పుడే వెళతారేంటండి
అసలు మీరొచ్చిందెపుడండి కాసేపు ఇంట్లో ఉండండి
తిన్నదెప్పుడు పడుకుందెప్పుడు ముచ్చటగా మాట్లాడెదెపుడు
మనసువిప్పి మాట్లాడండి హాయిగ మాతో గడపండి
వానొచ్చేలా ఉందండి...వానొచ్చేలా ఉందండి
మీరుంటే బాగుంటుందండి  ||అదోలా||

చక్కని దొరలా ఉండేవారు చిక్కిపోయారు
చిలిపితనాలు చిరుచిరునవ్వులు మరచిపోయారు
పండగపూట ఇంట్లో గడపక ప్రయాణమైపోతారు
పనులమీద పడి శ్రీమతి మీదే శీతకన్ను వేశారు
సందడి పెరిగే వయసండి బాధ్యత మీకూ ఉందండి
డబ్బుతో అన్నీ రావండి హాయిగ ఇంట్లో గడపండి
వెళ్ళకండి అటు చూడండి పిల్లి ఎదురు వస్తూందండి    ||అదోలా||

అన్నీ తెలిసి మళ్ళీ ఇంకా ఎందుకు చేస్తారండి
గుడికో సినిమాకో కలిసెళ్ళి ఎన్నాళ్ళయ్యిందో
భర్తే ఇంటికి బంధువులాగ వస్తున్నట్టుందండి
ఇట్టా అయితే ఇరుగూ పొరుగు ఏమనుకుంటారండి
కాపురం కలలా ఉందండి కారణం మీకే తెలుసండి
మనసుతో ఆలోచించండి అసలు ఏ కోపం వద్దండి
అర్థాంగిగా చెప్పానండి అర్థాంగిగా చెప్పానండి
నన్ను అర్థం చేసుకోండి                                ||అదోలా||


చిత్రం : - ఆవిడే శ్యామల (2000)
సంగీతం :  మాధవపెద్ది సురేష్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : నిత్యసంతోషిణి
*********************************************
Movie Name :  Aavide Shyamala (2000)
Music Director : Madhavapeddi Suresh
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : Nityasanthoshini

Friday, November 30, 2012

హే అందమా ఏయ్ పంతమా ఓ వేగమా ఆగవమ్మా .... అటు అమెరికా ఇటు ఇండియా (2001)

పల్లవి : 
హే అందమా ఏయ్ పంతమా
ఓ వేగమా ఆగవమ్మా || 3 ||
అవకాసం ఉందీనాడు - వదిలేస్తే మళ్ళీ రాదు
సరదాగా రావెందుకు
|| హే అందమా ||

చరణం : 1
ఏం చేసినా అడిగేదెవ్వరు
ఏమి చెప్పుకున్నా వినలేరెవ్వరూ
క్రీస్తు పూర్వమేమీ కాదే ఈ క్షణం
ఫాస్టు లైఫ్ లోనే ఉన్నాంగా మనం
టు బి ఆర్ నాట్ టు బి అంటూ
అడుగడుగు ఆలోచిస్తూ ఉంటే
ఔటాఫ్ డేటైపోతావే ఔటర్లో నిలబడతావే అంతే
కులాసా వలేసి వయస్సులాగుతోంది పరుగెడుతూ
|| హే అందమా ||

చరణం : 2
లవ్ మీ లవ్ మీ లవ్ మీ మైడియర్
గివ్ మీ గివ్ మీ గివ్ మీ గివ్ మీ న్యూప్లెజర్

నీకు ఆశ ఉంది అలా ఒప్పుకో
లోని ఊసులన్నీ నాతో చెప్పుకో
లెట్ మీ డూ సంథింగ్ థ్రిల్లింగ్
యూ టూ జాయన్ మీ లవ్లీ బేబీ
ఎవరేమనుకున్నా గానీ మనలోకం మనదనుకుంటే హ్యాపీ

never feel so much shy, take a chance,
Come! let us freak out ‘n dance
|| హే అందమా ||


చిత్రం : అటు అమెరికా ఇటు ఇండియా (2001)
సంగీతం : మాధవపెద్ధి సురేష్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, కల్పన
**************************************************
Movie Name : Atu America Itu India (2001)
Music Director : Madhavapeddi Suresh
Lyricist : Sirivennela Sitarama Sastry
Singers : S.P.Balasubramanyam, Kalapana

నా గుండెలో నీ సంతకం తడిదేరుతున్నకన్నుల్లో .... అటు అమెరికా ఇటు ఇండియా (2001)

నా గుండెలో నీ సంతకం
తడిదేరుతున్నకన్నుల్లో
ఆషాడ మేఘమై మెరిసింది
కన్నీళ్ళకే నవ్వు నేర్పింది || 2 ||

చేయి జారుతున్న నీ జ్ఞాపకం
పిండారబోసిన వెన్నెల్లో
గోదారి తరగలా వచ్చింది
చిరునవ్వుకే దిగులు నేర్పింది


చిత్రం : అటు అమెరికా ఇటు ఇండియా (2001)
సంగీతం : మాధవపెద్ధి సురేష్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : వినోద్ బాబు 
**************************************************
Movie Name : Atu America Itu India (2001)
Music Director : Madhavapeddi Suresh
Lyricist : Sirivennela Sitarama Sastry
Singer : Vinod Babu

చల్లని శాంతుల దరహాసం శాశ్వత విలువల స్థిరవాసం .... అటు అమెరికా ఇటు ఇండియా (2001)

పల్లవి : 
చల్లని శాంతుల దరహాసం శాశ్వత విలువల స్థిరవాసం
మంచీ మమతల మధుకోశం యుగాలు చదివిన ఇతిహాసం
అది నా భారతదేశం - అది నా హృదయనివాసం
అది నా ఆశల విలాసం - నా ఆశయాలకది వికాసం
చెప్పకు చెప్పకు గొప్ప నువ్వొక నూతిలో కప్ప
|కోరస్| ||చెప్పకు చెప్పకు||

అప్పులు తప్ప చిప్పలు తప్ప ఇండియాలో ఏమున్నదిరబ్బా
ఎల్లలు దాటితే చిల్లుకానికి చెల్లని రూపాయి
గ్లోబును మొత్తం కొనగల డాలరు ముందా బడాయి

చరణం : 1
మట్టిలోన పారాడే తత్వం మానేయబ్బాయి
స్టేట్స్ దాకా పెరిగే స్టేటస్సేం తక్కువ కాదోయి

కోరస్:
ఇక్కడకొచ్చేయ్ ఇక్కడే సెటిలైపోవోయి || 2 ||

కష్టాలు కన్నీళ్ళూ కూడు గూడు లేనివాళ్ళు
ఇరుకుతనం పిరికితం మురికితనం వదలని వాళ్ళు
ఇదే కదా న్యూ ఇండియా ఇంతకుమించేముందయ్యా
|కోరస్| || ఇదే ||
అరచేతిలో వైకుంఠం అంటే అమెరికాని చూడండయ్యా
కోరస్:
ఈ అమెరికాను చూడండయ్యా

చరణం : 2
కష్టాలొస్తే కలిసిపంచుకొను ఆత్మీయతలున్నాయి అక్కడ
కన్నీళ్ళొస్తే అవి తనకిమ్మని అడిగే ఎదలున్నాయి అక్కడ
సుఖాలు మాత్రమే చుట్టాలనుకొను సంపదలున్నాయి ఇక్కడ
అంతేనయ్యా తేడా ఎంతోనయ్యా
|కోరస్| || అంతే ||

పిట్టలుకూడా వలస వెళ్ళవా వసతి చాలకుంటే
పిట్టలతో సరిపోల్చుకోడమా మనిషి తెలివి అంటే
మెదడుండే ప్రతివారు ఇంకా ఎదగాలని చూస్తారు
మెదడు పెరిగి మనసు తగ్గిస్తే యంత్రాలైపోతారు
భగవద్గీతలు భాగవతాలు చాలోయ్ బాబూజీ

కోరస్ : ఇది కంప్యూటర్ ఏజి
తాతలు తాగిన నేతుల వాసన చూపుతూ ఎందుకు పేచీ
కోరస్ :  ఇది ఇంటర్నెట్ స్టేజి

చరణం : 3
ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే సంపాదించే అవకాశం
కావలన్న అందరికి అందదు ఈ అదృష్టం
ఇక్కడకొచ్చేయి ఇక్కడే సెటిలైపోవోయి
|కోరస్| || ఇక్కడ ||

అనుబంధాలు అనురాగాలే అదృష్టంగా భావిద్దాం
ఎండమావులనే వెంటాడే ఈ అవివేకాన్నే వదిలేద్దాం
ఎక్కడవున్న మనిషిగా నిలిపే మనసు పెంచుకుందాం
ఎవరికివారే యమునా తీరే తెలివి మరిచిపోదాం
దేశాలు జాతులనే ఈ ఎల్లలు చెరిపేద్దాం
సంపదకన్నా శాంతి మిన్నా అని నమ్మినదేగా మానవత
నమ్మినదేగా మానవత


చిత్రం : అటు అమెరికా ఇటు ఇండియా (2001)
సంగీతం : మాధవపెద్ధి సురేష్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, మురళీధర్ , శైలజ 
**************************************************
Movie Name : Atu America Itu India (2001)
Music Director : Madhavapeddi Suresh
Lyricist : Sirivennela Sitarama Sastry
Singers : S.P.Balasubramanyam, Muralidhar, Sailaja

వెల్ కం ఇండియా కుమారి వొణుకుడు దేనికే వయారి ..... అటు అమెరికా ఇటు ఇండియా (2001)

పల్లవి : 
వెల్ కం ఇండియా కుమారి వొణుకుడు దేనికే వయారి
వేషం మార్చుకోవె పోరి - ఫ్యాషన్ నేర్చుకోవె ప్యారి
వెస్ట్రన్ స్తైలులో న్యూ స్మైలులో దొరసాని లాగమారి

అరెరె ఆగు ఒక్కసారి పరుగులు తీయలేను సారీ
అసలే కొత్తగుంది దారి పడతానేమో కాలుజారి
మనుషుల లోకమో మాలోకమో ఈ మాయదారి మజిలీ
|| వెల్ కం ||

చరణం : 1
కార్లో శృంగారం అదేమంత నేరం
బేజారవుతావేం అది ఈ ఊళ్ళో ఆచారం
ఏంటి వ్యవహారం మరీ ఇంత ఘోరం
బాగుందంటావేం నడివీధుల్లో వికారం
Be a Roman when you are in Rome
అయ్యో రామా ఇదేం సంబరం
నలుగుర్లాగే ఉండాలే మనం
నడిచే దెట్టా నీతో కాపురం
ఎట్టాగో అట్టా అడ్జస్టు అయిపోవే భామా
|| వెల్ కం ||

చరణం : 2
వస్త్రాలేం కరువా అవేమంత బరువా
చెడ్డీలే కట్టి చెడ తిరిగాడే అది పరువా
చాదస్తం మగువా ప్రతీ చోట తగువా
పరేషాను మాని ఆరే! పరవాలేదనుకోవా
ఊరంతా చూడాలి అందుకా - ఒళ్ళంతా వదిలేయమందువా
MTV FTV చూడవా బ్యూటి పోటీ మాటలెరగవా
అట్టాగ నన్నుండ మంటావా ఏంటయ్య మామా
|| వెల్ కం ||


చిత్రం : అటు అమెరికా ఇటు ఇండియా (2001)
సంగీతం : మాధవపెద్ధి సురేష్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, స్వర్ణలత 
**************************************************
Movie Name : Atu America Itu India (2001)
Music Director : Madhavapeddi Suresh
Lyricist : Sirivennela Sitarama Sastry
Singer : S.P.Balasubramanyam, Swarnalatha

నువ్వెవరైనా నేనెవరైనా నీ నా గుండెల సడి ఒకటే ...... అటు అమెరికా ఇటు ఇండియా (2001)


నువ్వెవరైనా నేనెవరైనా నీ నా గుండెల సడి ఒకటే
నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే
ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే
అలలన్నిటికీ కడలొకటే నదులన్నిటికీ నీరొకటే

మనసు తడిస్తే నీ నా చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటే
ఏ దేశం వారికి ఐనా ఇల ఒకటే గగనం ఒకటే
ఏ భాషను పలికిస్తున్నా గొంతులొ స్వర తంత్రులు ఒకటే
ఆహారం  వేరే ఐనా అందరి ఆకలి ఒకటే

ఆకారం వేరే ఐనా ఆధారం బ్రతుకొకటే

నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే
ఎన్నో రంగుల తెల్ల కిరణమై వెలుగుతున్న జీవితమొకటే
ఏ రూపం చూపెడుతున్నా ఉలి కదలికలకు శిల ఒకటే
ఏ రాగం వినిపిస్తున్నా పిల్లన గ్రోవికి గాలొకటే
నీ నాట్యం పేరేదైనా పాదాలకు కదలిక ఒకటే
ఏ ప్రాంతంలో నువ్వున్నా ప్రాణాలకు విలువొకటే
నీకు నాకు అందరికి పుట్టుకతో చుట్టరికం ఒకటే
నువ్వు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే


చిత్రం : అటు అమెరికా ఇటు ఇండియా (2001)
సంగీతం : మాధవపెద్ధి సురేష్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
**************************************************
Movie Name : Atu America Itu India (2001)
Music Director : Madhavapeddi Suresh
Lyricist : Sirivennela Sitarama Sastry
Singer : S.P.Balasubramanyam

వినిపించనీ తరుణీ నీ చరితని ........ అటు అమెరికా ఇటు ఇండియా (2001)

పల్లవి :
వినిపించనీ తరుణీ నీ చరితని
వివరించనీ రమణీ నీ ఘనతని
ప్రకృతిగ భావించి పడతిని పూజించు
సంస్కృతి మనదేనని
|| వినిపించనీ ||

చరణం :
మంచికి మాగాణి మమతల మారాణి
భరతావని భామిని ఇలపై సౌదామిని
కుంకుమ నీరెండ కురులలో పూదండ
కళలొలికే భూమిని ప్రతి ఋతువు ఆమని
మగువను మన్నించి మనసున కొలువుంచు
పురుషుడె మనిషంటూ జగతికి చాటించి
మురిసిన చరితని తలుచుకొని
|| వినిపించనీ ||

చరణం :
అమ్మ అనడమే అన్ని విద్యలకూ ఆది బిందువంది
పుట్టుకకే పురుడోసిన పృధివిని స్త్రీతో పోల్చింది
ఇల్లాలిని నట్టింటి లక్ష్మిగా కళ్ళకద్దుకుంది
ఇంటి కంటితడి కారు చిచ్చులా కాల్చుతుంది అంది
ఇలాంటి ధర్మం ఈ జగాన ఇంకెక్కడ ఉంటుంది

చరణం :
శృంగార రంగాన అంగన సౌందర్యలహరి
చందన శీతల మందహాస చంద్రికలలాసనగరి
కారుణ్యామృతవారి సుకుమారి
సమరాంగణాన యమపురికి దారి చూపించు వీరనారి
సహన శీలమున శాంత శీలమై నిలిచే చిన్నారి
మహిష మర్దినిగ భయద భీభత్స జ్వాలా కీలగ మారి
భద్రకాళిగా రౌద్రకేళిగా రుధిర నదులుగ పారి
పరమాద్భుతమనిపించదా మరి
నవరసాకృతుల కలికి విలాసం దర్శించిన భారతదేశం
మనవ జాతికి సందేశం తరతరాలకు ఆదర్శం


చిత్రం : అటు అమెరికా ఇటు ఇండియా (2001)
సంగీతం : మాధవపెద్ధి సురేష్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం & బృందం 
**************************************************
Movie Name : Atu America Itu India (2001)
Music Director : Madhavapeddi Suresh
Lyricist : Sirivennela Sitarama Sastry
Singers : S.P.Balasubramanyam & Chorus

Saturday, November 3, 2012

ఏమిటో ఇది..సరికొత్తగున్నదీ ....... నీ సుఖమే నే కోరుతున్నా (2008)


ఏమిటో ఇది..సరికొత్తగున్నదీ
నిన్నా అటు మొన్నా కనరానిదీ
నేడే తొలిసారే తెలిసిందిదీ

ఎందుకో మరి..తడబాటుగున్నదీ
ప్రేమో మరి ఏమో అనలేనిదీ
ప్రియమై పరిచయమై కలిసిందిదీ

నిదురే రాదులే..కుదురే లేదులే..ఎదలో ఏదో పులకింతా
హో తలపుల వాకిలీ..తలుపులు తీసినా..తీయని వింతా గిలిగింతా

సగమే నేనన్నా మాటే వినిపించీ..
జగమే ఈ నాడూ కొత్తగ కనిపించే..

ఏమి చూసినా..నేనేమి చూసినా
నాతో ఒకరున్నారు అన్న భావనా !

ఏమిటో ఇది..ఆ
సరికొత్తగున్నదీ..ఆ
నిన్నా అటు మొన్నా కనరానిదీ
నేడే తొలిసారే తెలిసిందిదీ

కొమ్మా పాతదే..కోయిల పాతదే
వినిపించేనే నవరాగం !
ఆ ఆ.. కమ్మని ఊహలే కలకలమన్నవీ
అనిపించేదే అనురాగం !

కంటికి కనరాకా ఎవరో పిలిచారూ
ఒంటరి నా మదిలో ఎవరో నిలిచారూ

నేడు తోచెనే నా నీడ రెండుగా..
జాడే కనరాకెవరో తోడు ఉండగా !

ఏమిటో ఇది..వూహూ
సరికొత్తగున్నదీ..ఆ హా
నిన్నా అటు మొన్నా కనరానిదీ
నేడే తొలిసారే తెలిసిందిదీ

ఎందుకో మరి..తడబాటుగున్నదీ
ప్రేమో మరి ఏమో అనలేనిదీ
ప్రియమై పరిచయమై కలిసిందిదీ


చిత్రం : నీ సుఖమే నే కోరుతున్నా (2008)
సంగీతం: మాధవపెద్ది సురేష్
రచన : వెన్నెలకంటి
గానం : కార్తీక్, చిత్ర
************************************************
Movie Name : Nee Sukhame Koruthunna (2008)
Music Director : Madhavapeddi Suresh
Lyricist : Vennelakanti
Singers : Karthik, Chitra