Showing posts with label Sandeep chowta Musical Hits. Show all posts
Showing posts with label Sandeep chowta Musical Hits. Show all posts

Tuesday, November 27, 2012

మిల మిల మిల మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో .... సూపర్ (2005)


మిల మిల మిల మెరిసిన కనులకు
ఎందుకో అసలెందుకో ఈ కలవరములే
చలి చలి చలి గిలి గిలి చలి గిలి
ఏమిటో ఇడి ఏమిటొ ఈ చలి చలి గిలే
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారు వీడేనేమొ నే కలలు కన్న వాడు
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారూ వీడేనేమొ కలలు కన్న మొగుడు
మిల మిల మిల మెరిసిన కనులకు
ఎందుకో అసలెందుకో ఈ కలవరమునా...

ఉన్న చోట ఉండనీడు చూడే వీడు ఊరుకోడు
ఏదొ మాయ చేస్తుంటాడమ్మా...
పొమ్మంటున్నా పోనే పోడు కల్లో కొచ్చి కూర్చుంటాడు
ఆగం ఆగం చేస్తున్నాడమ్మా
ఘడియ ఘడియకి.. ఓ ఊ ఓ ఊ ...నడుము తడుముడయ్యో
తడవ తడవకి ...ఓ ఊ ఓ ఊ ...చిలిపి చెడుగుడయ్యో
బంగారు వీడేనా... నా నిండు సెందురూడు
బంగారు వీడేనేమొ... నే కలలు కన్న వాడు
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారూ వీడేనేమొ... కలలు కన్న మొగుడు
మిల మిల మిల మెరిసిన కనులకు
ఎందుకో అసలెందుకో ఈ కలవరమునా...
చలి చలి చలి గిలి గిలి చలి గిలి
ఏమిటో ఇడి ఏమిటొ ఈ చలి చలి గిలే

తోడు కోరే తుంటరోడు వీల్లేదన్నా ఊరుకోడు
ప్రాణాలన్ని తోడేస్తాడమ్మా
నవ్వుతాడె అండగాడు ఈడు జోడు బాగుంటాడు
ప్రేమో ఏమొ అవుతున్నాదమ్మా
వలపు తలపులేవో వయసు తెరిచెనేమో
చిలక పలుకులేవో మనసు పలికేనేమో
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారు వీడేనేమొ నే కలలు కన్న వాడు
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారూ వీడేనేమొ కలలు కన్న మొగుడు
మిల మిల మిల మెరిసిన కనులకు
ఎందుకో అసలెందుకో ఈ కలవరమునా...
చలి చలి చలి గిలి గిలి చలి గిలి
ఏమిటో ఇడి ఏమిటొ ఈ చలి చలి గిలే
చలి చలి గిలేనా..చలి చలి గిలేనా....చలి చలి గిలే...నా...

చిత్రం : సూపర్ (2005)
సంగీతం : సందీప్ చౌతా
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : అనుష్క మణిచందన్

Thursday, November 1, 2012

పూలు గుస గుసలాడేనని జత గూడేనని .... సలీమ్ (2009)


పూలు గుస గుసలాడేనని జత గూడేనని
గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని
అది ఈ రోజె తెలిసిందీ .. హా ఆ (2)

జల జల వరదలు నది మది పిలుపని తెలిసిందా
తెల తెల నురగలు కడలిలొ చెలిమని తెలిసిందా
నిన్నలే వీడనీ .. ఎండలే నీడనీ

నక్షత్రాలే నవ్వుతాయని
పాలపుంతలే పాడుతాయని
పుడమే నాట్యం ఆడుతుందని
అడవికి ఆమని చేరుతుందని
మయూరాలు పురి విప్పుతాయని
చకోరాలు తలలెత్తుతాయని
పావురాలు పైకెగురుతాయని
చిలక పళ్ళనే కొరుకుతందని
చేప నీటిలో తుళ్ళుతుందని
మబ్బు చినుకులే చల్లుతుందని
తేనెటీగలో ముళ్ళు ఉందని
తీగ పందిరిని అల్లుకుందని
జగతే కొత్తగ జన్మనెత్తునని
ప్రకృతి మొత్తం పరవశించునని
నేడే తెలిసిందీ !

" అయ్యబాబోయ్ చంటీ .. ఇంత కవిత్వం ఎలా చెప్పావ్ !"

"నా చిట్టి !"

ప్రేమ నాలో పుడుతుందని
ప్రేమలోనే పడతానని
ప్రేమతో మతి చెడుతుందని
నేడే తెలిసిందీ రు రు రు రూ !

పూలు గుస గుసలాడేనని జత గూడేనని
గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని
అది ఈ రోజె తెలిసిందీ ..

ఎదిగిన వయసుకు వరసే కలదని తెలిసిందా
వలచిన మనసుకు వయసే వరదని తెలిసిందా
అలజడే .. ఉందనీ
అలసటే .. లేదనీ

అల్లరి నాలో పెరుగుతుందని
అద్దం ఎపుడూ వదల్లేనని
ఆకలి నన్నే అంటుకోదని
ఆశలకేమో అంతులేదని
వేషం భాషా మారుతుందని
వేగం నన్నే తరుముతుందని
వేళా పాళా గురుతు రాదని
వేరే పనిలో ధ్యాస లేదని
ఒకటే దీపం వెలుగుతుందని
ఒకటే దైవం వెలసి ఉందని
ఒకటే మంత్రం మ్రోగుతుందని
ఒకటే మైకం కలుగుతుందని
ఒకటీ ఒకటీ ఒక్కటేనని
మోక్షం అంటే ఇక్కడేనని
నేడే తెలిసిందీ !

" అసలేమైంది చంటీ నీకూ.. "

ప్రేమ తరగతి చేరానని
ప్రేమశాస్త్రం చదివానని
ప్రేమ పట్టా పొందానని

నేడే తెలిసిందీ రు రు రు రూ !

పూలు గుస గుసలాడేనని జత గూడేనని
గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని
అది ఈ రోజె తెలిసిందా ..

చిత్రం : సలీమ్ (2009)
సంగీతం : సందీప్ చౌతా
రచన : చంద్రబోస్
గానం: ప్రదీప్ సోమసుందరన్, సోనూ కక్కర్

ఈ వేళలో .. హాయిలో..I wanna talk to you .. సలీమ్ (2009)


" ఈ వేళలో .. హాయిలో .. మాయలో
మాట రానీ .. మత్తులో "

ఈ వేళలో .. హాయిలో .. మాయలో
మాట రానీ .. మత్తులో
I wanna talk to you ..

I wanna talk to you .. (2)

హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్
నేనిన్నాళ్ళూ నన్నే దాచి ఉన్నాను నా ఊహల్లో
హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్
నేనిన్నాళ్ళూ నన్నే దాటి ఉంటాను నీ గుండెలో

I wanna talk to you .. I wanna talk to you ..

పెదాలలో ప్రకంపనే .. తొలి సాక్ష్యం
పాదాలలో ప్రవాహమే .. మలి సాక్ష్యం
చెక్కిళ్ళలో సింధూరమే .. చిరు సాక్ష్యం
నా కళ్ళలో సముద్రమే .. ప్రతి సాక్ష్యం

అణువణువు నేడు అనేక గొంతులై
కణకణము కూడ.. స్వరాల తంత్రులై
ఒకే మాటనే సదా స్మరించుతున్నా
అదే మాటనే చెప్పేస్తూ ఉన్నా

I love you ! I love you !!

ఏం చెయ్యనూ .. ఏమనీ చెప్పనూ
What do I do with out You !

I wanna talk to you .. I wanna talk to you ..

వెన్నెల్లలో తెప్పించనా .. ఆహ్వానం
కన్నీళ్ళతో చేయించనా.. అభిషేకం
కౌగిళ్ళలో దాచెయ్యనా .. నీ స్నేహం
ప్రాణాలలో నింపెయ్యనా .. నీ రూపం

నీ శ్వాసలోన సుమాల గాలినై
నీ కాలిలోన సుగంధ ధూళినై
ఎన్నో మాటలూ వినుపించు వీలు లేకా
ఒకే మాటతో వివరించేస్తున్నా

I love you ! I love you !!

ఏం చెయ్యనూ .. ఏమనీ చెప్పనూ
What do I do with out You !

I wanna talk to you ..I wanna talk to you ..

హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్
నేనిన్నాళ్ళూ నన్నే దాచి ఉన్నాను నా ఊహల్లో

హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్
నేనిన్నాళ్ళూ నన్నే దాటి ఉంటాను నీ గుండెలో

I wanna talk to you ..I wanna talk to you ..

చిత్రం : సలీమ్ (2009)

సంగీతం : సందీప్ చౌతా
రచన : చంద్రబోస్
గానం : నిఖిత నిగం

నీవేనా నీవేనా .. నీతోనే నేనున్నానుగా .... కేడి (2010)


నీవేనా నీవేనా .. నీతోనే నేనున్నానుగా
నీలోనా నాలోనా .. ఈ సంతోషం కలకాదుగా !
ఇంకో జన్మేనేమో .. నీతోనే చూసానేమో
ఏదేమైనా ఈ రోజే .. మళ్ళీ మళ్ళీ రాదేమో !!

నీవేనా నీవేనా .. నీతోనే నేనున్నానుగా
నీలోనా నాలోనా .. ఈ సంతోషం కలకాదుగా !

మెల్లగా మెల మెల్లగా నా మనసులొ విరబూసెనే నీ జ్ఞాపకాలే .. నీ జ్ఞాపకాలే
మెరుపులా నువు నవ్వుతూ అణువణువునా చేసావులే నీ సంతకాలే .. నీ సంతకాలే
నీతోనే నా పాదం .. నా ప్రాణం .. సాగిపోనీ
మౌనంగా కాలం .. కలకాలం .. ఆగిపోనీ

ఇంకో జన్మేనేమో .. నీతోనే చూసానేమో
ఏదేమైనా ఈ రోజే .. మళ్ళీ మళ్ళీ రాదేమో !

నీవేనా నీవేనా .. నీతోనే నేనున్నానుగా
నీలోనా నాలోనా .. ఈ సంతోషం కలకాదుగా !!

కొత్తగా సరికొత్తగా ఈ లోకమే కనిపించెనే నీ రాకతోనే .. నీ రాకతోనే
ఎప్పుడో నేనెప్పుడో నీ రూపమే దాచానుగా నా గుండెలోనే .. నా గుండెలోనే
చూసానే నేడే .. ఈనాడే .. ప్రేమ జాడే
అందంగా నాకే .. అందాడే .. అందగాడే

ఇంకో జన్మేనేమో .. నీతోనే చూసానేమో
ఏదేమైనా ఈ రోజే .. మళ్ళీ మళ్ళీ రాదేమో !

నీవేనా నీవేనా .. నీతోనే నేనున్నానుగా
నీలోనా నాలోనా .. ఈ సంతోషం కలకాదుగా !!

చిత్రం : కేడి (2010)

సంగీతం : సందీప్ చౌతా
రచన : చిన్ని చరణ్
గానం : అరిజిత్ సింగ్, నేహా కక్కర్