Showing posts with label Ghantaadi krishna Musical Hits. Show all posts
Showing posts with label Ghantaadi krishna Musical Hits. Show all posts

Tuesday, October 29, 2013

విభ్రాంతిగొల్పు ఈ ఆర్తనైవేద్యం ...... దేవతలు (2007)

విభ్రాంతిగొల్పు ఈ ఆర్తనైవేద్యం
ఆ ఆదిశక్తికే ఆహ్వానయఙ్ఞం
అపర కాళీశక్తి ఆ పరాశక్తి
వనదేవతాశక్తి ఘన త్యాగశక్తి
అల కలిసి ఇల వెలసి అపురూప దేవతలు
మహిమలతో మహినేలు ఈ మహాదేవతలు


చిత్రం :  దేవతలు (2007)
సంగీతం :  ఘంటాడికృష్ణ
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం :  ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
*********************************************
Movie Name :  Devathalu (2007)
Music Director : Ghantadi Krishna
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : S.P.Balasubramanyam

పదునాలుగు లోకాలు పాలించు అమ్మా ..... దేవతలు (2007)

పదునాలుగు లోకాలు పాలించు అమ్మా
భక్తులను కాపాడ నిదురపోదమ్మా
ఒళ్ళంత కన్నులై ఇళ్ళంత కన్నులై
నింగినేలలికలకు నిర్ణిద్రనేత్రమై
దిక్కులును చుక్కలును పాప కనుపాపలై
శరణన్న వారికై కరుణాతరంగియై
రెప్పవేయదు విశాలాక్షి మూడు కన్నులవాడి సాక్షి


చిత్రం :  దేవతలు (2007)
సంగీతం :  ఘంటాడికృష్ణ
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం :  ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
*********************************************
Movie Name :  Devathalu (2007)
Music Director : Ghantadi Krishna
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : S.P.Balasubramanyam

సౌభాగ్యదేవికే వైధవ్య గ్రహణమా ....... దేవతలు (2007)

సౌభాగ్యదేవికే వైధవ్య గ్రహణమా
విధిరాతకెదురీత ఇంత విపరీతమా
సౌభాగ్యదేవికే వైధవ్య గ్రహణమా
విధిరాతకెదురీత ఇంత విపరీతమా
కల్లోల భూతాల...కలికాల ఘోరమా
కల్లోల భూతాల కలికాల ఘోరమా
మహిమ కోల్పోతివా మాంగళ్య మంత్రమా

సింధూర తిలకాన పడె అశనిపాతమే
అసహాయతను చాటె కనుల జలపాతమే
బ్రహ్మముడి విడదీసే వికటాట్టహాసమే
కర్కశపు హస్తాలు ...సిగలాగె విలవిల
కర్కశపు హస్తాలు సిగలాగె విలవిల పుష్పాలు భాష్పాలుగా రాలె
జలజల ముక్కలైనది గుండె చేతి గాజులవలె
భీభత్సమైపోయె సకల సౌభాగ్యం
జీవచ్ఛవంబాయె పడతి తనుమాత్రం      ||సౌభాగ్యదేవికే||

కోటి కుంకుమరాశి కనకదుర్గమ్మయే అభయమొసగి అయ్యె నుదుటి కుంకుమగా
దివ్యవాక్కులతోడ ఘన గౌరవము కూర్చు శ్రీ సరస్వతి మారె సతి పసుపు చీరగా
చుట్టుప్రక్కల నింగి శూన్యమైనట్టుగా చుక్కలన్నియు చేరె సిగలోన పూలుగా
కటిక చీకటినెల్ల త్రుటిలోన  వెలిగించు కాళికాదేవియే మారె కాటుకగా
నాగదేవత అయ్యె మాంగళ్యధనముగా
అఖిల దేవతలు అయ్యె ఆభరణ రాశిగా
అడుగు వేసెను ధూర్త విధ్వంసమూర్తిగా

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి
సర్వ పర్వతశ్రేణి తిరగబడి ఒరగగా
సంద్రాలు ఉప్పొంగి దివినాక్రమించగా
అనిలాగ్ని భూతాలు స్తంభించిపోవగా
దశదిశాగాశాలు గజగజా వణకగా
భీకర పిశాచాలు భీవభీకలు కాగా
ప్రేతభూతాలెల్ల తడబడుచు పరుగిడగా
ఆది ముత్తైదువై అగ్ని సింహాకృతై
అఖిలాండ బ్రహ్మాండ కోటి శక్తాత్మయై
ఘ్రీంకార హూంకార ధిక్ ధిక్ విరుక్తాల
ఘ్రీంకార భీంకార హుక్ హుక్ ప్రయుక్తాల
ప్రళయ ప్రగర్జనల గర్జా ప్రతిధ్వనుల
విళయ మాయారూప వికృత దైత్యాదమున్
ఖండింపగా దూకె కాళకాళేశ్వరి సింహ శ్రీచండీశ్వరీ
( శ్లోకం )


చిత్రం :  దేవతలు (2007)
సంగీతం :  ఘంటాడికృష్ణ
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం :  ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
*********************************************
Movie Name :  Devathalu (2007)
Music Director : Ghantadi Krishna
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : S.P.Balasubramanyam

మృత్యుంజయేశ్వరిని రూపుమాపేదెవడు ..... దేవతలు (2007)

మృత్యుంజయేశ్వరిని రూపుమాపేదెవడు
కాలరూపిణి దారికి అడ్డుపడువాడెవడు
మహా మాయాదేవి వ్యూహమెరిగినదెవడు
ప్రళయమును ప్రశ్నించి నిలబడేదెవడు
భక్తురాలికి రక్ష ఈ పరాశక్తి
శుభమనుచు దీవించు ఈ విశ్వమూర్తి


చిత్రం :  దేవతలు (2007)
సంగీతం :  ఘంటాడికృష్ణ
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం :  ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
*********************************************
Movie Name :  Devathalu (2007)
Music Director : Ghantadi Krishna
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : S.P.Balasubramanyam

నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ ...... దేవతలు (2007)

నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ
నీ బంగరుకాంతుల చల్లని పడగల దీవెనలీయమ్మ
నమ్మినవారికి నాగులచవితికి అమ్మవు నీవమ్మా
పసుపుకుంకుమ పడతులకొసగే దేవత నీవమ్మా
మా ఐదవతనముకు అభయమునిచ్చి అండగా ఉండమ్మ
చల్లని చూపుల నాగమ్మ మా పిల్లాపాపల కాయమ్మ
కరుణించు తల్లివి నీవమ్మా మాకు తోడునీడగ ఉండమ్మా
రత్నాలకాంతుల పడగల భోగభాగ్యాలనిచ్చేటి తల్లివి
పుట్టిమట్టి పుట్టలోనే తల దాచుకొందువమ్మా    
 ||చల్లని చూపుల||

నాటి నీ పాలతో చల్లంగా కాచేవే
నడివిడి నైవేద్యముతో చింతలు మాపేవే
పూజలందుకో శివ నాగమ్మా ఎల్లవేళలా తల్లి నాగమ్మా
దీవెనలియ్యవే దేవ నాగమ్మ దారి చూపవే శ్రీ నాగమ్మ  
 ||నాలుగు దిక్కులె||

క్షీరాబ్ది మథియించు వేళలో చిన్న కవ్వపు తాడుగా మారినా
వన్నెలీను వాసుకి నాగదేవి నీకు తోడై
వేదాల నాదాల సత్యమా ఇన్ని లోకాల కాచేవు నీవమ్మా
శాశ్వత చైతన్యరూపమా మా సన్నుతులందుకో నాగమ్మా
సూర్యుడే సిగలో వెలిగే మణిలా తోచెనే
నింగిలోని మెరుపులన్ని నిన్నే చూపేనే
వెండికొండకే దారి నీవులే కొండ అంచులే నీ పడగలే
లోకసుందరి రూపానివే
అంతు తెలియని నాగశక్తివే       ||నాలుగు దిక్కులె||


చిత్రం :  దేవతలు (2007)
సంగీతం :  ఘంటాడికృష్ణ
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం :  K.S. చిత్ర
*********************************************
Movie Name :  Devathalu (2007)
Music Director : Ghantadi Krishna
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : K.S.Chitra

వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరీ ....... దేవతలు (2007)

వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరీ
మీకేలే మా పూజలే భువిలోని భువనేశ్వరీ
పద్దెనిమిది శక్తిపీఠాలలో ముజ్జగములే ఏలే పెద్దమ్మలు
వెలసె అత్తమ్మ చెల్లెమ్మ పరదేవతలు              ||వేవేల జేజేలివే||

మా గుండెలో నీ గుడిగంటలై
మారుమ్రోగేనే కోనంతా మా ఊరంతా
నాలుగు రేకుల ప్రక్కన నువ్వు ఊరికి ఇచ్చే దీవెన
ఇల్లిల్లు చేసేను చల్లన నీవెన్నెల చూపుల పాలన
సెలయెరులా అడవి పొలిమేరలా
ఉరికి ప్రవహించు ఓయమ్మ నీ ప్రేమయై
వేవేల చేతులతో వెలసితివమ్మా
అమ్మా ముగ్గురమ్మలకే నువు మూలపుటమ్మ
కొండల కోనల మధ్యలో కోటి సూర్యులచంద్రుల వెలుగుతో
అండదండలియ్యనుంటివే అక్కమ్మ చెల్లెమ్మ బంగరు తల్లి             ||వేవేల జేజేలివే||

నీవే కదా శ్రీ భ్రమరాంబిక
ఆ కాశీపురి అన్నపూర్ణాంబిక
మాధవీదేవివి నీవెగా ఆ మాణిక్యాంబవి నీవెగా
జోగులాంబదేవి నీవెగా పురుహూతికా దేవి నీవెగా
శ్రీలంకలో ఉన్న శాంకరి నీవే
సిరుల కొళాపురి మహాలక్ష్మివి నీవే
బెజవాడలో కనకదుర్గాంబవి తల్లీ ఉజ్జయినిలో మహాకాళివి నీవే
ఎక్కడ ఎక్కడ ఎప్పుడు నువ్వు ఎన్నెన్ని రూపాలలో ఉన్నను
అక్కమ్మ చెల్లెమ్మ రూపున మా పక్కనే ఉందువు చక్కని తల్లి          ||వేవేల జేజేలివే||


చిత్రం :  దేవతలు (2007)
సంగీతం :  ఘంటాడికృష్ణ
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం :  K.S. చిత్ర
*********************************************
Movie Name :  Devathalu (2007)
Music Director : Ghantadi Krishna
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : K.S.Chitra