Showing posts with label Hero Special- Rajashekhar songs. Show all posts
Showing posts with label Hero Special- Rajashekhar songs. Show all posts

Wednesday, October 30, 2013

చెల్లాయే ఇల్లాలై అత్తింటీకెడుతుంటే అందరి కన్నుల్లోనా కన్నీరే .... గోరింటాకు (2008)

చెల్లాయే ఇల్లాలై అత్తింటీకెడుతుంటే అందరి కన్నుల్లోనా కన్నీరే
అడుగే పడనీ పయనం విడువలేనీ బంధం ఆగీ ఆగీ అచటే నిలిచేనా
అప్పగింతాల తీరు ఇంతేనా
దేవుడిలా నిలిచి నిను పెంచిన అన్నయ్య
నిన్నే తలచి తలచి నిలువెల్లా నీరయ్యే
ఆకాశం తాకే ఆ ప్రేమ మమకారం నీవెంటే రావాలని కనుజల్లై కురిసే
సుఖశాంతులు శోభిల్లి నువ్వు మెట్టీన ఇల్లు
ఓ చెల్లి వర్థిల్లు నిండూనూరేళ్ళు
అన్నయ్యదీవెనలు శ్రీ రామరక్ష
శ్రీరస్తు శుభమస్తు సౌభాగ్యమస్తు


చిత్రం : గోరింటాకు (2008)
సంగీతం :   S.A.రాజ్ కుమార్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : గోపికా పూర్ణిమ
*********************************************
Movie Name : Gorintaku (2008)
Music Director : S.A.Raj Kumar
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : Gopika Purnima

కరుణకురియు అరుణాచల శివశంభో జయజయ శంభో ..... గోరింటాకు (2008)

కరుణకురియు అరుణాచల శివశంభో జయజయ శంభో
కడుపుతీపి రుచి తెలిసిన హరశంభో కైలాసవిభో
జన్మని ధన్యం చేయవయా వరపుత్రుడనొసగి ప్రేమతో దీవెనలీయవయా
కడుపుతీపి రుచి తెలిసిన హరశంభో కైలాసవిభో

రాహుకేత శని నాగ దోషములు నివారించు నిఖిలేశ్వరా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా
అమ్మ పిలుపుతో అమృతత్వమును ప్రసాదించు పరమేశ్వరా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా

బాలగణపతి కుమారస్వాముల ఆటలు చూసి మురిసే దేవా
శివశివశంకర హరహరదేవా
పాలుతేనె అబిషేకములనుగొని పరీక్షించకు ఇక దయగన రారా
అభయమునీరా పాహిపాహిమాం దేవా సంతానభాగ్యమీరా
తల్లిప్రేమలా తండ్రి మమతలా వెల్లువైన నీ చూపులే
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా
వంశదీపమై ఇల్లు చేరి వర్థిల్లునయ్య విశ్వేశ్వరా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా

పిలిచినంతనె పలికి భక్తులకు వరములనొసగె అరుణగిరీశా
నమకచమకముల మనసావాచా మరి మరి కొలిచెదా ఉమామహేశా
ధన్యమాయె నా బ్రతుకే దాసోహం ఇక నీకే..జన్మనీ ధన్య చేయవయా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా


చిత్రం : గోరింటాకు (2008)
సంగీతం :   S.A.రాజ్ కుమార్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : అనిత, మనో, ప్రియ ప్రకాష్, హేమ
*********************************************
Movie Name : Gorintaku (2008)
Music Director : S.A.Raj Kumar
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Anitha, Mano, Priyaprakash, Hema

Wednesday, April 24, 2013

మా లోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పున్నమే... మా అన్నయ్య (2000)


మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే
మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే
ఈ ఇంటికీ మా కంటికీ మణి దీపం ప్రేమకు ప్రతి రూపం
మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే

రాముడు అడవికి వెళ్ళేనా నువ్వే అన్నై ఉండుంటే
ఏసు శిలువ మోసేనా నీకే తమ్ముడు అయ్యుంటే
అమ్మంటూ లేకున్నా జన్మంతా జరిగేనులే
అన్నంటూ లేకుంటే క్షణమైనా యుగమౌనులే
కనకున్ననూ కన్నమ్మవై కడుపున మము దాచి కాచిన దైవమా

మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే

ఇంతటి చక్కటి బంధాన్ని కాలం ఆగి చూసేను
రాత రాయు ఆ బ్రహ్మ రాయుట ఆపి మురిసేను
తపమేమి చేశామో తమ్ముళ్ళం అయ్యాములే
తన బతుకే మా మెతుకై తనయులమే అయ్యాములే
మా దేవుడు మాకుండగా మాకిక లోటేది కలతకు చోటేది

మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే
ఈ ఇంటికీ మా కంటికీ మణి దీపం ప్రేమకు ప్రతి రూపం
మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే


చిత్రం : మా అన్నయ్య (2000)
సంగీతం : ఎస్.ఎ. రాజ్ కుమార్
రచన : శ్రీ హర్ష
గానం : S.P.బాల సుబ్రహ్మణ్యం, చిత్ర
***************************************
Ma logililo pandedanta punyame
Ma jabiliki edadanta punname
Ma logililo pandedanta punyame
Ma jabiliki edadanta punname
I intiki ma kantiki mani dipam premaku prati rupam
Ma logililo pandedanta punyame
Ma jabiliki edadanta punname

Ramudu adaviki vellena nuvve annai undunte
Esu siluva mosena nike tammudu ayyunte
Ammantu lekunna janmanta jarigenule
Annantu lekunte kshanamaina yugamounule
Kanakunnanu kannammavai kadupuna mamu daci kacina daivama

Ma logililo pandedanta punyame
Ma jabiliki edadanta punname

Intati cakkati bandhanni kalam agi cusenu
Rata rayu a brahma rayuta api murisenu
Tapamemi cesamo tammullam ayyamule
Tana batuke ma metukai tanayulame ayyamule
Ma devudu makundaga makika lotedi kalataku cotedi

Ma logililo pandedanta punyame
Ma jabiliki edadanta punname
I intiki ma kantiki mani dipam premaku prati rupam
Ma logililo pandedanta punyame
Ma jabiliki edadanta punname


Movie Name : Maa Annayya (2000)
Music Director : S.A.Raj kumar
Lyricist : Sri Harsha
Singers : S.P.Bala subramaniam, Chitra

కదిలే అందాల నది అరెరే.. నను ముంచినది... మా అన్నయ్య (2000)


కదిలే అందాల నది అరెరే.. నను ముంచినది
ఇక తెలిపోను నేను ఏ ఒడ్డు చేరుకోను
ఈ హాయి వరదలో నేనుండే ప్రేమనొదులుకోను
ఓ ప్రియా ప్రియా సఖియా నీవే సుమా నా గుండె లయ
ఓ ప్రియా ప్రియా సఖియా నీవే సుమా నా గుండె లయ
కదిలే అందాల నది అరెరే.. నను ముంచినది

వాన విల్లు పూల జల్లు రూపు కడితే
నువ్వే కాదా నవ్వే కాదా
కొంటె కళ్ళు చూపు ముళ్ళు గుచ్చి పెడితే
సిగ్గు రాదా చిచ్చు కాదా
నీకు పెట్టిన పేరిది భాగ్యం
జన్మించానే ప్రతి రోజు
నీ పేరు పలికి పలికి నా పెదవి తేనెలాయె
నీ మాట వింటూ వింటూ నా మనసు ఊయలాయె

కదిలే అందాల నది అరెరే.. నను ముంచినది

చిలక వచ్చి వాలగానే చిట్టి కొమ్మకి
సోకులొచ్చే శోభలొచ్చే
ప్రేమ మెచ్చి తాకగానే చిన్ని గుండెకి
ఊహలొచ్చే ఊసులొచ్చే
నువ్వు ఎపుడూ పక్కన ఉంటే ఎక్కడున్నా అద్భుతమే
నీ గాలి సోకగానే నా దారి మారిపోయె
నిమిషానికున్న విలువే నువ్వు దగ్గరుంటే తెలిసె

కదిలే అందాల నది అరెరే.. నను ముంచినది
ఇక తెలిపోను నేను ఏ ఒడ్డు చేరుకోను
ఈ హాయి వరదలో నేనుండే ప్రేమనొదులుకోను
ఓ ప్రియా ప్రియా సఖియా నీవే సుమా నా గుండె లయ
ఓ ప్రియా ప్రియా సఖియా నీవే సుమా నా గుండె లయ


చిత్రం : మా అన్నయ్య (2000)
సంగీతం : ఎస్.ఎ. రాజ్ కుమార్
రచన : షణ్ముఖ శర్మ
గానం : సుఖ్వింధర్ సింగ్, అనురాధ శ్రీరామ్
***************************************
Kadile andala nadi arere.. Nanu muncinadi
Ika teliponu nenu e oddu cerukonu
I hayi varadalo nenunde premanodulukonu
O priya priya sakhiya nive suma na gunde laya
O priya priya sakhiya nive suma na gunde laya
Kadile andala nadi arere.. Nanu muncinadi

Vana villu pula jallu rupu kadite
Nuvve kada navve kada
Konte kallu cupu mullu gucci pedite
Siggu rada ciccu kada
Niku pettina peridi bhagyam
Janmincane prati roju
Ni peru paliki paliki na pedavi tenelaye
Ni mata vintu vintu na manasu uyalaye

Kadile andala nadi arere.. Nanu muncinadi

Cilaka vacci valagane citti kommaki
Sokulocce sobhalocce
Prema mecci takagane cinni gundeki
Uhalocce usulocce
Nuvvu epudu pakkana unte ekkadunna adbhutame
Ni gali sokagane na dari maripoye
Nimishanikunna viluve nuvvu daggarunte telise

Kadile andala nadi arere.. Nanu muncinadi
Ika teliponu nenu e oddu cerukonu
I hayi varadalo nenunde premanodulukonu
O priya priya sakhiya nive suma na gunde laya
O priya priya sakhiya nive suma na gunde laya


Movie Name : Maa Annayya (2000)
Music Director : S.A.Raj kumar
Lyricist : Shanmukha Sharma
Singers : Sukhwinder Singh, Anuradha Sriram

నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి..... మా అన్నయ్య (2000)


నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
కలహంసలాగ రావే కలలన్నీ తీర్చిపోవే
నా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే
నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి

దేవుడు కనబడి వరమిస్తే వెయ్యి జన్మలు ఇమ్మంటా
ప్రతి ఒక జన్మ నా కంటే నిన్ను మిన్నగా ప్రేమిస్తా
దేవత నీవని గుడి కడతా జీవితమంతా పూజిస్తా
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి

నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి

ప్రేమకు మరుపే తెలియదులే మనసు ఎన్నడూ మరువదులే
తెరలను తీసి నను చూడు జన్మ జన్మకు నీ తోడు
వాడనిదమ్మా మన మన వలపు ఆగనిదమ్మా నా పిలుపు
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి

నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
కలహంసలాగ రావే కలలన్నీ తీర్చిపోవే
నా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే
నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి


చిత్రం : మా అన్నయ్య (2000)
సంగీతం : ఎస్.ఎ. రాజ్ కుమార్
రచన : శ్రీహర్ష
గానం : హరిహరన్
***************************************
Nili ningilo nindu jabili
Nuvvu ravali ni navvu kavali
Kalahamsalaga rave kalalanni tircipove
Na prema srti nive prati janma jata nive
Nili ningilo nindu jabili
Nuvvu ravali ni navvu kavali

Devudu kanabadi varamiste veyyi janmalu immanta
Prati oka janma na kante ninnu minnaga premista
Devata nivani gudi kadata jivitamanta pujista
Nuvvu ravali ni navvu kavali

Nili ningilo nindu jabili
Nuvvu ravali ni navvu kavali

Premaku marupe teliyadule manasu ennadu maruvadule
Teralanu tisi nanu cudu janma janmaku ni todu
Vadanidamma mana mana valapu aganidamma na pilupu
Nuvvu ravali ni navvu kavali

Nili ningilo nindu jabili
Nuvvu ravali ni navvu kavali
Kalahamsalaga rave kalalanni tircipove
Na prema srti nive prati janma jata nive
Nili ningilo nindu jabili
Nuvvu ravali ni navvu kavali


Movie Name : Maa Annayya (2000)
Music Director : S.A.Raj kumar
Lyricist : Sriharsha
Singer : Hariharan

మైనా ఏమైనావే మన్మథ మాసం... అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం... మా అన్నయ్య (2000)


మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
సాగు అల్లిక కొనసాగనీ ఇక
పూల మాలిక చెలి పూజకే ఇక
మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం

విరహాల నిట్టూర్పు విరజాజి ఓదార్పు
చలి గాలి సాయంత్రాల స్వాగతమే
పైపైకొచ్చే తాపాలు పైటమ్మిచ్చే శాపాలు
ఎదతోనే ముందుగా చేసే కాపురమే
ఎవరేమైనా ఎదురేమైనా నేనేమైనా నీవేమైనా
ఈ తోవుల్లో పువ్వై నిను పూజిస్తూ ఉన్నా

మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం

సందెపొద్దు నేరాలు అందమైన తీరాలు
దాటేస్తే కాదన్నానా ఎప్పుడైనా
కవ్విస్తున్న నీ కళ్ళు కైపెక్కించే పోకళ్ళు
కాటేస్తే కాదంటానా ఇపుడైనా
వయసేమైనా సొగసేమైనా మైమరిపించే మనసేమైనా
నవ్వు నవరాత్రి నీకోసం తీసుకు వస్తున్నా

మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
సాగు అల్లిక కొనసాగనీ ఇక
పూల మాలిక చెలి పూజకే ఇక
మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం


చిత్రం : మా అన్నయ్య (2000)
సంగీతం : ఎస్.ఎ. రాజ్ కుమార్
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఉన్నికృష్ణన్ , చిత్ర
***************************************
mainaa EmainAvE manmatha mAsam
ayinA entainA idi mettani mOsam
tiyyanaina tIrika tIrcamandi kOrika
nIku tODu nEnika nIvu lEka lEnika
sAgu allika konasAganI ika
pUla mAlika celi pUjakE ika
mainA EmainAvE manmatha mAsam
ayinA entainA idi mettani mOsam

virahAla niTTUrpu virajAji OdArpu
cali gAli sAyantrAla swAgatamE
paipaikoccE tApAlu paiTammiccE SApAlu
edatOnE mundugA cEsE kApuramE
evarEmainA edurEmainA nEnEmainA nIvEmainA
I tOvullO puvvai ninu pUjistU unnA

mainA EmainAvE manmatha mAsam
ayinA entainA idi mettani mOsam

sandepoddu nErAlu andamaina tIrAlu
dATEstE kAdannAnA eppuDainA
kavvistunna nI kaLLu kaipekkincE pokallu
kATEstE kAdanTAnA ipuDainA
vayasEmainA sogasEmainA maimaripincE manasEmainaa
navvu navarAtri nIkOsam tIsuku vastunnA

mainaa Emainave manmatha maasam
ayinaa entainaa idi mettani mOsam
tiyyanaina tIrika tIrcamandi kOrika
nIku tODu nEnika nIvu lEka lEnika
sAgu allika konasAganI ika
pUla mAlika celi pUjakE ika
mainA EmainAvE manmatha mAsam
ayinA entainA idi mettani mOsam


Movie Name : Maa Annayya (2000)
Music Director : S.A.Raj kumar
Lyricist : Veturi Sundara Ramamurthy
Singers : Unnikrishnan, Chitra

తాజాగా మా ఇంట్లో పెళ్ళి బాజాలే మోగేను ...... మా అన్నయ్య (2000)














తాజాగా మా ఇంట్లో పెళ్ళి బాజాలే మోగేను
దర్జాగా మా మరిది ఇక రాజాలా తిరిగేను
కొత్త యువరాణి రానుంది ఈ అంత:పురం ఏలగా
అంతా సంతోషంలో తెలగా
తాజాగా మా ఇంట్లో పెళ్ళి బాజాలే మోగేను

పండుగ కాని రోజేదంట మనసులు నేసిన మమతల పొదరింట
అందరి కోసం ఒంటరి అయినా అన్నకు పండుగ మా సుఖమేనంట
ఈ ఇల్లే వెయ్యేళ్ళు మొదలవును ఇక ఈ అన్న ఒక మంచి కథ అవును

తాజాగా మా ఇంట్లో పెళ్ళి బాజాలే మోగేను

జానెడు కాడు కట్టిన వాడు జన్మలు వేయి నీ జోడవుతాడు
పున్నమి రెమ్మ పుత్తడి బొమ్మ మమతల కోవెల మెట్టిన ఇల్లమ్మా
ముత్తైదు మురిపాల జీవించు అన్న ఆనంద భాష్పాల దీవించు

తాజాగా మా ఇంట్లో పెళ్ళి బాజాలే మోగేను
దర్జాగా మా మరిది ఇక రాజాలా తిరిగేను
కొత్త యువరాణి రానుంది ఈ అంత:పురం ఏలగా
అంతా సంతోషంలో తెలగా
ఈ అంత:పురం ఏలగా అంతా సంతోషంలో తేలగా


చిత్రం : మా అన్నయ్య (2000)
సంగీతం : ఎస్.ఎ. రాజ్ కుమార్
రచన : శ్రీహర్ష
గానం : మనో, చిత్ర, సుజాత
***************************************
Tajaga ma intlo pelli bajale mogenu
Darjaga ma maridi ika rajala tirigenu
Kotta yuvarani ranundi i anta:puram elaga
Anta santoshamlo telaga
Tajaga ma intlo pelli bajale mogenu

Panduga kani rojedanta manasulu nesina mamatala podarinta
Andari kosam ontari ayina annaku panduga ma sukhamenanta
I ille veyyellu modalavunu ika i anna oka manci katha avunu

Tajaga ma intlo pelli bajale mogenu

Janedu kadu kattina vadu janmalu veyi ni jodavutadu
Punnami remma puttadi bomma mamatala kovela mettina illamma
Muttaidu muripala jivincu anna ananda bhashpala divincu

Tajaga ma intlo pelli bajale mogenu
Darjaga ma maridi ika rajala tirigenu
Kotta yuvarani ranundi i anta:puram elaga
Anta santoshamlo telaga
I anta:puram elaga anta santoshamlo telaga


Movie Name : Maa Annayya (2000)
Music Director : S.A.Raj kumar
Lyricist : Sri Harsha
Singers : Mano, Chitra, Sujatha

Thursday, November 8, 2012

హలో హల్లో ప్రేమలేఖ ఫోను చేశా రాయలేక ...... గ్యాంగ్ మాస్టర్ (1994)


హలో హల్లో ప్రేమలేఖ ఫోను చేశా రాయలేక
L O V E లవ్ టెల్ మి అది హౌ
లైనేసిన లవ్ ఎల్ బోర్డిది లవ్
టెలిఫోనిది మారెను పోను పోను ఓ ప్రేమ ట్యూనుగా
హలో హల్లో ప్రేమలేఖ ఫోను చేశా రాయలేక

అంతే నాకు లేక చందమామ కేక నన్నింక కవ్వించక
తోటలోని రోజా తోటమాలి పూజ వేళాయే వేధించక
ఈ దూరమే మధురం నీ ఫోను అధరం
సన్నాయి ముద్దుల్లో అమ్మాయి ప్రేమల్లో
అందాల వాణి విన్నాను ఈ వేళ
హలో హల్లో ప్రేమలేఖ ఫోను చేశా రాయలేక
L O V E లవ్ టెల్ మి అది హౌ
లైనేసిన లవ్ ఎల్ బోర్డిది లవ్
టెలిఫోనిది మారెను పోను పోను ఓ ప్రేమ ట్యూనుగా
హలో హల్లో ప్రేమలేఖ ఫోను చేశా రాయలేక

అర్దరత్రి దాకా నేను ఆగలేక కొట్టాను లవ్ గంటలే
తెల్లవారేదాకా తేనె విందు లేక కోరాను నీ జంటనే
రాశాను లవ్ లెటరే అందాల అడ్రస్ కే
చిన్నారి సిగ్గుల్లో శృంగార తెలుగుల్లో
ఆకాశవాణి చెప్పిందీ శుభవార్త

హలో హల్లో ప్రేమలేఖ ఫోను చేశా రాయలేక
L O V E లవ్ టెల్ మి అది హౌ
లైనేసిన లవ్ ఎల్ బోర్డిది లవ్
టెలిఫోనిది మారెను పోను పోను ఓ ప్రేమ ట్యూనుగా
హలో హల్లో ప్రేమలేఖ ఫోను చేశా రాయలేక
L O V E లవ్ టెల్ మి అది హౌ
లైనేసిన లవ్ ఎల్ బోర్డిది లవ్
టెలిఫోనిది మారెను పోను పోను ఓ ప్రేమ ట్యూనుగా
హలో హల్లో ప్రేమలేఖ ఫోను చేశా రాయలేక

చిత్రం : గ్యాంగ్ మాస్టర్ (1994)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : వేటూరి సుందరరామమూర్తి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , K.S.చిత్ర
******************************

halO hallO prEmalEkha fOnu chESaa raayalEka
L O V E lav Tel mi adi hou
lainEsina lav el bOrDidi lav
telifOnidi maarenu pOnu pOnu O prEma TyUnugaa
halO hallO prEmalEkha fOnu chESaa raayalEka

antE naaku lEka chandamaama kEka nanninka kavvinchaka
tOTalOni rOjaa tOTamaali pooja vELaayE vEdhinchaka
ee dooramE madhuram nee fOnu adharam
sannaayi muddullO ammaayi prEmallO
andaala vaaNi vinnaanu ee vELa
halO hallO prEmalEkha fOnu chESaa raayalEka
L O V E lav Tel mi adi hou
lainEsina lav el bOrDidi lav
telifOnidi maarenu pOnu pOnu O prEma TyUnugaa
halO hallO prEmalEkha fOnu chESaa raayalEka

ardaratri daakaa nEnu aagalEka koTTaanu lav ganTalE
tellavaarEdaakaa tEne vindu lEka kOraanu nee janTanE
raaSaanu lav leTarE andaala aDras kE
chinnaari siggullO SRngaara telugullO
aakaaSavaaNi cheppindI Subhavaarta

halO hallO prEmalEkha fOnu chESaa raayalEka
L O V E lav Tel mi adi hou
lainEsina lav el bOrDidi lav
telifOnidi maarenu pOnu pOnu O prEma TyUnugaa
halO hallO prEmalEkha fOnu chESaa raayalEka
L O V E lav Tel mi adi hou
lainEsina lav el bOrDidi lav
telifOnidi maarenu pOnu pOnu O prEma TyUnugaa
halO hallO prEmalEkha fOnu chESaa raayalEka

Movie Name : Gang Master (1994)
Music Director : A.R.Rehaman
Lyricist : Veturi Sundara Ramamurthy
Singer : S.P.Bala Subrahmanyam , K.S.Chithra

Wednesday, October 24, 2012

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ....... అంకుశం (1990)


పల్లవి:
ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఆ...ఆ...ఆ...
ఇది మమతల మేడకు ప్రాకారం
ఓ... ఓ.... ఓ....
పండిన కలలకు శ్రీరస్తూ పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తూ
కలకాలం వైభోగమస్తూ

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఆ...ఆ...ఆ...
ఇది మమతల మేడకు ప్రాకారం
ఓ... ఓ.... ఓ....
పండిన కలలకు శ్రీరస్తూ పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తూ...
కలకాలం వైభోగమస్తూ...

చరణం 1:
కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసూ
రసరమ్య బంధాలు రాతిరికి తెలుసూ
పారాణి మిసమిసలు పదములకు తెలుసూ
పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసూ
చిగురుటాశల చిలిపి చేతలూ పసిడిబుగ్గల పలకరింపులూ పడుచు జంటకే తెలుసూ

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఆ...ఆ...ఆ...
ఇది మమతల మేడకు ప్రాకారం
ఓ... ఓ.... ఓ....
పండిన కలలకు శ్రీరస్తూ పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తూ
కలకాలం వైభోగమస్తూ

చరణం 2:
ముగ్గుల తొలిపొద్దు ముంగిళ్ళకందం
శ్రీవారికి చిరునవ్వె శ్రీమతికి అందం
మింటికి పున్నమి జాబిల్లి అందం
ఇంటికి తొలిచూలు ఇల్లాలు అందం
జన్మజన్మల పుణ్యఫలముగా
జాలువారు పసిపాప నవ్వులే అలుమగలకూ అందం

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఆ...ఆ...ఆ...
ఇది మమతల మేడకు ప్రాకారం
ఓ... ఓ.... ఓ....
పండిన కలలకు శ్రీరస్తూ పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తూ
కలకాలం వైభోగమస్తూ


చిత్రం : అంకుశం (1990)
సంగీతం: సత్యం
రచన : వేటూరి
గానం: S.P.బాలు, S.జానకి

Sunday, October 21, 2012

సూరీడు తూరుపున దీపమై వెలుగు .... ఆహుతి (1987)

సూరీడు తూరుపున దీపమై వెలుగు
ఆ వెలుగు లోకానికంతటికి వెలుగు (2)
పుడమి ముత్తైదువ పులకించిపోవ
సిరి బొట్టు పెట్టి నే తీర్చినట్టి
ముగ్గులే ముంగిలికి ముత్యాల వెలుగు
ముత్యాల వెలుగు

హరివిల్లులో లేని సొగసు
నీ చిరునవ్వులో ఉన్నది
సిరివెన్నెలను మించు సిరులు
నీ చిరు బుగ్గలో ఉన్నవి
ఈ ముద్దు మురిపాలు నాకు వైభోగాలు
ఈ అమ్మ ప్రేమకు నువ్వానవాలు

దిగులెందుకో నాకు తెలుసు
నీకు దేవుడే అండగా నిలుచు
ఇది మనసు విరబూయు వయసు
ఇపుడు నిలపాలి చదువుపై మనసు
బుద్దిగా మసలుతూ శ్రద్దగా చదివి
తేవాలి ధనమందు తెలుగుకే వెలుగు


చిత్రం : ఆహుతి (1987)
సంగీతం : సత్యం
రచన  : మల్లెమాల (యం. యస్. రెడ్డి)
గానం : పి.సుశీల 
************************************
sureedu turupuna deepamai velugu
aa velugu lokaanikantatiki velugu(2)
pudami muttaiduva pulakinchipova
siri bottu petti ne teerchinatti
muggule mungiliki mutyala velugu
mutyala velugu

harivillulo leni sogasu
ne chirunavvulo unnadi
sirivennelanu minchu sirulu
ne chiru buggalo unnavi
ee muddu muripalu naku vaibhogalu
ee amma premaku nuvvaanavaalu

digulenduko naku telusu
neku devude andagaa niluchu
idi manasu virabuyu vayasu
ipudu nilapali chaduvupai manasu
buddiga masalutu shraddaga chadivi
tevaali dhanamandu teluguke velugu


Movie Name : Aahuthi (1987)
Music Director : Satyam
Lyricist : Mallemaala (M.S.Reddy)
Singer : P.Susheela

చెబుతా నీకో వింత కధ ఎపుడూ ఎవరూ వినని కధ..... ఆహుతి (1987)

చెబుతా నీకో వింత కధ
ఎపుడూ ఎవరూ వినని కధ(2)
కత్తి కన్న పదునైన కధ
కడలి కన్న లోతైన కధ
కల్లాకపటం తెలియని మనిషికి
కాలం నేర్పిన కక్ష కధ(2)

రెక్కలాడినా డొక్కలాడని కటిక పేదనొకనాడు
రెక్కలున్న నా చెక్కు బుక్కుతో చుక్కల కొనగలనీనాడు
ఎన్ని కోట్లు నాకున్నా నేనెంత ఎత్తులో ఉన్నా
జనమంతా నా వెంటపడుతూ జేజేలు పలుకుతూ ఉన్నా
నాకు తెలుసు నేను చేస్తున్నవన్నీ తప్పులని
అయినా బ్రహ్మరధం పడుతున్నారు ప్రజలు నేను చాలా గొప్పవాణ్ణని
అందుకే అంటున్నాను నీతికి విలువలేదని నిజాయితీకి చోటు లేదని

నిజము తెలుసుకొన్నాను నా నడక మార్చుకొన్నాను
రాతిగుండెతో రాజాలాగ రాజ్యమేలుతున్నాను
అమ్మా అని పిలిచేందుకు తల్లి లేదు
అనురాగం పంచేందుకు ఆలు బిడ్డలు లేరు
ఆత్మీయతకు నోచుకోలేదు ఆప్యాయతకు పెట్టి పుట్టలేదు
అందుకే అంటున్నాను అన్నీ ఉన్నా ఏమి లేనివాణ్ణని
అయినా I am the king అప్పుడు ఇప్పుడు ఎప్పుడు I am the king


చిత్రం : ఆహుతి (1987)
సంగీతం : సత్యం
రచన  : మల్లెమాల (యం. యస్. రెడ్డి)
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
************************************
chebutaa neko vinta kadha
yepudu yevaru vinani kadha(2)
katti kanna padunaina kadha
kadali kanna lotaina kadha
kallakapatam teliyani manishiki
kalam nerpina kaksha kadha(2)

rekkalaadinaa dokkalaadani katika pedanokanadu
rekkalunna na chekku bukkuto chukkala konagalaneenaadu
yenni kotlu nakunnaa nenenta yettulo unnaa
janamantaa na ventapadutu jejelu palukutu unnaa
naku telusu nenu chestunnavannee tappulani
ayinaa brahmaradham padutunnaru prajalu nenu chalaa goppavannani
anduke antunnanu neetiki viluvaledani nijaayiteeki chotu ledani

nijamu telusukonnanu na nadaka marchukonnanu
ratigundeto rajaalag rajyamelutunnanu
ammaa ani pilichenduku talli ledu
anuragam panchenduku alu biddalu leru
atmeeyataku nochukoledu apyayataku petti puttaledu
anduke antunnanu anni unnaa yemi lenivannani
ayinaa I am the king appudu ippudu yeppudu I am the king


Movie Name : Aahuthi (1987)
Music Director : Satyam
Lyricist : Mallemaala (M.S.Reddy)
Singer : S.P.Bala Subramaniam

అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం .... ఆహుతి (1987)


పల్లవి:
అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతిరూపం
ఆ తలపే నా ధ్యానం ఆ అభినవ దేవత నా ప్రాణం
అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతి రూపం

చరణం 1:
మల్లెపూల కన్నా మంచు పొరల కన్నా
నా చెలి ముసి ముసి నవ్వులు అందం...
ఆ... నెమలి హొయలకన్నా...
సెలయేటి లయల కన్నా...
నా చెలి జిలిబిలి నడకలు అందం
అపురూపం ఆ నవ లావణ్యం...
అపురూపం ఆ నవ లావణ్యం
అది నా మదిలో చెదరని స్వప్నం...
అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతిరూపం

చరణం 2:
పైడిబొమ్మ లాంటి ఆమె పక్కనుంటె
పగలే వెన్నెల నే కురిపిస్తా...
ఆ... నీడ లాగ నాతో...
ఏడడుగులు సాగితే...
ఇలలో స్వర్గం నే సృష్టిస్తా...
రస రమ్యం ఆ రాగ విలాసం...ఆ..ఆ..
రస రమ్యం ఆ రాగ విలాసం
వసి వాడదు అది ఆజన్మాంతం

అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతిరూపం
ఆ తలపే నా ధ్యానం ఆ అభినవ దేవత నా ప్రాణం
అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతి రూపం


చిత్రం : ఆహుతి (1987)
సంగీతం : సత్యం
రచన  : మల్లెమాల (యం. యస్. రెడ్డి)
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
************************************
andamaina na uhala medaku avida manideepam
andi andani na ashalaku ame pratirupam
aa talape na dhyanam aa abhinava devata na pranam
andamaina na uhala medaku avida manideepam
andi andani na ashalaku ame pratirupam

malle pula kannaa manchu porala kannaa
na cheli musimusi navvulu andam
aa nemali hoyalakannaa selayeti layalakannaa
na cheli jilibili nadakalu andam
apuram aa navalavanyam(2)
adi na madilo chedarani swapnam
andamaina na uhala medaku avida manideepam
andi andani na ashalaku ame pratirupam

paidi bommalanti aame pakkanunte
pagale vennela ne kuripistaa
nedalaga nato yedadugulu sagite
ilalo swargam ne srustista
rasaramyam aa ragavilaasam(2)
vasivaadadu adi aajanmaantam

andamaina na uhala medaku avida manideepam
andi andani na ashalaku ame pratirupam
aa talape na dhyanam aa abhinava devata na pranam
andamaina na uhala medaku avida manideepam
andi andani na ashalaku ame pratirupam


Movie Name : Aahuthi (1987)
Music Director : Satyam
Lyricist : Mallemaala (M.S.Reddy)
Singer : S.P.Bala Subramaniam

Wednesday, October 17, 2012

పలుకవా ప్రియా ప్రియా.. తెలుపవా ప్రియా ప్రియా... అమెరికా అబ్బాయి (1987)


నీవు బొమ్మవా..ఉహూ..
ముద్దు గుమ్మవా.. ఊహూ హు హు....
మనసు దోచే మరుమల్లె కొమ్మవా
...అహా..అహా...ఆ.. అహహాహా...

పల్లవి :
పలుకవా ప్రియా ప్రియా.. తెలుపవా ప్రియా ప్రియా
వలపు వీణలు మీటిన క్షణం... మలుపు తిరుగును జీవిన పధం
నీవో సగం నేనో సగం.. ఒకటే జీవితం..

పలుకవా ప్రియా ప్రియా.. తెలుపవా ప్రియా ప్రియా
వలపు వీణలు మీటిన క్షణం... మలుపు తిరుగును జీవిన పధం
నీవో సగం నేనో సగం.. ఒకటే జీవితం..
పలుకవా ప్రియా ప్రియా.. తెలుపవా ప్రియా ప్రియా

చరణం : 1
నీవెవరో ఊర్వశివి.. మురిపించే ప్రేయసివి
తలపులలో మెరిశావు.. నా మదిలో వెలిశావు
సన్నిధిలో సరాగాలు... పెన్నిధిగా ప్రసాదించు...
సన్నిధిలో సరాగాలు... పెన్నిధిగా ప్రసాదించు...
ఆశా రధం.. సాగే రిథం నీవే తెలుపవా...
పలుకవా ప్రియా ప్రియా.. తెలుపవా ప్రియా ప్రియా

చరణం : 2
కదలని నీ కన్నులలో కళలెన్నో కన్నాను...
ముసిముసి నీ నవ్వులలో గుసగుసలే విన్నాను
పచ్చని కల ఫలించాలి... వెచ్చని జత సుఖించాలి
పచ్చని కల ఫలించాలి... వెచ్చని జత సుఖించాలి
మన ఈ కథ.. మమతల సుధా.. చెలిమే సంపదా..

పలుకవా ప్రియా ప్రియా.. తెలుపవా ప్రియా ప్రియా
వలపు వీణలు మీటిన క్షణం... మలుపు తిరుగును జీవిన పధం
నీవో సగం... నీవో సగం.. ఒకటే జీవితం..
పలుకవా ప్రియా ప్రియా.. తెలుపవా ప్రియా ప్రియా
పలుకవా ప్రియా ప్రియా.. తెలుపవా ప్రియా ప్రియా
లలలాలల లలాలలాలాల్లా...


చిత్రం : అమెరికా అబ్బాయి (1987)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
రచన  : సి.నారాయణ రెడ్డి
గానం :ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, పి.సుశీల
********************************************
Movie Name : America Abbayi (1987)
Music Director : S.Rajeswara rao
Lyricist : C. Narayana Reddy
Singers : S.P.Balasubramanyam, P.Susheela

ఏ దేశమేగినా... ఎందుకాలిడినా... అమెరికా అబ్బాయి (1987)


పల్లవి :
ఏ దేశమేగినా... ఎందుకాలిడినా...
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ...

రాయప్రోలన్నాడు ఆనాడూ... అది మరిచిపోవద్దు ఏనాడూ

చరణం : 1
పుట్టింది నీ మట్టిలో సీత.... రూపు కట్టింది దివ్య భగవద్గీత
వేదాల వెలసినా ధరణిరా...వేదాల వెలసినా ధరణిరా...
ఓంకార నాదాలు పలికినా అవనిరా
ఎన్నెన్నొ దేశాలు కన్ను తెరవని నాడు
వికసించె మననేల విజ్ఞాన కిరణాలు

ఏ దేశమేగినా... ఎందుకాలిడినా...
ఏ పీఠమెక్కినా.. ఎవ్వరెదురైనా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ...

చరణం : 2
వెన్నెలదీ ఏ మతమురా...?
కోకిలదీ ఏ కులమురా...?
గాలికి ఏ భాష ఉందిరా...?
నీటికి ఏ ప్రాంతముందిరా...?

గాలికీ నీటికీ లేవు భేధాలూ...
మనుషుల్లో ఎందుకీ తగాదాలు కులమత విభేదాలూ

ఏ దేశమేగినా... ఎందుకాలిడినా...
ఏ పీఠమెక్కినా... ఎవ్వరెదురైనా...
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ...

చరణం : 3
గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ..
గాంధీ చూపిన మార్గం విడవద్దూ....
గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ
గాంధీ చూపిన మార్గం విడవద్దూ....

ద్వేషాల చీకట్లూ తొలగించూ..
స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించూ
ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్షా
అందుకే నిరంతరం సాగాలి దీక్షా...
అందుకే నిరంతరం సాగాలి దీక్షా...


చిత్రం : అమెరికా అబ్బాయి (1987)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
రచన  : సి.నారాయణ రెడ్డి
గానం : P .సుశీల
*****************************************
Movie Name : America Abbayi (1987)
Music Director : S.Rajeswara rao
Lyricist : C. Narayana Reddy
Singer : P.Susheela