Showing posts with label Hero Special- Ali songs. Show all posts
Showing posts with label Hero Special- Ali songs. Show all posts

Tuesday, October 29, 2013

సుర్రూ సుర్రనుకురా సూరీడా మమ్ము చల్లంగ చూడరా సూరీడా .... సోంబేరి (2008)

సుర్రూ సుర్రనుకురా సూరీడా
మమ్ము చల్లంగ చూడరా సూరీడా
మండీపడకురా సూరీడా
మేముండే ఎడారిలోనా సూరీడా
రెచ్చిపోయి గుచ్చబోకు సూరీడా
రేయీపగలు కూడ సూరీడా  ||సుర్రూ సుర్రనుకురా||

తెలుగోళ్ళ కుర్రోళ్ళు తెలివిగల కుర్రోళ్ళు పనికని వచ్చారురా
ఈ గల్ఫ్ కి పనికని వచ్చారురా
చాకులాంటి కుర్రోళ్ళు చురుకైన కుర్రోళ్ళూ ఉద్యోగాలకొచ్చారురా
ఈ షార్జా కి ఉద్యోగాలకొచ్చారురా
అమ్మానాన్నలకి ఆలుబిడ్డలకి దూరంగా ఉన్నవాళ్ళురా
వీళ్ళ ఆరోగ్యం ఎప్పుడూ ఉక్కులాగ ఉండాలిరా
ఉక్కబోత తగ్గించరా...దేవుడా రక్షించరా  ||సుర్రూ సుర్రనుకురా||

యాభైరెండు డిగ్రీలు  దాటుతున్న ఎండలోనే డ్యూటిలోనే ఉంటారురా
పనికై పాటుపడుతుంటారురా
ఇసుకతుఫానులోన ఎత్తైన మేడలపైన కష్టపడుతుంటారురా
పనిలో కరిగిపోతుంటారురా
ఎర్రనిప్పులైన ఇక పనోళ్ళ చెమటని అర్ఘ్యమున అందుకోరా
నే చెమ్మగిల్లు కళ్ళతోటి మళ్ళీ మళ్ళీ అడుగుతున్న అందరిని ఆదుకోరా
వీళ్ళ ఇళ్ళు ఒళ్ళు కాపాడరా
అల్లా.....అక్బర్
హరీనాం తుం బోలేరో...
హరీనాం తుం బోలేరో...        ||సుర్రూ సుర్రనుకురా||


చిత్రం : సోంబేరి (2008)
సంగీతం :  మనో
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : మనో, శంకర్ మహదేవన్
*********************************************
Movie Name : Somberi (2008)
Music Director : Mano
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Mano, Shankar Mahadevan

కండోమే జర వాడండి బావలు గండాలు రావండి బావలు.... సోంబేరి (2008)

మైనర్ బావలూ....మేజర్ బావలూ
కామశాస్త్రం కన్నా అక్షరఙ్ఞానం కన్నా
అవసరం మీకు కండోము విఙ్ఞానం
కండోమే జర వాడండి బావలు గండాలు రావండి బావలు
కండోమే జర వాడండి బావలు గండాలు రావండి బావలు
సిగ్గూపడకు చిన్న బావ మధ్యనుండి జారిపోకు పెద్దబావ
బతిమాలి...బామాలి
బతిమాలి బామాలి మరదలుగా చెబుతున్నా మరువకండి వాడకం
బావలూ...బావలూ...   ||కండోమే||

యువతీయువకుల దూకుడుకి రక్షణ కవచం కండోము
మొగుడుపెళ్ళాల గొడవలకి మధ్యవర్తి ఈ కండోము
పట్టుగుడ్డకంటె కన్న పెద్దగుంటది గుట్టురట్టు చేయకుండ అడ్డుకుంటది
ప్రేమాభిషేకాలు జరిగేవేళ పట్టాభిషేకం కండోము
జనాభా లెక్కలు పెరగనీయదు జాతికి నేస్తం కండోము
జై జై కండోము జాతికి నేస్తం కండోము    ||కండోమే||

సృష్టికర్త ఆ బ్రహ్మయ్యకి విశ్రాంతినిస్తుంది కండోము
వాడినవాళ్ళకి తగ్గట్టుగా సుఖశాంతులనిస్తుంది కండోము
కడుపులు రాకుండా యవ్వనాన్ని కాపాడుతుంది కండోము
ఆడోళ్ళ కొంగుల్లో మగవాళ్ళ చేతుల్లో అమరిపోతుంది కండోము
పగలు రాత్రి అందరి సేవకి అంకితమవుతుంది కండోము
జై జై కండోము జాతికి నేస్తం కండోము    ||కండోమే||


చిత్రం : సోంబేరి (2008)
సంగీతం :  మనో
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : మాలతి
*********************************************
Movie Name : Somberi  (2008)
Music Director : Mano
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Malathi

సోంబేరే శుద్ధ సోంబేరే సోంబేరే మొద్దు సోంబేరే ....... సోంబేరి (2008)

శుద్ధ బద్ధకం సుందరాంగుడే హే
ముద్దుకోరితే వద్దనెస్తాడే
శుద్ధ బద్ధకం సుందరాంగుడే ముద్దుకోరితే వద్దనెస్తాడే
బుగ్గ గిల్లినా జబ్బ కొరికినా...
బుగ్గ గిల్లినా జబ్బ కొరికినా చలనం గిలనం లేనే లేదు
సోంబేరే శుద్ధ సోంబేరే సోంబేరే మొద్దు సోంబేరే
సోంబేరే శుద్ధ సోంబేరే సోంబేరే మొద్దు సోంబేరే  ||సోంబేరే||

స్కాచ్ లార్జ్ కొట్టే వయసుకి తడి గుడ్డలనే కప్పినాడు
ఇనపకడ్డీలాంటి గుంటడు మూడంగిలా ముడుచుకుంటడు
మంచందాకా తెచ్చినా లంచో బంచో ఇచ్చిన
శరీర కష్టం సచ్చి నష్టమని శవంలాగ నిదరోతడే
ఎంత లేపినా లేవడు వీడే     ||సోంబేరే||

బ్యాంకాక్ లో లేడీస్ కి వచ్చిన మసాజ్ టెక్నిక్ పారలేదే
హాంకాంగ్ లో ట్రైనింగ్ అయ్యిన భంగిమలే పని చేయలేదే
పోరంబోకు పోరడే ఆరంభానికి చేరడే
క్షణిక సుఖానికి గంటలు గంటలు సమయం అసలు పెరికేస్తాడే
సచ్చి ఇచ్చినా ట్రై చేయడే   ||సోంబేరే||


చిత్రం : సోంబేరి (2008)
సంగీతం :  మనో
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : కల్పన
*********************************************
Movie Name : Somberi (2008)
Music Director : Mano
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : Kalpana

బోర్లా పడుకున్నా వెల్లకిలా పడుకున్నా పక్కకు తిరిగి పడుకున్నా .... సోంబేరి (2008)

బోర్లా పడుకున్నా వెల్లకిలా పడుకున్నా
బోర్లా పడుకున్నా వెల్లకిలా పడుకున్నా పక్కకు తిరిగి పడుకున్నా
ముడుచుకుని పడుకున్నా ఎట్టా పడుకున్నా నిదర పట్టడం లేదు
ఏం బాధరా మన్మథా ఇదేం బాధరా మన్మథా
ఏం బాధరా మన్మథా ఇదేం బాధరా మన్మథా      
||బోర్లా పడుకున్నా||

నో అంటే ఒక్క బాధ పోవే అంటే అదో బాధ
పెండింగ్ పెడితే పెద్ద బాధరా
ఓకే అంటే ఒక్క బాధ ట్రీట్ అంటే అదో బాధ
డైటింగ్ అంటే మరో బాధరా
దీంతో స్లోగా ఉంటే ఒక్క బాధ
స్పీడైపోతే ఇంకో బాధ
మూడవుటైతే మహా బాధరా
ఫ్రీగా ఉంటే ఒక్క బాధ
ఫ్రీడమిస్తే మరో బాధ
ఈగో వస్తే ఇంకో బాధరా
అరే నిదర రాక రాత్రి బాధ నిదర పడితే కలల బాధ
కలలలోన గిలల బాధరా
గర్ల్ ఫ్రెండ్ తో ఇదేమి బాధరా         ||ఏం బాధరా||

కిస్సడిగితె ఒక్క బాధ
ప్లస్సడిగితె మరో బాధ
యస్స్ నోలు యమా బాధరా
వెయిట్ చెయ్యమంటె బాధ
దులిపి కయ్యిమంటె బాధ
దూరముంచుతుంటె బాధరా
సెల్ ఫోన్ చేస్తె ఒక్క బాధ చెయ్యకుంటె అదో బాధ
లొల్లి పెట్టుకుంటె బాధరా
లుక్స్ తోటి ఎక్స్ బాధ నవ్వుతోటి వై బాధ
జలక్ తోటి జెడ్ బాధరా
వయసు బాధ మనసు బాధ
బుగ్గ బాధ సిగ్గు బాధ
తిక్కితిక్క తీపి బాధరా
గర్ల్ ఫ్రెండ్ తో ఇదేమి బాధరా            ||ఏం బాధరా||


చిత్రం : సోంబేరి (2008)
సంగీతం :  మనో
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : మనో, చిత్ర
*********************************************
Movie Name : Somberi  (2008)
Music Director : Mano
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Mano, Chitra

కోతికి తోక ఎందుకుంటుంది గురూ ..... సోంబేరి (2008)

కోతికి తోక ఎందుకుంటుంది గురూ
కొమ్మకొమ్మలు వేలాడేందుకు శిష్యా
అద్భుతం..
కుక్కకి పళ్ళు ఎందుకుంటాయి గురూ
పిక్క పట్టుకుని పీకేటందుకు శిష్యా
ఆహా హా...ఓహో హో...
ముక్కు పొడుం కి కంది పొడుం కి తేడా ఏమిటి గురూ
నాయనా..ముక్కు పొడుం ని ఎగబీల్చాలి
కంది పొడుం ని దిగమింగాలి
ఓహో హో...ఓహో హో...
హనీమూన్ కి ఏ ప్లేస్ బెటరు గురూ
గడ్డపలుగు లాంటి వయసులో గడ్డివామైనా కాశ్మీరే శిష్యా...
దారి చూపించారు ధన్యులం

తాగుబోతు మొగుణ్ణి మార్చేదెలా...గురూ
అమ్మా..భర్త క్వార్టరు కొడితే భార్య హాఫ్ కొట్టి వాణ్ణి ఫుల్లుగా కొట్టాలి తల్లీ...
కట్టుకున్నదానికి ఉంచుకున్నదానికి తేడా ఏమిటి గురూ
కట్టుకున్నదేమో కర్మఫలం రా ఉంచుకున్నదేమో పాపఫలం రా
తమరి బోధ పరమాద్భుతం
అయ్యప్పకొండకి తిరుపతికొండకి తేడా ఏమిటి గురూ
అయ్యప్పకొండ పెంచుకొనుట తిరుపతికొండ గొరిగించుకొనుట
ఆహా హా...ఓహో హో...
తీసిన సినిమా హిట్టవడానికి ఏం చేయాలి గురూ
తీసిన కథనే తీసీ తీసీ తోసెయ్యాలి శిష్యా
సూపర్ ఐడియా ధన్యులం
సూర్యుడు తూర్పున ఉదయించుటెందుకు గురూ
పడమర దిశలో..పడమర దిశలో అస్తమించేందుకే..శిష్యా
వన్స్ మోర్ వన్స్ మోర్

అన్ని కులాలకు న్యాయం జరిగే మార్గం ఏమిటి గురువా
తందానా తందాన గురువు నందనాన
ఒక్కొక్క కులమొక్క పార్టీ పెడితే చిక్కులు తీరేను శిష్యా
తందానా తందాన శిష్య నందనాన
తరిగట జమ్మరిగతా
పార్టీకి నష్టము ఎందుకు గురూ
ప్రజాసేవ కర్తవ్యమన్నందుకు శిష్యా
ఏడుకొండలవాడ గోవిందో హాయ్
మీ ఆశీస్సులు కావాలంటే ఏమి చేయాలి గురూ
క్యాషీస్సులు మీరిస్తే చాలు ఆశీస్సులు మేమిస్తాం మీకు శిష్యా
శ్రీ సందేహానంద స్వామీజీకి జై


చిత్రం : సోంబేరి (2008)
సంగీతం :  మనో
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : మనో, జొన్నవిత్తుల, సాకేత్, శ్రీదేవి
*********************************************
Movie Name : Somberi  (2008)
Music Director : Mano
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Mano, Jonnavithula, Saketh, Sridevi