Showing posts with label Hero Special- Mohanbabu songs. Show all posts
Showing posts with label Hero Special- Mohanbabu songs. Show all posts

Sunday, December 1, 2013

బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి ..... తప్పు చేసి పప్పు కూడు (2002)

సమగమ సమాగమగసదా నీ సా
గమదని సమగస నిసదని మదగమ
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
వెన్నెల ముగ్గుల దారులు వేసినదందుకేరా
వీలలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టంలేరా
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి

సరి సరి నటనలతో సరాగం హాయిగ సాగాలి
 సిరి సిరి మువ్వలతో చిత్రంగా చిందులు వేయాలి
మెరుపుల తీగలతో భుజాలే చనువుగ కలపాలి
ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ఒడుపులు చూపాలి
పదపదమంటూ పట్టే పట్టి ప్రేమలొ ఉట్టి కొల్లగొట్టి పోరా
పరవశమవుతూ పైట చెంగు పాల దొంగకప్పగించుకోనా
 ముద్దుల జాణ ముందుకు రాగా మీగడ బుగ్గల నిగ్గులు దోచగ
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి

స్వరములు సరసముగా వయ్యారి చెలిమితో పాడాలి
మురళిని మురిపెముగా మురారి మరిమరి ఊదాలి
యమునా కెరటములా నువ్వే నా యదనే తాకాలి
వరసలు కలుపుకొని వరాలే వయసుకు ఇయ్యాలి
గిలగిలమంటూ పొన్న చెట్టు మీద ఉన్న చీరనందుకోరా
గలగలమన్న గాజులున్న కన్నె చేతి వెన్నముద్దనీనా
మీటగ రారా యవ్వన వీణ మువ్వలు నవ్వగ పువ్వులు ఇవ్వగ
బృందావనమాలి... ఆ...
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి


చిత్రం : తప్పు చేసి పప్పు కూడు (2002)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి 
రచన : 
గానం : కె.జె.యేసుదాసు , కె.ఎస్.చిత్ర  
**********************************************
Movie Name : Tappu Chesi Pappu Kudu (2002
Music Director : M.M.Keeravani
Lyricist : 
Singers : K.J.Yesudas, K.S.Chitra 

Wednesday, October 30, 2013

మనుషుల్లో జెంటిల్ మాన్ పోస్ట్ మాన్ .. పోస్ట్ మాన్ (2000)

సార్ పోస్ట్ ...మేడం పోస్ట్
మనుషుల్లో జెంటిల్ మాన్ పోస్ట్ మాన్ .. పోస్ట్ మాన్
జాబుల్లో గ్రేటు జాబు పోస్ట్ మాన్ .. పోస్ట్ మాన్
మనుషుల్లో జెంటిల్ మాన్ పోస్ట్ మాన్
జాబుల్లో గ్రేటు జాబు పోస్ట్ మాన్
పోస్ట్ మాన్ లేని ఊరు వేస్టురా కన్నా
నీ బెస్టు ఫ్రెండు పోస్ట్ మాన్ తెలుసుకో నాన్నా
పట్టణాలకైనా పల్లెలకైనా వార్తలెన్నో మోసుకొచ్చే వారధేరా ఈ పోస్ట్ మాన్
సారథేరా ఈ పోస్ట్ మాన్ ||మనుషుల్లో||

రామయ్యా ఉంగరాన్ని సీతమ్మకిచ్చిన హనుమానేరా మొదటి పోస్ట్ మాన్
ముల్లోకాల వార్తలన్ని అక్కడికిక్కడ లింకుపెట్టిన నారదుడేరా మేటి పోస్ట్ మాన్
రాజూరాణిల ప్రేమపురాణం రాజమహెంద్రం కోట రహస్యం
మేఘాలల్లో వేగాలతో రెక్కలచాటున భద్రం చేసి
గమ్యం చేర్చిన వార్త విహారీ పావురమేరా స్పీడు పోస్ట్ మాన్
దాని వారసుడేరా నేటి పోస్ట్ మాన్  ||మనుషుల్లో||

భూగోళ్ళమ్మీద ఉన్న ప్రతి ఒక్కరితోను ఉత్తరబంధం ఉన్న ఉత్తముడేరా పోస్ట్ మాన్
ప్రేమపెళ్ళి అనుబంధాలకి మానవజీవన సంబంధాలకి
ముద్దర వేసీ ముందుకు నడిపేవాడు పోస్ట్ మాన్
కులము మతము పట్టనివాడు పేద గొప్ప చూడనివాడు
సరిహద్దుల్లో సైన్యానికి ప్రేమపెద్దలు పంచేవాడు ప్రజలందరికి చుట్టము వీడు
సహనముతోనే రోజూ సాగేవాడు
శుభము జయమూ మీకు అందిస్తాడు   ||మనుషుల్లో||


చిత్రం :  పోస్ట్ మాన్ (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత Jr
*******************************************************
Movie Name :  Post Man (2000)
Music Director : Vandemataram Srinivas
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Udith Narayan, Swarnalatha

Tuesday, October 29, 2013

జై దుర్గా జై జై జైశక్తి జై దిగి రావమ్మా ....... పుణ్యభూమి నా దేశం (1994)

జై దుర్గా జై జై జైశక్తి జై
దిగి రావమ్మా ఇక మాకోసమై
జై దుర్గా జై జై జైశక్తి జై
దిగి రావమ్మా ఇక మాకోసమై
కళ్ళురిమినావో రక్కసులే అంతం
కరుణించినావో లక్ష్మీప్రసన్నం      ||జై దుర్గా||

ఘ్రీంకారి లయకారి హూంకారి రావే మాంకాళి
ఘ్రీంకారి లయకారి హూంకారి రావే మాంకాళి

ఆ....ఆవేశమే త్రిశూలమై మర్దించగా ఇక దీవించవే
ఈ....ఉద్రేకమే రుద్రాంశతో ఉప్పొంగగా శుభం చేకూర్చవే
జయీభవ అనవే జైదుర్గా జగమంతా శాంతివనం చేస్తానే           ||జైదుర్గా||

ఘ్రీంకారి లయకారి హూంకారి రావే మాంకాళి
ఘ్రీంకారి లయకారి హూంకారి రావే మాంకాళి

నీ.....భక్తునితో తలపడితే తలలే తెగునే ఇలలోన
ఎదుటపడి ఎదురించి బ్రతికేదెవరే ఇకపైన
పిడికిలి బిగిసిన చాలులే హడలెత్తిపోవాలి లోకాలన్ని          ||జైదుర్గా||


చిత్రం : పుణ్యభూమి నా దేశం (1994)
సంగీతం : కె. వి. మహదేవన్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
*********************************************
Movie Name : Punyabhumi Naa Desham (1994)
Music Director : K.V.Mahadevan
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : S.P.Balasubramanyam, K.S.Chitra

ఓ టీనేజీ స్వీటీ బ్యూటీ రమ్మనె..... పుణ్యభూమి నా దేశం (1994)

folks lets celebrate together
ఓ టీనేజీ స్వీటీ బ్యూటీ రమ్మనె
దానిమ్మ టూటీ ఫ్రూటీ ఇమ్మనె
కౌగిట్లో పోటాపోటీ కమ్మనె
తేనె ముద్దిమ్మనె
డ్రెస్సుల్లో నీ యవ్వనం
తొక్కన్ని అంటున్నది చందనం
సయ్యంటు చెప్పా నీకే స్వాగతం
తాకితే తకిటతోం
చుమ్మా చుమ్మా చురుక్కుమంది
సున్నా నడుమే తళుక్కుమంది
అమ్మ ఊపే హుషారుగుంది బొమ్మాబొరుసే కసెక్కుతోంది
ముద్దొచ్చే బేబీ కాబోయే బీవీ పాడనలల్లుబీ
లవ్ లవ్ లవ్ పాప లవ్ లవ్ లవ్ లవ్ పాప లవ్

హే ఓసోసి ఆంటీ నాతోటి ఏంటి
నీకేమో ఫిఫ్టీ నాకా ట్వంటీ
ఓల్డేజులోన ఓల్టేజీ పెరిగి లైను వేసావటే
1/2 కాలేనే నా రూటే వేరేలే                     ||ఓసోసీ ఆంటీ||

అబ్బో యబ్బ గులాబు దెబ్బ అందం జంజంగున్నాదబ్బ
డబ్బు డుబ్బు ఉన్నాదబ్బ వయసే ఇబ్బందబ్బ
ఒడ్డూ పొడుగు బాగున్నావని ఓకే చేశానబ్బ
పైపైకొచ్చి సైసై అన్నా ఇరుకున పడలేనబ్బా
చిత్తూరు వాన్నే చిక్కేది లేదే ఈడు తేడా కదే
నీతోనే రాలేనే నీ జోడీ కాలేనే             ||ఓసోసీ ఆంటీ||

చిందు ఎత్తేతి ఏస్తే సోసి ఏడి పుట్టింది నా ఈడుకి
మందు వద్దన్న కొద్ది ఏసి ఊపు తెచ్చావు నా ఒంటికి
నాలుగు పదుల అనుభవమంత నైసుగ చెపుతారా
నాకు కిక్కెక్కినాదె నీకు దిమ్మతిరిగెను ముప్పొద్దులూ
హాయ్ హంభక్కు బ్యూటీ తైతక్క ఆపు తిక్కరేపొద్దిక
నీ జోరు యమబోరు ఇక చాలు నకరాలు               ||ఓసోసీ ఆంటీ||


చిత్రం : పుణ్యభూమి నా దేశం (1994)
సంగీతం : కె. వి. మహదేవన్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
*********************************************
Movie Name : Punyabhumi Naa Desham (1994)
Music Director : K.V.Mahadevan
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : S.P.Balasubramanyam, K.S.Chitra

Sunday, November 4, 2012

బోయవాని వేటుకు గాయపడిన కోయిల .... రౌడీ గారి పెళ్ళాం (1991)


బోయవాని వేటుకు గాయపడిన కోయిల
బోయవాని వేటుకు గాయపడిన కోయిల
గుండెకోత కోసినా చేసినావు ఊయల ||బోయవాని||

చరణం 1
తోడులేని నీడలేని గూడులోకి వచ్చింది
ఆడతోడు ఉంటానని మూడుముళ్ళు వేయమంది
రాయికన్న రాయిచేత రాగాలు పలికించి
రాక్షసుణ్ణి మనిషిచేసి తన దైవం అన్నది
ఏనాటిదో ఈ బంధం ||బోయవాని||

చరణం 2
చేరువైన చెలిమికి చుక్క బొట్టు పెట్టనీ
కరునచిందు కనులకు కాటుకైన దిద్దనీ
మెట్టినింటి లక్ష్మికీ మెట్టె నన్ను తొడగనీ
కాబోయే తల్లికీ గాజులైన వేయనీ
ఇల్లాలికేదేలే సీమంతం ||బోయవాని||

చిత్రం : రౌడీ గారి పెళ్ళాం (1991)
సంగీతం : బప్పిలహరి
రచన :
గానం : K.J.ఏసుదాసు

భూమికి పచ్చాని రంగేసినట్టో అమ్మలాలా ...... శ్రీరాములయ్య (1998)















పల్లవి :
భూమికి పచ్చాని రంగేసినట్టో అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా
ఆలి పుస్తెలమ్ముకొని
అప్పు తీర్చుకుంటివో అమ్మలాలా
వలవలవల ఏడ్చుకుంటూ
వలసెల్లిపోతివో అమ్మలాలా
పురుగులమందే నీకు
పెరుగన్నమాయనో అమ్మలాలా
చెరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో
పంటలు చేతికొస్తే పండుగ చేద్దామురో ॥

చరణం : 1
జాతరమ్మ జాతరమ్మ
కూలిజనం జాతరో అమ్మలాలా
ఎత్తుపల్లాలనే చదును చేసే జాతరో అమ్మలాలా
చేలు దున్ని చాళ్లుదీసె
బీదబిక్కి జాతరో అమ్మలాలా
ఎద్దుకొమ్మల నడుమ ఎర్రపొద్దు పొడిచెరో
భూస్వామి గుండెలధర గుడిసెలోల్ల జాతర ॥

చరణం : 2
చెమట జల్లు చిలకరిస్తే
నేల పులకించురో అమ్మలాలా
వానొస్తే భూతల్లి శీమంతమాడురో అమ్మలాలా
తంగెళ్లు గన్నేర్లు
పసుపు కుంకుమిచ్చురో అమ్మలాలా
పశుల మెడన చిరుగజ్జెలు ఘల్లున మ్రోగేనో
గజ్జెల మోతల్లో పల్లె పరవశించెను ॥

చరణం : 3
ఎగువ పెన్నమ్మమతల్లి
ఎగిరెగిరి దుమికితే అమ్మలాలా
తుంగభద్రమ్మ పొంగి
పరవళ్లు తొక్కితే అమ్మలాలా
చిత్రంగ చిత్రావతి చిందులు ఆడితే అమ్మలాలా
నేలతల్లి నీళ్లాడి పసిడిపంటలిచ్చురో
నా సీమకన్నుల్లో వెలుగులు నిండేనురో ॥


చిత్రం : శ్రీరాములయ్య (1998)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన : కలెకూరి ప్రసాద్
గానం : కె.జె.ఏసుదాస్, బృందం
********************************************
Movie Name : Sriramulayya (1995)
Music Director : Vandematharam Srinivas
Lyricist : Kalekoori Prasad
Singers : K.J.Yesudas, Chorus

Friday, September 7, 2012

తనన... రేపల్లె మళ్లీ మురళి విన్నదీ .... అల్లరి మొగుడు (1992)














పల్లవి :
తనన... ఆ... తనన... ఆ... (2)
తనన... రేపల్లె మళ్లీ మురళి విన్నదీ
తనన... ఆ పల్లె కళే పలుకుతున్నదీ
తనన... ఆ జానపదం ఝల్లుమన్నదీ
తనన... ఆ జాణ జతై అల్లుకున్నదీ
మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక
ఎదను పరిచి వేసేయ్యనా ప్రణయవేదిక
మల్లెనవ్వు మారాణి ఈ గొల్ల గోపికా
మూగమనసు వింటున్నది మురళి గీతికా
॥రేపల్లె॥
తానన తందానన తఝం తఝం ఝం

చరణం : 1
ఆ... పెంకితనాల పచ్చిగాలి ఇదేనా
పొద్దుపోని ఆ ఈలలే నా ఈ ఆలాపన
ఆ... కరుకు తనాల కన్నెమబ్బు ఇదేలా
ఇంతలోనే చిన్నారి చినుకై చెలిమే చిలికెనా
అల్లరులన్నీ పిల్లనగ్రోవికి స్వరములిచ్చేనా
కళ్లెరజేసే కిన్నెరసానికి సరళినచ్చేనా
మెత్తదనం... తందననా మెచ్చుకునే
గోపాలకృష్ణయ్య గారాలు చెల్లించనా
॥రేపల్లె॥
ససరిసరి సరి సరి పనిని పప నినినినినిని

చరణం : 2
నీ... గుండె వినేలా వెంట వెంట ఉండేలా
గొంతులోని రాగాలు పంపాను ఈ గాలితో
ఆ... ప్రేమ పదాలా గాలిపాట స్వరాలా
పోల్చుకోని కలిపేసుకున్నాను నా శ్వాసలో
ఎక్కడవున్నా ఇక్కడ తిన్న వెన్నే వేణువయ్యే
కొంగునులాగే కొంటెతనాలే కంటికి వెలుగయే
వన్నెలలో... తందననా వెన్నెలలే
వెచ్చని వెల్లువలయ్యే వరసిదీ ॥


చిత్రం : అల్లరి మొగుడు (1992)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి, బాల సుబ్రహ్మణ్యం , కె.ఎస్. చిత్ర
***************************************
Movine Name : Allari Mogudu (1992)
Music Director : M.M.Keeravani
Lyricist : Sirivennela Sitarama Sastry
Singers :  S.P.Bala Subramaniam, K.S.Chitra

నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ........ అల్లరి మొగుడు (1992)


నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో
బాత్ టబ్బు షవరులో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే నో నో
అకస్మాత్తుగా అదే మత్తుగా సుఖం ఎక్కడో పుట్టగా
నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో
బాత్ టబ్బు షవరులో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే నో నో
అకస్మాత్తుగా అదే మత్తుగా రహస్యములు చే చూడగా

హొమగుండమయ్యె భామ కౌగిలి కవ్వింతలే కేరింతలై జ్వలించగా
ప్రేమ కోటి రాసి పెరిగె ఆకలి ముద్దెంగిలి తీపెక్కువై నోరూరగా
ఎడతెగనీ తపనా… ఎడమవగా తగునా…
వగరు వయసు అడుగు ముడుపులన్నీ తడిమి చూసి తపన పెంచనా
నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో
బాత్ టబ్బు షవరులో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే నో నో

ఊసులాడుకున్న రాసలీలలో తెల్లారని ఉయ్యాలలే ఊపేసుకో
ఊపిరంటుకున్న తీపి మంటలో వేన్నీళ్ళకే చన్నీళ్ళుగా వాటేసుకో
కథ ముదిరే మదనా… లయలివిగో లలనా…
జలక జతుల కలికి కులుకులన్నీ చిలుక చుట్టి పులకరించనా

నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో
బాత్ టబ్బు షవరులో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే నో నో
అకస్మాత్తుగా అదే మత్తుగా రహస్యములు చే చూడగా
నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో ఏమో
బాత్ టబ్బు షవరులో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే నోనో నోనో
అకస్మాత్తుగా అదే మత్తుగా సుఖం ఎక్కడో పుట్టగా

చిత్రం : అల్లరి మొగుడు (1992)
సంగీతం : M.M. కీరవాణి
రచన : సిరివెన్నెల
గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం , చిత్ర