Showing posts with label Saluri Vasu Rao Musical Hits. Show all posts
Showing posts with label Saluri Vasu Rao Musical Hits. Show all posts

Friday, April 19, 2013

తెలుగు తల్లికి జేజేలు.....వెలుగు వెల్లువకు జోహార్లు... మా తెలుగు తల్లికి జేజేలు ( ప్రైవేటు గీతం)

సాకీ :
కడలి అంచులు దాటి
కదిలింది తెలుగు
ఎదలలోతులు మీటి ఎగిసింది తెలుగు... ఆ...

పల్లవి :
ఆ తెలుగు తల్లికి జేజేలు
ఆ వెలుగు వెల్లువకు జోహార్లు...
మా తెలుగు తల్లికి జేజేలు
ఆ వెలుగు వెల్లువకు జోహార్లు
మా తెలుగు తల్లికి జేజేలు

చరణం : 1
ఏ భాష చెణుకైన ఏయాస చినుకైన
తనలోన కలుపుకుని తరలింది తెలుగు
॥భాష॥
ఒదిగొదిగి పోతన్న ఒరవళ్లలో సాగి (2)
హుమ్మంటు వేమనగ ఉరిమింది తెలుగు (2)
॥తెలుగు॥
సగమ గమ సగమ గమ గమప మప గమప మప

చరణం : 2
అభినయానికి హృదయమర్పించుకుని
కూచిపూడియే నాడిగా ఆడింది తెలుగు
॥
సంగీతమే జీవ సంపుటిగ... ఆ...
సంగీతమే జీవ సంపుటిగ త్యాగయ్య
ప్రతిపదములో కరిగి పాడింది తెలుగు (2)
॥తెలుగు॥

చరణం : 3
స్వాతంత్య్ర సమరాన స్వచ్ఛంద గతులీన
ఉగ్రనేత్రం తెరిచి ఉరికింది తెలుగు
॥
శాంతికి కపోతమై క్రాంతి జలపాతమై (2)
నిత్య వర్థిష్ణువై నిలిచింది తెలుగు (2)
॥తెలుగు॥


ప్రైవేటు గీతం : మా తెలుగు తల్లికి జేజేలు
సంగీతం : సాలూరి వాసూరావు
రచన : డా॥సి.నారాయాణరెడ్డి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం