Showing posts with label Trivikram Srinivas-Lyrics. Show all posts
Showing posts with label Trivikram Srinivas-Lyrics. Show all posts

Thursday, November 29, 2012

కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేల.... ఒక రాజు ఒక రాణి (2003)

చికిత చికిత తం చికి చికి చికితం
థకిట థకిట తం చికినక చికితం
చికిత చికిత తం చికి చికి చికితం
థకిట థకిట తం చికినక చికితం

పల్లవి :
కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేల
కలిపి చూడాలి నింగీ నేల ఇంద్రధనసు ఉయ్యాలయ్యెల
చలి పుట్టే ఎండల్లోన చెమటొచ్చే వానేదైనా
గడిపేద్దాం కాసేపైనా..
nine o' clock కూసే కొడి round the clock ఆడి పాడి
సరదాగా గడిపెద్దామా  హో ..
కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేల

చరణం : 1
ప్రియురాలై ఈ నేల ఆకాశం చూసే వేళ
కదిలొచ్చే ప్రతి చినుకు ఓ ముత్యం అయిపోలేదా
ప్రతి పూవ్వు చిరునవ్వై చెప్పాలి హెల్లో...
ఈ గాలి జో లాలి పాడాలి ఇలలో
కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం
తెచ్చేద్దాం ఇప్పటికైనా హో...
కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం
తెచ్చేద్దాం ఇప్పటికైనా హో..హో..
కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేల

చరణం : 2
చెయ్యెత్తి  పిలిచానా చుక్కల్లో చంద్రుడు కూడా
పరిగెత్తి దిగివచ్చి నా జళ్ళొ పూవైపోడా
కొమ్మలనే కుర్చీలా వాడే కోయిల
వాసంతం విరిసింది కూ అనవే ఎలా
వదిలేద్దాం కోపం ద్వేషం నవ్వేగా నా సందేశం
పుట్టడమే విజయం కాదా హో..
వదిలేద్దాం కోపం ద్వేషం నవ్వేగా నా సందేశం
పుట్టడమే విజయం కాదా హో..హో..


చిత్రం : ఒక రాజు ఒక రాణి (2003)
సంగీతం : చక్రి
రచన : త్రివిక్రమ్ శ్రీనివాస్
గానం : కౌసల్య
***********************************
Movie Name : Oka Raju Oka Rani (2003)
Music Director : Chakri
Lyricist : Trivikram Srinivas
Singer : Kousalya

స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా... ఒక రాజు ఒక రాణి (2003)














స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా
స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా
స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా
ఎండలో ఇలా పూల వాన లా
మెరుపు కూడ మల్లె తీగలా
నేలపై ఇల నా అడుగు నిలవదా
లోకమంత కొత్త చోటు లా
నువ్వు తప్ప కళ్ళ ముందు లేరు యెవరు నమ్మవా
స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా

రేయి చీర కప్పుకున్న చందమామని
నిన్ను చూసి ఒక్కసారి పలకరించి వెళ్ళనీ
తారలన్ని అల్లుకున మేఘమాలని
వాలు కళ్ళ సాగరాన కాటుకల్లె మారని
వాలె పొద్దులా జారె నీ జడ నడుము పై నాట్యమె ఆడితే
విరిసె పువ్వుల కురిసె మంచుల
నువ్వల చల్లగ నవ్వితె
నేను చూడలెను చూసక ఆగలేను
ఎన్నాళ్ళు నిన్ను ఒదిలి ఉండను
స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా

మూసి ఉన్న రెప్పలలో కలల వనములా
నిదుర రాని వేలలోన కలవరింతల ఇలా
ఊపిరంత ఊహలతొ నిండిపోయినా
గుండె లోన నిన్ను ఇంక దాచి ఉంచడం ఎలా
నేనె నేనుగ లేనె లేనుగ
నాకే వింతగ ఉందిగ
నీల ఎవరు నన్నె ఎపుడు కమ్ముకోలేదులే ఇంతలా
రెయ్యి నిద్దుర రాదు
పగలంత కునుకు లేదు
ఆసలేమైందో నాకే తెలియదు
స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా

చిత్రం : ఒక రాజు ఒక రాణి (2003)
సంగీతం : చక్రి
రచన : త్రివిక్రమ్ శ్రీనివాస్
గానం : చక్రి
*******************************************
Swarala veena eevela lona neekemayinde aakasama
Swarala veena eevela lona neekemayinde aakasama
Endalo ila poola vaanala merupu kuda malle theegala
Nelapai ila na adugu nilavada lokamantha kotha chotula
Nuvvu thappa kalla mundu leru evaru nammava

Swarala veena eevela lona neekemayinde aakasama

Reyi cheera kappukunna chandamamani
Ninnu chusi okkasari palakarinchi vellani
Tharalanni allukunna meghamalani
Valu kalla sagarana katukalle maarani
Vaale poddula jaare nee jada nadumupai natyame aadithe
Virise puvvula kurise manchula nuvvala challaga navvithe
Nenu chudalenu chusaka aagalenu ennallu ninnu vadili undanu

Swarala veena eevela lona neekemayinde aakasama

Musi unna reppalalo kalala valavana
Nidura rani velalona kalavarinthala ila
Upirantha uhalalo nindi poyina
Gundelona ninnu inka daachi unchadam ela
Nene nenuga lene lenuga naake vinthaga undigaa
Neela evvaru nanne eppudu kammukoledule inthalaa
Reyi nidura raadu pagalantha kunuku ledu asalemayindo naake theliyadu

Swarala veena eevela lona neekemayinde aakasama
Endalo ila poola vaanala merupu kuda malle theegala
Nelapai ila na adugu nilavada lokamantha kotha chotula
Nuvvu thappa kalla mundu leru evaru nammava

Swarala veena eevela lona neekemayinde aakasama


Movie Name : Oka Raju Oka Rani (2003)
Music Director : Chakri
Lyricist : Trivikram Srinivas
Singer : Chakri

నా ప్రాణం నా ప్రణయం నా లోకం అన్నీ నువ్వే......... ఒక రాజు ఒక రాణి (2003)


నా ప్రాణం నా ప్రణయం నా లోకం అన్నీ నువ్వే
నా మౌనం నా గానం నా గుండెల సవ్వడి నువ్వే (2)

నువ్వే.. ఆశ  నువ్వే.. శ్వాస నువు లేని ఈ నిముషం
యుగమైనా అవదుగా
నా ప్రాణం నా ప్రణయం నా లోకం అన్నీ నువ్వే
నా మౌనం నా గానం నా గుండెల సవ్వడి నువ్వే

నాలో ఉన్న నిన్ను మరిచేపోలేని నేను
తీరంలేని అలలా నిజమే కాలేని కలలా
నాలో లేని నేను కలవాలంటూనే నిన్ను
నీరే లేని నదిలా కన్నీరై ఉన్న మదిలా
వర్షం కోరి ఎండే చూసి మండే భూమిలా
ప్రేమే కోరి విరహం చూసి మిగిలా నేనిలా
వేరే దారి చూపే వేళ నిన్నే చేరుకోనా
నా ప్రాణం నా ప్రణయం నా లోకం అన్నీ నువ్వే
నా మౌనం నా గానం నా గుండెల సవ్వడి నువ్వే

నీ కౌగిళ్ళలోనే కాలం మాయమవనీ
నీ వేడి ఊపిరిలో ఇక నన్నే కరిగిపోనీ
నా ప్రతి అడుగులోనూ వెంటాడే జ్ఞాపకాలు
నువ్వే లేని నాడు చనిపోయే వరమే చాలు
వెళ్ళే దారి ముళ్ళే చల్లి నన్నే ఆపితే
నీళ్ళే మారి నిప్పై పొంగి నన్నే ముంచితే
గాలే జాలిచూపే వేళా పూవై చేరుకోనా

నా ప్రాణం నా ప్రణయం నా లోకం అన్నీ నువ్వే
నా మౌనం నా గానం నా గుండెల సవ్వడి నువ్వే
నువ్వే.. ఆశ  నువ్వే.. శ్వాస నువు లేని ఈ నిముషం
యుగమైనా అవదుగా
నా ప్రాణం నా ప్రణయం నా లోకం అన్నీ నువ్వే
నా మౌనం నా గానం నా గుండెల సవ్వడి నువ్వే


చిత్రం : ఒక రాజు ఒక రాణి (2003)
సంగీతం : చక్రి
రచన : త్రివిక్రమ్ శ్రీనివాస్
గానం : చక్రి
*****************************************
Movie Name : Oka Raju Oka Rani (2003)
Music Director : Chakri
Lyricist : Trivikram Srinivas
Singer : Chakri