Showing posts with label రావు బాలసరస్వతీదేవి పాడిన పాటలు. Show all posts
Showing posts with label రావు బాలసరస్వతీదేవి పాడిన పాటలు. Show all posts

Thursday, November 8, 2012

పలుకరాదటే చిలుకా ఉలుకులేటికే ......... షావుకారు (1950)


పల్లవి :
పలుకరాదటే చిలుకా ఉలుకులేటికే
పలుకరాదటే వలపు చిలుకరాదటే
చిలుకా పలుకురాదటే

చరణం :
మనసులొకటి అయితే మరి మాటతో పనేలా
మనసులొకటి అయితే మరి మాటతో పనేలా
కన్నె బాసలింతేనని ఎదుట నిలచి పలుకరని
కన్నె బాసలింతేనని ఎదుట నిలచి పలుకరని
తెలుసుకొంటినే చిలుకా పలుకువింటినే
నీ పలుకు వింటినే
చిలుకా తెలుసుకొంటినే


చిత్రం : షావుకారు (1950)
సంగీతం : ఘంటసాల వెంకటేశ్వర రావు 
రచన : సీనియర్ సముద్రాల రాఘవాచార్య 
గానం : ఘంటసాల , రావు బాలసరస్వతి దేవి 
**************************************
Movie Name : Shavukaru (1950)
Music Director : Ghantasala Venkateshwara Rao
Lyricist : Samudrala Raghavacharya (senior)
Singers : Ghantasala , Rao Bala Saraswathi Devi

Sunday, November 4, 2012

ప్రేమయే జనన మరణ లీల ....మృత్యుపాశమే అమరబంధమౌ..... ఆహుతి (1948)


ప్రేమయే జనన మరణ లీల
మృత్యుపాశమే అమరబంధమౌ ||2||
యువప్రాణుల మ్రోల... ఆ...
యువప్రాణుల మ్రోల... ||ప్రేమయే||

చరణం : 1
ఆకాశమె చెరువయై తోచె
అలలె పొంగి హాయిగ వీచె ||ఆకాశమె||
జీవితమంతా ఒకే పాటుగా
ఎప్పటికీ మనమే ||ప్రేమయే||

చరణం : 2
మధుర మధురతరమైన వాంఛలే
హృదయ సదనమును పరిపాలించె ||మధుర||
సుకృత జన్మము మాదే సఫలం సుఖమే ఈ వేళ ||ప్రేమయే||

చరణం : 3
తను సాంగత్యము త్రుటియే కాదా ||2||
నిలచు దృఢముగా మానసగాధ ||2||
మృత్యుపాశమే అమరబంధమౌ ||2||
యువప్రాణుల మ్రోల... ||ప్రేమయే||


చిత్రం : ఆహుతి (1948)
సంగీతం : సాలూరి రాజేశ్వర్ రావు
రచన : శ్రీ శ్రీ
గానం : రావు బాల సరస్వతీ దేవి
***********************************
Movie Name : Aahuthi (1948)
Music Director : Saluri Rajeswar rao
Lyricist : SriSri
Singer : Rao Bala saraswathi devi
( శ్రీ శ్రీ గారు సినిమాలకు రాసిన మొదటి పాట )