Showing posts with label Raj-Koti Musical Hits. Show all posts
Showing posts with label Raj-Koti Musical Hits. Show all posts

Tuesday, October 29, 2013

అభిమతమో అభినయమో ఈ ప్రేమ ..... జయమ్ము నిశ్చయమ్మురా (1989)

అభిమతమో అభినయమో
ఈ ప్రేమ చతురాతి చతురం
అభిమతమో అభినయమో
ఈ ప్రేమ చతురాతి చతురం
కలలో రేపును సెగలే
ఎదలో మోవును లయలే
ఇది పెళ్ళికి పిచ్చికి నడుమ విచిత్రం

మధుకలశం హిమశకలం
మన చెలిమి మధురాతి మధురం
మధుకలశం హిమశకలం
మన చెలిమి మధురాతి మధురం
మనసే మమతకు జోడై
మమతే మనిషికి నీడై
ఇటు సాగిన స్నేహమే మైత్రికి అందం              ||అభిమతమో||

కోటి నవ్వులా గూటి గువ్వవు
ఓట మీటగానే మోగు వీణవు
కోమలి కో అంటే ఆరును ఎద మంట
భామిని నో అంటే బాధలు మొదలంటా
సరి అనవా వరమిడవా సరసన నవరస మధురస వీణ     ||మధుకలశం||

మండుటెండలో మంచుకొండవై
స్నేహసుధలలోన భాగమందుకో
ఒంటరి మనుగడలో ఊరట కలిమేలే
బాధల సుడివడిలో బాసట బలిమేలే
వేడుకలో వేదనలో తోడుగ నిలిచెడి స్నేహమే సంపద            ||అభిమతమో||


చిత్రం : జయమ్ము నిశ్చయమ్మురా (1989)
సంగీతం :  రాజ్-కోటి
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
*********************************************
Movie Name : Jayammu Nischayammuraa (1989)
Music Director : Raj-Koti
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : S.P.Balasubramanyam, S.Janaki

ప్రేమ పుట్టిందోయ్ - ఏం చేయమంటావ్ .... పేకాట పాపారావు (1993)

ప్రేమ పుట్టిందోయ్ - ఏం చేయమంటావ్
తోడు రమ్మందోయ్ - ఎందాకంటా
పెళ్ళికి లగ్గం పెట్టండోయ్ - హొయ్యారే అంటా
కార్య గదిలో నెట్టండోయ్ - ఒళ్ళోనే ఉంటా
పెద్దల్లాగ మనవలనెత్తుకు ఆడించండోయ్

ప్రేమ పుట్టిందోయ్ - ఎట్టెట్ట
తోడు రమ్మందోయ్ - ఎందాకంటా
పెళ్ళికి లగ్గం పెట్టండోయ్ - హొయ్యారే అంటా
కార్య గదిలో నెట్టండోయ్ - ఒళ్ళోనే ఉంటా
పెద్దల్లాగ మనవలనెత్తుకు ఆడించండోయ్

ఓ పట్టు నీవిట్టు కలకత్తా స్వీటు
కనికట్టు రసపట్టు నువు పెట్టే గాటు
ఓ బ్యూటీ అందించు పెదవుల్లో జ్యూసు
ఓ మిస్సు ప్రామిస్సు నీ కిస్సే కిస్సు
జోకు మీద జోకు వేసే రాజేంద్రుడు
వీడిపోని తోడునీడ అయినాడు
నీ సయ్యాటకి నా లవ్వాటకి
ఇక టోటల్ నైటే సూపర్హిట్టే ముమ్మాటికి               ||ప్రేమపుట్టిందోయ్||

ఓ బుచ్చి హై పిచ్చి నా అనురాగాలే
ఓ స్వీటీ నీతోటే ఈ సల్లాపాలు
అడిగింది నా షేపు నీ ఆటోగ్రాఫ్
ఎంచక్కా ఇమ్మంటే ఇంకెంతసేపు
ప్రేమ ఊట పెన్నులోన పోశాకనే
తియ్యనైన సంతకాలు చేస్తానే
జత సరసాలలో ఒడి మురిపాలలో
ఈ ఆకతాయి చేసేనంటే ప్యారాహుషార్       ||ప్రేమపుట్టిందోయ్||


చిత్రం :  పేకాట పాపారావు (1993)
సంగీతం :  రాజ్-కోటి
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
*********************************************
Movie Name : Pekata Paparao (1993)
Music Director : Raj-Koti
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : S.P.Balasubramanyam, K.S.Chitra

పుకారే పుకారే ఊరంతా పుకారే ... పేకాట పాపారావు (1993)

పుకారే పుకారే ఊరంతా పుకారే
ఔనంటే హొయ్యారే ఏమైనా తయ్యరే
నన్ను లేపుకుపో అందగాడా సైరా రారా
సర్దుకో ఇక పెట్టాబేడా
అహ ఇద్దరం ఇక తోడూనీడా       ||పుకారే పుకారే||

సిగ్గుపడితే ఒంటిగంట సందడిలో
ముగ్గు పెడతా బుగ్గమీద చక్కెరతో
ఇష్టపడితే ప్రేమ లోతు చూపెడతా
రెచ్చగొడితే రేకు విప్పి జోకొడతా
మోజుపడితే మీదపడతా
వేడిపుడితే వెంటపడతా
ఊహలకందని ఊపుల అల్లరి పుచ్చుకో పుచ్చుకో
వామనగుంటల వాయిన ఉంది అందుకో అందుకో
చెయ్యిపడుతుంటే చెంగుమీద ఆహా ఆహా ఓహో ఓహో
మోసుకో మజా ఒత్తిళ్ళని
కాసుకో కసి కౌగిళ్ళకి          ||పుకారే పుకారే||

కుర్ర సరసం కుమ్ముతుంటే కోరికలే
కన్నెపరువం జివ్వుమంది కౌగిళ్ళలో
ఎర్రబడితే వెర్రిమొర్రి యవ్వనమే
కొల్లగొడతా జెల్లగొట్టి తిమ్మిరులే
కన్నుకొడితే జున్నుపెడతా
వెన్నుతడితే వచ్చిపడతా
కొబ్బరిమోజుల రబ్బరు సాపులు చుట్టుకో చుట్టుకో
హద్దులు దాటిన ఇద్దరి ఆశలు ఇరుకో ఇరుకో
పట్టుకుదిరిందా పక్కమీదా...ఆహా ఓహో
కొత్తగా భలే మత్తోయమ్మ ... మెత్తని కసి పత్తాయమ్మ  
      ||పుకారే పుకారే||


చిత్రం :  పేకాట పాపారావు (1993)
సంగీతం :  రాజ్-కోటి
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం,  రాధిక
*********************************************
Movie Name : Pekata Paparao (1993)
Music Director : Raj-Koti
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : S.P.Balasubramanyam, Radhika

Thursday, March 28, 2013

అబ్బాయిలూ చెప్పనా ప్రేమపాఠం ...... ఇద్దరూ ఇద్దరే (1990)


పల్లవి :
అబ్బాయిలూ చెప్పనా ప్రేమపాఠం
అమ్మాయిలూ నేర్పనా కొత్త నాట్యం
జపనిలో జాగ్రఫీలు... జానులలో జామెట్రీలు
కిస్సింగులో కెమిస్ట్రీలు...
రొమాన్సులో రహస్యాలు
తెలిపే వలపే విరిసే వయసిదికదా
॥

చరణం : 1
టాటా చెప్పరా సోదర ప్రతిక్లాసుకి
డ్యూటీ వేయర వీధిలో చెలి వేటకి
వీలుచూసి గాలమేసి ఈలకొట్టు
సందుచూసి సైగచేసి సైటుకొట్టు
ప్రేమభిక్ష వేడుకుంటు జోలకొట్టు
జాలిచూపి చేరమంటు గోలపెట్టు
పరాభవం ఎదురైన పరాజయం అనుకోకు
పరీక్షలే ఫెయిలైనా నిరాశలో పడిపోకు
సరిగా వినరా బ్రదరూ తొలి సిలబసు
॥

చరణం : 2
సాయంకాలం పార్కులే నీ క్లాసురూమ్
బేబీ హాబీ జాబితా నీ పుస్తకం
పాపకెన్ని పరికిణీలో లెక్కపెట్టు
వాళ్ల బొచ్చుకుక్కపిల్ల జట్టుకట్టు
ఆమెగారి ఈసడింపు ఓర్చుకుంటూ
అడ్డమైన చాకిరీలు చేసిపెట్టు
ఇలా ఇలా గడిచాక తపోబలం పెరిగాక
లిఖించిరా లవ్ లేఖ ఫలించురా నీ దాక
బదులే దొరికే వరకూ కథ నడపరా
॥


చిత్రం : ఇద్దరూ ఇద్దరే (1990)
సంగీతం : రాజ్-కోటి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : మనో, కె.ఎస్.చిత్ర
****************************************
Movie Name : Iddaru Iddare (1990)
Music Director : Raj-Kori
Lyricist : Sirivennela Sitarama Sastry
Singers : Mano, K.S.Chitra

Saturday, November 10, 2012

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ... హలో బ్రదర్ (1994)


హాయ్‌ హాయ్‌ హాయ్‌... ఓ...
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ...
ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ...
చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం
ఓ ఓ ఓ... ఓ... ఓ ఓ ఓ... ఓ... ||ప్రియ||

చరణం 1
అల్లరి కోయిల పాడిన పల్లవి
స్వరాలలో నీవుంటే.. పదాలలో నేనుంటా..
వేకువ పూచిన కవితల గీతిక
ప్రియా ప్రియా నీవైతే.. శ్రుతి లయ నేనౌతా..
కలకాలం కౌగిలై నినే చేరుకోనీ..
కనురెప్పల నీడలో కలై ఒదిగిపోనీ..
ఓ ప్రియా... ఓ...
దరిచేరితే దాచుకోనా తొలిప్రేమలే దోచుకోనా... ||ప్రియ||

చరణం 2
సవ్వడి చేయని యవ్వనవీణలు
అలా అలా సవరించు.. పదే పదే పలికించు..
వయసులు కోరిన వెన్నెల మధువులు
సఖి చెలి అందించు.. సుఖాలలో తేలించు..
పెదవులతో కమ్మనీ కధే రాసుకోనా..
ఒడిచేరి వెచ్చగా చలేకాచుకోనా..
ఓ ప్రియా... ఓ...
పరువాలనే పంచుకోనీ పడుచాటలే సాగిపోనీ... ||ప్రియ||

చిత్రం : హలో బ్రదర్ (1994)
సంగీతం : రాజ్ - కోటి
రచన : భువన చంద్ర
గానం : ఎస్.పి.బాలు , చిత్ర
*******************

Movie Name : Hello Brother (1994)
Music Director : Raj-Koti
Lyricist : Bhuvana Chandra
Singers : S.P.Balu, Chithra

Thursday, November 1, 2012

ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం..... పెద్దరికం (1992)


ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం (2)
పగేమో ప్రాణమయ్యేనా .. ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా .. ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం

ఒడిలో పెరిగిన చిన్నారినీ .. ఎరగా చేసినదా ద్వేషమూ
కధ మారదా ..ఈ బలి ఆగదా
మనిషే పశువుగ మారితే .. కసిగా శిశువుని కుమ్మితే (2)
అభమూ శుభమూ ఎరుగని వలపులు ఓడిపోయేనా !

ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా .. ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా .. ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం !

విరిసీ విరియని పూదోటలో .. రగిలే మంటలు చల్లారవా
ఆర్పేదెలా .. ఓదార్చేదెలా
నీరే నిప్పుగ మారితే .. వెలుగే చీకటి మూగితే (2)
పొగలో సెగలో మమతల పువ్వులు కాలిపోయేనా !

ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా .. ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా .. ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం !


చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం : రాజ్-కోటి
రచన : భువనచంద్ర
గానం : K.J.ఏసుదాస్
***********************************
Movie Name : Peddarikam (1992)
Music Director : Raj-Koti
Lyricist : Bhuvanachandra
Singers :K.J.Yesudas

నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ .... పెద్దరికం (1992)


నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ
ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ
ఆ మాటే చాలు నెలవంకా రా ఇకా
ప్రేమిస్తా నిన్ను సందేహం లేదికా
విలాసాల దారి కాచా ....సరగాలా గాలమేసా
కులాసాల పూలు కోసా....వయ్యారాల మాల వేసా
మరో నవ్వు ఋవ్వరాదటే
నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ
ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ
మల్లెపూల మంచమేసీ హుషారించనా

జమాయించి జాజిమొగ్గా నిషా చూడనా
తెల్ల చీర టెక్కులేవో చలాయించనా
విర్ర వీగు కుర్రవాణ్ణి నిభాయించనా

అతివకు ఆత్రము తగదటగా
తుంటరి చేతులు విడువవుగా .. మనసు పడే .. పడుచు ఒడీ !
ఓ ఓ ఓ ఓ .. ఓ ఓ ఓ ఓ
నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ
ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ

కోరమీసమున్న వాడి కసే చూడనా
దోర దోర జామపళ్ళ రుచే చూపనా
కొంగు చాటు హంగులన్నీ పటాయించనా
రెచ్చి రేగు కుర్రదాన్ని ఖుమాయించనా

పరువము పరుపుల పరమటగా
వయసున సరసము సులువటగా .. తధిగిణతోం మొదలెడదాం !

ఓ ఓ ఓ ఓ .. ఓ ఓ ఓ ఓ
నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ
ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ
ఆ మాటే చాలు నెలవంకా రా ఇకా
ప్రేమిస్తా నిన్ను సందేహం లేదికా


చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం : రాజ్-కోటి
రచన : భువనచంద్ర
గానం : S.P.బాలు, చిత్ర
*******************************
Movie Name : Peddarikam (1992)
Music Director : Raj-koti
Lyricist : Bhuvanachandra
Singers : S.P.Balasubramaniam, Chitra

Wednesday, October 31, 2012

ప్రియతమా.. ప్రియతమా ..తరగనీ పరువమా .... పెద్దరికం (1992)


ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా
తరలిరా .. తరలిరా
కన్నె గోదారిలా కొంటె కావేరిలా
నిండు కౌగిళ్ళలో చేర రావే !

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా
కదలిరా .. కదలిరా
మాఘమాసానివై మల్లెపూమాలవై
నిండు నా గుండెలో ఊయలూగా !

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా
తరలిరా .. తరలిరా !

నీ ఆశలన్నీ నా శ్వాసలైనా .. ఎంత మోహమో
ఓ ఓ ఓ .. నీ ఊసులన్నీ నా బాసలైనా .. ఎంత మౌనమో
ఎవరేమి అన్నా ఎదురీదనా .. ఆ ఆ ఆ
సుడిగాలినైనా ఒడి చేరనా .. ఓ ఓ ఓ ఓ
నీడల్లే నీ వెంట నేనుంటా .. నా ప్రేమ సామ్రాజ్యమా !

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా
కదలిరా .. కదలిరా !

పెదవుల్ని తడితే పుడుతుంది తేనే .. తియ తియ్యగా
ఓ ఓ ఓ .. కౌగిట్లో పడితే పుడుతుంది వానా .. కమ్మ కమ్మగా
వెన్నెల్ల మంచం వేసెయ్యనా .. ఓ ఓ ఓ ఓ
ఏకాంత సేవా చేసేయనా .. ఓ ఓ ఓ ఓ
వెచ్చంగ చలి కాచుకోవాలా .. నీ గుండె లోగిళ్ళలో !

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా
తరలిరా .. తరలిరా
కన్నె గోదారిలా కొంటె కావేరిలా
నిండు కౌగిళ్ళలో చేర రావే !

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా
కదలిరా .. కదలిరా
మాఘమాసానివై మల్లెపూమాలవై
నిండు నా గుండెలో ఊయలూగా !


చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం : రాజ్-కోటి
రచన : భువనచంద్ర
గానం : S.P.బాలసుబ్రహ్మణ్యం , K.S.చిత్ర
********************************
Movie Name : Peddarikam (1992)
Music Director : Raj-Koti
Lyricist : Bhuvanachandra
Singers : S.P.Balasubramaniam, K.S.Chitra

Saturday, September 29, 2012

గరం గరం పోరి నా గజ్జెల సవ్వారి...... నమస్తే అన్న (1990)


గరం గరం పోరి నా గజ్జెల సవ్వారి
బుంగ మూతి ప్యారి నా బుల్ బుల్ సింగారి
ముందు జేబు నల్లకెళ్ళి వందనోట్ల కట్ట తీస్తా
వెనక జేబు నల్లకెళ్ళి వెయ్యికొక్క కట్ట తీస్తా
మనం reserve bank, మా బామర్ధికి thanks

ఒక లక్ష కాదు, రెండు లక్షలు కాదు
వందకోట్ల ముల్లే వచ్చే బిడ్డో
kawasaki వద్దు, benz car వద్దు
గాలి మోటార్ నేను తెస్తా బిడ్డో
వజ్రాలే ఒదిగిన వడ్డాణమే తెచ్చి బుజ్జి నడుము పూజ చేసుకుంటా
రతనాలు అద్దిన రైకబట్ట తెచ్చి మెత్తంగా మొత్తంగా దోచుకుంటా
ఔనంటారా, ఇంక సుఖామంటారా, బేఫికారంటారా
కాశిదాకా వెళ్ళిన
కర్మ మీకు దక్కునా
బుర్రగీకితే చూడనా
మీకు ఎఱ్ఱగడ్డ దవఖానా

గాజుమహల్ కాదు రాజమహల్ కాదు
తాజ్ మహల్ నేను కొంటా బిడ్డో
హనుమకొండా కాదు హైదరాబాద్ కాదు
అమెరికాలో నేను బంగళ కడతా బిడ్డో
అత్తిబత్తిలెక్క మూతి ముడుచుకుంటే అత్తారు పన్నీరు చలుకుంటా
calcutta పాన్ వేసి కన్ను కొట్టావంటే గోలుకోండ కిల్లాకు రాజునంటా
ఔనంటారా, కొంచం డౌన్ అంటారా లేదు డౌట్ అంటారా
తొందరెందుకు బాబులు
ముందరున్నవి మోజులు
లెక్కపెడతరు చువ్వలు
ఇక చిప్పలలో బువ్వలు

చిత్రం : నమస్తే అన్న (1990)
సాహిత్యం:- సుద్దాల అశోక్ తేజ
సంగీతం:- రాజ్ కోటి
గానం : వడ్డేపల్లి శ్రీనివాస్
***********************
garam garam pOri nA gajjela savvAri
bunga mooti pyAri nA bul bul singAri
mundu jEbu nallakeLLi vandanOTla kaTTa teestA
venaka jEbu nallakeLLi veyyikokka kaTTa teestA
manam #reserve bank#, maa baamardhiki #thanks#

oka laksha kaadu, renDu lakshalu kAdu
vandakOTla mullE vacchE biDDO
#kawasaki# vaddu, #benz car# vaddu
gAli mOTAr nEnu testA biDDO
vajrAlE odigina vaDDANamE tecchi bujji naDumu pooja chEsukunTA
ratanAlu addina raikabaTTa tecchi mettangA mottangA dOchukunTA
ounanTArA, inka sukhAmanTArA, bEfikAranTArA
kaaSidAkA veLLina
karma meeku dakkunA
burrageekitE chooDanA
meeku e~r~ragaDDa davakhAnA

gaajumahal kaadu raajamahal kaadu
taaj mahal nEnu konTA biDDO
hanumakonDA kaadu haidarAbaad kaadu
amerikAlO nEnu bangaLa kaDatA biDDO
attibattilekka mooti muDuchukunTE attAru pannIru chalukunTA
#calcutta# pAn vEsi kannu koTTAvanTE gOlukOnDa killAku rAjunanTA
ounanTArA, koncham Down anTAraa lEdu DouT anTArA
tondarenduku bAbulu
mundarunnavi mOjulu
lekkapeDataru chuvvalu
ika chippalalO buvvalu

Movie name : NamastE annA (1990)
Lyricist : suddAla aSOk tEja
Music director- Raj-koti
Singer : vaddepalli Srinivas

Thursday, September 27, 2012

చక్కిలిగింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే..... కొదమసింహం (1990)


పల్లవి :
చక్కిలిగింతల రాగం
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చెక్కిలి గుంటల గీతం
ఓ ప్రియా... యా యా యా...
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియా... యా యా యా...
సాయంత్రం వేళ సంపంగిబాల
శృంగారమాల మెళ్లోన వేసి
ఒళ్లోన చేరగా యా యా యా...॥॥

చరణం : 1
కౌగిట్లో ఆకళ్లు కవ్వించే పోకళ్లు
మొత్తంగా కోరిందమ్మా మోజు
పాలల్లో మీగళ్లు పరువాల ఎంగిళ్లు
మెత్తంగా దోచాడమ్మా లౌజు
వచ్చాక వయసు వద్దంటే ఓ యస్
గుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగసు
ఊ అంటే తంటా...
ఊపందుకుంటా...
నీ అండ కన్నేసి నా గుండె వెన్నేసి
నీ ముద్దు నాటెయ్యాలీరోజు...
యా యా యా...॥॥

చరణం : 2
చూపుల్లో బాణాలు సుఖమైన
గాయాలు కోరింది కోలాటాల ఈడు
నీ ప్రేమగానాలు లేలేత దానాలు
దక్కందే పోనే పోడు వీడు
గిలిగింత గిచ్చుళ్లు పులకింత పొత్తిళ్లు
ముంగిట్లో ముగ్గేస్తుంటే నాకు మనసు
సయ్యంటే జంట... చెయ్యందుకుంటా...
బుడమేటి పొంగంటి బిడియాల బెట్టంతా
ఒడిలోనే దులిపేస్తాలే చూడు... యా యా యా...॥


చిత్రం : కొదమసింహం (1990)
సంగీతం : రాజ్-కోటి
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర
*********************************
Movie name: Kodama Simaham (1990)
Music Director : Raj- koti
Lyricist : Vetoori
Singers : S.P.Balu , Chithra