Sunday, September 23, 2012

తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునెలాగైనా...... ఆడబ్రతుకు (1965)


పల్లవి :
తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునెలాగైనా
మనసుకొక్కగాయమైనా
మాసిపోదు చితిలోనైనా॥

చరణం : 1
ఆడవాళ్లు ఆడుకునే
ఆటబొమ్మ ఈ మగవాడు (2)
ఆడుకున్నా ఫరవాలేదు...
పగులగొట్టి పోతారెందుకో (2)॥

చరణం : 2
మగువలను పుట్టించావే
మా సుఖమునకే అన్నావే
అందుకే ధర తెమ్మన్నావే...
బ్రతుకే బలి ఇమ్మన్నావే (2)॥

చిత్రం : ఆడబ్రతుకు (1965)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : విశ్వనాథన్-రామ్మూర్తి
గానం : పి.బి.శ్రీనివాస్

No comments:

Post a Comment