Saturday, September 22, 2012

ఓ ఓ ఓ... చామంతి ఏమిటే ఈ వింత....... ఆత్మీయులు (1969)


పల్లవి :
ఓ ఓ ఓ... చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగినేల గిలిగింత
లేని పులకింత
ఓ ఓ ఓ... చిన్నారి చెల్లి పెళ్లి జరిగింది
ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది
వలపు పెరిగింది

చరణం : 1
ఇన్నాళ్లూ ఈ వలపే ఏమాయే
నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే॥
ఇన్నాళ్లూ నీ హొయలు చూశాను
నా ఎదలోనే పదిలంగా దాచాను వే చాను
॥చామంతి॥

చరణం : 2
దూరాల గగనాల నీ మేడ
ఓ దొరసాని ననుకోరి దిగినావా॥
నీ మనసే పానుపుగా తలచేను
నీ ప్రాణంలో ప్రాణంగా నిలిచేను వలచేను
॥చిన్నారి॥

చిత్రం : ఆత్మీయులు (1969)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, పి.సుశీల

No comments:

Post a Comment