Saturday, September 29, 2012

నేను నా దేశం పవిత్ర భారతదేశం....... నేను నా దేశం (1973)


నేను నా దేశం 
పవిత్ర భారతదేశం
సాటి లేనిది..ధీటు రానిది
శాంతికి నిలయం మన దేశం

అశోకుడు వెలసిన ధర్మ ప్రదేశం
బుద్దుడు వెలసిన శాంతి దేశం
బుద్ధం శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి
కులమత భేధం మాపిన త్యాగి
అమర బాపుజీ వెలసిన దేశం
వందేమాతరం
వందేమాతరం
వందేమాతరం

కదం తొక్కిన వీర శివాజీ
వీర విహారిని ఝన్సీ రాణి
స్వరాజ్య సమరుడు నేతాజీ
జై హింద్...జై హింద్..జై హింద్
కట్ట బ్రహ్మన్న పుట్టిన దేశం

ఆజాదు సమరులే వల్లభ పటేలు, లజపతి, తిలక్, నౌరోజిలు
అంబులు కురిపిన మన అల్లూరి
భగత్ రక్తం చిందిన దేశం
హిందుస్థాన్ హమరా హై
హిందుస్థాన్ హమరా హై
హిందుస్థాన్ హమరా హై

గుళ్ళతుపాకి చూపిన దొరలకు గుండె చూపే మన ఆంధ్రకేసరి
శాంతి దూత మన జవహర్ నెహ్రు
లాలబహదూర్ జన్మ దేశం
జై జవాన్..జై కిసాన్

చిత్రం : నేను నా దేశం (1973)
సంగీతం : సత్యం
రచన : అన్కిశ్రీ
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , పి.సుశీల

No comments:

Post a Comment