Monday, September 24, 2012

పట్టు పట్టు పరువాల పట్టు .....కట్టు కట్టు సొగసైన కట్టు.... ప్రేమలేఖ (1996)














పట్టు పట్టు పరువాల పట్టు .. కట్టు కట్టు సొగసైన కట్టు
ఒట్టు ఒట్టు యదపైన ఒట్టు   చుట్టు చుట్టు చీరల్లే చుట్టు
సుందరుడా నిను వలచితిరా  చెలి పిలిచిన బిగువటరా
చేకొనరా చిరుచిలకనురా   నను పలుచన చేయకురా
పట్టు పట్టు పరువాల పట్టు  కట్టు కట్టు సొగసైన కట్టు

యదే నదై తరించదా నీ మాటలు వింటే
రతి మతి చెలించదా నీ రూపము కంటే
ఒంపు సొంపు అందించుకుంటా  ముద్దు ముచ్చటే పంచుకుంటా
తనువై నిన్ను పెనవేసుకుంటా  నాలో నిన్ను దాచేసుకుంటా (2)
విరహపు సొద వినలేవా దేవా  సొగసరి సొగసులు నీవే నీవే రావా
సుందరుడా నిను వలచితిరా  చెలి పిలిచిన బిగువటరా
చేకొనరా చిరుచిలకనురా  నను పలుచన చేయకురా

అనుక్షణం తపించవా నిను చూడని కళ్ళూ
ప్రతీక్షణం భరించునా వసివాడిన ఒళ్ళూ
మనసై నిన్ను కోరింది అందం  మత్తే హత్తుకోమంది మంచం
ముద్దే నన్ను మురిపించ నిత్యం  నీకై వేచిఉంటాను సత్యం (2)
విరహపు సొద వినలేవా దేవా సొగసరి సొగసులు నీవే నీవే రావా
సుందరుడా నిను వలచితిరా చెలి పిలిచిన బిగువటరా
చేకొనరా చిరుచిలకనురా నను పలుచన చేయకురా
పట్టు పట్టు పరువాల పట్టు  కట్టు కట్టు సొగసైన కట్టు
ఒట్టు ఒట్టు యదపైన ఒట్టు  చుట్టు చుట్టు చీరల్లే చుట్టు


చిత్రం : ప్రేమలేఖ (1996)
సంగీతం : దేవా
రచన : భువనచంద్ర
గానం : స్వర్ణలత
*****************************************
Movie Name : Premalekha (1996)
Music Director : Deva
Lyricist : Bhuvanachandra
Singer : Swarnalatha

No comments:

Post a Comment