Saturday, September 8, 2012

అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే.......... సింహాద్రి (2003)

కోరస్ : గిరినీమే గలగాల గిరితీతి బైమారె 
బియ్యాన దెకదేకో జురతీతి బైమా 

పల్లవి :
అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే
పైనుంచి ఈ వాన ఇట్టా దూకేనా
చాల్లే అని ఎవరైనా ఆపుంటే ఎపుడైనా
సయ్యాట సాగేనా ఎగసే కెరటానా
అమ్మానాన్న ఉంటే అమ్మో మహ ఇబ్బందే
కాస్తైనా అల్లరి చేసే వీల్లేదే
|| అమ్మైనా నాన్నైనా ||

చరణం :
సూరిడుకి నాన్నుంటే స్కూల్లో పెడతానంటే
పగలైనా వెలుతురు వస్తుందా
జాబిల్లికి అమ్ముంటే ఒళ్లో జో కొడుతుంటే
రాతిరేళ వెన్నెల కాస్తుందా
నిను చేరేనా నా లాలనా
ఏనాటికైనా ఓ పసి కూన
ఆడిందే ఆటంట పాడిందే పాటంట
ఆపేందుకు అమ్మా నాన్న లేరంట
సరదాగా రోజంతా తిరిగేనా ఊరంతా
ఊరేగే చిరుగాలికి ఉండుంటే అమ్మా
అలుపంటు లేకుండా చెలరేగి ఉరికేనా
ఉప్పొంగే సెలయేటికి ఉండుంటే నాన్నా

చరణం :
అలిగిందా రాచిలక కూర్చుందా కిమ్మనక
నాతో మాటాడేదెవరింకా
రానందా నా వంక దాగుందా కొమ్మెనక
అమ్మో మరి నాకేం దారింకా
ఏది ఏది రానిరానీ నన్నేరుకోనీ ముత్యాలన్ని
ఈ నవ్వే చాలంట పులకించే నేలంతా
పున్నాగ పువ్వుల తోటై ఏలంట
దిక్కుల్నే దాటాలి చుక్కల్నే తాకాలి
ఆనందం అంచులు నేడే చూడాలి

కోరస్ : గిరినీమే గలగాల గిరితీతి బైమారె 
బియ్యాన దెకదేకో జురతీతి బైమా 

చిత్రం : సింహాద్రి (2003)
సంగీతం : M.M.కీరవాణి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం :  కళ్యాణి మాలిక్ 

No comments:

Post a Comment