Sunday, September 30, 2012

నాతోనే నువ్వు నాలోనే నువ్వు......... వస్తాడు నా రాజు (2010)


పల్లవి :
నాతోనే నువ్వు నాలోనే నువ్వు
ఐనా నువు నాతో లేవు
॥
ఎక్కడ నేనున్నా
నా పక్కనే ఉంటావు
పక్కన ఉంటూనే
నన్ను ఒంటరి చేశావు
ఇప్పటికి ప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది
చెప్పక మిగిలిన మాటేదో చెబుదామనిపిస్తుంది
॥

చరణం : 1
ఎన్నో అనుకున్నా ఏదీ నీతో అనలేదే
ఏవో కలలుగన్నా నీతో పంచుకోలేదే
సమయం కొనసాగదే హృదయం తనలాడదే
నువు లేకుంటే
మనసేమో పదే పదే నీతో జ్ఞాపకాలను
గురుతుకు తెస్తుందే
ప్రాణం నలిగిన ప్రేమకు ఇకపై
ఆశలన్నీ నీమీదే
॥ఇప్పటికిప్పుడు॥॥

చరణం : 2

ప్రేమ తొలిప్రేమ
నీ చిరునామా ఏదంటూ
నిన్నే వెతుకుతున్నా నువ్వే దారి చూపించు
కసిరే నడిరాతిరి ఎటుగా నిను దాచినా చేరగలేనా
లోకం నలువైపులా ఆపే గిరిగీసిన
దూసుకు రాలేనా
జతగా నడిచిన నిన్నటి అడుగే నీకోసం వస్తున్నా
॥ఇప్పటికిప్పుడు॥॥

చిత్రం : వస్తాడు నా రాజు (2010)
సంగీతం : మణిశర్మ
రచన : రామజోగయ్యశాస్త్రి
గానం : సాకేత్, సైంధవి
*****************************
Movie name : vasthaadu naraaju (2010)
Music director : manisharma
Lyricist : Ramajogayya sastry
Singers : Saketh , Saindhavi

No comments:

Post a Comment