Sunday, October 14, 2012

పోరా బాబూ పో... పోయి చూడు ఈ లోకం పోకడ......దీక్ష (1951)

పల్లవి :
పోరా బాబూ పో... (2)
పోయి చూడు ఈ లోకం పోకడ
పోరా బాబూ పో...
ఆవేశాలను ఆశయాలను
వదిన కోసమే వదులుకొంటివా॥
ఆమెకు నీకు ఋణం తీరెగా
తెగించి చూడు తేలేదేమిటో॥బాబూ పో॥

చరణం : 1
ఉన్నవారు కాదన్నావో
ఊరు విడిచి పోతున్నావో
ఏ ఘనకార్యం సాధిస్తావో... (2)
ఏమౌతావో ఎవరికెరుకరా॥బాబూ పో॥

చరణం : 2
దూరపు కొండలు నునుపేనేమో
దోషం నీలో లేదో ఏమో
నీవు నమ్మిన నీతి న్యాయం (2)
నిజమౌనేమో తెలుసుకుందువో॥బాబూ పో॥

చరణం : 3
దేశసేవకై దీక్ష పూనమని
ధీరమాత దీవించెను నాన్న
కాకిని కోకిల చేస్తావో... (2)
లోకంలో ఒకడైపోతావో॥బాబూ పో॥


చిత్రం : దీక్ష (1951)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఎం.ఎస్.రామారావు

No comments:

Post a Comment