Tuesday, October 30, 2012

ఇది తియ్యని వెన్నెల రేయి ....... ప్రేమలేఖలు (1953)


ఇది తియ్యని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
నా ఉహల జాబిలి రేఖలు
కురిపించెను ప్రేమలేఖలు

ఇది తియ్యని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి

నడిరాతిరి వేళా నీ పిలుపు
గిలిగింతలతో నను ఉసిగోలుపు
నడిరాతిరి వేళా నీ పిలుపు
గిలిగింతలతో నను ఉసిగోలుపు
నును చేతులతో నను పెనవేసి
నా ఒడిలో వాలును నీ వలపు

ఇది తియ్యని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి

నా మనసే కోవెల చేసితిని
ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నా మనసే కోవెల చేసితిని
ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నీ ఒంపులు తిరిగే అందాలు
కనువిందులు చేసే శిల్పాలు

ఇది తియ్యని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి

నీ పెదవులు చిలికే మధురిమలు
అనురాగము పలికే సరిగమలు
నీ పెదవులు చిలికే మధురిమలు
అనురాగము పలికే సరిగమలు
మన తనువులు పలికే రాగాలు
కలకాలం నిలిచే కావ్యాలు

ఇది తియ్యని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
నా ఉహల జాబిలి రేఖలు
కురిపించెను ప్రేమలేఖలు ప్రేమలేఖలు ...

ఇది తియ్యని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి

చిత్రం : ప్రేమలేఖలు (1953)
సంగీతం : సత్యం
రచన : ఆరుద్ర
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , పి.సుశీల

No comments:

Post a Comment