Wednesday, October 17, 2012

సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ ... కంచుకోట (1961)


సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ 
సురవైభవానా భాసుర కీర్తిలోనా 
సురవైభవాన భాసుర కీర్తిలోనా 
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ 
సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ 
సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ 
సిరిలోన గానీ మగసిరిలోన గానీ 
సిరిలోన గానీ మగసిరిలోన గానీ 
సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ 

ప్రజలను నీకంటి పాపలుగా కాచి ఆ ఆ 
ప్రజలను నీకంటి పాపలుగా కాచి 
పరరాజులదరంగ కరవాలమును దూసి 
ప్రజలను నీకంటి పాపలుగా కాచి 
పరరాజులదరంగ కరవాలమును దూసి 
శాంతిని వెలయించి మంచిని వెలిగించి
శాంతిని వెలయించి మంచిని వెలిగించి
జగతిని లాలించి పాలించినావూ
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ 

మరుడే తొందర చేయ విరిబోణులను గూడి 
మధువే పొంగులు వార మనసార తూగాడి ఆ ఆ 
మరుడే తొందర చేయ విరిబోణులను గూడి 
మధువే పొంగులు వార మనసార తూగాడి
నవ్వులు చిలికించి మువ్వలు పలికించి 
నవ్వులు చిలికించి మువ్వలు పలికించి 
యవ్వన వీణను కవ్వించినావూ

సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ 
రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్ 
నీట గుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్ 
రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్ 
నీట గుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్ 
అసమ ప్రభావ జోహార్ రాసికావతంస జోహార్ 
అసమ ప్రభావ జోహార్ రాసికావతంస జోహార్ 
జోహార్ జోహార్ జోహార్ జోహార్ 
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ
సిరిలోన గానీ మగసిరిలోన గానీ సరిలేరు నీకెవ్వరూ
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ

చిత్రం : కంచుకోట (1961)
సంగీతం : కె.వి.మహదేవన్ 
రచన : సి.నారాయణ రెడ్డి 
గానం : సుశీల , జానకి 

No comments:

Post a Comment