Friday, October 19, 2012

చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి ....... ఆత్మ బంధువు (1962)

పల్లవి:
చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా..
చిన్నదానా.. హోయ్

చరణం 1:
ఒయ్యారము ఒలకబోసినావా.. వాలుచూపులతో గాలమ్ము వేసినావా

పెళ్ళికొడుకును పట్టినావా .. పెళ్ళికొడుకును పట్టినావా ..
ఓసి కోడలుపిల్లా ఛాన్సు కొట్టినావా

చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్

చరణం 2:
చందమామవంటి భలే అందగాడు.. బాగ కన్నువేసి నిన్ను కోరుకున్నవాడు

నేనన్నమాట తప్పిపోదు ఇటు చూడు.. నేనన్నమాట తప్పిపోదు ఇటు చూడు
ఏడాది తిరగకుండ వచ్చు.. ఏడాది తిరగకుండ వచ్చు చిన్నవాడు

చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్

చరణం 3:
ముక్కుమీదే ఉంది నీకు కోపం..అబ్బో విసురుకుంటే కసురుకుంటే ఏమి లాభం

వలపు దాచావంటే పరితాపం .. వలపు దాచావంటే పరితాపం..
అది పైకి చెప్పుకుంటేనే ఉల్లాసం

చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్

చిత్రం : ఆత్మ బంధువు (1962)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : కొసరాజు
గానం : ఘంటసాల

No comments:

Post a Comment