Tuesday, October 30, 2012

కన్నయ్యా, నల్లని కన్నయ్యా ... నిన్ను కనలేని కనులుండునా ..... నాదీ ఆడజన్మే(1964)


కన్నయ్యా, నల్లని కన్నయ్యా
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే

గుణమెంట లేనింట పడవైతువా
నన్ను వెలివేయువారికే బలిచేతువా
సిరిజూచుకుని నన్ను మరిచేవయా
మంచిగుడి చూచుకొని నీవు మురిసేవయా
బంగారు మనసునే ఒసగినావు
అందు అందాల గుణముచే పొదిగినావు
మోముపై నలుపునే పులిమినావు
ఇట్లు నన్నేల బ్రతికించదలచినావు


చిత్రం : నాదీ ఆడజన్మే(1964)
సంగీతం : ఘంటసాల
రచన : శ్రీశ్రీ
గానం : పి.సుశీల
********************************
Movie Name : Naadee Aadajanme (1964)
Music Director : Ghantasala
Lyricist : Sri Sri
Singer : P.Susheela

No comments:

Post a Comment