Wednesday, October 3, 2012

ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో ...... అమర శిల్పి జక్కన (1964)


పల్లవి:
ఓహో ఓ ఓ....
ఓహోహో....
ఓ ఓ....
ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఒ... ఓ .. ఓ ..

చరణం 1:
పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి ..ఈ నల్లని రాళ్ళలో

చరణం 2:
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
ఉలి అలికిడి విన్నంతనే ఉలి అలికిడి విన్నంతనే....
ఉలి అలికిడి విన్నంతనె జల జలమని పొంగి పొరలు ..ఈ నల్లని రాళ్ళలో..

చరణం 3:
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న శిలలే నయమని పించును ..ఈ నల్లని రాళ్ళలో..


చిత్రం : అమర శిల్పి జక్కన (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
రచన : సముద్రాల (సీనియర్)
గానం: ఘంటసాల

No comments:

Post a Comment