Tuesday, October 16, 2012

వలపులోని చిలిపితనం ఇదేలే.......... తోడు-నీడ (1965)

పల్లవి :
వలపులోని చిలిపితనం ఇదేలే
నీ చెలిమిలోని గట్టి చిక్కు అదేలే
॥

చరణం : 1
కన్నులకి అల్లరి నేర్పినది ఎవ్వరు
మనసులోన జొరబడిన మగసిరి గల ధీరుడు
అంత ధీరుడీనాడు ఏమైనాడు (2)
నీ ఇంత గుండెలోన ఇమిడిపోయినాడు (2)
॥

చరణం : 2
తెలిసీ తెలియని మనసు తెరిచినది ఎవ్వరు
లోనికి రాగానే మూసినది ఎవ్వరు ఎవ్వరు
తీయని కలలను తినిపించినదెవ్వరు (2)
తినిపించి చిటికెలోన ఓడించినదెవ్వరు
॥

చరణం : 3
చలివేసే వేళలో వేడైనది ఎవ్వరు
వేడైన విరహంలో తోడైనదెవ్వరు
నాలోన ఉండి నాకు నీడైనది ఎవ్వరు (2)
తోడునీడగా ఉండి దోచినది ఎవ్వరు (2)
॥

చిత్రం : తోడు-నీడ (1965)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : ఆత్రేయ 
గానం : పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి

No comments:

Post a Comment