Wednesday, October 17, 2012

రాశాను ప్రేమలేఖలెన్నో...దాచాను ఆశలన్నీ నీలో.... శ్రీదేవి (1970)

పల్లవి : 
రాశాను ప్రేమలేఖలెన్నో.....
దాచాను ఆశలన్నీ నీలో....
భువిలోనా మల్లికలాయే...
దివిలోనా తారకలాయే నీ నవ్వులే...||రాశాను||

చరణం 1
కొమ్మల్లో కోయిలమ్మ ఒయన్నదీ...||2 times||
నా మనసు నిన్నే తలచి ఒయన్నదీ.....
మురిపించే ముద్దులు రాలి మొగ్గేసింది...
చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది.... ||రాశాను||

చరణం 2
నీ అడుగుల సవ్వడి ఉంది నా గుండెలో .....
నీ చల్లని రూపం ఉంది నా కనులలో....
నాలోని సోయగమంతా విరబూసెలె.....
మన కోసం స్వర్గాలన్ని దిగివచ్చేనులే... ||రాశాను||

చరణం 3
అందాల పయ్యెద నేనై ఆటాడనా....
కురులందు కుసుమం నేనై చెలరేగనా....
నీ చేతుల వీణను నేనై పాట పాడనా....
నీ పెదవుల గుసగుస నేనై పొంగి పోదునా....||రాశాను||


చిత్రం : శ్రీదేవి (1970)
సంగీతం : జి కే వెంకటేష్
రచన : దాశరధి
గానం : SP బాలసుబ్రహ్మణ్యం ,సుశీల
************************************
Movie Name : Sridevi (1970)
Music Director : G.K.Venkatesh
Lyricist : Dasarathi
Singers : S.P.Balasubramanyam, P.Susheela

No comments:

Post a Comment