Wednesday, October 17, 2012

సన్నజాజి పువ్వులు చందమామ కాంతులు ....... అమాయకురాలు (1971)

సన్నజాజి పువ్వులు చందమామ కాంతులు
చిన్నారి పాపా నవ్వులు
మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు
బంగారు జోతుల దీవెనలు'(2)

పాపాయి గెంతులు తువ్వాయి చెంగులు(2)
తూరీగలాగ దొరకదు
పరుగులు తీస్తే పండుగ
ఉరకలు వేస్తె వేడుక
మా జోతి చిందులే అందాల విందులు

తాతయ్య మీసాల ఉయ్యాలలూగేను
అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను(2)
ఆడిన ఆట పాడిన పాట
ఆడిన ఆట అల్లరి పాడిన పాట పల్లవి
మా జోతి మాటలే వరహాల మూటలు

ఆ కొంటె చేష్టలు ఆ చిలిపి చూపులు
ఆనందమొసగే వరములు
ఇరుగుపొరుగు మెచ్చగా ఇంటిల్లిపాదికి నచ్చగా
చిరంజీవి పెరగాలి బంగారు తల్లిగా



చిత్రం : అమాయకురాలు (1971)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : ఎస్.పి.బాలు, P.సుశీల
*******************************
sannajaji puvvulu chandamama kantulu
chinnari papa navvulu
ma inti velugu ma kanti velugu
bangaaru jotula deevenalu'(2)

papayi gentulu tuvvayi chengulu(2)
tureegalaaga dorakadu
parugulu teeste panduga
urakalu veste veduka
ma joti chindule andaala vindulu

tatayya meesala uyyalalugenu
ammamma kallato dobuchulaadenu(2)
aadina aata padina paata
aadina aata allari padina paata pallavi
ma joti matale varahala mutalu

aa konte chestalu aa chilipi chupulu
anandamosage varamulu
iruguporugu mechaga intillipadiki nachaga
chiranjeevi peragali bangaru talligaa


Movie Name : Amayakuralu (1971)
Music Director : Saluri Rajeswara Rao
Lyricist :
Singers : 

No comments:

Post a Comment