Saturday, October 20, 2012

చిగురేసే మొగ్గేసే సొగసంత పుతపూసే ...... ఆలుమగలు (1977 )


పల్లవి:
చిగురేసే మొగ్గేసే  సొగసంత పుతపూసే..
చెయ్యైన వెయ్యవేమి ఓ బాబూదొర
చెయ్యైన వెయ్యవేమి ఓ బాబూదొర
ఉయ్యాలలూపవేమీ ఈ..ఈ..ఈ..

చిగురేసే మొగ్గేసే సొగసంత పుతపూసే ఇవ్వాలని లేదా ఏమి
ఆ సొగసంతా ఇవ్వాలని లేదా ఏమి ఓ సిరిపాప..
ఎన్నాళ్ళు దాస్తావేమీ.. ఈ.. ఈ..

చరణం 1:
ముట్టుకుంటే ఉలికిపడతావ్ .. పట్టుకుంటే జారిపోతావ్
ముట్టుకుంటే..ఏ..ఏ.. ఉలికిపడతావ్... పట్టుకుంటే జారిపోతావ్..

నీ చూపుల్లో వుంది సూదంటూ రాయి
అది లాగుతుంటే ఒళ్ళంతా హాయి...

చిగురేసేమొగ్గేసే సొగసంత పుతపూసే చెయ్యైన వెయ్యవేమి ఓ బాబూదొర
చెయ్యైన వెయ్యవేమి ఓ బాబూదొర ఉయ్యాలలూపవేమీ ఈ..ఈ..ఈ..

చరణం 2:
చేరుకుంటే ఊరుకుంటావ్.. వల్లకుంటే గిల్లుతుంటావ్...
చేరుకుంటే..ఈ..ఈ ఊరుకుంటావ్.. వల్లకుంటే...ఏ..ఈ గిల్లుతుంటావ్..

నీ చేతుల్లో వుందీ చెకుముకిరాయీ..
అది రాసుకుంటే చురుకైన హాయి..

చిగురేసే మొగ్గేసే సొగసంత పుతపూసే ఇవ్వాలని లేదా ఏమి
ఆ సొగసంతా ఇవ్వాలని లేదా ఏమి ఓ సిరిపాప..
ఎన్నాళ్ళు దాస్తావేమీ.. ఈ.. ఈ..

చరణం 3:
నిన్ను కట్టుకోవాలని మనసౌతాది... చేయి పట్టుకోవాలంటే గుబులౌతాది..
నిన్ను కట్టుకోవాలని మనసౌతాది... చేయి పట్టుకోవాలంటే గుబులౌతాది..

గుబులెందుకుకింకా గారాల చిలకా..
ఎగిరెగిరి పోదాము నెలవంక దాక...


చిత్రం : ఆలుమగలు (1977 )
సంగీతం : టి.చలపతిరావు
రచన : వేటూరి
గానం: బాలు, సుశీల

No comments:

Post a Comment