Wednesday, October 24, 2012

తొలిసారి ముద్దివ్వమందీ.... చెలిబుగ్గ చేమంతి మొగ్గా .... ఎదురీత (1977)


పల్లవి :
తొలిసారి ముద్దివ్వమందీ.. చెలిబుగ్గ చేమంతి మొగ్గా
ఓ..ఓ..తొలిసారి ముద్దివ్వమందీ.. చెలిబుగ్గ చేమంతి మొగ్గా
పెదవులలో మధువులనే కోరి కోరి చేరి
ఒకసారి రుచి చూడమందీ చిరుకాటు ఈ తేనెటీగా

చరణం : 1
నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం.. తెరచాటు సొగసులారబోసి నాకోసం..
నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం.. తెరచాటు సొగసులారబోసి నాకోసం

నీ చూపులు సోకి... సొగసు వెల్లువలాయే..
నీ చూపులు సోకి... సొగసు వెల్లువలాయే..

నీ ఊపిరి సోకి మనసు వేణువులూదే..
తొలిసారి ముద్దివ్వమందీ.. చెలిబుగ్గ చేమంతి మొగ్గా

చరణం : 2
నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం.. సిరిమల్లెపూలు గుప్పుమంది నీకోసం..
నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం.. సిరిమల్లెపూలు గుప్పుమంది నీకోసం..

నీ నవ్వులలోనే... వలపు గువ్వలు సాగే..
నీ నవ్వులలోనే... వలపు గువ్వలు సాగే..

నీ నడకలలోనే వయసు మువ్వలు మోగే..
తొలిసారి ముద్దివ్వమందీ.. చెలిబుగ్గ చేమంతి మొగ్గా

చరణం : 3
ఈ రేయి హాయి మోయలేను ఒంటరిగా.. ఇక రేపు మాపు తీపివలపు పంటలుగా..
ఈ రేయి హాయి మోయలేను ఒంటరిగా.. ఇక రేపు మాపు తీపివలపు పంటలుగా

నులివెచ్చన కాదా.. మనసిచ్చిన రేయి..
నులివెచ్చన కాదా.. మనసిచ్చిన రేయి..
తొలిమచ్చికలోనే సగమిచ్చిన హాయీ...
తొలిసారి ముద్దివ్వమందీ.. చెలిబుగ్గ చేమంతి మొగ్గా
ఓ..ఓ..తొలిసారి ముద్దివ్వమందీ.. చెలిబుగ్గ చేమంతి మొగ్గా
పెదవులలో మధువులనే కోరి కోరి చేరి

ఒకసారి రుచి చూడమందీ చిరుకాటు ఈ తేనెటీగా
తొలిసారి ముద్దివ్వమందీ.. చెలిబుగ్గ చేమంతి మొగ్గా


చిత్రం : ఎదురీత (1977)
సంగీతం : సత్యం
రచన :  వేటూరి సుందరరామ మూర్తి
గానం :  ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, P.సుశీల
*******************************************
Movie Name : Edhureetha (1977)
Music Director : Satyam
Lyricist : Veturi Sundararama Murthy
Singers : S.P.Balasubramanyam, P.Susheela

No comments:

Post a Comment