Thursday, October 25, 2012

నవమి నాటి వెన్నెల నేను ........ శివరంజని (1978)


పల్లవి
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయి
కార్తీక పున్నమి రేయి                   (నవమి)

చరణం 1
నీ వయసే వసంత రుతువై
నీ మనసే జీవన మధువై               (2)
నీ పెదవే పల్లవిగా
నీ నగవే సిగ మల్లికగా
చెరిసగమై యే సగమేదో
మరచిన మన తొలి కలయికలో     (నవమి)

చరణం 1
నీ వొడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై                   (2)
అందాలే నీ హారతిగా
అందించే నా పార్వతిగా
మనమొకటై రసజగమేలే
సరస మధుర సంగమ గీతికలో      (నవమి)

చిత్రం : శివరంజని (1978)
సంగీతం : రమేష్ నాయుడు
రచన : వేటూరి
గానం : S.P.బాలు, P.సుశీల

No comments:

Post a Comment