Tuesday, October 9, 2012

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక.. సిరి సిరి మువ్వ (1978)


పల్లవి:
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటుపోతుందో ఎవరిని అడుగక
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటుపోతుందో ఎవరిని అడుగక
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక

చరణం:
వాన కురిసి కలిసేది వాగులో
వాగువంక కలిసేది నదిలో హ
వాన కురిసి కలిసేది వాగులో
వాగువంక కలిసేది నదిలో
కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో
కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో
కాని ఆ కడలి కలిసేది ఎందులో

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటుపోతుందో ఎవరిని అడుగక
ఎవరికెవరు ఈ లోకంలో


చిత్రం : సిరి సిరి మువ్వ (1978)
రచన : వేటూరి
సంగీతం : K.V. మహదేవన్
గానం: S.P.బాలు

No comments:

Post a Comment