Wednesday, October 24, 2012

కాలమిలా ఆగిపోనీ...కలనిజమై సాగిపోనీ... ఏది పాపం? ఏది పుణ్యం? (1979)


పల్లవి:
కాలమిలా ఆగిపోనీ...కలనిజమై సాగిపోనీ
అన్నీ మరచి... ఈ నిమిషంలో...నీ ఒడిలోనే నిదురపోనీ

కాలమిలా ఆగిపోనీ...కలనిజమై సాగిపోనీ
అన్నీ మరచి ఈ నిమిషంలో...నీ ఒడిలోనే నిదురపోనీ...
కాలమిలా ఆగిపోనీ...

చరణం 1:
తొలిసంజె మలి సంజె లేల... నా చెంత చెలి ఉన్న వేళ
తొలిసంజె మలి సంజె  లేల... నా చెంత చెలి ఉన్న వేళ

చిరుగాలి సెలయేరు లేల... నా మనిషి తోడున్న వేళ
అనువైన వేళ... ఈ శుభవేళ...

బ్రతుకే వెన్నెల వేళా... వేళా.. వేళా..

కాలమిలా ఆగిపోనీ...కలనిజమై సాగిపోనీ
అన్నీ మరచి...ఆ..ఆ..
ఈ నిమిషంలో...ఆ...ఆ..
నీ ఒడిలోనే నిదురపోనీ...
కాలమిలా ఆగిపోనీ...

చరణం 2:
సిరిదివ్వెలో వెలుగులాగ... నీ చూపులో నిలిచిపోనీ
సిరిదివ్వెలో వెలుగులాగ... నీ చూపులో నిలిచిపోనీ

జేగంటలో రవళిలాగ... నీ ఊపిరై కలిసిపోనీ...
కలలే కాని... కలతే లేని..
లోకానకే చేరిపోనీ...చేరిపోనీ...

కాలమిలా ఆగిపోనీ... కలనిజమై సాగిపోనీ
అన్నీ మరచి...ఆ..ఆ..
ఈ నిమిషంలో...ఆ...ఆ..
నీ ఒడిలోనే నిదురపోనీ...
కాలమిలా ఆగిపోనీ...


చిత్రం : ఏది పాపం? ఏది పుణ్యం? (1979)
సంగీతం : సత్యం
రచన : మైలవరపు గోపి
గానం: S.P.బాలు, P.సుశీల

No comments:

Post a Comment