Thursday, November 1, 2012

కళకే కళ ఈ అందమూ ...... అమావాస్య చంద్రుడు (1981)


కళకే కళ ఈ అందమూ
ఏ కవీ రాయనీ చేయనీ కావ్యమూ
కళకే కళ ఈ అందమూ

నీలి కురులు పోటీ పడెను .. మేఘమాలతో
కోల కనులు పంతాలాడే .. గండుమీలతో
వదనమో జలజమో.. నుదురదీ ఫలకమో
చెలి కంఠం పలికే శ్రీ శంఖము !

కళకే కళ ఈ అందమూ

పగడములను ఓడించినవి .. చిరుగు పెదవులు .. హా
వరుస తీరి మెరిసే పళ్ళు .. మల్లె తొడుగులూ
చూపులో తూపులో .. చెంపలో కెంపులో
ఒక అందం తెరలో దోబూచులు !

కళకే కళ ఈ అందమూ

తీగెలాగ ఊగే నడుమూ .. ఉండి లేనిదీ
దాని మీద పువ్వై పూచీ .. నాభి ఉన్నదీ
కరములో కొమ్మలో .. కళ్ళవీ బోదెలో
ఈ రూపం ఇలలో అపురూపము !

కళకే కళ ఈ అందమూ

చిత్రం : అమావాస్య చంద్రుడు (1981)

సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం

No comments:

Post a Comment