Friday, October 19, 2012

సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్.. ఆకలి రాజ్యం (1981)

పల్లవి:
సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్
సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్...
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్...
సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్...
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్...

చరణం : 1
మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా... ఆ ఆ..
మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా
డిగ్రీలు తెచ్చుకొని చిప్ప చేతపుచ్చుకొని
ఢిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే భావిపౌరులం బ్రదర్..
సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్...
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్...

చరణం : 2
బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది
ఎలుగె త్తి చాటుదామురా ఇంట్లో ఈగల్ని తోలుదామురా
ఈ పుణ్యభూమిలో పుట్టటం మన తప్పా
ఈ పుణ్యభూమిలో పుట్టటం మన తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మానాన్నదే తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మానాన్నదే తప్పా
గంగలో మునకేసి కాషాయం కట్టేయ్ బ్రదర్..
సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్...
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్...

చరణం : 3
సంతాన మూలికలం సంసార బానిసలం
సంతానలక్ష్మి మనదిరా తమ్ముడూ
సంపాదనొకటి బరువురా... ఓ ఓ...
చదవెయ్య సీటులేదు చదివొస్తే పనీలేదు
అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కులేదు
దేవుడిదె భారమని పెంపుచేయరా బ్రదర్..
సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్...
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్...


చిత్రం : ఆకలి రాజ్యం (1981)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

No comments:

Post a Comment