Thursday, October 25, 2012

ఓం నమఃశివాయ ... చంద్ర కళాధర సహృదయ ... సాగర సంగమం (1983)



పల్లవి:
ఓం ఓం ఓం
ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ
చంద్ర కళాధర సహృదయ
చంద్ర కళాధర సహృదయ
సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయ
ఓం... ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ

చరణం:
పంచ భూతములు ముఖ పంచకమై
ఆరు ఋతువులు ఆహార్యములై
పంచ భూతములు ముఖ పంచకమై
ఆరు ఋతువులు ఆహార్యములై
ప్రకృతి పార్వతి నీతొ నడచిన
ఏడు అడుగులే స్వర సప్తకమై
సాగమదానిస దాదామగని సమగగగ ససస నిగ మగసనిదమగస
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై
నా వాక్కులే నవరసమ్ములై
తాపస మందార ఆ ఆ ఆ ఆ
నీ మౌనమే
దషౌపనిషత్తులై ఇలా వెలయా

ఓం... ఓం నమఃశివాయ

చరణం:
త్రికాలములు నీ నేత్ర త్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
త్రికాలములు నీ నేత్ర త్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
గజ ముఖ షణ్ముఖ ప్రమదాదులు నీ
సంకల్పానికి రుగ్విజవరులై
అద్వైతమే నీ ఆది యోగమై
నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరి వాస నీ గానమే
జంత్ర గాత్రముల శృతి కలయా

ఓం... ఓం నమఃశివాయ
చంద్ర కళాధర సహృదయ
సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయ


చిత్రం : సాగర సంగమం (1983)
రచన : వేటూరి
సంగీతం : ఇళయరాజా
గానం : S.జానకి

No comments:

Post a Comment