Saturday, October 20, 2012

ఇది ఆశలు రేపే లోకం.. అడియాశలు చేసే లోకం.... ఆలయ శిఖరం (1983)


పల్లవి:
హే.. హేహే..
ఇది ఆశలు రేపే లోకం.. అడియాశలు చేసే లోకం
హే.. స్వార్థం మరిగిన మనుషుల్లారా..
సాగదు సాగదు మీ మోసం..ఊ..
సాగదు.. సాగదు.. మీ మోసం..

ఇది ఆశలు రేపే లోకం.. అడియాశలు చేసే లోకం
హే.. స్వార్థం మరిగిన మనుషుల్లారా..
సాగదు సాగదు మీ మోసం..ఊ..
సాగదు.. సాగదు.. మీ మోసం..

చరణం 1:
కోటలు కట్టిన రాజులెక్కడో..ఓ.
బాటలు వేసిన కూలీలెవరో..

కోటలు కట్టిన రాజులెక్కడో.. బాటలు వేసిన కూలీలెవరో..
కాలం నడిచే కాలినడకలో.. సమాధిరాళ్ళై నిలిచారు..ఊ ఊ
చరిత్రగానే మిగిలేరు....

ఇది ఆశలు రేపే లోకం.. అడియాశలు చేసే లోకం
హే.. స్వార్థం మరిగిన మనుషుల్లారా.. సాగదు సాగదు మీ మోసం..ఊ..
సాగదు.. సాగదు.. మీ మోసం..

చరణం 2:
మనుషుల మమతలు మట్టిగోడలు
కలిసిన మనుసులు మర్రి ఊడలు
మనుషుల మమతలు మట్టిగోడలు.. కలిసిన మనుసులు మర్రి ఊడలు
కన్నవారి కల పండించాలీ..ఈ..
కన్నవారి కల పండించాలి.. రేపటి వెలుగయి నిలవాలి..

ఇది ఆశలు రేపే లోకం.. అడియాశలు చేసే లోకం
హే.. స్వార్థం మరిగిన మనుషుల్లారా.. సాగదు సాగదు మీ మోసం..ఊ..
సాగదు.. సాగదు.. మీ మోసం..
హై.. హేహే.. హై..


చిత్రం : ఆలయ శిఖరం (1983)
సంగీతం : సత్యం
రచన : ఉపద్రష్ట సాయి
గానం: ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం

No comments:

Post a Comment