Saturday, October 27, 2012

జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా ... సితార (1983)


పల్లవి:
జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
కిల కిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా
మిలిమిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
మిలిమిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా
కలలను పెంచకు కలతలు దాచకు ఏమైనా ఓ మైనా
జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
కిల కిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా

చరణం1:
అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా
చిరునవ్వే పుట్టిళ్ళు నీకైనా నాకైనా
తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వ
తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వ
హరివిల్లు రంగుల్లో వర్ణాలే
చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓ మైనా ఏమైన
జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా

చరణం2:
ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా
మెరుపులలో నిలకడగ కనిపించే ఈ మైనా
ఎండలకే అల్లాడే వెన్నలలో క్రీనీడ
ఎండలకే అల్లాడే వెన్నలలో క్రీనీడ
వినువీధి వీణల్లో రాగంలా
ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేనా ఏమైన

జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
తొలకరి వయసుల మినుగురు సొగసుల ఈ మైనా మైనా
మిలి మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
గుడికే చేరని దీపం పడమటి సంధ్యా రాగం
మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా
చుక్కల అందక దిక్కున దాగిన నేనేలే ఆ మైనా
జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
తొలకరి వయసుల మినుగురు సొగసులాడెమైన మైనా

చిత్రం : సితార (1983)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : S.P.బాల  సుబ్రహ్మణ్యం

No comments:

Post a Comment