Monday, October 29, 2012

మనసున వున్నదీ చెప్పాలనున్నదీ ....... ప్రియమైన నీకు (2001)



మనసున వున్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావేఁ ఎలా
మాటున వున్నదీ ఓ మంచి సంగతీ బయటకు రాదేఁ ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా
ఒకసారి దరిచేరి యద గొడవేమిటో తెలుపకపోతే ఎలా..
లలలా లల లల లలలలలాలాలా ||మనసున||

చరణం 1
చింత నిప్పల్లె తీయంగ వుందని
ఎంత నొప్పైన తెలియలేదనీ.
తననే తలుచుకునే వేడిలో
ప్రేమ అంటేనే తీయని బాధని
లేక గుండెల్లో కొండంత బరువనీ
కొత్తగా తెలుసుకునే వేళలో
కనబడుతోందా నా ప్రియమైన నీకు
నా యద కోత అని అడగాలనీ
అనుకుంటూ తన చుట్టూ మది తిరిగిందనీ
తెలుపకపోతే ఎలా.. ||మనసున||

చరణం 2
నీలికన్నుల్లో ఆతని బొమ్మని
చూసి నాకింక చోటెక్కడుందనీ
నిదరే కసురుకునే రేయిలో
మేలుకున్నా ఇదేం వింత కైపని
వేల ఊహల్లో ఊరేగు చూపుని
కలలే ముసురుకునే హాయిలో
వినబడుతోందా నా ప్రియమైననీకు
ఆశలరాగం అని అడగాలని
పగలేదో రేయేదో గురుతే లేదనీ
తెలపకపోతే ఎలా.. ||లలలా|| |మనసున||

చిత్రం : ప్రియమైన నీకు (2001)
సంగీతం : శివ శంకర్
రచన  : సిరివెన్నెల
గానం : చిత్ర

No comments:

Post a Comment