Tuesday, October 23, 2012

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ..... చక్రం (2005)














ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ  నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ  నా ఊపిరే నువ్వనీ  నీకు చెప్పాలని ...
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా

నేను అని లేను అని చెబితె ఏం చేస్తావు
నమ్మనని నవ్వుకొని చాల్లె పొమ్మంటావు
నీ మనసులోని ఆశగా నిలిచేది నేననీ
నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ
నీ కంటిమైమరుపులో నను పొల్చుకొంటాననీ
తల ఆంచి నీ గుండెపై నా పేరు వింటాననీ    నీకు చెప్పాలని
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా

నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం
నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం
నువు రాకముందు జీవితం గురుతైన లేదనీ
నిను కలుసుకున్న ఆ క్షణం నను వొదిలిపోననీ
ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ
ఈ మహిమ నీదేననీ నీకైన తెలుసా అనీ   నీకు చెప్పాలని

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ  నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ  నా ఊపిరే నువ్వనీ  నీకు చెప్పాలని ...
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా


చిత్రం : చక్రం (2005)
సంగీతం : చక్రి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : చక్రి
******************************
Oke oka maata madilona daagundi mounamgaa
oke oka maata pedavopalenanta teeyamgaa
naa peru nee premani ...naa daari nee valapani
naa choopu nee navvani
naa oopire nuvvanii  neeku cheppaalani
Oke oka maata madilona daagundi mounamgaa
oke oka maata pedavopalenanta teeyamgaa

nenu ani lenu ani chebite em chestaavu
nammanani navvukoni chaalle pomantaavu
nee manasuloni aasagaa nilichedi nenani
nee tanuvuloni sparsagaa tagiledi nenani
nee kantimaimarupulo nanu polchukontaanani
tala aanchi nee gundepai naa peru vintaanani
neeku cheppaalani

Oke oka maata madilona daagundi mounamgaa
oke oka maata pedavopalenanta teeyamgaa

nee adugai nadavadame payanamannadi paadam
ninu vidichi batakadame maranamannadi praanam
nuvu raakamundu jeevitam gurutaina ledani
ninu kalusukunna aa kshanam nanu vodiliponani
prati ghadiya o janmagaa ne gaduputunnaanani
ee mahima needenanii neekaina telusaa ani
neeku cheppaalani

Oke oka maata madilona daagundi mounamgaa 
oke oka maata pedavopalenanta teeyamgaa 
naa peru nee premani ...naa daari nee valapani
naa choopu nee navvani
naa oopire nuvvanii  neeku cheppaalani 
Oke oka maata madilona daagundi mounamgaa 
oke oka maata pedavopalenanta teeyamgaa 


Movie Name : Chakram (2005)
Music Director : Chakri
Lyricist : Sirivennela sitarama Sastry
Singer : Chakri

No comments:

Post a Comment