Sunday, October 14, 2012

అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ ..... లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012)


పల్లవి :
అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ
తికమక పెంచుతోంది మనసుకేమయింది
చకచక దూకుతూ తడబడి తుళ్లుతూ
తలపుని తరుముతోంది వయసుకేమయింది
నీ వలనే ఇదిలా మొదలయిందే
నా మాటే వినదే... ప్రేమా... ఏ?
నా ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు
ప్రేమా... ఏ?
నా వెంటే ఉంటావు..నీలా మారే వరకు
॥ఇటు॥

చరణం : 1
జాబిలికి జలుబును తెచ్చే చలువ నీవే
సూర్యుడికి చెమటలు పట్టే వేడి నీదే
మేఘముని మెలికలు తిప్పే మెరుపు నీవే
కాలముని కలలతో నింపే కథవి నీవే
మౌనం నీ భాషయితే చిరునవ్వే కవితౌతుందే
నీ కనుల కావ్యాన్నే చదివేయమన్నదే
నీ వలనే ఇదిలా ఔతోందే
॥మాటే వినదే॥॥ఇటు॥

చరణం : 2
మాములుగా అనిపిస్తుందే నువ్వు వస్తే
మాయమని తెలిసొస్తుందే లోతు చూస్తే
మంటవలె వెలుగిస్తావే దూరముంటే
మంచువలె లాలిస్తావే చేరువైతే
విరబూసే పువ్వైనా మరునాడే చూస్తది అందం
నువ్వు పూస్తే నూరేళ్లూ విరిసేను జీవితం
నీ వలనే ఇదిలా జరిగిందే
॥మాటే వినదే॥॥ఇటు॥


చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012)
సంగీతం : మిక్కీ జె.మేయర్
రచన : అనంత శ్రీరామ్
గానం : శ్రీరామ చంద్ర
***********************************
Atu itu ooguthu alajadi reputhu
thikamaka penchuthondi manasukemaindi
cheka cheka dookuthu thadabadi thulluthu
thalapuni tharumuthondi vayasukemaindi
nee valane  idila modalainde
naa maate vinadhe prema ye.. ?
naa pranam thintavu ninne thalache varaku
yemaaye naa vente vuntavu
neela maare varaku...
atu itu ooguthu alajadi reputhu
thikamaka penchuthondi manasukemaindi

jaalibi ki jalubunu theche chaluva neede
suryudiki chematalu patte vedi neede
meghamunu melikalu thippe merupu neeve
kaalamuni kalalatho nimpe kanthavi neeve
mounam nee bhashaithe chiru navve kavithavuthondhe
nee kanula kavyanne chadiveyamannade

nee valane idila avuthonde
naa maate vinadhe
prema ye na pranam thintavu
ninne thalache varaku
premaaye naa vente vuntavu
neela maare varaku
atu itu ooguthu alajadi reputhu
thikamaka penchuthondi manasukemaindi

mamuluga anipisthunde nuvvu vasthe
maayavani telisostunde  lothu chusthe
manta vale velugisthave dooramunte
manchu vale lalisthave cheruvaithe
viraboose poovaina marunaade choosthadi antham
nuvu poosthe noorellu virisenu jeevitham

nee valane idila jarigindhe
naa maate vinadhe
prema ye... naa pranam thintavu
ninne thalache varaku
premaaye... naa vente vuntavu
neela maare varaku
atu itu ooguthu alajadi reputhu
thikamaka penchuthondi manasukemaindi


Movie Name : Life is Beautiful (2012)
Music Director : Mickey.J.meyer
Lyricist : Anantha Sriram
Singer : Srirama Chandra

No comments:

Post a Comment